రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్.!

రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలు కేటాయించాలి

తీగల శ్రీనివాస్ రావు
జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్(ఏ డి జె ఎఫ్)

మంచిర్యాల నేతి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎలాంటి జీత భత్యాలు లేకుండా నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిస్వార్థంగా సేవ చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రత్యేకంగా రుణాలను కేటాయించాలని అల్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే గొప్ప ఉద్దేశం తో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఉన్నత చదువులు చదివి జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్న వారికి ప్రత్యేక అవకాశం కల్పించినట్టైతే వారిని ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహించినట్టు అవుతుందని అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్ట్ జీవితాలు మారలేదన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం లో రాజీవ్ యువ వికాసం పథకంలో జర్నలిస్టుల కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

పార్థివ దేహాన్ని సందర్శిం చి నివాళులు.!

పార్థివ దేహాన్ని సందర్శిం చి నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలo భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మండల కేంద్రంలోని కీ||శే|| మారపేల్లి నాగరాజు గోడకూలి మరణిం చగా విషయం తెలుసుకున్న మండల మాజీ ఎంపీపీ మెతు కు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి నాగరాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించా రు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబ సభ్యులను పరామ ర్శించి తమ ప్రగాఢ సాను భూతిని తెలియ జేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఉపసర్పంచ్ దైనంపేల్లి సుమన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మండల యూత్ అధ్యక్షులు మారపేల్లి మోహన్, సీనియర్, నాయ కులు కరుణ్ బాబు, దైనంపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

వీధి కుక్కలకు వింత రోగాలు.

వీధి కుక్కలకు వింత రోగాలు

పిల్లలకు వృద్ధులకు పెను ప్రమాదం

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో వీధి కుక్కలకు సోకుతున్న చర్మ వ్యాధులతో ప్రమాదం పొంచి ఉంది గత కొన్ని రోజులుగా వీధి కుక్కలకు కొత్త రోగం అంటుకుంది. కుక్కల ఒంటిపై బొచ్చు ఊడిపోవడం దద్దుర్లు రావడం చిన్న చిన్న పుండ్లు ఏర్పడుతున్నాయి పశువులలో లంపీ స్క్రీన్ వైరస్ సోకినట్లు కుక్కలకు కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ వ్యాధి ఒకదాని నుండి మరొక దానికి వ్యాపిస్తుండడం ఆందోళనన కలిగిస్తుంది మండలంలో సుమారుగా 300 కుక్కలు ఉంటాయి వీటిలో చాలా కుక్కలకు పారాసెట్ ఇన్ స్టేషన్ వ్యాధి బారిన పడ్డాయి ఇవి రెండు రకాలుగా ప్రభావం చూపుతుంది వాటి శరీరంపై బొచ్చు ఊడిపోయి గజ్జి లాంటి దద్దుర్లు రావడం వల్ల ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి

రోగ నివారణకు చర్యలు శూన్యం

వ్యాధి బారిన పడిన కుక్కలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడిన కుక్కలు చని పోకున్న వాటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. రోగానికి గురైన కుక్కలను చూసి ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు.

పిల్లలు వృద్దులకు పెను ప్రమాదం

మండలంలోని వీధి కుక్కలకు చాలా రోజులుగా శరీరం మీద బొచ్చు ఊడిపోతుంది రాలి పోయిన చోట పురుగులు ఉంటున్నాయి. ఆ కుక్కలను చూస్తే భయం వేస్తుంది అవి నివాసానికి రావడంతో పిల్లలు, వృద్దులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కొనుగోలు చేసిన వడ్లను తరలించాలి.

