నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు.

నాగయ్య పల్లెలో రెచ్చిపోయిన భూకబ్జాదారులు..

ఎస్సీల స్మశానవాటిక కబ్జా చేసిన వైనం

భూకబ్జాదారులను కఠినంగా శిక్షించాలి:ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్..

జాతీయ రోడ్డుపై దళితుల ధర్నా..రెండు కిలోమీటర్ల మేర స్థంబించిన ట్రాఫిక్..

న్యాయం చేస్తామన్న ఎస్సై హామీతో ధర్నా విరమణ

వరంగల్ నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నాగయ్యపల్లెలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూకబ్జాదారులుగా అవుతారమెత్తి రెచ్చిపోయారు.ఏకంగా ఎస్సీల స్మశాన వాటికనే కబ్జా చేశారు.సర్వే నెంబర్ 931లో దాదాపు రెండు ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు స్మశాన వాటికగా ఏర్పాటు చేసుకొని సమాధులు నిర్మించారు.ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన పోగుల మహేందర్ రెడ్డి,పోగుల బ్రహ్మయ్య,పోగుల కైలాసం,పోగుల సురేందర్ అను వ్యక్తులు మంగళవారం గుర్తుతెలియని రెండు జెసిబిలను తీసుకువచ్చి సమాధులను తొలగించి స్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారని :ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆరోపించారు.కబ్జా పట్ల పోలీసు అధికారులకు,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ దళితులకు సంబంధించిన స్మశానవాటిక భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకాలను శాంతింపజేసి కబ్జాదాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు బాగాజీ రజనీకాంత్,జినుక అశోక్,మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్ర సూరయ్య,మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య,మాదాసి సుధాకర్,సంగి యాకయ్య,గిన్నారపు భాస్కర్, మాదాసిరాజు,మాదాసి మల్లయ్య,మాదాసి రాహుల్ తదితరులు పాల్గోన్నారు.

భూకబ్జాదారుల నుండి ఓటేరు చెరువును కాపాడండి.

*భూకబ్జాదారుల నుండి ఓటేరు చెరువును కాపాడండి..

*ఓటేరు చెరువును పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

*భూకబ్జా దార్లకు అమ్ముడు పోయిన రెవెన్యూ అధికారులు..

*ఓటేరు చెరువు పరిరక్షణకై పోరాటం కొనసాగిస్తాం..

*సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి.

తిరుపతి రూరల్(నేటి ధాత్రి) మార్చి 05:

ఓటేరు చెరువును మట్టితో పూచిన భూకబ్జాదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఓటేరు చెరువును భూకబ్జాదారులు అక్రమంగా పూడ్చి వేయడంతో పరిశీలన చేయడం జరిగింది.ఈ సందర్భంగా పి .మురళి మాట్లాడుతూ తిరపతి హైవే ఆనుకుని ఉన్న 376, 77 సర్వే నెంబర్ ఓటేరు చెరువును అర్ధరాత్రిలో భూకబ్జాదారులు 30 టిప్పర్లతో మట్టితోలి పూడ్చివేయడం జరిగిందని, పూడ్చిన వారిపై ఇంతవరకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుపోను, రెవెన్యూ అధికారులకు తెలిసిన వారు నిమ్మక నీరెత్తినట్లు వెవరిస్తున్నారని వాపోయారు.సుమారు 1000 కోట్లకు పైగా విలువ కలిగిన చెరువు భూమిని కాపాడాలని రెండు నెలల క్రితం కలెక్టర్ ని కలిసిన పరిరక్షిస్తామని చెప్పినటువంటి రెవెన్యూ అధికారులు ఇప్పుడు దౌర్జన్యంగా భూకబ్జాదారులు చెరువును పూడుస్తూ ఉంటే ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు.ఐదు నెలల క్రితం కుక్లైన్ తో చెరువు నీళ్ల తొలగిస్తే జిల్లా కలెక్టర్ కి తెలిసిన వారిపైన చర్యలు తీసుకోలేదని,చెరువు ఆక్రమ గురికాకుండా చూడాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అర్జీ ఇచ్చి తాసిల్దార్ కి తెలిపిన ఏమని మాత్రం చర్యలు తీసుకోకపోను ఇప్పుడు దౌర్జన్యంగా చెరువును పూడ్చారని అన్నారు. చెరువును పూడ్చిన వారిపై ఇంతవరకు ఒక్కరి పైన కూడా కేసులు పెట్టలేదని, కమ్యూనిస్టులు చెరువును కాపాడాలని పరిశీలనకు వెళితే లాండ్ ఆర్డర్ అతిక్రమణ చేస్తున్నారని పోలీసులే కమ్యూనిస్టులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడిందిని అన్నారు. ఓటేరు చెరువు అనుకొని స్థానిక ఎమ్మెల్యే నాని నివాస గృహం ఉన్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలపారు.
దీని వెనుక పెద్ద పెద్ద పలుకుబడిన నాయకులే వేల కోట్ల రూపాయల భూమిని కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఓటేరు చెరువు భూమి ప్రభుత్వ చేతిలోనైనా ఉండాలి లేనియెడల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలతో గుడిసెలు వేపించి భూమిని పంచతామనే హెచ్చరించారు. చెరువును కాపాడాలని రేపటినుండి తిరుపతి రూరల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నగర కార్యవర్గ సభ్యులు ఎన్ శివ, శ్రీరాములు, విజయ, అలివేలమ్మ, అల్లా బక్షు, రవి, కిషోర్, శ్రీనివాసులు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version