స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రామంపేట జూలై 14 నేటి ధాత్రి (మెదక్)
ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్.ఆర్.ఓ అంబర్ సింగ్ గారు, వనమహోత్సవం మరియు చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదని ,చెట్లు మాత్రమే చెడును తీసుకొని మంచిని ఇస్తాయని. మానవులు వదిలేటటువంటి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ,ఆక్సిజన్ మానవులకు ఉపయోగపడేటటువంటి ఆక్సిజన్ ఇస్తాయని ఇనుము ఎలా అయితే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా చెట్లు మేఘాలను ఆకర్షించే వర్షాలను కురిపింప చేస్తాయని ప్రతిరోజు మానవుడికి మూడు సిలిండర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఒక సిలిండర్ విలువ 700 రూపాయలు అయినట్లయితే రోజుకి 2100 ఖర్చు అవుతుందని సంవత్సరానికి 7,66,500 అలాంటి ఆక్సిజన్ ని మనం ఉచితంగా తీసుకోగలుగుతున్నాం. అందరికీ ఆక్సిజన్ సిలిండర్ల అవసరము పడితే సిలిండర్లు దొరకక ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందో కరోనా సమయంలో అందరం చూసినటువంటిదే కాబట్టి చెట్లను నాటడం వాటిని సంరక్షించడం చెట్లతో పాటుగా అడవిని, జంతువులను ,నీటిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి అమ్మ పేరు పైన ఒక చెట్టును నాటాలని అమ్మను ఏ విధంగా చూసుకుంటారో ఆ చెట్టుని ఆ విధంగా చూసుకోవాలని విద్యార్థులకు వివరించడం జరిగింది. అమ్మ పేరు పైన చెట్టు నాటడం అనేది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు చెప్పినటువంటి నినాదం. క్రమం తప్పకుండా మనం అందరం పాటించాలని చెప్పడం జరిగింది.
మంజీరా పాఠశాలలో ఎఫ్ఆర్ఓ అంబర్ సింగ్ గారు, డిప్యూటీfro శ్రీనివాస్ గారు ,గీత ,కృష్ణ గారు చెట్లను నాటడం జరిగింది .విద్యార్థుల చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ ,అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.