హృదయం ద్రవించిపోయింది
Category: తాజా వార్తలు
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.
గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.
గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్యాలారం బసవరాజ్ ఝరాసంగం పట్టణంలోని నూతనంగా గృహప్రవేశం చేస్తున్న బసవరాజ్ గారికి గృహప్రవేశం శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వాడితోపాటు కాంగ్రెస్ నాయకులు కుతుబుద్దీన్ సత్తార్ భాయ్ ఎజాస్ బాబా బిజీ సందీప్ తదితరులు ఉన్నారు.
ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.
ఉపాధి హామీ పని ప్రదేశంలో ప్రథమ చికిత్స నీడ నీటి సౌకర్యాలు కల్పించాలి.
డి ఆర్ డి ఓ.పోరిక బాల కృష్ణ
చిట్యాల నేటిధాత్రి:
జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల ప్రజా పరిశత్ కార్యాలయం వారంతా సమావేశంనకు ముఖ్య అడతిథులు గా డి ఆర్ డి ఓ పోరిక బాల కృష్ణ (జిల్లా గ్రామీన అభివృద్ధీ అధికారి హాజరయ్యారు
ఈ సందర్బంగా డిఆర్ ర్డీవో మీటింగ్ లో మాట్లాడుతూ దీనసరి కూలి 307/- రూపాయలు వచ్చు విధంగా మా సిబ్బంది కి సూచనలు చేశాము వాళ్ళు చెప్పిన కొలతల ప్రకారం పని చేసి 300 ల నుండి 307 రూపాయలు వచ్చు విధంగా పని చేయమని చెప్పారు
అదేవిధంగా పని వద్ద కచ్చితంగా నీడ, ప్రధమ చికిత్స పెట్టె, నీటి సౌకర్యం విధిగా పంచాయతీ కార్యదరషులకు కల్పించాలని చెప్పారు
తర్వాత రేపు రాబోయే వనమహోత్సవం కార్యక్రమమాo క్రింద తీసుకున్న స్థలాలను పంపించి టార్గెట్ ప్రకారం నాటించాలి అని చెప్పారు
ఎస్సి ఎస్టీ చిన్న సానకారు రైతులకు పండ్ల తోటలపథకం క్రింద అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని చెప్పాడు
మండల కార్యాలయనకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సమీక్ష సమావేశం తీసుకున్నారు
ఈ కార్యక్రమం లొ జయశ్రీ ఎంపీడీఓ క్వాలిటీ కాట్రోలర్ ధర్మషింగ్ , ఏపీవో అలీం,సాంకేతిక సహాయకులు, సుధాకర్, అపర్ణ, స్వామి, స్రవంతి , పంచాయతీ కార్యదర్శలు,స్వచ్చా జిల్లా కోర్డినేటర్ వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై యువతక అవగాహన.
సైబర్ నేరాలపై యువతక అవగాహన…
బాలానగర్ నేటి ధాత్రి:
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు బుధవారం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పలు విషయాలపై సైబర్ క్రైమ్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయని సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు, యువత అవగాహన పెంచుకుని ఏటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ వినియోగదారులు అపరిచిత వ్యక్తులకు ఓటిపి, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సుజ్ఞానం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…
ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి…
పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉండి, బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతున్నదనీ తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ను కలిసి విద్యారంగ సమస్యలపై పి డి ఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ,విద్యార్థులు లేరనే సాకుతో మూసివేతకు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేతకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ హంగు ఆర్భాటాలు చూపించే విధంగా కరపత్రాలు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ తెలిపారు.ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి, కార్పొరేటు,ప్రైవేటు అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.వివిధ రకాలుగా టై, బెల్టు, పాఠ్యపుస్తకాల పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలువరించాలని, పేద,మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను ఆర్ధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్,పట్టణ నాయకులు శేఖర్, దీపక్, సుందర్,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ నిరుపేద కుటుంబికుని కల ఇందిరమ్మ ఇల్లు.
