కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ.

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి:

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారమే.!

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

* సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )*

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే ఐపీఎస్ తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

కవి ఆకుల శివరాజ లింగం ను సన్మానం చేసిన ఎస్పీ.

కవి ఆకుల శివరాజ లింగం ను సన్మానం చేసిన ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి :

 

 

 

వనపర్తి పట్టణ ములో జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తికి చెందిన ప్రముఖ పద్య కవి ఆకుల శివరాజలింగం రచించిన పుస్తకాలు జిల్లా ఎస్పీ శ్రీ *రావుల గిరిధర్ చదివి పరవశించి ఆనందంతో కవి నిశాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు, టి, వెంకట్ రాములు, వై, నగేష్ యాదవ్, నరేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర నాయకత్వం లోకి కుంట్ల మహేందర్.

ఏ ఐ టి యు సి ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం లోకి కుంట్ల మహేందర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం , చెల్పూర్ లో కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన ఏ ఐ టి యు సి కార్యవర్గ సమావేశం లో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న,కుంట్ల మహేందర్ ను ఏ ఐ టి యు సి అనుబంధ తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ యూనియన్ రాష్ట్ర కమిటీ లోకి తీసుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు ప్రకటించడం జరిగింది.ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ, ఆర్టిజన్ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న కుంట్ల మహేందర్ కు పదవీ రావడం పట్ల ఏ ఐ టి యు సి రాష్ట్ర రీజినల్ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.
ఇట్టి సమావేశం లో రీజినల్ ప్రెసిడెంట్ కోల శ్యామ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగినేని ధర్మారావు, కార్యదర్శి గోపిరెడ్డి కిరణ్, ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు బొమ్మకంటి పవన్ కుమార్,పిప్పాల శ్రీపాల్ తదితరలు పాల్గొన్నారు

ఊర చెరువు శిఖరం భూమి కబ్జా.

ఊర చెరువు శిఖరం భూమి కబ్జా

ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం
ధర్మారావుపేట గ్రామంలో ఊరచెరువు శిఖం భూమి కబ్జాకు గురైందని చెరువు భూమిని వ్యవసాయ సాగుభూమిగా చిత్రికరిస్తూకొందరు దళారులు అధికారులు నాయకులు సింగరేణి ఓ సి త్రి భూ సేకరణ ఎంజాయిమెంట్ నమోదు చేసి డబ్బులు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని తెలుసుకున్న ఆయకట్టు రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావానిలో పిర్యాదు ఇవ్వడం జరిగిందని మరియు ఆర్ డి ఓ సింగరేణి జీ యం గార్లకు వేరు వేరుగా వినతి పత్రాలు అందిచమని వారు తెలిపారు..దయచేసి మా చెరువు భూమిని హద్దులు ఏర్పాటు చేసి చెరువు భూమిని కాపాడగలరని రైతులు కోరుతున్నారు..

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా.

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి..

బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నర్సంపేట నేటిధాత్రి:

అక్రమ నాటుసారా అమ్ముతూ పట్టుబడి బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా నియంత్రణలో భాగంగా నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలను నిర్వహించగా పట్టణంలోని మల్లంపల్లి రోడ్డులో ఏలేటి కృష్ణ అనే వ్యక్తి నాటుసారా అమ్ముతూ పట్టుబడినట్లు తెలిపారు. అతడు గతంలో తహసిల్దార్ ఎదుట బైండోవరై ఉన్నందున బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నాటుసారా అమ్మినందున నిందితున్ని నర్సంపేట తహసిల్దార్ ఎదుట హాజరుపరచగా అతనికి రూ.50 వేలు జరిమానా విధించగా అతను చలానా రూపంలో చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు.ఈ దాడులలో ఎస్సై శార్వాణి, సిబ్బంది పాల్గొన్నారు.

బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నాటు సారా తయారు చేస్తూ,అమ్ముతూ పట్టుబడిన వారిని వారి ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తూ బైండోవర్ చేయడం జరుగుతుంది. అయినప్పటికిని పద్ధతి మార్చుకోకుండా తిరిగి అదే నేరాలకు పాల్పడినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుందని తహసిల్దార్ రాజేష్ హెచ్చరించారు.

DNSS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా.!

DNSS వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారముల్ల యాకూబ్ ఏకగ్రీవ ఎన్నిక

వర్దన్నపేట (నేటిదాత్రి):DNSS

వర్ధన్నపేట పట్టణ మూడో డివిజన్ కు చెందిన మారముల్లా యాకూబ్ ను దళిత నిరుద్యోగ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సోమవారం రోజున డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల కుమార్ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు ఎం యాకోబు ఉద్యమాలు తెలిసిన వ్యక్తి సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి పోరాట యోధులు అని వారన్నారు ఎన్నుకోబడిన మారుమూల యాకూబ్ మాట్లాడుతూ దళితుల సమస్యల పైన నిరుద్యోగుల సమస్యల పైన నిరంతరం పోరాటాలు

General Secretary

చేస్తానని వారు అన్నారు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు తన ఎన్నికకు సహకరించిన డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల కుమారస్వామి డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్ల మిథున్ గారు డిఎన్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంజర్ల సమ్మయ్య గారు పట్టణ అధ్యక్షులు మునిగాల అరుణ్ కుమార్ గారికి కొండేటి రామచంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఇట్లు
తుమ్మల కుమారస్వామి
డిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రం

ఇట్లు
మారముల్లా యాకూబ్
డిఎన్ఎస్ఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
వరంగల్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం

పార్థివ దేహాన్ని సందర్శిం చి నివాళులు అర్పించిన.!

