నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు

శివ నామస్మరణంతో మారుమోగే రోజు రేపు మహా శివరాత్రి.

నేటి నుండి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలు.

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కాళేశ్వరం.

నేటి నుండి మూడు రోజుల వరకు శివరాత్రి ఉత్సవాలు

జిల్లా మరియు రాష్ట్ర రాజధాని నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. అధికారులు పోలీసుల ప్రత్యేక బందోబస్తు.

శివ భక్తుల కొరకు నేటిధాత్రి  ప్రత్యేక  కథనం.

మహాదేవపూర్-నేటిధాత్రి:

చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో తెలపడం జరిగింది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం,  శివరాత్రి ఫిబ్రవరి  నెలలో రావడం జరిగుతుంది .సనాతన మాసం ప్రకారం  మాఘ మాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో ఒకటి మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించడం తో ఈ బుధవారం రాత్రిని మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధి గాంచిన ఆలయం కాలేశ్వర ముక్తేశ్

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా పరిషత్,సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మండలస్థాయి అవగాహన,శిక్షణ కార్యక్రమం

విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి

ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణ

Students

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉత్తీర్ణత మరియు వ్యక్తిత్వ వికాసం పై ఏర్పాటు చేసిన అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ వీరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ డాక్టర్ కన్నం.నారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువు పై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు.ప్రఖ్యాత మోటివేటర్ దిలీప్ కుమార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు,తహసీల్దారు విజయలక్ష్మి మాట్లాడుతూ మాట్లాడుతూ విధ్యార్థులకు చదువడం జ్ఞాపక శక్తి పెంచుకోవడం మరియు పరీక్షలు రాయడంలో మెలకువల గురించి వివరించారు,ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలని,విద్యార్థులు అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లి తండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యస్ రమాదేవి,జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పరకాల బాలుర గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ మధు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

స్వామి పూజలో మాజి ఎంపీ రావుల..

వనపర్తి లో శ్రీ సీతరామలక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి పూజలో మాజి ఎంపీ రావుల
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో పాతబజార్ 3 వ వార్డులో శ్రీ వీరంజనేయ దేవాలయం ప్రతిష్ట సందర్భంగా పూజలో మాజి ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు
ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఆలయ పున నిర్మాణం అద్భుతంగా జరిగిందని ఇందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.రోడ్ల విస్తరణలో తర్వాత నూతనంగా రూపుదిద్దుకున్న ఆలయాలు,దర్గాలు,మసీదులు అద్భుతంగా ఉన్నాయని వీటికి కృషి చేసిన మాజి మంత్రి నిరంజన్ రెడ్డిని రావుల అభినందించారు
ఆలయం నిర్మించడంతో పాటు రోజు ధూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామి వారిని పూజించాలని ఇందుక నా సహకారం ఉంటుందని రావుల హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు సాదరంగా రావుల చంద్రశేఖరరెడ్డి ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
అనంతరం నూతన బొడ్రాయి శిలాకు పూజలు నిర్వహించారు.
రావు ల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,బండారు.కృష్ణ,డాక్టర్. దానియాల్,సూర్యవంశపు
గిరి,సునీల్ వాల్మీకి,ఇమ్రాన్,మునికుమార్ ఆలయ కమిటీ సభ్యులు గోనూరు.వెంకటయ్య గుప్త ,వసంత శ్రీనివాసులు, నీల స్వామి,బాలస్వామి తదితరులు ఉన్నారు.

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ అందజేత.

సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ అందజేత.

సీఐ మల్లేష్.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్లో చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ తో కలిసి చిట్యాల సిఐ మల్లేష్ 2 మొబైల్స్ లని పోగొట్టుకున్న బాధితులకు సోమవారం రోజున అందించారు, చల్లగరిగ గ్రామానికి చెందిన
శ్రీ బరన్ రెడ్డి తను 3 నెలల క్రితం తన వన్ ప్లస్ మొబైల్ ని పోగొట్టుకొని, మరియు చిట్యాల మండల కేంద్రానికి చెందిన గోల్కొండ సతీష్ నెల క్రితం తన రియల్ మీ ఫోన్ ని పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో తమ మొబైల్ ఫోన్లు పోయాయని దరఖాస్తు ఇవ్వగా, అట్టి మొబైల్ ఫోన్ సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి ఈరోజు శ్రీ భరణ్రెడ్డికి మరియు సతీష్ కి అందించడం జరిగింది, అట్టి మొబైల్ ఫోన్స్ నీ గుర్తించడంలో సహాయపడిన కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ సిఐ అభినందించారు
ప్రజలకి ఎవరికైనా మొబైల్స్ దొరికితే పోలీస్ స్టేషన్ ల లో అప్పచ్చెప్పలని, ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ నీ ఉపయోగించి మొబైల్స్ నీ సులువుగా గుర్తించవచ్చు అని, దొరికిన మొబైల్స్ ను తమ వద్ద ఉంచుకోకుండా పోలీస్ స్టేషన్ లో అప్పగించి మంచి మనుసు చాటుకోవాలని తెలిపారు.

వర్కింగ్ జర్నలిస్టులందరు సభ్యత్వ నమోదు చేసుకోవాలి..

వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో యూనియన్ సభ్యత్వాలను ప్రారంభించారు.

కాకతీయ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్ లు కలిసి యూనియన్ సభ్యత్వ నమోదు చేసి రసీదు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల టి.ఎస్.జే.యూ యూనియన్ నిరంతరం పనిచేస్తుందాన్నారు.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి రూ.5 లక్షల ప్రమాద భీమా ను రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు ఉపయోగించుకోవాలని,జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని దీనివల్ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలని సూచించారు.

జర్నలిస్ట్ ల హక్కుల సాధనే లక్ష్యంగా అందరం కలిసి ఐకమత్యంగా పోరాడాలనేదే యూనియన్ లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.ఎస్.జె.యూ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు రవీందర్ సంయుక్త కార్యదర్శి కడపాక రవి, పల్నాటి రాజు కోశాధికారి శేఖర్ నాని,జిల్లా సంయుక్త కార్యదర్శి,బొచ్చు భూపాల్,ఈసి మెంబెర్ కె.దేవేందర్, బొల్లపెల్లి జగన్,మారపెల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ నేటిధాత్రి

మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం ఈ నెల 25,26,27 తేదీలలో జరిగే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను పూర్తి అయ్యాయని తెలిపారు.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకొని మహాశివరాత్రి జాతర వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు…. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.. పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించు స్వామి వారి సేవలో తరించాలని కోరారు…

వనపర్తి అభివృద్ధికి అడ్డుపడద్దు..

వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధికి అడ్డుపడద్దు

ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి
వనపర్తి నేటిధాత్రి ;

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డు పడ వద్దని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కి సవాల్ విసిరారు ఆదివారం సాయంత్రం చిన్నారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒకసారి0 మంత్రిగా పనిచేశానని చెప్పారు .గోపాల్ పెట్ మండలం లో పోలికేపాడు గ్రామం గుట్టల మధ్యన మార్కెట్ యార్డ్ శంకుస్థాపన ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్కెట్ యార్డ్ నిర్మాణానికిమంత్రి తుమ్మల నాగేశ్వర్ రెడ్డితో శంకుస్థాపన చేయించారని ఆయన పేర్కొన్నారు గోపా ల్ పే ట్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం 76 ఎకరాలు ఉన్నదని మండలానికి అనుకూలంగా తన సొంత గ్రామం తిరుమలాపుర o ఉన్నదని వివిధ గ్రామాలు ఉన్నాయని గోపాల్ పెట్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మెగా రెడ్డి గెలుపుకు పెద్దమందడి మండలంలో అనేక గ్రామాల్లో ప్రచారం చేశా నని గెలుపు కు కృషి చేశానని చిన్నారి రెడ్డి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీ ఎ సి కమిటీకి కే సీ వేణుగోపాల్ ఇన్చార్జిగా ఉన్నారని ఆ కమిటీలోనేను కూడా ఉన్నానని చిన్నారెడ్డి చెప్పారు . సీఎం రేవంత్ రెడ్డి తన.పై నమ్మకంతో బేగంపేట్ ప్రజాపాలన కార్యాలయం ప్రజల వినతి పత్రాలు స్వక రి o చు ట అప్ప గించారని చెప్పారు ప్రతి శుక్రవారం 8 వేల నుండి 12 వేల వరకు ప్రజలు. వస్తుంటారని వారితో. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు సంబంధిత కలెక్టర్లతో అధికారులతో ఫోన్లో సంప్రదించి ప్రజల సమస్యలకు పరిష్కారం కావడానికి కృషి చేస్తున్నానని చిన్నారెడ్డి చెప్పారు. ఓపి క తో ప్రజల వినతి పత్రాల స్వీక రి స్తు.న్న నని ఆయన పేర్కొన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలవడానికి వనపర్తి నియోజకవర్గ మొత్తం పర్యటించానని గెలుపుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఆయాతారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారంలో చేశానని ప్రజలను కోరానని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ పాదాభివందనం అసెంబ్లీ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వడానికి నా యొక్క పేరును టికెట్ రావడానికి లిస్టులో టిక్ చేశారని చెప్పారు .ప్రస్తుత ఎమ్మెల్యే మెగా రెడ్డి సర్వే చేసిన బృందానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ఇచ్చి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు 46 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కి సేవలందించానని ఇప్పుడు కూడా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని నాకు అన్ని తెలుసునని అన్నారు ఎమ్మెల్యే కు ఒకటి చెబుతున్న నీ వెంబడి ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఇతర నాయకుల అభివృద్ధికి అడ్డుపడితే సహించనని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ న్యాయవాది కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వ్యక్తిపై కేసు, రిమాండ్ కి తరలింపు..

మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసిన వ్యక్తిపై కేసు,రిమాండ్ కి తరలింపు..

సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వేములవాడ నేటిధాత్రి

వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్న షామీర్ పెట్, మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్, s/o అంజనేయులు,age 43y అనే వ్యక్తి పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని,జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాలు అయిన ఫెస్ బుక్ , ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూప్స్ etc.. లలో ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం,విద్వేషాన్ని దుష్ప్రచారం చేయడం ,ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టిన,వ్యాప్తి చేసిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు

— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు
• యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజాంపేట: నేటి ధాత్రి

కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ

పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.

ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

వేములవాడ నేటిధాత్రి

ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్‌ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..

ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభం

2025: ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డేట్, టైమ్, ఇతర వివరాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

2025 సంవత్సరానికి గానూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతోంది. వివిధ దేశాల్లో ఈ సమయం వేర్వేరుగా ఉంటుంది. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ మాస ఉపవాసాలను ముస్లింలు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కానీ, మార్చి 1 వ తేదీన కానీ నెలవంక కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

2025: చంద్రవంక దర్శనం ప్రకారం.. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెలవంక వేర్వేరు దేశాల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడం వల్ల, ఆయా దేశాల్లో రంజాన్ మాసం ప్రారంభ సమయం మారుతూ ఉంటుంది. ఈ వ్యత్యాసం కొత్తదేమీ కాదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ లోని ప్రతి నెల ప్రారంభ తేదీని ప్రభావితం చేసే నెలవంక దర్శనంపై ఆధారపడతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుక తేదీలలో కూడా వైవిధ్యాలకు దారితీస్తుంది.

మార్చి 1వ తేదీననా? లేక మార్చి 2 నా?

ఇస్లామిక్, పాశ్చాత్య దేశాలలో ఎనిమిదవ ఇస్లామిక్ నెల షబాన్ జనవరి 31, 2025 శుక్రవారం ప్రారంభమైంది. అందువల్ల, ఈ సంవత్సరం సాంప్రదాయకంగా, రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఫిబ్రవరి 28, శుక్రవారం, అంటే షబాన్ 29 వ రోజున కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ నెలవంక కనిపిస్తే ఈ దేశాల్లో 2025 మార్చి 1 నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. అయితే చాలా చోట్ల చంద్రుడు ఆ రోజు కనిపించకపోవచ్చని, అందువల్ల షబాన్ నెల మరో రోజు పొడిగించబడుతుందని భావిస్తున్నారు. అంటే, మార్చి 1వ తేదీన నెలవంక కనిపిస్తే, రంజాన్ మాసం ప్రారంభం 2025 మార్చి 2కి మారే అవకాశం ఉందని కొందరు పండితులు వాదిస్తున్నారు.

రంజాన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు

సౌదీ అరేబియా ఖగోళ అంచనాలకు అనుగుణంగా మార్చి 1న రంజాన్ ప్రారంభమవుతుందని పాశ్చాత్య దేశాలలోని అనేక నగరాలు ఇప్పటికే తమ రంజాన్ 2025 టైమ్ టేబుల్ ను ప్రచురించాయి.

అయితే, మొరాకో వంటి దేశాలు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. అక్కడ నెలవంక స్పష్టంగా కంటికి కనిపించిన మరుసటి రోజు రంజాన్ ను ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న మొరాకోలో చంద్రుడు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే మొరాకోలో మార్చి 2 నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

జర్మనీలో రంజాన్ 2025 ఫిబ్రవరి 28 న ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అలాగే, అక్కడ ఈ పవిత్ర మాసం మార్చి 30 నాటికి ముగుస్తుంది.

అమెరికాలో కూడా మార్చి 1వ తేదీన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈద్ అల్-ఫితర్ వేడుకలతో పవిత్ర మాసం మార్చి 30న ముగుస్తుందని భావిస్తున్నారు.

2025 మార్చి 1న రంజాన్ ప్రారంభమైతే, 2025 మార్చి 30న సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో ఈద్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే మార్చి 2న రంజాన్ ప్రారంభమయ్యే వారికి ఈద్ 2025 మార్చి 31న వచ్చే అవకాశం ఉంది.

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు

ఆదివాసి వ్యక్తి పైన దాడి…

ఆదివాసి వ్యక్తి పైన ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా దాడి..

వ్యక్తికి ప్రక్కటెముకలు విరిగిన వైనం.

దాడికి పాల్పడిన ఫారెస్ట్ అధికారులను విధులు నుంచి తొలగించాలి.

ఫారెస్ట్ అధికారుల పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలి..

మానవ హక్కుల కమిషన్ Save ఫిర్యాదు చేస్తాం.

ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటి..

నూగూర్ వెంకటాపురం, (నేటి ధాత్రి ):-

అటవీ శాఖా అధికారులు ఆదివాసీల పైన వరస దాడులకు పాల్పడుతూ ఉన్నారని ఆదివాసీ నాయకులు కొర్స నర్సింహా మూర్తి,ఉయిక శంకర్, పూనెం సాయి ఆరోపించారు. ఆదివారం అటవీ శాఖా అధికారుల చేత దాడికి గురై గాయాల పాలైన ఏకన్న గూడెం గ్రామానికి చెందిన కోరం సమ్మయ్య ను పరామర్శించారు. సమ్మయ్య ను, కుటుంబ సభ్యులను పూర్తి వివరాలు అడికి తెలుసుకున్నామని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు. అడవికి వెళ్లిన ఆదివాసీ పైన అటవీ శాఖా అధికారులు మూడు ప్రక్కఎముకలు విరిగేలా అత్యంత పాశవికంగా దాడి చేయడం హేయమైన దుశ్చర్య అని మండిపడ్డారు. ఒకవేళ సమ్మయ్య తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయని, కొట్టడానికి అధికారులకు అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. తనని వదిలేయమని ఎంత ప్రాదేయ పడిన కనికరం చూపకుండా దాడి చేయడం అమానవీయ చర్య అన్నారు. బాధితుడి లుంగీ విప్పి తన మెడకు, మొఖానికి ముసుకు వేసి, చేతులు వెనక్కి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేసినట్టు బాధితుడు సమ్మయ్య చెప్పినట్టు తెలియజేసారు. ఆదివాసీలు శతా బ్దాలు గా అడవిని కాపాడితే అటవీ శాఖా ఉద్యోగులు కంచే చేను మేసినట్టు అడవిని అమ్ముకుంటున్నారు అని విమర్శించారు. ఈ అమానవీయ ఘటన పైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ని, ఎస్సి ఎస్టీ కమిష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు నర్సింహా మూర్తి, శంకర్, సాయి తెలిపారు. సమ్మయ్య కుటుంబం రోడ్డు పడిందని, నష్టపరిహారం గా 10 లక్షలు ఇవ్వాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు… కోరం సమ్మయ్య కు న్యాయం జరగక పోతే చర్ల రేంజ్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..జి ఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్, ఏ ఎన్ ఎస్ మండల అధ్యక్షులు కుంజ మహేష్, వాసం నారాయణ తదితరులు పాల్గొన్నారు..

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం.

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

– భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Shiva Parvathi

మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీసం స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. ఇవన్నీ ఆలయం తరపున సమకూర్చుకున్నారు. కళ్యాణంలో పాల్గోన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా మహిళలకు వాయినాలు అందజేశారు. రాత్రికి స్వామిఅమ్మవారల ఉత్సవ మూర్తులను విమానరథంలో బసవేశ్వర మందిరం వరకు ఊరేగించారు. కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఆలయ ఈఓ శివరుద్రప్పస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సివిల్‌ సప్లయ్‌లో కదలికలు. నేటిధాత్రి ఎఫెక్ట్‌.