కొనుగోలు చేసిన వడ్లను తరలించాలి

కలెక్టర్అధికారులకు ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు
సోమవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ కో ఆపరేటివ్ సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో ధాన్యం తరలింపు పై సమీక్ష నిర్వహిం చారు .ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లు ఎన్ని,రైస్ మిల్లులకు, గోదాములకు తరలించింది ఎన్ని, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ కావాల్సినవి ఎన్ని అని అన్ని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వర్షాలు పడుతున్నందున రైతులు ఇబ్బందులు కు గురి కాకుండా లారీ రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని అలసత్వం చేసే కాంట్రాక్టర్ల అనుమతి రద్దు చేసి ఇతరులకు ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూను కలెక్టర్ ఆదేశించారు
గోపాల్ పేట పెద్ద మందడి పొల్కేపాడు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తరలించేందుకు సిద్ధంగా ఉందని వడ్లు తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు . ప్రతి రైస్ మిల్లుకు, గోదాముకు సన్న వడ్లు, లావు వడ్లు 60 40 నిష్పత్తిలో పంపించాలని సూచించారు ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి బి.రాణి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భూ భారతితో రైతులకు మేలు.!

‘భూ భారతితో రైతులకు మేలు’

కలెక్టర్ విజయేందిర బోయి

జడ్చర్ల నేటి /ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం మండలంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని, భూ భారతి చట్టంలో పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేస్తే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూ ఆధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, వ్యవసాయతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వం భూధాన్, అసైన్డ్, ఎండోమెంట్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉందన్నారు. భూభారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందన్నారు.

program

అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడిందని, బీఆర్ఎస్ రాజకీయ నాయకులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చారన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ సెక్షన్ 6 ప్రకారం.. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 సంవత్సరాలుగా.. అనుభవంలో ఉంటూ.. 12-10- 2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం చిన్న సన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు. భూభారతి చట్టంలో రైతులకు మేలు కలుగుతూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నారు.

program

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లిఖిత రెడ్డి, బాలానగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, విజయలక్ష్మి తిరుపతి, వెంకట్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, శ్రీనాథ్ నాయక్, రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షడు మృతి.!

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షడు మృతి.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం అందుకుతండా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని దేవదాస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన నాయకుడు. దేవదాస్ అకాల మరణం చాలా బాధాకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య తన ప్రగాఢ సానుభూతి తెలిపారు..

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి నoదుకుసన్మానించిన ఐక్యవేదిక నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణ ములో రావుస్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదివి న విద్యార్థులను ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యన్ని అభినందించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, వెంకటేశ్వర్లు,రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఇందారం గోదావరి ఇసుక.!

ఇందారం గోదావరి ఇసుక రిచ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జైపూర్ నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామ పంచాయతీల ప్రజలు తమ అవసరాలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.అలాగే ఈ అవకాశాన్ని ఎవరైనా అదునుగా చేసుకొని అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జగన్ మోహన్ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సుమన్,స్థానిక ప్రజా ప్రతినిధులు,ట్రాక్టర్ యజమానులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల.!

ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల దాడులు ఆపాలనీ డిమాండ్

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నిరసన

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా) నేటిధాత్రి:

 

కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని,ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలనీ
కర్రెగుట్ట ను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గుండాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనిమేధావులు నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వస్తున్న బిజెపి నరేంద్ర మోడీ,అమిత్ షా ప్రభుత్వాలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.
గత జనవరి నుండి ఇప్పటివరకు మావోయిస్టుల పేరుతో అనేకమంది ఆదివాసీలను చంపివేశారని అన్నారు.
దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన మిలటరీ సాయుధ బలగాలు మధ్య భారత దేశంలో ఆదివాసీలపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఆదివాసీల మారనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణన్న,న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అరెం నరేష్, పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పెంటన్న, ఈసం మంగయ్య,మానాల ఉపేందర్, బానోతు లాలు, భూఖ్య వెంకన్న, పాయం ఎల్లన్న, గోగ్గల శ్రీను, మోకాళ్ళ సూర్యనారాయణ , దుగ్గి శేఖర్, వాగబోయిన బుచ్చయ్య,అరెం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సెలవు దినాల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..

అందరూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి..

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల సెక్రటరీ బైరం శంకర్..

రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ సెక్రటరీ బైరం శంకర్ విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

నిజాంపేట, నేటిధాత్రి

 

 

 

ఈ మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన ముచ్చర్ల కల్పన రూ.54 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరo మని అన్నారు .అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ..

శీర్షిక:అక్షరమా..!

