మైనార్టీ ఖబ్రస్థాన్ కు 5 ఎకరాల భూమి కేటాయింపు, భూమి పూజ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో నూతన మైనార్టీ ఖబ్రస్థాన్ ఏర్పాటుకు 5 ఎకరాల భూమిని కేటాయించి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ, మైనార్టీలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఖబ్రస్థాన్ అభివృద్ధిలో భాగంగా పహరి గోడ నిర్మాణానికి రూ.10 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, మైనార్టీ సమాజానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగింది,