 

`సివిల్‌ సప్లయ్‌ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు

`బియ్యం మింగిన మిల్లర్లు!?

`మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు?

`దొంగ మిల్లర్లు? అబద్ధపు గోడౌన్లు?

`లేని గోడన్ల మాయ! వంటి నేటిధాత్రి కధనాలకు ప్రభుత్వ స్పందన.

`పదేళ్లుగా మిల్లర్లతో సమావేశం కాని ప్రభుత్వ పెద్దలు.

`ప్రజా ప్రభుత్వంలో నేటిధాత్రి వార్తలకు కదలిక.

`నేటిధాత్రి ఒక్క వార్తతోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మిల్లర్లతో సమావేశం.

`నేటిధాత్రి ప్రస్తావించిన అన్ని అంశాలపై సమావేశంలో విసృతంగా చర్చలు.

`వాటి అధ్యయనానికి కమిటీ ఏర్పాటు!

`నేటిధాత్రికి మిల్లర్ల ప్రశంసలు.

`మిల్లర్ల సమస్యలు వెలుగులోకి తెచ్చినందుకు నేటిధాత్రికి కృతజ్ఞతలు.

`దొంగ మిల్లర్లపై చర్యలకు డిమాండ్‌.

`దొంగ మిల్లర్లకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి.

`సివిల్‌ సప్లయ్‌ని భ్రష్టు పట్టించిన అధికారుల భరతం పట్టాలి!

`అప్పుడే అన్ని రకాలుగా ప్రక్షాళన పూర్తయ్యేది.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పదేళ్లుగా మిల్లర్లు ప్రభుత్వం మధ్య లేని చర్చలకు నేటిధాత్రి వార్తా కథనం దారితీసింది.. ఒక రకంగా ప్రభుత్వం, మిల్లర్ల సమావేశానికి మార్గమైంది. ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య దూరం తొలగిపోయేలా చేసింది. మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు? అని నేటిధాత్రి ప్రశ్నించింది. ప్రభుత్వ యంత్రాంగం కదలివచ్చింది. పౌరసరఫరా శాఖలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి వార్త వెళ్లింది. 

పది సంవత్సరాల బిఆర్‌ఎస్‌ పాలనలో ఇలాంటి సన్నివేశం మృగ్యమైపోయింది. ఆగమైన సివిల్‌ సప్లయ్‌ శాఖను గాడిలో పెట్టే తీరిక లేక గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెట్టింది. మిల్లర్లు ఎన్ని సార్లు ప్రభుత్వాన్ని కోరినా అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్డింది. సివిల్‌ సప్లయ్‌ శాఖ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని ఎన్ని వార్తలు నేటిధాత్రి రాసినా చెవిడి వాళ్ల ముందు శంఖం ఊదినట్లైంది. సివిల్‌ సప్లయ్‌ శాఖలో వేల కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయని చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లే అయ్యింది. పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో బకాయిలు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. దళారులు దూరేలా చేశాయి. రైతులు పండిరచిన వడ్లు మిల్లర్లకు ఆదాయమార్గాలయ్యాయి. బకాయిలు కొండలా పేరుకుపోవడానికి కారణమయ్యాయి. అయినా గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టి, మారటోరియం పేరు చెప్పి కేసిఆర్‌ ప్రభుత్వం అప్పులు చేసిందే గానీ, మిల్లర్లు నుంచి బకాయిలు వసూలు చేయలేదు. సివిల్‌ సప్లయ్‌ అధికారులను పురమాయించలేదు. వారిని బకాయిల వసూలుకు పురిగొల్పలేదు. మిల్లర్లు ఇష్టా రాజ్యాంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు. పేరుకుపోతున్న వేల కోట్ల బకాయిల మీద దృష్టి సారించలేదు. దాంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం రాకుండా ఆగిపోయింది. అయినా మిల్లర్ల దాహం తీరలేదు. కాకపోతే ఇక్కడ అందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేయలేదు. కొంత మంది బోగస్‌ మిల్లర్లు తమ చేతి వాటం ప్రదర్శించారు. లేని మిల్లులు సృష్టించారు. తమవి కాని గోడౌన్లను లెక్కల్లో చూపారు. ప్రభుత్వం ఇచ్చిన వడ్లను అమ్ముకున్నారు. కోట్లు వెనకేసుకున్నారు. సివిల్‌ సప్లయ్‌ అధికారుల సహకారంతో వడ్లు, బియ్యం అమ్ముకొని ఆస్థులు కూడా బెట్టుకున్నారు. ప్రజా ప్రభుత్వానికి పూర్తి విషయాలు, వివరాలు అందిస్తూ, మిల్లర్ల మోసాలపై నేటిధాత్రి వార్తలు రాస్తోంది. సరిగ్గా రైతుల నుంచి వడ్లు సేకరించే సమయంలో ప్రభుత్వానికి సమాచారం చేరేలా నేటిధాత్రి వార్తలు ప్రచురించింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో కదలిక వచ్చింది. సిఎం. రేవంత్‌ రెడ్డికి వివరాలు అందడంతో వడ్ల సేకరణ మీద హుటాహుటిన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మిల్లర్లను కూడా ఆహ్వించారు. వారి సూచనలు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మూలంగా సివిల్‌ సప్లయ్‌లో కదలికలు వచ్చినట్లే కాదు. ఆ దిశగా అడుగులు పడినప్పుడు అసలైన కార్యాచరణ. అసలు బియ్యం మింగిన మిల్లర్లు ఎవరు? ఎంత మంది అనేది ముందు తేల్చాలి. లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంటుంది. ఇక మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య దళారులెందుకు? అనేదానిపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చిన వడ్లును మిల్లర్లు మింగారా? మిల్లర్ల పేరు చెప్పి దళారులు తిన్నారా? ఇద్దరూ కలిసి మొత్తం బుక్కేశారా? అనేది వెల్లడి కావాలి. మిల్లర్లలో దొంగ మిల్లర్లు వేరయా? అన్నది కొత్త కథ. మిల్లర్లలో కూడా దొంగ మిల్లర్లు వున్నారనే విషయం సహజంగానే ఆందోళనకరమైనది. అసలు మిల్లులేని మిల్లర్లు, లేని గోడౌన్లతో కోట్లు కూడబెట్టుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు. అందువల్ల దొంగ మిల్లర్లు? ఎవరు అనేది వెలుగులోకి రావాలి. మిల్లులు లేకున్నా మిల్లర్ల వ్యాపారానికి ఎందుకొచ్చారో తెలియాలి. వారిని ఎవరు పరిచయం చేశారో తెలియాలి. వారికి అండగా నిలిచిన వారి బాగోతం కూడా బైటకు రావాలి. నిజాలు నిగ్గు తేలాలి. దొంగ మిల్లర్ల మీద కేసులు నమోదు చేయాలి. వారిపై కఠినమైన చర్యలను చేపట్టాలి. అంతే కాకుండా అబద్ధపు గోడౌన్లు? ఎందుకు సృష్టించారు. పదేళ్లలో ఎన్ని లక్షల టన్నుల వడ్లు మాయం చేశారు. వివరాలు లెక్కలు తీయాలి. లేని గోడన్ల మాయ! వంటి నేటిధాత్రి కధనాలకు ప్రభుత్వ స్పందించింది. దానిపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి. నేటిధాత్రి ప్రస్తావించిన అన్ని అంశాలపై సమావేశంలో విసృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య వున్న దూరం, ఒక రకంగా చెప్పలేని అగాధం పూడుకున్నదనే చెప్పాలి. ప్రభుత్వం తమను సమావేశానికి ఆహ్వానించడంతో నేటిధాత్రికి మిల్లర్ల ప్రశంసలు కురిపించారు. మిల్లర్ల సమస్యలు వెలుగులోకి తెచ్చినందుకు నేటిధాత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా అసలైన మిల్లర్లు కూడా దొంగ మిల్లర్లపై చర్యలకు డిమాండ్‌ చేయడం జరిగింది. దొంగ మిల్లర్లకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. సివిల్‌ సప్లయ్‌ని భ్రష్టు పట్టించిన అధికారుల భరతం పట్టాలి! అని ప్రజల నుండి డిమాండ్‌ పెరుగుతోంది. అప్పుడే అన్ని రకాలుగా ప్రక్షాళన పూర్తయ్యేదని తెలంగాణ సమాజం కోరుకుంటోంది.

టిజి బడుగులకు అండగా కాంగ్రెస్‌

-ఏపి అగ్రకులాల పక్షాన బిఆర్‌ఎస్‌.

-కొండా సురేఖ మీద సినీ వర్గం మూకుమ్మడి దాడి.

-సీని అగ్ర కులాలకు బాసటగా బిఆర్‌ఎస్‌ పార్టీ.