 

(నేటిధాత్రి )

 

 

మనిషి తెలివిమీరిన చేష్టలు చేస్తూ… పకృతి మాతకు విఘాతం కలిగిస్తూ…
రకరకాల ఉడుపులతో వేషధారణ చేస్తూ…
మతిమాలిన మితిమీరిన తెలివితేటలతో సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తూ…
కాయంలో ప్రాణం పోయాక
ఒక్క క్షణం కూడా ఇంట్లో
ఉంచుకోని బంధాలు కోసం అబద్ధాలు, మోసాలు చేస్తూ…
కళేబరాలతో కల్తీ నూనెలు తయారు చేస్తూ…
రాజ్యం ఏలుతున్న
దుష్ట నికృష్టు రక్కసులను
నామరూపాలు లేకుండా
చేసే అణ్వాయుధమైపో అక్షరమా..!
గుంట నక్కల మాయతెరల వెనుక కృంగుతున్న…కనులుండీ కబోదులుగా మారుతున్న ప్రతి మనిషి లోని అజ్ఞాన తిమిరాలను సంహరణ చేసి వారి జీవితాల్లో చిరుదీపమై వెలిగేట్లు చేయి అక్షరమా..!

శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న.!

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 30న జరిగే నిరసనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ముఫ్తీ మౌలానా అబ్దుల్ సబూర్ ఖాస్మీ అధ్యక్షతన జహీరాబాద్‌లోని ఇస్లామిక్ సెంటర్ లతీఫ్ రోడ్‌లో విలేకరుల సమావేశం జరిగింది. స్థానిక జమాతే-ఇ-ఇస్లామీకి చెందిన మౌలానా అతిక్ అహ్మద్ ఖాస్మీ, ముఫ్తీ నజీర్ అహ్మద్ హసమి, ముఫ్తీ ఉబైద్-ఉర్-రెహ్మాన్, ముహమ్మద్ నజీముద్దీన్ ఘౌరి, అమీర్ సంయుక్తంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రకారం, ఏప్రిల్ 30 బుధవారం రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:15 గంటల వరకు, అంటే 15 నిమిషాల పాటు “బాతి గుల్ ప్రచారం” కింద ముస్లింలందరూ తమ ఇళ్ళు, దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర వ్యాపార సంస్థలలో లైట్లు ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ద్వారా, కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ చట్టం, 2025పై మీ అసంతృప్తిని నమోదు చేయండి. ఈ బ్లాక్ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను ఆక్రమించడం ద్వారా మరియు ఇతర వర్గాల సంక్షేమం పేరుతో వివక్ష చూపడం ద్వారా భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులతో ఆడుకోవడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది, ఇది వాస్తవాలకు విరుద్ధం. ఈ సందర్భంగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, తీవ్రంగా ఖండించారు మరియు ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించి, నిందితులను న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతిగుల్ ప్రచారం సందర్భంగా, ఎలాంటి శబ్దం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ముహమ్మద్ మజీద్ ముహమ్మద్ మొయిజుద్దీన్, హఫీజ్ ముహమ్మద్ అక్బర్ ముహమ్మద్ మొయినుద్దీన్ ముహమ్మద్ ఖ్వాజా నిజాముద్దీన్ ముహమ్మద్ యూసుఫ్ ముహమ్మద్ అబ్దుల్ ఖదీర్, ముహమ్మద్ ఫిరోజ్, ముహమ్మద్ అయూబ్ ఖాన్ ముహమ్మద్ వసీం మరియు ఇతరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన.!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ మల్యాల బాలస్వామి ని ఫోన్ లో పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజనగరం గోశాల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ నాగవరం మల్యాల బాలస్వామిని ఫోన్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పరామర్శించి గాయాలపై ఆరా తీశారు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామిని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 2024 జనవరిలో నిర్వహించిన గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్నారు. పెదమద్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నట్లు, సోమవారం ఉదయం పలువురు
ఝరాసంగం మండలం ప్రజలు తెలిపారు.

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని.!

ఏ పేదవాళ్లకు న్యాయం చేసారని
రజత్సోహలు చేస్తున్నారు??