ప్రతీ నిరుపేద కుటుంబికుని కల ఇందిరమ్మ ఇల్లు…
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కొక్కరకుంట, వన్నారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మండల అధికారులు గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా సరైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, లబ్ధిదారులు సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వెన్న రాజమల్లయ్య, రామడుగు కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే శంకర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కర్ణ శీను, పొన్నం మల్లేశం, బత్తిని అజయ్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఫార్మసి మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి…
ఫార్మసి మందులను పోర్టల్ లో ఎంట్రీ చేయాలి…
డాక్టర్ బి.రవి రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి…
నేటి ధాత్రి – మహబూబాబాద్ :-
జిల్లాలో వ్యాప్తంగా పనిచేస్తున్న ఫార్మసీ వైద్య సిబ్బంది అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించిన తాత్కాలిక పద్ధతులైన అంతరా ఇంజక్షన్స్, ఓరల్ పిల్స్,ఐ యు సి డి జిల్లాకు వచ్చినఅన్ని రకాల మందులు పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఫార్మసీ వైద్య సిబ్బందిలో తో ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ,వర్షాకాలంలో మందులన్నీ మూడు నెలల స్టాక్ ఉంచుకోవాలని కోరడం సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ,డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సారంగం, డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ,లోక్య,ఫార్మసీ ఆఫీసర్ రామారావు, డిపిఓ నీలోహన, డిడిఎం సౌమిత్, సూపర్వైజర్ రవి, రాజ్యలక్ష్మి విసిసిఎం, ఫార్మసీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…
గార్ల నేటి ధాత్రి:
మండలంలోని సమీపంలో ఉన్న గార్ల పెద్ద చెరువులో కబ్జాకు గురైన చెరువు శిఖం భూములకు వెంటనే ట్రెంచ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక మంగపతి రావు భవనంలో మల్లెల నాగమణి అధ్యక్షత జరిగిన మండల కమిటీ సమావేశంలో శ్రీనివాస్, సత్యవతిలు మాట్లాడుతూ, మండలానికే అతిపెద్ద చెరువు గా ఉండి,అటు ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇటు రైతుల లెక్కల ప్రకారం సుమారుగా 18 వందల ఎకరాల వరి పంటల భూములకు సాగునీరు అందించే ఈ చెరువు శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుని పట్టాలు చేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రెవెన్యూ అధికారులు స్పందించి శిఖం భూములు కబ్జా కాకుండా ట్రెంచ్ ఏర్పాటు చేసి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు కె.ఈశ్వర్ లింగం, వి.పి.వెంకటేశ్వర్లు,ఐ.గోవింద్,ఎల్లయ్య, మౌనిక,ఉపేందర్ రెడ్డి, బి.లోకేశ్వరావు,కైబాబు,మౌలానా,సిహెచ్.మౌనిక,ఎ.రామకృష్ణ,కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పేదింటికల సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి.
పేదింటికల సాకారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీ సభ్యులతోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. గ్రామంలో లబ్ధిదారులకు. ముగ్గు పోసి భూమి పూజ చేయడం జరిగిందని తెలియజేస్తూ. ఈ సందర్భంగా సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గడ్డం మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం పరిపాలనలో పేద ప్రజలకు ఇండ్లు లేని లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని సంకల్పంతో ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రజా పరిపాలనలో ప్రజలు అందరూ. మంచిగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి ధ్యేయంగా. ప్రజా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.పొన్నం ప్రభాకర్ రెడ్డికి. వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ప్రవీణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం రచన. కొంపల్లి శ్యాం. కొండ రాజు. పొన్నం కనకయ్య. అడి గొప్పల రాము. యమునా. ముంతాటి శారద. జ్యోతి. మౌనిక. సంపతి శ్యామల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..
వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.
అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.
భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.
మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..
ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.
శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు
నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు.
నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు..
ఎస్సీల స్మశానవాటిక కబ్జా చేసిన వైనం
భూకబ్జాదారులను కఠినంగా శిక్షించాలి:ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్..
జాతీయ రోడ్డుపై దళితుల ధర్నా..రెండు కిలోమీటర్ల మేర స్థంబించిన ట్రాఫిక్..
