అన్యమత ఉద్యోగులని సస్పెండ్ చేసిన టీటీడీ
నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. వీరు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతోనే సస్పెండ్ చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుపతి: నలుగురు అన్యమత ఉద్యోగులని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి, స్టాప్‌నర్స్(బర్డ్ ఆస్పత్రి), ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ (బర్డ్ ఆస్పత్రి), అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల్లో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.