కొత్తగూడ నేటిధాత్రి:

60 ఏళ్లు సుదీర్ఘ పోరాటాలతో శ్రీమతి సోనియా గాంధీ చల్లని చలువతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు టిఆర్ఎస్ పరిపాలించి ఏ పేద వాళ్లకు న్యాయం చేశారు ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూములు ఇండ్లు నిర్మించి ఇచ్చారు ఎన్ని గ్రామాలలో రోడ్లు నిర్మించి అభివృద్ధి చేశారు పేదవారికి రైతు బందు పేరిట పది రూపాయలు ఇచ్చి పెద్దవారికి దొరలకు భూస్వాములకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రైతుబంధు ఇచ్చారు మీరు దోచుకుని తిన్నందుకా రజోత్సవాలు,ఏజెన్సీ మండల లో తరలుగా వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ గిరిజన గిరిజనేతరుల భూములను హరితహారం పేరుతో మా భూములు గుంజుకున్నాందుక.
మీ రజత్సహలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు తోలక్షల కోట్లు
దొచుకున్నందుక రథోత్సవాలు నీళ్లు నిధులు నియామకాల అని ఊకడు దంపుడు ఉపన్యాసాలు తప్ప మీరు ఎన్ని ఉద్యోగలు ఇచ్చారు ఇంటింటికి ఉద్యోగం పేరుతో గద్దెనెక్కిన మీరు మీ కుటుంబంలో మాత్రం నాలుగైదు ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. అప్పుడే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని మీ కబంధహస్తాలతో విచ్చిన్నం చేసి ఎక్కడికక్కడ దోచుకొని తిన్నారు నిరుద్యోగులను గాలికొదిలేసి కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి పేరుకు కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని మీరే చెప్పి పేపర్లు లీకులు చేసి వాటి మీద కేసులు వేసి తప్పించకు తిరిగారు, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు హడావిడిగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేసి వారి చావులకు కారణమైనందుకా బి ఆర్ ఎస్ నాయకులు రజత్సోవాలు జరిపేది దొడ్డు బియ్యం పంపిణీ చేసి దళారుల చేతికి పంపించి వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రజలకు పంచి గప్పాలు కొట్టారు మీ ప్రభుత్వ హాయంలో ఏనాడైనా పేదవారిని పట్టించుకున్నారా వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించార సన్న బియ్యం పంపిణీ చేయమని మాట్లాడితే రెండు వేల కోట్లు కావాలని మాట్లాడిన మీరు సంపద సృష్టిస్తాం సంపద పెంచడం పేదలకు పంచుతామని గొప్పలు చెప్పిన మీరు సంపద పెరిగింది అలాగనే మీ ఆస్తులు పెరిగాయి ఆ రూపాయల తోనే లతోనే ఈరోజు రజోత్సవాలు జరుపుతున్నారు.. మీరు పేదవాలని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని మరొక్కసారి గుర్తు చేస్తున్నామని
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య అన్నారు…

ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు.

ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు
విలేఖరి పై అనుమానాలు
జమ్మికుంట :నేటిధాత్రి

 

 