-తెలంగాణ ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్‌ పార్టీ.

-బిఆర్‌ఎస్‌పై తొలగిన తెలంగాణ ముసుగు.

-అసలైన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ గొడుగు.

-కొండా, వర్సెస్‌ కేటిఆర్‌ అంశాన్ని సినీ లోకానికి ముడిపెట్టింది బిఆర్‌ఎస్‌.

-హుందాగా తనదైన శైలిని ప్రదర్శించింది కాంగ్రెస్‌.

-ఆది నుండి అగ్రకుల అహంకారం ప్రదర్శిస్తూనే వుంది బిఆర్‌ఎస్‌.

-బలహీన వర్గాలకు ఎప్పుడూ ఆపన్న హస్తం అందించేదే కాంగ్రెస్‌.

-బడుగులను నెగలనీయకుండా తరిమేసింది బిఆర్‌ఎస్‌.

-బడుగుల ఆడబిడ్డ సురేఖకు కష్టకాలంలో అండగా నిలిచింది కాంగ్రెస్‌.

-అపోహతో ఆనాడు రాజయ్యను భర్తరఫ్‌ చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ ఆడపడుచుకు అండగా నేడు నిలిచింది రేవంత్‌.

-బడుగులను నిలువునా ముంచింది బిఆర్‌ఎస్‌.

-బడుగులకు రిజర్వేషన్లు పెంచాలన్న సంకల్పం కల్గింది కాంగ్రెస్‌.

-గులాబీ జెండా నాదన్నందుకు ఈటెలను తరిమేసింది బిఆర్‌ఎస్‌.

-ఎవరో ఆరోపణలు చేశారని గంగుల కమలాకర్‌ను తొక్కేయాలని చూసింది బిఆర్‌ఎస్‌.

-అగ్రకుల అహంకారానికి నిలువెత్తు సాక్ష్యం కేసిఆర్‌.

-అన్ని వర్గాలను కలుపుకుపోవడంలో మానవత్వం నిండిరది రేవంత్‌.

-పార్టీ నేతలపై అపవాదులొచ్చినప్పు కాపాడుకోలేని నాయకుడు కేసిఆర్‌.

-కాంగ్రెస్‌ నాయకుల మీద అవాకులు చెవాకులయ పేలితే అండగా నిలుస్తుంది రేవంత్‌.

-మాయమాటలతో రాజకీయం చేయడం కేసిఆర్‌కు అలవాటు.

-అసలైన మానవత్వ లక్షణాలు నిండిన నాయకుడు రేవంత్‌.

-ఆంధ్రులకు అడుగడుగునా అండగా నిలిచి తెలంగాణను చులకన చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ వాళ్లకు ఎవరు అన్యాయం చేసినా చీల్చి చెండాడుతున్నది రేవంత్‌.

-రాజకీయ అవసరాల కోసం పరాయి వాళ్లకు పీటలేసింది కేసిఆర్‌.

-తెలంగాణకు అన్యాయం చేస్తే ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించమని నిరూపిస్తోంది రేవంత్‌.

-అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు పంచింది కేసిఆర్‌.

-తెలంగాణ కంచాలు లాగితే కూసాలు కదులుతాయని చెబుతున్నది రేవంత్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పార్టీ నాయకుల కోసం అండగా నిలవలేని అగ్రనేతలు అధినేతలే కాదు. పార్టీ నాయకులకు విపత్కరపరిస్ధితులు ఎదురైనప్పుడు అండగా నిలవలేనప్పుడు అధి నాయకత్వమే కాదు. కాని మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అగ్రనాయకుడిగా, మంత్రి వర్గంలో తన తోటి సహచర మంత్రికి పూర్తి అండగా నిలిచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసనీయుడు. ఆయన చూపిన చొరవ మంత్రి వర్గానికే వన్నె తెచ్చినట్లైంది. ఆధిపత్య సీమాంధ్ర మీడియా చేస్తున్న హడావుడి ఉచ్చులో తెలంగాణ సమాజం పడిపోయింది. అందుకే కొందరు పనిగట్టుకొని కొండా సురేఖను టార్గెట్‌ చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ అసలు విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వున్న మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ అధికారిక కార్యాక్రమానికి హజరయ్యారు. మెదక్‌ జిల్లాలో పద్మశాలి కుటుంబాలు ఎక్కువ. మంత్రి కొండా సురేఖ కూడా పద్మశాలి ఆడబిడ్డ కావడంలో మెదక్‌ ఎంపి రఘునందన్‌ రావు మర్యాద పూర్వకంగా మంత్రి కిండా సురేఖకు నూలదండను మెడలో వేసి ఆహ్వానం పలికారు. పద్మశాలి సమాజం సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇది బిఆర్‌ఎస్‌ నాయకులకు కంటకింపుగా మారింది. ఎలా మంత్రి సురేఖను ఇరుకున పెట్టాలని, అటు రఘునందన్‌ రావును అబాసులు పాలు చేయాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం చేయకూడని తప్పు చేసింది. మంత్రి కొండా సురేక, ఎంపి. రఘునందన్‌ రావులు వున్న ఫోటోపై దుష్ప్రచారం చేశారు. ఇది కాంగ్రెస్‌ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రి కొండా సురేఖ మనస్తాపానికి గురైంది. కన్నీటి పర్యంతమైంది. అయినా బిఆర్‌ఎస్‌ దుష్ట గ్రహాల మనసు కరగలేదు. కాకపోతే జరిగిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు క్షమాపణ చెప్పారు. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కాని బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం అక్కడితో ఆపలేదు. ఆ విషయాన్ని మరింత ప్రచారం చేసింది. మళ్లీ మళ్లీ గాయాన్ని రేపేలా చేసింది. దాంతో మంత్రి కొండా సురేఖకు ఆగ్రహం తెప్పించింది. నూలు దండకు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సంబంధం వుంది. అది బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగానికి చెందిన వ్యక్తులకు తెలియదు. అసలు బిఆర్‌ఎస్‌ నేతలకే ఆ విషయం తెలియదు. కాంగ్రెస్‌ పార్టీ సహజంగా పూల దండలకు బదులుగా ఎప్పుడైనా నూలు దండలనే వినియోగిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జాతీయస్ధాయి సమావేశాలలో నూలు దండలనే వేసుకుంటారు. పూల దండలు నిషేదం. ఆ మాత్రం కామన్‌ సెన్స్‌ బిఆర్‌ఎస్‌ శ్రేణులకు లేకుండాపోయింది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో విదేశీ వస్తు భహిష్కరణ, చేనేత వస్త్రాల నేతకు విడదీయ రాని అనుబంధం వుంది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్ర నూలు పోగు. ఈ సంగతి బిఆర్‌ఎస్‌ నేతలకు కనీసం అవగాహన కూడా లేదు. అందుకే చెరపకుడార చెడేవు అన్న సామెతను మీద వేసుకున్నారు. నూలు దారం ఎంతో పవిత్రమైనది. అది దేశ స్వాతంత్య్రానికి చిహ్నం. దాన్ని అపవిత్రకు ఆపాదించిన బిఆర్‌ఎస్‌ శ్రేణుల తెలివి తక్కవ తనం మూలంగా పద్మశాలి ఆడబిడ్డకు కోపం తెప్పించింది. పైగా పద్మశాలి సమాజానికి నూలు పోగు ఎంతో పవిత్రమైనది. ఆ నూలు మాల ఎంతో శ్రేష్టమైనది. దాన్ని ఎంతో గౌరవం కోసం వేసుకుంటారు. అలాంటి దండకు అపవిత్రను ఆపాదించి బిఆర్‌ఎస్‌ పెద్ద తప్పు చేసింది. దాంతో మంత్రి కొండా సురేఖ సినీ హీరో నాగార్జున కుటుంబంలో జరిగిన అన్యాయానికి మాజీ మంత్రి కేటిఆర్‌ కారణం అని ఆరోపణ చేశారు. అయితే ఇక్కడ ఎక్కడా మంత్రి కొండా సురేఖ సినీ నటి సమంతను కించపర్చలేదు. ఆమెకు ఎలాంటి తప్పును ఆపాదించలేదు. ఆమె గౌరవాన్ని నిలబెట్టింది. అంతే కాని ఆమెకు ఎలాంటి తప్పును ఆపాదించలేదు. బిఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా అతి తెలివి ప్రదర్శించింది. నాగార్జున కుటుంబాన్ని రెచ్చగొట్టింది. దాంతో సినీ లోకమంతా కదలింది. అసలైన విషయాన్ని సినీ ప్రముఖులు కూడా వదిలిపెట్టారు. నాగార్జునకు అండగా నిలిచారు. మంత్రి కొండా సురేఖ మీద మాటల దాడి మొదలు పెట్టారు. ఆఖరుకు నాగార్జున మంత్రి మీద పరువు నష్టం దావా దాకా వెళ్లారు. ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ ఎంతో హుందాగా తాను సమంతపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సాటి మహిళలకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రస్తావించాను. అందులోనూ ఆమె తెగువను కీర్తించాను అని చెబుతూనే ఒక వేళ నటి సమంత తన మాట వల్ల మనసు గాయమైతే క్షమించమని కూడా కోరింది. కాని బిఆర్‌ఎస్‌ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయాలనే చూసింది. నాగార్జునను రెచ్చగొట్టింది. దాంతో సినీ వర్గమంతా ఒక్కతాటి మీదకు వచ్చింది. కాని ఇక్కడ అందరూ నాగార్జునకు మద్దతుగా ఏమీ రాలేదు. కేవలం చిరంజీవి కుటుబం, ఎన్టీఆర్‌, ఇతర కమ్మకుల సినీ వర్గమే ఆయనకు తోడుగా నిలిచింది. ఇక్కడ మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమలో తనకు వినిపించిన అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఆమె ఆరోపణలు చేయలేదు. సమంత మీద ఎలాంటి వివాదాలు సృష్టించాలని అనుకోలేదు. ఒక రకంగా సమంతకు మద్దతుగా , సాటి మహిళగా తోడుగానే నిలిచింది. కాని తిమ్మిని బమ్మిని చేయడంలో ఆరి తేరిన బిఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ పైశాచిక ఆనందం పొందాలని చూసింది. సినీ పరిశ్రమను కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా మారితే భవిష్యత్తులో తమకు వాళ్లంతా మద్దతుగా నిలుస్తారని ఆశించారు. కాని కథ అడ్డం తిరిగింది. మంత్రి కొండా సురేఖ మీద పెద్దఎత్తున మీడియాలో విపరీత ప్రచారం చేస్తే ఆమెపై చర్యలు తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ భావించింది. కాని అది జరగలేదు. కాంగ్రెస్‌లో కదలిక కనిపించడం లేదని గ్రహించి పెద్దఎత్తున మీడియాను రంగంలోకి దించారు. జాతీయ స్ధాయిలో కూడా ఈ విషయాన్ని చర్చనీయాంశం చేశారు. రోజుల తరబడి మీడియాలో చర్చలు జరిపారు. ఏకంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాందీ లాంటి వారు స్పందించినట్లు మీడియా లేని పోని కలరింగులిచ్చారు. అబద్దాలు విసృతంగా ప్రచారం చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీలో స్పందన కనిపించకపోవడంతో బిఆర్‌ఎస్‌ నెత్తిన చేతులు పెట్టుకున్నది. ఎలాగైనా మంత్రిని భర్తరఫ్‌ చేయించాలిన పన్నాగం పన్నింది. కాని మంత్రి కొండా సురేఖకు అండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బిసి నాయకులంతా ఏకమయ్యారు. ఒక బడుగుల ఆడబిడ్డపై లేని పోని వివాదాలు సృష్టించి ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించేలా బిఆర్‌ఎస్‌ చేసిన కుట్రలను పటాపంచెలు చేశారు. తెలంగాణ బిసిలంతా ఏకమై బిఆర్‌ఎస్‌ మీద యుద్దం ప్రకటించింది. నిజం అడుగు బైట పెట్టేలోపు అబద్దం ఆరు ఊర్లు తిరిగి వస్తుందన్నట్లు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు విపరీతార్దాలు సృష్టించి లేని పోనివి ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూశారు. కాని కాంగ్రెస్‌పార్టీ తన పార్టీ నేత కొండా సురేఖను కాపాడడంలో సఫలమైంది. కాంగ్రెస్‌ పార్టీ అంటే బడుగులకు అండగా వుండే పార్టీ అని మరోసారి నిరూపించింది. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో బడుగులను అడుగుగడుగునా అణచివేస్తూ వచ్చింది. బడుగుల నాయకులు ఎదడగాన్ని కేసిఆర్‌ తో సహా పెత్తందారి నీj నాయకులు సహించలేకపోయారు. దాంతో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మీద లేని పోని అపోహలు సృష్టించి ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పటి వరకు రాజయ్య చేసిన తప్పేమిటో మాత్రం చెప్పలేదు. పైగా అడుగడుగునా ఆయనను పార్టీ అవమానించింది. ఒక దశలో ఎన్నికల స్టేజీ మీద పక్కన కూర్చున్న రాజయ్య షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతే కేసిఆర్‌ చీదరించుకున్న సందర్భం వుంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మీద ఓ సినీ నటి లేనిపోని ఆరోపణలు చేస్తే ఆయనను కూడా పదవినుంచి తొలిగించేందుకు సిద్దమయ్యారు. కాని ఆగిపోయారు. ఉద్యమ కాలం నుంచి కేసిఆర్‌కు అండగా నిలిచిన ఈటెల రాజేందర్‌, గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అన్న ఒక్క మాట పట్టుకొని ఆయనను మెడపట్టి గెంటివేసినంత పనిచేశారు. ఆయనను భూ కబ్జా కోరురుగా చిత్రీకరించి బైటకు పంపించారు. మంత్రి పదవి నుంచి తొలిగించారు. ఇలా బడుగులకు అడుగడుగునా అవమానం చేసిన పార్టీ బిఆర్‌ఎస్‌. బడుగుల నాయకులకు ఆదప వచ్చినప్పుడు అండగా నిలిచింది కాంగ్రెస్‌ పార్టీ. వారికి కొండంత ధైర్యం నింపే నాయకుడు రేవంత్‌ రెడ్డి. అదీ ఒక నాయకుడికి వుండాల్సిన తత్వం. అదే అసలైన వ్యక్తిత్వం. అదే రేవంత్‌ రెడ్డి విశాలమైన మనసున్న నాయత్వం.

చీటింగ్‌లో చిట్‌ఫండ్స్‌ చమక్కు! ఎపిసోడ్‌-1

https://epaper.netidhatri.com/view/381/netidhathri-e-paper-19th-september-2024/2

-హైడ్రా రాకముందే అన్ని అమ్మేసుకుందాం

-కొన్ని చిట్‌ ఫండ్‌ సంస్థలు కొనుగోలు చేసిన స్థలాలన్నీ చెరువు శిఖాలే!అసైన్డ్‌ భూములే!

-హైడ్రా నోటీసులొచ్చే లోపు ఆనవాలు లేకుండా చూసుకోవడమే!

-తెలంగాణ వ్యాప్తంగా చిట్‌ ఫండ్స్‌ నయా మోసం!

-అగ్గువగా ఫ్లాట్లిస్తాం..ఆలోచించిన ఆశాభంగం!

-బురిడీ కొట్టిచ్చి..ప్లాట్లు అంటగట్టేస్తాం!

-డబ్బులు లేవని చెప్పేద్దాం..కావాలంటే ఫ్లాట్లు రాసిస్తాం!

-చిట్‌ ఎత్తినా నెలల తరబడి తిప్పించుకుంటాం..ఇది పాత మాట.

-చిట్టేసిన వాళ్లకు ఫ్లాట్లే ఇస్తాం..ఇది కొత్త మాట.

-ఇలా కూడా చీట్‌ చేస్తాం!

-హైడ్రా నుంచి తప్పించుకునేందుకు నయా వ్యాపారం!

-అమాయక కస్టమర్లను ఇలా కూడా ముంచేస్తాం.

-కస్టమర్లకు అమ్మేసి చేతులు దులిపేసుకుందాం.

-కేసుల నుంచి తప్పించుకుందాం..

-చిట్‌ అమౌంట్‌ ఇవ్వలేం…

-కావాలంటే ఫ్లాట్లు ఇస్తాం..

-చిట్‌ ఫండ్‌ వెంచర్‌ ఫ్లాట్లు అంటకడతాం?

-ఆలోచించుకోండి…మీ ఇష్టం!

-ఎలాగైనా వదిలించుకునేందుకు కొత్త ఎత్తుగడలు.

