-ఏపి అగ్రకులాల పక్షాన బిఆర్‌ఎస్.
-కొండా సురేఖ మీద సినీ వర్గం మూకుమ్మడి దాడి.
-సీని అగ్ర కులాలకు బాసటగా బిఆర్‌ఎస్ పార్టీ.
-తెలంగాణ ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్ పార్టీ.
-బిఆర్‌ఎస్‌పై తొలగిన తెలంగాణ ముసుగు.
-అసలైన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గొడుగు.
-కొండా, వర్సెస్ కేటిఆర్ అంశాన్ని సినీ లోకానికి ముడిపెట్టింది బిఆర్‌ఎస్.
-హుందాగా తనదైన శైలిని ప్రదర్శించింది కాంగ్రెస్.
-ఆది నుండి అగ్రకుల అహంకారం ప్రదర్శిస్తూనే వుంది బిఆర్‌ఎస్.
-బలహీన వర్గాలకు ఎప్పుడూ ఆపన్న హస్తం అందించేదే కాంగ్రెస్.
-బడుగులను నెగలనీయకుండా తరిమేసింది బిఆర్‌ఎస్.
-బడుగుల ఆడబిడ్డ సురేఖకు కష్టకాలంలో అండగా నిలిచింది కాంగ్రెస్.
-అపోహతో ఆనాడు రాజయ్యను భర్తరఫ్ చేసింది కేసిఆర్.
-తెలంగాణ ఆడపడుచుకు అండగా నేడు నిలిచింది రేవంత్.
-బడుగులను నిలువునా ముంచింది బిఆర్‌ఎస్.
-బడుగులకు రిజర్వేషన్లు పెంచాలన్న సంకల్పం కల్గింది కాంగ్రెస్.
-గులాబీ జెండా నాదన్నందుకు ఈటెలను తరిమేసింది బిఆర్‌ఎస్.
-ఎవరో ఆరోపణలు చేశారని గంగుల కమలాకర్‌ను తొక్కేయాలని చూసింది బిఆర్‌ఎస్.
-అగ్రకుల అహంకారానికి నిలువెత్తు సాక్ష్యం కేసిఆర్.
-అన్ని వర్గాలను కలుపుకుపోవడంలో మానవత్వం నిండిరది రేవంత్.
-పార్టీ నేతలపై అపవాదులొచ్చినప్పు కాపాడుకోలేని నాయకుడు కేసిఆర్.
-కాంగ్రెస్ నాయకుల మీద అవాకులు చెవాకులయ పేలితే అండగా నిలుస్తుంది రేవంత్.
-మాయమాటలతో రాజకీయం చేయడం కేసిఆర్‌కు అలవాటు.
-అసలైన మానవత్వ లక్షణాలు నిండిన నాయకుడు రేవంత్.
-ఆంధ్రులకు అడుగడుగునా అండగా నిలిచి తెలంగాణను చులకన చేసింది కేసిఆర్.
-తెలంగాణ వాళ్లకు ఎవరు అన్యాయం చేసినా చీల్చి చెండాడుతున్నది రేవంత్.
-రాజకీయ అవసరాల కోసం పరాయి వాళ్లకు పీటలేసింది కేసిఆర్.
-తెలంగాణకు అన్యాయం చేస్తే ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించమని నిరూపిస్తోంది రేవంత్.
-అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు పంచింది కేసిఆర్.
-తెలంగాణ కంచాలు లాగితే కూసాలు కదులుతాయని చెబుతున్నది రేవంత్.
