సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ…

సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ…

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గురిజాల రవీందర్ రావ్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

సింగరేణి సంస్థ ఒక రత్న గర్భ అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, క్యాతనపల్లి మాజీ సర్పంచ్ గురిజాల రవీందర్ రావ్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సివి రామన్ పాఠశాలలోఅడ్వకేట్ కస్తూరి శ్రీనివాస్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి లో ఓపెన్ కాస్ట్ గనులు వచ్చి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేస్తదని నేను ఓపెన్ కాస్ట్ ను వ్యతిరేకిస్తే నా ఉద్యోగాన్ని సంస్థ తీసివేసింది అని అన్నారు.సింగరేణి కార్మికులు,కార్మికేతరులు, చిరు వ్యాపారుల కొరకు అనేక ఉద్యమాలు చేశానని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో రామకృష్ణాపూర్ పట్టణం కనుమరుగవుతుందేమోనని బాధను వ్యక్తం చేశారు.135 సంవత్సరాల చరిత్ర కలిగి,అత్యధిక కార్మికులు సింగరేణి సంస్థ లో పని చేసే వారని గుర్తు చేశారు.అత్యధిక ఉత్పత్తి, ఉత్పాదకత సింగరేణి సంస్థ సాధించి తెలంగాణకు ఒక ఆయువుపట్టుగా నిలిచిందని అన్నారు.మందమర్రి ఏరియాలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అధికారుల, కార్మికుల ఫోటోలు, ప్రతి ఒక్కరి ఫోటోలు, సంస్థలో వాడే వస్తువులు మ్యూజియంలో ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు చూసుకునే అవకాశం ఉంటది కాబట్టి మ్యూజియం అవసరం అని, కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా కలిసొస్తాయని అన్నారు.సింగరేణి లో నాటిన మొక్కలు మరెక్కడా నాటలేదని అన్నారు.కొత్తగూడెం, మందమర్రి ,భూపాలపల్లి మూడు ఏరియాలలో మూడు మ్యూజియాలు ఏర్పాటు చేసేలా సింగరేణి సంస్థ చొరవ తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు.దేశంలోని వివిధ సంస్థలకు మ్యూజియాలు ఉన్నప్పుడు సింగరేణి సంస్థ కు ఎందుకు ఉండకూడదని అన్నారు. మ్యూజియాలు ఏర్పాటు చేస్తే వాటి ముందు విలియం కింగ్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థను కోరుతామని అన్నారు.

గౌడ కులంలో మెరిసిన ఆణిముత్యం.

గౌడ కులంలో మెరిసిన ఆణిముత్యం

– కొడకండ్ల టీఎస్ ఆర్ జె సి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కీర్తన విజయకేతనం

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

 

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదలైన నేపథ్యంలో..జనగామ జిల్లా కొడకండ్ల టిఎస్ ఆర్ జె సి కళాశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారు. ఈ ఫలితాల్లో ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చిన విద్యార్థిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన మాదారపు లావణ్య-రంజిత్ దంపతుల పెద్ద కుమార్తె మాదారపు కీర్తన 440 మార్కులకు గాను 435 మార్కులతో కళాశాల స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి విశేషమైన విజయాన్ని సాధించింది. కీర్తన విజయాన్ని పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు హర్షాతిరేకాలతో అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆమెను అభినందించారు.

కీర్తన స్పందన

ఈ ఫలితాన్ని సాధించడంలో మా టీచర్లు, స్నేహితులు, ముఖ్యంగా మా తల్లిదండ్రులు ఇచ్చిన సహకారం ఎంతో కీలకమైనది. భవిష్యత్తులో కూడా ఇలానే కృషి చేసి, ఉన్నత విద్యలో అద్భుత ఫలితాలను సాధించడమే నా లక్ష్యం.

తల్లిదండ్రుల హర్షం:

మా అమ్మాయి ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలికగా కీర్తన సాధించిన ఈ విజయం గౌడ కులస్తుల గౌరవాన్ని పెంచడమే కాక, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version