-అడ్డికి పావుసేరుకైనా అంటగట్టడమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా దెబ్బకు కొన్ని చిట్‌ఫండ్‌ కంపనీలు విలవిలలాడిపోతున్నాయి. చిట్‌ ఫండ్‌ సంస్ధల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రాకు చిట్‌పండ్‌ కంపనీలకు సంబంధం ఏమిటా? అన్న అనుమానం కల్గుతోందా? ఇక్కడే వుంది అసలు తిరకాసు. హైడ్రా తెరమీదకు రావడంతో చిట్‌ఫండ్‌ సంస్ధల మోసాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో చాల వరకు చిట్‌ ఫండ్‌ కంపనీలు రియల్‌ వ్యాపారం పెద్దఎత్తున చేశాయి. కొన్ని సంస్ధలు సంయుక్తంగా చేస్తే, కొన్ని పెద్ద సంస్ధలు సొంతంగా పెద్దఎత్తున రియల్‌ వ్యాపారం సాగించాయి. అయితే చిట్‌ ఫండ్‌ సంస్థలు పెట్టిన పెట్టుబడి మొత్తం చిట్‌ దారుల నుంచి వసూలు చేసిన డబ్బులే కావడం గమనార్హం. అయితే లోగుట్టులో కొన్ని ఆసక్తికరమైన అంశాలుంటాయి. గతంలో చిట్‌ఫండ్‌లు చిట్‌ వేసిన వారికాల పరిమిత పూర్తయిన తర్వాత వచ్చే ఎక మొత్తం సొమ్మును వారికి ఇవ్వకుండా వారిని ఒప్పించి, మెప్పించి, లేని పోని ఆశలు కల్పించి, అధిక వడ్డీ ఎర వేసి, ఆ సొమ్మును డిపాజిట్లు తిరిగి అవే సంస్ధలు తీసుకునేవి. చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ అనే లెక్కతో చిట్లు వేసిన వారిని పెద్దఎత్తున ప్రజల సొమ్మును డిపాజిట్లుగా మల్చుకునేవారు. అయితే కాల క్రమేనా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి డిపాజిట్లకు అంగీకరించడం మానుకున్నారు. చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ల పేరుతో డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది. వాటికి ఆ అర్హత లేదని తేల్చిచెప్పింది. దాంతో చిట్స్‌ కంపనీలు రియల్‌ వ్యాపారం బాట పట్టాయి. ఒక వేళ చిట్స్‌ నిబందనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ చర్యలుంటాయని హెచ్చరించింది. దాంతో కొత్త మార్గం వెతుకున్నారు. ఇంతలో తెలంగాణలోనే దేశ వ్యాప్తంగా రియల్‌ వ్యాపారం పెరిగింది. ఒక దశలో ఉచ్చ దశకు చేరుకున్నది. ఆ సందర్భంలో ఇదే చిట్టి దారుల నుంచి చిట్స్‌కు చేరే సొమ్ముతో నగర శివారుల్లో వుండే రైతుల భూములను తక్కువ ధరకు పెద్దఎత్తున సేకరించుకొని పెట్టుకున్నారు. ప్రజల సొమ్మంతా అక్కడ పెట్టుబడి పెట్టారు. భూమి మీద పెడితే ఎప్పటికైనా మేలుతోపాటు, మరింత లాభమే తప్ప నష్టం వుండదు. రూపాయికి వేయి రూపాయలు లాభం వస్తుందన్న బలమైన నమ్మకం కూడా వుంది. అందుకే తెలంగాణలో అసలు సాగుకు కూడా పనికి రావనుకున్న భూమలన్నీ నివాస యోగ్యాలుగా మార్చే వ్యాపారం పెద్దఎత్తున మొదలైంది. దాంతో అత్యాశకు పోయిన కొన్ని చిట్‌ ఫండ్‌ కంపనీలు భూములు కొనుగోలు చేయడం, ఖాతాదారులకు సొమ్ము ఇవ్వకుండా, స్ధిరాస్ధుల పేరుతో వారి వెంచర్లలో ప్లాట్లు అంటగట్టడం మొదలు పెట్టారు. డబ్బులు అత్యవసరమైన వాళ్లు తప్ప, మిగతా వాళ్లంతా ప్లాట్లకు చిట్స్‌నుంచి వచ్చే సొమ్ముకు అదనంగా మరింత జత చేసి మరీ ప్లాట్లు కొన్నవాళ్లు కొన్ని లక్షల మంది వున్నారు. అలా మూడు చిట్లు, ఆరు ప్లాట్లుగా సాగుతున్న వ్యాపారాన్ని మరింత మరింత విస్తరించుకోవాలన్న ఆశతో చిట్స్‌ కంపనీలు విచ్చలవిడిగా భూములు కొనుగోలు చేశారు. అందులో చెరువు భూములున్నాయి. శిఖం భూములున్నాయి. అసైండ్‌ భూములు కూడ వున్నాయి. చిట్స్‌ కంపనీలు రైతులనుంచి నేరుగా సేకరించిన భూములతోపాటు వాటికి ఆనుకొని వున్న అసైండ్‌ భూములు, శిఖం భూములును కూడా మింగేశారు. రెవిన్యూ అధికారులతో కలిసి, రిజిస్ట్రార్ల్‌ను మేనేజ్‌ చేసుకొని ఎకరాల కొద్ది భూములను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్లాట్లు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. అయితే ఇలా అమ్మగా చిట్స్‌ ఆస్ధులుగా భవిష్యత్తులో కూడా ఖాతాదారులు ముడిపెట్టేందుకు ఇంకా కొన్ని వేల ఎకరాల భూములు చిట్స్‌ కంపనీల చేతుల్లో వున్నాయి.

ఇప్పుడు అనుకోకుండా హైడ్రా వచ్చి పడిరది. ఏం చేయాలో పాలుపోని చిట్స్‌ కంపనీలు ఆ భూములను ఎలాగైనా వదిలించుకొని,ఖాతాదారులకు కట్టబెడుతున్నారు. ఒకప్పుడు రూపాయి కూడా తక్కువ ఇచ్చేది లేదంటూ చిట్స్‌ సొమ్ముకు తోడు లక్షలకు లక్షలు వసూలు చేసిన కంపనీలు ఇప్పుడు ఆ ప్లాట్లను అడ్డికిపావుసేరుకు అమ్మకాలు సాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాలు సాగిస్తున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నిజానికి రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు. కాని రిజిస్ట్రేషన్లు ఆగిపోలేదు. కారణం అమాయకులైన ప్రజలను ఇలా చిట్స్‌ కంపనీలు మోసం చేస్తున్నాయి. సహజంగా చిట్టి ఎత్తుకున్న తర్వాత ఏ ఖాతాదారుడికైన కంపనీలు మూడు నెలలలోపు ఆ సొమ్ము ఇవ్వదు. కొన్ని కంపనీలైతే అన్ని సక్రమంగా వున్నా ఆరు నెలలకు కూడా సొమ్ములు ఇవ్వవు. ఇలాంటి సమయంలో చిట్స్‌ కంపనీలు ఖాతాదారులను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తాదు. అందులో ప్లాట్ల దందా ఒకటి. అయితే ఇటీవల చిట్టిలు ఎత్తుకున్న వారికి సొమ్ము ఇవ్వడం కుదరని కంపనీలు తెల్చి చెబుతున్నాయి. కంపనీల్లో సొమ్ములేదని, ఆసొమ్మంతా ఖాతాదారుల మేలు కోసమే భూమి మీద పెట్టుబడి పెట్టామని నమ్మిస్తున్నారు. చిట్టిని బట్టి భూమిని కేటాయిస్తామే తప్ప, సొమ్ములు చేతుల్లో లేవని తేల్చిచెబుతున్నారు. దాంతో ఖాతాదారులు తప్పని పరిస్దితుల్లో ప్లాట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ భూములన్నీ అన్ని సక్రమంగానే వున్నట్లు మాయ చేస్తున్నారు. ఖాతాదారులను మభ్యపెడుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అలా చకచకా సాగుతున్న రిజిస్ట్రేషన్లలో అన్నీ ఇలాంటివే అన్న నిజాలు వెలుగు చూస్తున్నాయి. కంపనీల్లో సొమ్ము లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి! అని తెల్చి చెబుతుండడంతో, దిక్కు తోచక ఖాతాదారులు ప్లాట్లు తీసుకుంటున్నారు. కాని కొంత కాలానికి తాము పూర్తిగా మోసపోయామని తెలిస్తే వారి పరిస్ధితి ఏమిటన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఏటా కొన్ని వందల చిట్‌ కంపనీలు బోర్డులు తిప్పేస్తూనే వున్నా, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కొత్త కొత్త కంపనీలు పుట్టుకొస్తూనే వున్నాయి. వ్యాపారం విస్తరించుకుంటూనే వున్నాయి. ఖాతాదారులు సొమ్ముతో రియల్‌ వ్యాపారం సాగిస్తూనే వున్నాయి. అయితే గతం వేరు. ఇప్పుడు వేరు. గతంలో ఖాతాదారులకు చిట్స్‌ కంపనీలు అంట గట్టిన ప్లాట్లలో కూడా ఏవి నిజమైనవి? ఏవి చెరువుల్లో వున్నవి అన్నవి కూడా కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే మోసపోయిన వాళ్లు తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది వున్నారు. ఇంత జరుగుతున్నా చిట్స్‌ కంపనీలు ఇంకా మోసం చేస్తూనే వున్నాయి. ప్రభుత్వం వెంటనే మేలుకొని ఇలాంటి మోసాలపై ప్రజలను అప్రమత్తంగా వుండాలని హెచ్చరించాల్సిన అవసరం వుంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత వుంది. లేకుంటే ప్రజలు ఇంకా నష్టపోవాల్సివుంటుంది. తర్వాత బుల్లోజర్లు వచ్చి, ప్లాట్లు స్వాదీనం చేసుకుంటే ప్రజలు లబోదిబోమనక తప్పదు. అయితే వున్న భూములను ఇప్పుడే అమ్మేస్తే తమకు చేతులకు మట్టి అంట కుండా వుంటుంది. కేసుల బారిన పడుకుండా జాగ్రత్తపడొచ్చని చిట్స్‌ కంపనీలు ఈ ఎత్తుగడ వేశాయి. ఒక వేళ హైడ్రా ఆ భూములను ఇప్పుడే స్వాధీనం చేసుకుంటే చిట్స్‌ వ్యాపారాలు కుప్పకూలిపోతాయి.