న్యాయం చేస్తామన్న ఎస్సై హామీతో ధర్నా విరమణ
వరంగల్ నేటిధాత్రి:
హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నాగయ్యపల్లెలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూకబ్జాదారులుగా అవుతారమెత్తి రెచ్చిపోయారు.ఏకంగా ఎస్సీల స్మశాన వాటికనే కబ్జా చేశారు.సర్వే నెంబర్ 931లో దాదాపు రెండు ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు స్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని సమాధులు నిర్మించారు.ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన పోగుల మహేందర్ రెడ్డి,పోగుల బ్రహ్మయ్య,పోగుల కైలాసం,పోగుల సురేందర్ అను వ్యక్తులు మంగళవారం గుర్తుతెలియని రెండు జెసిబిలను తీసుకువచ్చి సమాధులను తొలగించి స్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారని :ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆరోపించారు.కబ్జా పట్ల పోలీసు అధికారులకు,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన స్మశానవాటిక భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకాలను శాంతింపజేసి కబ్జాదాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు బాగాజీ రజనీకాంత్,జినుక అశోక్,మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్ర సూరయ్య,మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య,మాదాసి సుధాకర్,సంగి యాకయ్య,గిన్నారపు భాస్కర్, మాదాసిరాజు,మాదాసి మల్లయ్య,మాదాసి రాహుల్ తదితరులు పాల్గోన్నారు.
వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్.
వివాహ వేడుక లో టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్లో షీలా రమేష్ గారి కూతురి వివాహ వేడుకలో పాల్గొని అక్షంతలు వేసి నూతన వధువు వరులకు శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కుచ్చుబుద్దీన్ బిజీ సందీప్ రేవనప్ప శంకర్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.
బిజెపి మండల కమిటీ ఎన్నిక.
బిజెపి మండల కమిటీ ఎన్నిక
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీని మండల అధ్యక్షుడు నర హరిశెట్టి రామకృష్ణ ప్రకటిం చడం జరిగింది.ఈ కమిటీలో ప్రకటించిన వారు మండల ఉపాధ్యక్షులుగా పోల్ మహేందర్, రేణుకుంట్ల చిరంజీవి, కోమటి రాజశేఖర్, లావుడియా జ్యోతి, మండల ప్రధాన కార్యదర్శులుగా మామిడి విజయ్, భూతం తిరుపతి, కార్యదర్శులుగా మేకల సుమన్, కొంగర భారతి, వంగరి శివశంకర్, జున్నుతుల జీవన్ రెడ్డి, కోశాధికారిగా కుక్కల మహేష్ బిజెపి మండల కమిటీని ఎన్ను కున్నారు ఎన్నుకున్న మాట్లాడుతూ కమిటీ సభ్యులు భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని మండలంలో విస్తరింప చేస్తా రని రానున్న రోజుల్లో భారతీ య జనతా పార్టీ గెలుపు కొర కు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్య క్షులు ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు.
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేతి ధాత్రి:
పట్టణం లోని శుభం కన్వెన్షన్ హాల్ లో జరిగిన మహిళ నాయకురాలు షీలా రమేష్ గారి కూతురి వివాహా వేడుకల్లో కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు శ్రీ కొన్నింటి మాణిక్ రావు, మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,యువ నాయకులు మిథున్ రాజ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప , వెంకట్ ,దీపక్, శంకర్ పటేల్ ,నర్సింహ రెడ్డి,రేవనప్ప తదితరులు.
గుంతలు పూర్తిగా పూడ్చని వైనం ప్రమాదాలకు నిలయం…
గుంతలు పూర్తిగా పూడ్చని వైనం -ప్రమాదాలకు నిలయం…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
బయ్యారం మండల పరిధి నామాలపాడు నుంచి కాచన పల్లి రహదారి మార్గం పక్కన కేబుల్ కోసం తవ్విన గుంటలు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ లైన్ వేయడం కోసం యంత్ర సాధనాలతో తీసిన గుంతలు పుడ్చకపోవడతో రహదారి ప్రయాణికులకు, పశువులకు ప్రమాదంగా మారి సతమతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అసంపూర్తిగా ఉన్న గుంటలలో ద్విచక్ర వాహనాలు, వాహనదారులు,మూగ జంతువులు పడి ప్రమాదాలకు గురి అవుతున్నాయి.
ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి.