జమ్మికుంట అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు సిరిమల్లె జయేందర్, కార్యదర్శి ఎలిమెల్ల రాజేంద్రప్రసాద్ లపై ఆలయానికి వచ్చినటువంటి విరాళాలు సొంతానికి వాడుకొని లెక్కలు చూపించకుండా అక్రమాలు చేసినట్టు ఆలయ సభ్యులకు అయ్యప్ప మాలధారులకు కరపత్రాలు పోస్ట్ ద్వారా సీతారామయ్య చీటీ లాగా అడ్రస్ లేకుండా పంపించిన వారు ఎవరనేది తెలియకుండా పంపించడం జరిగింది ఇది జమ్మికుంట పట్టణం ఒక సంచలన వార్తగా మిగిలిపోయింది ఈ కరపత్రాల సమస్య విషయమై ప్రజల యొక్క నానుడి ఎలా ఉందంటే ఆలయ నిర్మాణ టైంలో యాంసాని కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసుకునే భక్తుడే కృష్ణమూర్తి అనుచరుడిగా శ్రేయోభిలాషిగా మెదులుతూ అతనిని తప్పుదోవ పట్టించి తప్పు చేయించి లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నటువంటి ఈ భక్తుడే కృష్ణమూర్తి ఉండే టైంలో గుడి పైసలు లక్షల రూపాయలు వాడుకొని కృష్ణమూర్తి తో ని కట్టించిన ఘనత ఈయనదే అని అనుకుంటున్నారు ఇతని లీలలు శ్రీకృష్ణ లీలలు త్వరలోనే బయటికి వస్తాయి అనుకుంటున్నారు ఇకపోతే ఆలయానికి చాలా ఖర్చులు ఉంటాయి ఒక కుటుంబం పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు అలాంటిది వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆలయానికి సౌకర్యాలు కలిగించడం ఉత్సవాలు జరిపించడం ప్రతి పండుగ రోజు పండుగ వాతావరణం కలిగించడానికి ఎంతో ఖర్చవుతుంది అలాంటిది రాయలేదు వచ్చిన రూపాయలు అక్రమం జరిగిందని రాస్తున్నారు అందులో ఎంతవరకు నిజం ఉన్నదో ఈ ఆకాశరామన్న ఉత్తరంలో ఏది నిజమో ఏది అబద్దమో కాలమే తెలియజేస్తుంది అలాగే ఆలయ మొత్తము విలువ 20 కోట్లు ఉంటుందేమో కానీ 15 కోట్ల రూపాయలు అక్రమం జరిగింది 15 కోట్ల రూపాయలు సంతానికి వాడుకున్నారు అనేదాంట్లో ఎంతవరకు నిజమో అనేది ప్రజలు గమనిస్తున్నారు ఏది ఏమైనా భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ భగవంతుని యొక్క పైసల విషయంలో ప్రజల్లోకి ఇలాంటి వార్తలు రావడం రానున్న రోజుల్లో విరాళాలు కూడా రాకుండా ఆలయ అభివృద్ధికి వెనకడుగు వేసే విధంగా చేసినారు తప్ప ఇది ఏదో అభివృద్ధి కో లేకుంటే ఏదో ఆలయానికి పనికివచ్చే విషయం అనేది ఎవరూ పరిగణించట్లేదు వాళ్ల దాంట్లో వాళ్లకు పడక ఆదిపత్య పూర్ లో భాగంగానే ఇది వచ్చిందని నిపుణులు భక్తులు ప్రజలు అనుకుంటున్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం.

హనుమకొండలో గుర్తు తెలియని మృతదేహం

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది తేది 21.04.2025 రోజున, సమయం 14:46 గంటల సమయంలో కాంగ్రెస్ భవన్ కుమార్ పల్లి వద్ద కనిపించినది, ఈ మృతదేహాన్ని హన్మకొండ పోలీస్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించడం జరిగింది.చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రక్త బందువులు ఎవరైనా ఉంటే ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించలని హనుమకొండ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. నెంబర్ 87126 85113, 9550961427.

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను.!

పాతకోటలో వృదాగా ఉన్న కురాగాయల మార్కెట్ ను

డబులో బెడ్ రుములు నిర్మెంచి పేదలకు ఇవ్వాలి ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి ;

వనపర్తి పట్టణంలో:

పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ పాత వ్యవసాయ మార్కెట్ లోని సమీకృత మార్కెట్లను వెంటనే వినియోగంలోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక.జిల్లా అధ్యక్షులు
సతీష్ యాదవ్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు గత బీ ఆర్ ఎస్ .ప్రభుత్వ ములో కోట్లు రూపాయలు ఖర్చు చేసి
పాతకోట లోని కందకంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉంది అని దాన్ని వినియోగం లోకి తేవాలనీ సతీష్ ప్రజల తరుపున కోరారు. లేకపోతే డబుల్ బెడ్ రూమ్ లను నిర్మాణం చేసి పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజలు. పాత వ్యవసాయ మార్కెట్లో కట్టిన సమీకృత మార్కెట్ బిల్డింగును తక్కువ ధరలకు కిరాయలకు ఇచ్చి పేదలు వ్యాపారం చేసుకోవడానికి} వినియోగం లోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి కలెక్టర్ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని సతీష్ యాదవ్ కోరారు
సతీష్ యాదవ్ వెంట ఎస్సీ ఎస్టీ కమిటీ నాయకులు గంధం నాగరాజు సిపిఎం నాయకులు మార్టిన్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version