పైగా భూమ్మీద పెట్టిన సొమ్ముంతా చెరువు పాలౌతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ములేదని చేతులెత్తేయాల్సి వస్తుంది. అయితే ప్రజల సొమ్ముతో అక్రమ వ్యాపారం చేసినందుకు కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. చిట్స్‌ వ్యాపారంలో మోసపోయామంటే చెల్లుతుంది. కాని ఖాతాదారుల అనుమతి లేకుండా వారి సొమ్ము వారికి తెలియకుండా భూ వ్యాపారం చేసి లాభాలు గడిరచి, ఇప్పుడు నష్టపోయామని చెబితే చట్టం నమ్మదు. న్యాయస్ధానం ఒప్పుకోదు. ఇలాంటి కేసుల్లో ఐపి పెట్టడానికి కూడా అవకాశం వుండదు. అక్రమంగా అసైండ్‌ భూములు కొనుగోలు చేయడం నేరమని తెలిసి ఎలా కొనుగోలు చేశారన్నది తెరమీదకు వస్తుంది. ఏ రకంగా చూసినా చిట్స్‌ వ్యాపారులకు ముందునుయ్యి, వెనకు గొయ్యిగా మారుతుంది. ఆ ఉప ద్రవం నుంచి తప్పించుకోవడానికి గుట్టు చప్పుడు కాకుండా, అమాయకులైన ఖాతాదారులకు చిట్స్‌ కంపనీలు కుచ్చు టోపి పెడుతున్నారు. హైడ్రా వచ్చినప్పుడు వాళ్లే ఎదురుతిరుగుతారు. అంతే కాకుండా హైడ్రాకు ఎదురు తిరిగితే కేసులు నమోదు చేస్తారని భయపడి సైలెంటుగా వుంటారు. ఏది జరిగినా మళ్లీ చిట్‌ కంపనీలకే లాభం… అందుకే చిట్స్‌ కంపనీలు ఈ దురాగతానికి ఒడిగట్టాయి. ప్రజలారా..తొందరపడి చిట్‌ కంపనీలు అగ్గువకు ప్లాట్లు ఇస్తున్నారని మోసం పోకండి. వాటిని తీసుకోకండి.

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విలీనమా విమోచనమా విద్రోహ దినమా ?

ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో

భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం

నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది

భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం

ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది

భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం రాజు చేతిలో బందీగా ఉంది. భారతదేశమంతా స్వతంత్ర పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎంచుకొని నిజాం ప్రభువుకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనలు చేస్తూ పోరాటం ముందుకు సాగించారు. ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ప్రభువు చేతిలో ఇంకా బందీగా ఉంది, యావత్ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం నిరంకుషానికి బలైపోతూనే ఉన్నారు, ఒకవైపు సాయుధ పోరాటం వల్ల నిజాం రాజుకు ముచ్చమటలు పటిస్తున్న తెలంగాణ ప్రజలు , రజాకార్లను, దేశ్ ముఖులను ఊర్ల నుండి తరిమికొడుతుంటే, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా వెళుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో సాయుధ పోరాట ప్రభావం చూపెడుతుందని భావించిన భారత ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి మిలటరీతో తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాదు స్టేట్ ని భారత దేశంలో కలుపుకునేందుకు నిజాం రాజు పై దండయాత్ర చేయడం జరిగింది అలా తీసుకున్న చర్యనే ఆపరేషన్ పోలోగా ఆనాటి భారత ప్రభుత్వం చెబుతుంది. భారత దేశ మిల్ట్రీ హైదరాబాద్ స్టేట్ లో అడుగుపెట్టి నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారులతో ప్రత్యక్ష యుద్ధం లో దిగారు ఇలా కొన్ని రోజులు సాగినటువంటి ఆపరేషన్ పోలో కి తలోగ్గిన నిజాం ప్రభువు భారత దేశ హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆనాటి భారత దేశ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల చైతన్యాన్ని గమనించి ఈ చైతన్యమంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కచ్చితంగా వ్యాపిస్తుందని దాని ప్రభావం యావత్ భారతదేశంపై పడుతుందని దానివల్ల భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టు దేశంగా మారే అవకాశం ఉందని గ్రహించి ఆపరేషన్ పోలోను చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ముసుగులో రజాకారులను, సామాన్యులను, ఒక వర్గ ప్రజలను మరియు సాయుధ పోరాటం వీరులను అంతం చేయడం జరిగింది. మరోవైపు చరిత్రకారుల పుస్తకాల్లో తెలంగాణ ప్రజల మానప్రాణాలను ఆపరేషన్ పోలో ముసుగులో దోచేశారని, కుప్పల కొద్దీ శవాలు విలిన తర్వాత బయటపడ్డాయని అనేకమంది మహిళలు మానాలు కోల్పోయారని చరిత్రకారుల పుస్తకాల్లో లిఖించబడ్డాయ, అందుకనే కమ్యూనిస్టులు ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించాయి, మరోవైపు భారతదేశం దీన్ని విలీనం ప్రక్రియగా ప్రకటించి ఇక్కడి ప్రజలను నిజాం నిరంకుశ పాల నుండి విమోచనం చేశామని ప్రకటించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 యొక్క ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఈ రోజును ఒక ప్రత్యేక దినంగా తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా ఆపరేషన్ పోలో అమరవీరులకు, సాయుధ పోరాట అమరవీరులకు ఇక్కడ ప్రజల త్యాగాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకాకుండా, చరిత్రను చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర పెత్తందారులు , ఆనాటి ముఖ్యమంత్రులు ఇలా చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతమై 1969లో విద్యార్థి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా హక్కులను మేము కాపాడుకుంటామని పోరాటం చేశారు ఆనాడు వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను బలికున్నారు ఆంధ్ర పెత్తందార , ముఖ్యమంత్రులు. ఆ తర్వాత తెలంగాణ వాదం కొన్ని రోజులు మరుగునపడిన 2001 తర్వాత అది రాజకీయ ఉనికిని పుచ్చుకొని మరో ఉద్యమంగా మారింది అలా సాగుతున్న ప్రయాణంలో 2009లో ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగింది వేలాదిమంది ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో త్యాగాలు చేసిన వీరులను చూశారు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరులను తెలంగాణ ప్రాంతంలోని చూశాను, ఎందుకంటే ఒకవైపు భారత దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పైన చేస్తున్నటువంటి అణచివేతను తీవ్రంగా ప్రతిఘటిస్తూన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి కొంతమంది వారి ఆత్మ బలిదానాలు వలన చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి అనుకున్నారు, అలా చాలా మంది అమరులయ్యారు అలా అమరులైన ప్రతి అమరుడికి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు చివరిగా వివిధ పార్టీలు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించిన అధికారికంగా సెప్టెంబర్ 17న ఇంతవరకు నిర్వహించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా ప్రకటించి అధికారికంగా నిర్వహించబోతోంది దానికి తెలంగాణ ప్రజల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దినోత్సవం రోజున ముందుగా సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వీరులకు, ఆపరేషన్ పోలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు, వీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలకు సరైన న్యాయం చేసి, ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారి త్యాగాలకు తగిన గుర్తింపుని ఇవ్వాలని వారికి ఉద్యమకారుల పెన్షన్లతో గౌరవించాలని ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల్లో ఇళ్లను కట్టించి ఇవ్వాలని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటను ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనాప్పటికీ చరిత్రలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ ఆధిపత్య కులాలు మరియు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు చేసి, అమరవీరుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేయడం దుర్మార్గమని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా పుస్తకాలను రూపొందించి దేశ, విదేశాలకు తెలంగాణ చరిత్రను వ్యాప్తి చెందేలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.