గుత్తేదారు గుంతలు పూడ్చకపోవడం ద్వారానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు చోరువచూపి ప్రమాదాల బారిన పడకుండా కేబుల్ కోసం వేసిన గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ…
సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ…
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్ రావ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, క్యాతనపల్లి మాజీ సర్పంచ్ గురిజాల రవీందర్ రావ్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సివి రామన్ పాఠశాలలోఅడ్వకేట్ కస్తూరి శ్రీనివాస్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి లో ఓపెన్ కాస్ట్ గనులు వచ్చి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేస్తదని నేను ఓపెన్ కాస్ట్ ను వ్యతిరేకిస్తే నా ఉద్యోగాన్ని సంస్థ తీసివేసింది అని అన్నారు.సింగరేణి కార్మికులు,కార్మికేతరులు, చిరు వ్యాపారుల కొరకు అనేక ఉద్యమాలు చేశానని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ పట్టణం కనుమరుగవుతుందేమోనని బాధను వ్యక్తం చేశారు.135 సంవత్సరాల చరిత్ర కలిగి,అత్యధిక కార్మికులు సింగరేణి సంస్థ లో పని చేసే వారని గుర్తు చేశారు.అత్యధిక ఉత్పత్తి, ఉత్పాదకత సింగరేణి సంస్థ సాధించి తెలంగాణకు ఒక ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు.మందమర్రి ఏరియాలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అధికారుల, కార్మికుల ఫోటోలు, ప్రతి ఒక్కరి ఫోటోలు, సంస్థలో వాడే వస్తువులు మ్యూజియంలో ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు చూసుకునే అవకాశం ఉంటది కాబట్టి మ్యూజియం అవసరం అని, కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కలిసొస్తాయని అన్నారు.సింగరేణి లో నాటిన మొక్కలు మరెక్కడా నాటలేదని అన్నారు.కొత్తగూడెం, మందమర్రి ,భూపాలపల్లి మూడు ఏరియాలలో మూడు మ్యూజియాలు ఏర్పాటు చేసేలా సింగరేణి సంస్థ చొరవ తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.దేశంలోని వివిధ సంస్థలకు మ్యూజియాలు ఉన్నప్పుడు సింగరేణి సంస్థ కు ఎందుకు ఉండకూడదని అన్నారు. మ్యూజియాలు ఏర్పాటు చేస్తే వాటి ముందు విలియం కింగ్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థను కోరుతామని అన్నారు.
వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సై..
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ.
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ
మెట్ పల్లి జూన్ 4 నేటి దాత్రి
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల నెరవేరిన వేళ
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణ జిఎస్ గార్డెన్లో పట్టణానికి చెందిన 33 వార్డుల ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ తో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పట్టణానికి చెందిన 33 వార్డుల్లో అర్హులైన 502 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ప్రజా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకుండా కేవలం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేసిందన్నారు కోరుట్ల పట్టణంలో కేవలం 80 ఇల్లు మాత్రమే మంజూరు చేయగా అది కూడా తమ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపునిండా తినాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణం కేవలం ఎన్నికల్లో ఓట్లు దండు పోవడం కోసం తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని బాండ్ పేపర్ రాసి ఇచ్చింది కానీ గెలిచిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఊసే లేకుండా పోయిందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 నెలల వ్యవధిలోనే 6 కోట్ల 80 లక్షల రూపాయల మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మాణ పనులకు పునాది వేసిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వార్డు ఆఫీసర్ల కృషి అభినందనీయమన్నారు ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రత్నాకర్ రావు హయాంలో కోరుట్ల పట్టణంలో సుమారు 500 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 80 మాత్రమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా పట్టణంలోని 33 వార్డుల ద్వారా 502 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రోస్డింగ్ పత్రాలు అందజేస్తున్నామన్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాని వారు ఉంటే వారికి కూడా త్వరలోనే అందేలా కృషి చేస్తామన్నారు కోరుట్ల నియోజకవర్గం లో ఇప్పటివరకు సుమారు మూడు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా తన వద్దకు వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వార్డు ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క నూతన రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తుందన్నారు.
నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు.
నూతన గృహాలకు భూమి పూజ చేసిన నాయకులు…
తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండలం లో దేశాయి పల్లె బదనపల్లి తంగళ్ళపల్లి గ్రామాలలో నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని . తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి.మండల కేంద్రంలో ఇప్పటివరకు 210. ఇండ్లకు గ్రౌండింగ్ చేయడం తో పాటు పేదింటి కలల సహకారం.చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో డబుల్.బెడ్ రూమ్ పేరు మీద. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అటువంటి దానికి. తావు లేకుండా ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం. ప్రజా పరిపాలన అందిస్తుందని. గత ప్రభుత్వాలు చేసిన. అప్పులను తీర్చుకుంటూ. రేవంత్ రెడ్డి. ప్రజా పరిపాల సాగిస్తూ. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు