గాయకుడికి నగదు పురస్కారం.. 

గాయకుడికి నగదు పురస్కారం..  సీఎం మాట నిలబెట్టుకున్నారు 

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు (Rahul Sipligunj) ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల గద్దర్ అవార్డుల  సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ఆ మేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.  సొంత కృషితో ఎదిగిన  రాహుల్  తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. కాల భైరవ తో కలిసి అతను పాడిన నాటు నాటు ఆస్కార్ అవార్డు అందుకుంది. 

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

యువత వ్యసనాలకు బానిస కావద్దు….

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డి బ్ల్యూ సి డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.
అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు,
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీ గురు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ లు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ తండ్రి ప్రసాద్ అనే యువకుడు పూర్తి వికలాంగుడు తండ్రి కూడా చిన్నతనంలో చనిపోయారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయిచరణ్ ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు చాలా ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ చార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యంని కలువగా వెంటనే స్పందించి వికలాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధికారితో ఫోన్ లో మాట్లాడి సాయిచరణ్ కు వెహికిల్ తొందరగా అందచేయాలని అధికారులతో మాట్లాడి శుక్రవారం ఎలక్ట్రీకల్ ఛార్జింగ్ వెహికిల్ ను అందజేసిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్.మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా సాయి చరణ్ మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version