హైదరాబాద్,నేటిధాత్రి:
పార్టీ నాయకుల కోసం అండగా నిలవలేని అగ్రనేతలు అధినేతలే కాదు. పార్టీ నాయకులకు విపత్కరపరిస్ధితులు ఎదురైనప్పుడు అండగా నిలవలేనప్పుడు అధి నాయకత్వమే కాదు. కాని మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అగ్రనాయకుడిగా, మంత్రి వర్గంలో తన తోటి సహచర మంత్రికి పూర్తి అండగా నిలిచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసనీయుడు. ఆయన చూపిన చొరవ మంత్రి వర్గానికే వన్నె తెచ్చినట్లైంది. ఆధిపత్య సీమాంధ్ర మీడియా చేస్తున్న హడావుడి ఉచ్చులో తెలంగాణ సమాజం పడిపోయింది. అందుకే కొందరు పనిగట్టుకొని కొండా సురేఖను టార్గెట్ చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ అసలు విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వున్న మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ అధికారిక కార్యాక్రమానికి హజరయ్యారు. మెదక్ జిల్లాలో పద్మశాలి కుటుంబాలు ఎక్కువ. మంత్రి కొండా సురేఖ కూడా పద్మశాలి ఆడబిడ్డ కావడంలో మెదక్ ఎంపి రఘునందన్ రావు మర్యాద పూర్వకంగా మంత్రి కిండా సురేఖకు నూలదండను మెడలో వేసి ఆహ్వానం పలికారు. పద్మశాలి సమాజం సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇది బిఆర్‌ఎస్ నాయకులకు కంటకింపుగా మారింది. ఎలా మంత్రి సురేఖను ఇరుకున పెట్టాలని, అటు రఘునందన్ రావును అబాసులు పాలు చేయాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం చేయకూడని తప్పు చేసింది. మంత్రి కొండా సురేక, ఎంపి. రఘునందన్ రావులు వున్న ఫోటోపై దుష్ప్రచారం చేశారు. ఇది కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రి కొండా సురేఖ మనస్తాపానికి గురైంది. కన్నీటి పర్యంతమైంది. అయినా బిఆర్‌ఎస్ దుష్ట గ్రహాల మనసు కరగలేదు. కాకపోతే జరిగిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు క్షమాపణ చెప్పారు. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కాని బిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం అక్కడితో ఆపలేదు. ఆ విషయాన్ని మరింత ప్రచారం చేసింది. మళ్లీ మళ్లీ గాయాన్ని రేపేలా చేసింది. దాంతో మంత్రి కొండా సురేఖకు ఆగ్రహం తెప్పించింది. నూలు దండకు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సంబంధం వుంది. అది బిఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన వ్యక్తులకు తెలియదు. అసలు బిఆర్‌ఎస్ నేతలకే ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ సహజంగా పూల దండలకు బదులుగా ఎప్పుడైనా నూలు దండలనే వినియోగిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయస్ధాయి సమావేశాలలో నూలు దండలనే వేసుకుంటారు. పూల దండలు నిషేదం. ఆ మాత్రం కామన్ సెన్స్ బిఆర్‌ఎస్ శ్రేణులకు లేకుండాపోయింది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో విదేశీ వస్తు భహిష్కరణ, చేనేత వస్త్రాల నేతకు విడదీయ రాని అనుబంధం వుంది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్ర నూలు పోగు. ఈ సంగతి బిఆర్‌ఎస్ నేతలకు కనీసం అవగాహన కూడా లేదు. అందుకే చెరపకుడార చెడేవు అన్న సామెతను మీద వేసుకున్నారు. నూలు దారం ఎంతో పవిత్రమైనది. అది దేశ స్వాతంత్య్రానికి చిహ్నం. దాన్ని అపవిత్రకు ఆపాదించిన బిఆర్‌ఎస్ శ్రేణుల తెలివి తక్కవ తనం మూలంగా పద్మశాలి ఆడబిడ్డకు కోపం తెప్పించింది. పైగా పద్మశాలి సమాజానికి నూలు పోగు ఎంతో పవిత్రమైనది. ఆ నూలు మాల ఎంతో శ్రేష్టమైనది. దాన్ని ఎంతో గౌరవం కోసం వేసుకుంటారు. అలాంటి దండకు అపవిత్రను ఆపాదించి బిఆర్‌ఎస్ పెద్ద తప్పు చేసింది. దాంతో మంత్రి కొండా సురేఖ సినీ హీరో నాగార్జున కుటుంబంలో జరిగిన అన్యాయానికి మాజీ మంత్రి కేటిఆర్ కారణం అని ఆరోపణ చేశారు. అయితే ఇక్కడ ఎక్కడా మంత్రి కొండా సురేఖ సినీ నటి సమంతను కించపర్చలేదు. ఆమెకు ఎలాంటి తప్పును ఆపాదించలేదు. ఆమె గౌరవాన్ని నిలబెట్టింది. అంతే కాని ఆమెకు ఎలాంటి తప్పును ఆపాదించలేదు. బిఆర్‌ఎస్ ఇక్కడ కూడా అతి తెలివి ప్రదర్శించింది. నాగార్జున కుటుంబాన్ని రెచ్చగొట్టింది. దాంతో సినీ లోకమంతా కదలింది. అసలైన విషయాన్ని సినీ ప్రముఖులు కూడా వదిలిపెట్టారు. నాగార్జునకు అండగా నిలిచారు. మంత్రి కొండా సురేఖ మీద మాటల దాడి మొదలు పెట్టారు. ఆఖరుకు నాగార్జున మంత్రి మీద పరువు నష్టం దావా దాకా వెళ్లారు. ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ ఎంతో హుందాగా తాను సమంతపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సాటి మహిళలకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రస్తావించాను. అందులోనూ ఆమె తెగువను కీర్తించాను అని చెబుతూనే ఒక వేళ నటి సమంత తన మాట వల్ల మనసు గాయమైతే క్షమించమని కూడా కోరింది. కాని బిఆర్‌ఎస్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయాలనే చూసింది. నాగార్జునను రెచ్చగొట్టింది. దాంతో సినీ వర్గమంతా ఒక్కతాటి మీదకు వచ్చింది. కాని ఇక్కడ అందరూ నాగార్జునకు మద్దతుగా ఏమీ రాలేదు. కేవలం చిరంజీవి కుటుబం, ఎన్టీఆర్, ఇతర కమ్మకుల సినీ వర్గమే ఆయనకు తోడుగా నిలిచింది. ఇక్కడ మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమలో తనకు వినిపించిన అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఆమె ఆరోపణలు చేయలేదు. సమంత మీద ఎలాంటి వివాదాలు సృష్టించాలని అనుకోలేదు. ఒక రకంగా సమంతకు మద్దతుగా , సాటి మహిళగా తోడుగానే నిలిచింది. కాని తిమ్మిని బమ్మిని చేయడంలో ఆరి తేరిన బిఆర్‌ఎస్ పార్టీ రాజకీయ పైశాచిక ఆనందం పొందాలని చూసింది. సినీ పరిశ్రమను కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా మారితే భవిష్యత్తులో తమకు వాళ్లంతా మద్దతుగా నిలుస్తారని ఆశించారు. కాని కథ అడ్డం తిరిగింది. మంత్రి కొండా సురేఖ మీద పెద్దఎత్తున మీడియాలో విపరీత ప్రచారం చేస్తే ఆమెపై చర్యలు తీసుకుంటారని బిఆర్‌ఎస్ భావించింది. కాని అది జరగలేదు. కాంగ్రెస్‌లో కదలిక కనిపించడం లేదని గ్రహించి పెద్దఎత్తున మీడియాను రంగంలోకి దించారు. జాతీయ స్ధాయిలో కూడా ఈ విషయాన్ని చర్చనీయాంశం చేశారు. రోజుల తరబడి మీడియాలో చర్చలు జరిపారు. ఏకంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాందీ లాంటి వారు స్పందించినట్లు మీడియా లేని పోని కలరింగులిచ్చారు. అబద్దాలు విసృతంగా ప్రచారం చేశారు. కాని కాంగ్రెస్ పార్టీలో స్పందన కనిపించకపోవడంతో బిఆర్‌ఎస్ నెత్తిన చేతులు పెట్టుకున్నది. ఎలాగైనా మంత్రిని భర్తరఫ్ చేయించాలిన పన్నాగం పన్నింది. కాని మంత్రి కొండా సురేఖకు అండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బిసి నాయకులంతా ఏకమయ్యారు. ఒక బడుగుల ఆడబిడ్డపై లేని పోని వివాదాలు సృష్టించి ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించేలా బిఆర్‌ఎస్ చేసిన కుట్రలను పటాపంచెలు చేశారు. తెలంగాణ బిసిలంతా ఏకమై బిఆర్‌ఎస్ మీద యుద్దం ప్రకటించింది. నిజం అడుగు బైట పెట్టేలోపు అబద్దం ఆరు ఊర్లు తిరిగి వస్తుందన్నట్లు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు విపరీతార్దాలు సృష్టించి లేని పోనివి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూశారు. కాని కాంగ్రెస్‌పార్టీ తన పార్టీ నేత కొండా సురేఖను కాపాడడంలో సఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగులకు అండగా వుండే పార్టీ అని మరోసారి నిరూపించింది. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో బడుగులను అడుగుగడుగునా అణచివేస్తూ వచ్చింది. బడుగుల నాయకులు ఎదడగాన్ని కేసిఆర్ తో సహా పెత్తందారి నీj నాయకులు సహించలేకపోయారు. దాంతో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మీద లేని పోని అపోహలు సృష్టించి ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పటి వరకు రాజయ్య చేసిన తప్పేమిటో మాత్రం చెప్పలేదు. పైగా అడుగడుగునా ఆయనను పార్టీ అవమానించింది. ఒక దశలో ఎన్నికల స్టేజీ మీద పక్కన కూర్చున్న రాజయ్య షేక్ హ్యాండ్ ఇవ్వబోతే కేసిఆర్ చీదరించుకున్న సందర్భం వుంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీద ఓ సినీ నటి లేనిపోని ఆరోపణలు చేస్తే ఆయనను కూడా పదవినుంచి తొలిగించేందుకు సిద్దమయ్యారు. కాని ఆగిపోయారు. ఉద్యమ కాలం నుంచి కేసిఆర్‌కు అండగా నిలిచిన ఈటెల రాజేందర్, గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అన్న ఒక్క మాట పట్టుకొని ఆయనను మెడపట్టి గెంటివేసినంత పనిచేశారు. ఆయనను భూ కబ్జా కోరురుగా చిత్రీకరించి బైటకు పంపించారు. మంత్రి పదవి నుంచి తొలిగించారు. ఇలా బడుగులకు అడుగడుగునా అవమానం చేసిన పార్టీ బిఆర్‌ఎస్. బడుగుల నాయకులకు ఆదప వచ్చినప్పుడు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. వారికి కొండంత ధైర్యం నింపే నాయకుడు రేవంత్ రెడ్డి. అదీ ఒక నాయకుడికి వుండాల్సిన తత్వం. అదే అసలైన వ్యక్తిత్వం. అదే రేవంత్ రెడ్డి విశాలమైన మనసున్న నాయత్వం.