ఆర్టికల్ రాసింది:
తాడిశెట్టి క్రాంతి కుమార్
తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు,
హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్,
తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం కన్వీనర్,
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్టెడ్ కాండేట్

హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ లో వైభవంగా శ్రీరాధాష్టమి వేడుకలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11, 2024 (బుధవారం) : బంజారా హిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఈరోజు శ్రీ రాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ భగవానుని నిత్య సఖీమణి శ్రీమతి రాధారాణి యొక్క దివ్య ఆవిర్భావ తిథియైన శుభ సందర్భంగా నగరంలోని అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివార్ల దివ్య ఆశీస్సులను పొందారు.

నేటి ఉదయం నుండి శ్రీశ్రీ రాధా గోవిందులు అద్భుతమైన నవవస్త్రాలు మరియు అత్యద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి, భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించబడిన దేవాలయమంతా పరిమళభరితమైంది. సాయంసంధ్యా వేళలో వైదిక ఋత్విక్కుల వేద మంత్రోచ్ఛారణలు మరియు శ్రావ్యమైన హరినామ సంకీర్తనల నడుమ 108 కలశాలతో శ్రీ రాధాగోవింద అభిషేకం అట్టహాసంగా నిర్వహించబడింది.

అభిషేకంలో భాగంగా, శ్రీ రాధా గోవిందులకు పంచామృతము (పాలు, పెరుగు, తేనె మొదలైనవి), పంచగవ్యము (ఆవు నుండి 5 పవిత్రమైన వస్తువులు), వివిధ రకాల పండ్ల రసాలు, అరుదైన వన మూలికలు, వివిధ రకాల సుగంధ పుష్పాలు, ప్రత్యేక ఓషధులు, నవరత్నాలు మొదలైనవి భక్తిభావంతో సమర్పించబడ్డాయి. శ్రీ రాధాగోవిందుల ప్రీత్యర్థం భక్తులంతా భక్తిపారవశ్యంతో “శ్రీ రాధాష్టకమును గానం చేశారు. స్వామి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన చప్పన్ భోగ్ (56 విశేషమైన ఆహార పదార్థాలతో కూడిన నైవేద్యం) వేడుకల్లోని మరో విశేషం. ఆ తరువాత స్వామివార్లకు విశేషమైన హారతిని అందించారు.

హరే కృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ అధ్యక్షులైన పూజ్యశ్రీ సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ (M. Tech, IIT చెన్నై)  వారు తమ ప్రవచనంలో రాధాష్టమి యొక్క ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. భాద్రపద మాసం (ఆగస్టు-సెప్టెంబర్) శుక్ల పక్ష అష్టమి తిథినాడు ఈ భువిపై అవతరించిన శ్రీమతి రాధారాణి సమస్త జగత్తుకూ తల్లి వంటిదని, ఈ పవిత్రమైన రోజున భక్తులంతా తమకు కృష్ణ భక్తిని ప్రసాదించమని ఆ తల్లిని ప్రార్థిస్తారని వారు వివరించారు. షోడశోపచారములు, శృంగార హారతి, రాజ భోగ్ హారతి, సంధ్యా హారతి, మహాభిషేకం, ఝూలన్ (ఊంజల) సేవ, మహాపల్లకీ సేవ, శయన హారతి, ఏకాంత సేవ మొదలైన పలు విశేష సేవలన్నీ ఈ ఉత్సవంలో స్వామివార్లకు నిశితంగా నిర్వహించబడ్డాయి.

మందిర సందర్శకుల సౌకర్యార్థం ఆలయంలో విస్తృతమైన ఏర్పాట్లను చేయడమే గాక, వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ రుచికరమైన భోజన ప్రసాదాలను కూడా అందించడం జరిగింది.

అమరవీరుల ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతాం.

కామ్రేడ్ బి విజయ సారథి, సిపిఐ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి.

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 11 నుండి 17 దాకా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మొదటిరోజు తొర్రూరు మండలంలో సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామాల్లో గల తమ్మెర వెంకటరామ నరసయ్య గారి స్థూపానికి మరియు తెలంగాణ అమరవీరుల స్తూపాలకి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి. విజయ సారధి పాల్గొన్నారు. అమ్మాపురం లో గల స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఊరేగింపు నిర్వహించారు. కామ్రేడ్ విజయ సారధి మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు నైజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి, కోట్లాదిమంది ప్రజలలో చైతన్యాన్ని రగిలించిన యోధులే తెలంగాణ సాయుధ పోరాట యోధులు. రాచరిక వ్యతిరేక పోరాటాన్ని ,హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించే మత చాందసవాదుల కుట్రలను తిప్పికొట్టాలని, అన్నారు. తెలంగాణ చరిత్రలోనూ, పోరాటం తోను సంబంధంలేని మతోన్మాద శక్తులు ఇవ్వాల తెలంగాణ చరిత్రకు మతంరంగును పులుముతున్నాయి. ప్రజలకు, ప్రజాపీడకులైన దొరలు, దేశముకులకు మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ మతంరంగు అంటుగడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవిక గాధ నేటి యువతరానికి తెలియాల్సి ఉంది. ఆనాటి రైతుల పంటలను, భూస్వాములు బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితులలో, దొరల దౌర్జన్యాలను ఎదిరించిన కామ్రేడ్ ఐలమ్మ లాంటి వీరవనితలకు ,గుత్పసంఘం వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యమంపై నీచంగా దాడులు చేస్తూ, అరాచకాలకు పాల్పడిన భూస్వాములపై, సామాన్య ప్రజలు తిరగబడ్డారు. సాంప్రదాయ ఆయుధాలతో భూస్వాములను ఎదుర్కోలేమని భావించిన కమ్యూనిస్టు పార్టీ, 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. రజకర్ల అధ్యక్షుడు కాసిం రజిని అయినా, దానికి ఉపాధ్యక్షుడు ఇదే విసునూరు రామచంద్రారెడ్డి. ఇవాళ ఏ రజివీని అయితే దుర్మార్గుడిగా, కూని కోరుగా మాట్లాడుతున్నామో,అందులో భాగస్తుడే ఈ విసునూరు రామచంద్రారెడ్డికి కూడా భాగం ఉన్నది .అతని తల్లి జానకమ్మ ,అతని కొడుకు బాబు దొర, చేసిన అఘాయిత్యాలకు, అకృత్యాలకు, జనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి తరుణంలో అమ్మాపురం గ్రామం సాయుధ పోరాటయోధులకు నిలయమైంది. ఈ గ్రామం నుంచి ఆనాడు కొండపల్లి గోపాలరావు గారి నాయకత్వంలో ప, గూడెల్లి ఎల్లయ్య, దొనక రాములు, గుంటుక అయిలయ్య,కొత్తూరు నరసయ్య, జనగం సోమయ్య, కొలిపాక సాయన్న, ముడుపు రామిరెడ్డి తదితరులు ఈ పోరాటంలో పాల్గొని, జాల్నా జైలుకు వెళ్లి వచ్చారు .అలాగే ఈ రజాకారుల మూకల దౌర్జన్యానికి ఈ గ్రామాల్లోనే వడ్డేపల్లి పుల్లయ్య, కడుదుల గోపయ్య అనే వ్యక్తులను సజీవదహనం చేసిన చరిత్ర ఈ గ్రామానికి కలదు. కావున ఇటువంటి పోరాటాలను నేడు యువత తెలుసుకొని, ఈ తెలంగాణ పోరాటాలను వక్రీకరిస్తున్న వ్యక్తులకు, పార్టీలకు, బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది.
తదనంతరం కామ్రేడ్ తమ్మెర విశ్వేశ్వరరావు సిపిఐ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ఆనాటి పోరాటయోధుల స్ఫూర్తితోనే, మేము ఇంకా ముందుకు నడుస్తామని ,వారి ఆశయ సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తామని ,చెబుతూ ఆనాటి యోధుల కుటుంబాలను ఘనంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది . తదనంతరం హరిపిరాల గ్రామంలో కామ్రేడ్ వల్లపు కొమరెల్లి గారి స్థూపానికి, వెంకటాపురంలోని మొగుళ్ళ మల్లయ్య స్తూపానికి, తోరూరులోని మన్నూరు వెంకటయ్య స్తూపాలకు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఓమా బిక్షపతి,మండల కార్యదర్శి. బందుమహేందర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఘనపురం లక్ష్మను ,డి హెచ్ పి ఎస్ నాయకులు గూడెల్లి ఎల్లయ్య, గ్రామ కార్యదర్శి బూరుగు యాదగిరి, గ్రామ మాజీ సర్పంచులు గూడెల్లి ఎల్లయ్య, మామిళ్ళపల్లి రమేషు, కోటగిరి ఏకాంతం, జనగం శ్రీనివాస్, పంజాల పాపయ్య పబ్బోజు బ్రహ్మచారి తదితరుల పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version