సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విలీనమా విమోచనమా విద్రోహ దినమా ?

ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో

భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం

నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది

భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం

ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది

భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం రాజు చేతిలో బందీగా ఉంది. భారతదేశమంతా స్వతంత్ర పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటం ఎంచుకొని నిజాం ప్రభువుకు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటనలు చేస్తూ పోరాటం ముందుకు సాగించారు. ఆగస్టు 15 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ప్రభువు చేతిలో ఇంకా బందీగా ఉంది, యావత్ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవిస్తుంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు నిజాం నిరంకుషానికి బలైపోతూనే ఉన్నారు, ఒకవైపు సాయుధ పోరాటం వల్ల నిజాం రాజుకు ముచ్చమటలు పటిస్తున్న తెలంగాణ ప్రజలు , రజాకార్లను, దేశ్ ముఖులను ఊర్ల నుండి తరిమికొడుతుంటే, ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా వెళుతుందని దక్షిణాది రాష్ట్రాల్లో సాయుధ పోరాట ప్రభావం చూపెడుతుందని భావించిన భారత ప్రభుత్వం ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి మిలటరీతో తెలంగాణ ప్రాంతమైనటువంటి హైదరాబాదు స్టేట్ ని భారత దేశంలో కలుపుకునేందుకు నిజాం రాజు పై దండయాత్ర చేయడం జరిగింది అలా తీసుకున్న చర్యనే ఆపరేషన్ పోలోగా ఆనాటి భారత ప్రభుత్వం చెబుతుంది. భారత దేశ మిల్ట్రీ హైదరాబాద్ స్టేట్ లో అడుగుపెట్టి నిజాం రాజుకు వ్యతిరేకంగా రజాకారులతో ప్రత్యక్ష యుద్ధం లో దిగారు ఇలా కొన్ని రోజులు సాగినటువంటి ఆపరేషన్ పోలో కి తలోగ్గిన నిజాం ప్రభువు భారత దేశ హోం శాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆనాటి భారత దేశ ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటం, ఇక్కడ ప్రజల చైతన్యాన్ని గమనించి ఈ చైతన్యమంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కచ్చితంగా వ్యాపిస్తుందని దాని ప్రభావం యావత్ భారతదేశంపై పడుతుందని దానివల్ల భారతదేశం అంతా కూడా కమ్యూనిస్టు దేశంగా మారే అవకాశం ఉందని గ్రహించి ఆపరేషన్ పోలోను చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ముసుగులో రజాకారులను, సామాన్యులను, ఒక వర్గ ప్రజలను మరియు సాయుధ పోరాటం వీరులను అంతం చేయడం జరిగింది. మరోవైపు చరిత్రకారుల పుస్తకాల్లో తెలంగాణ ప్రజల మానప్రాణాలను ఆపరేషన్ పోలో ముసుగులో దోచేశారని, కుప్పల కొద్దీ శవాలు విలిన తర్వాత బయటపడ్డాయని అనేకమంది మహిళలు మానాలు కోల్పోయారని చరిత్రకారుల పుస్తకాల్లో లిఖించబడ్డాయ, అందుకనే కమ్యూనిస్టులు ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించాయి, మరోవైపు భారతదేశం దీన్ని విలీనం ప్రక్రియగా ప్రకటించి ఇక్కడి ప్రజలను నిజాం నిరంకుశ పాల నుండి విమోచనం చేశామని ప్రకటించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 యొక్క ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఈ రోజును ఒక ప్రత్యేక దినంగా తెలంగాణ అస్తిత్వానికి గుర్తుగా ఆపరేషన్ పోలో అమరవీరులకు, సాయుధ పోరాట అమరవీరులకు ఇక్కడ ప్రజల త్యాగాలకు గుర్తుగా ఈ రోజును జరుపుకాకుండా, చరిత్రను చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర పెత్తందారులు , ఆనాటి ముఖ్యమంత్రులు ఇలా చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడి ప్రజలు చైతన్యవంతమై 1969లో విద్యార్థి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మా హక్కులను మేము కాపాడుకుంటామని పోరాటం చేశారు ఆనాడు వందలాదిమంది విద్యార్థుల ప్రాణాలను బలికున్నారు ఆంధ్ర పెత్తందార , ముఖ్యమంత్రులు. ఆ తర్వాత తెలంగాణ వాదం కొన్ని రోజులు మరుగునపడిన 2001 తర్వాత అది రాజకీయ ఉనికిని పుచ్చుకొని మరో ఉద్యమంగా మారింది అలా సాగుతున్న ప్రయాణంలో 2009లో ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగింది వేలాదిమంది ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో త్యాగాలు చేసిన వీరులను చూశారు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరులను తెలంగాణ ప్రాంతంలోని చూశాను, ఎందుకంటే ఒకవైపు భారత దేశ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల పైన చేస్తున్నటువంటి అణచివేతను తీవ్రంగా ప్రతిఘటిస్తూన్న, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి కొంతమంది వారి ఆత్మ బలిదానాలు వలన చలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తాయి అనుకున్నారు, అలా చాలా మంది అమరులయ్యారు అలా అమరులైన ప్రతి అమరుడికి జోహార్లు అర్పిస్తూ, తెలంగాణ అస్తిత్వ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు చివరిగా వివిధ పార్టీలు సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించిన అధికారికంగా సెప్టెంబర్ 17న ఇంతవరకు నిర్వహించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా ప్రకటించి అధికారికంగా నిర్వహించబోతోంది దానికి తెలంగాణ ప్రజల తరుపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ దినోత్సవం రోజున ముందుగా సాయుధ పోరాటం, విద్యార్థి ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వీరులకు, ఆపరేషన్ పోలో అమరులైనటువంటి అమాయక ప్రజలకు, వీరులకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలకు సరైన న్యాయం చేసి, ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారి త్యాగాలకు తగిన గుర్తింపుని ఇవ్వాలని వారికి ఉద్యమకారుల పెన్షన్లతో గౌరవించాలని ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల్లో ఇళ్లను కట్టించి ఇవ్వాలని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పెషల్ కోటను ప్రకటించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ ప్రభుత్వానికి ఉద్యమకారుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనాప్పటికీ చరిత్రలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సాయుధ పోరాట అమరవీరుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం ఇక్కడ ఆధిపత్య కులాలు మరియు ఆంధ్ర పెత్తందారులు ముఖ్యమంత్రులు చేసి, అమరవీరుల అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా చేయడం దుర్మార్గమని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మన చరిత్రను ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా పుస్తకాలను రూపొందించి దేశ, విదేశాలకు తెలంగాణ చరిత్రను వ్యాప్తి చెందేలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.

ఆర్టికల్ రాసింది:
తాడిశెట్టి క్రాంతి కుమార్
తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకుడు,
హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్,
తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘం కన్వీనర్,
వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కంటెస్టెడ్ కాండేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!