పార్థివ దేహాన్ని సందర్శిం చి నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలo భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం మండల కేంద్రంలోని కీ||శే|| మారపేల్లి నాగరాజు గోడకూలి మరణిం చగా విషయం తెలుసుకున్న మండల మాజీ ఎంపీపీ మెతు కు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి నాగరాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించా రు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బాధిత కుటుంబ సభ్యులను పరామ ర్శించి తమ ప్రగాఢ సాను భూతిని తెలియ జేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ ఉపసర్పంచ్ దైనంపేల్లి సుమన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మండల యూత్ అధ్యక్షులు మారపేల్లి మోహన్, సీనియర్, నాయ కులు కరుణ్ బాబు, దైనంపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆ” అధికారి” ఎందుకు వచ్చినట్లు.!

ఆ” అధికారి” ఎందుకు వచ్చినట్లు.!

టి జి ఎం డి సి నిర్లక్ష్యం, హద్దులు దాటుతున్న ఇసుక అక్రమాలు.

ఆ అధికారి వచ్చి ఏమి చేసినట్లు, గుట్టు చప్పుడు కాకుండా వచ్చుడు ఎందుకు.

మంచిర్యాల జిల్లా క్వారీ, కుంట్లం ఇసుక తీస్తుంటే ఆ అధికారికి కనబడలేదా.

దేవుని దర్శనంగా అధికారుల సందర్శన, రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతున్న అక్రమాలు.

టీజీఎండిసి చీకటి ఒప్పందమే, ఇసుక క్వారీల అక్రమాలు,
అనేక సాక్షాలు తెరపై.

ఇప్పటికే ఐదు క్వారీల్లో అక్రమ వసూళ్ల పర్వం, కొత్తగా తెరపైకి పక్క జిల్లా క్వారీకి ఇసుక రవాణా ఆగేనా.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

ఇసుక క్వారీల్లో అక్రమాలకు అంతులేకుండా యదేచ్చగా అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక బిసి కాసులు దండుకుంటున్న క్రమంలో, మండలంలోని 5 ఇసుక క్వారీల అక్రమ వ్యవహారం, తెరపైకి వస్తున్న క్రమంలో అధికారుల చర్యలు లేకపోవడం, ఇసుక రీచ్ లో అక్రమాలకు మరింత బలం చేకూర్చింది, ఒకవైపు ఇప్పటికే పలుకుల 8 పలువుల తొమ్మిది, మహాదేవపూర్ పూసుక్ పల్లి,1 పుసుపల్లి పలుకుల సిక్స్, పుసుపల్లి ఒకటి. ఐదు ఇసుక రీచ్ లో దర్జాగా దోపిడీ వ్యవహారాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, టీజీఎండిసి అధికారులు చర్యలకు ఉసేత్తలేదు, ఉన్నత అధికారుల నిర్లక్ష్యం ఇసుక రీచ్ లో దోపిడీ అక్రమ ఇసుక రవాణా చేస్తూ మరింత రెట్టింపు ఉత్సాహంతో, ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు దర్జాగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తెరపైకి వచ్చింది, మంచిర్యాల జిల్లా చెన్నూర్ సరిహద్దుకు అనుకొని ఉన్న ఎర్రాయిపేట తీరుతూ నిర్వహించబడి ఇసుక క్వారీ గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, కుంట్లం గ్రామ శివారు నుండి ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇది కూడా టీజీఎండిసి నిబంధనలకు విరుద్ధం కాదు, స్థానికులు అడిగితే అధికారులు టీజీఎండిసి విధానాల పాఠాలను చెప్పడం, కాంట్రాక్టర్ సూపర్వైజర్ కు అడిగే పరిస్థితి లేదని, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తరలించడమే కాకుండా దౌర్జన్యాo, బెదిరించే పరిస్థితికి దారితీసింది. తాజాగా మరోవైపు “సెన్సేషనల్” విషయం గుట్టు చప్పుడు కాకుండా రెండు రోజులుగా మండలమంతా గుసగుసలాడింది, అదేమిటంటే ఉన్నత అధికారి సందర్శన, వింటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా కానీ అదే నిజం.

officer

ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు.!

రాష్ట్రవ్యాప్తంగా మహాదేవపూర్ ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక రవాణా, పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల వసూళ్ల పర్వం, గత 24 గు రోజుల నుండి, వరుస కథనాలు తెరపైకి వస్తున్న క్రమంలో, టీజీఎండిసి సిబ్బంది, తమ హద్దులు దాటి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న సాక్షాలు, లోడింగ్ పై అదనపు ఇసుక తరలిస్తున్న లారీలు కాంటాల వ్యవహారం, సాక్షాలతో తెరపైకి తీసుకురావడం తోపాటు మండలంలో ఇసుక రీచుల అక్రమ వసూళ్ల వ్యవహారం, లక్షల రూపాయల సొమ్ము కాంట్రాక్టర్లు జీబులు నింపుకోవడం, వారికి గుమస్తాలుగా టీజీఎండిసి సిబ్బంది సహకరించడం లాంటి విషయాలను సాక్షాలతో తెరపైకి తీసుకురావడంతో పాటు, టీజీఎండిసి అధికారుల నిర్లక్ష్యం, చర్యలకు ససి మీరా అనడం, వరుస కథనాలతో అధికారులు చలనం రాకపోవడం తో కాంట్రాక్టర్లు తమ అక్రమాలను మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగడం లాంటి విషయాలను, తిరుపతికి తీసుకురావమే, లక్ష్యంగా అడుగులు వేస్తున్న క్రమంలో, శనివారం రోజు ఉన్నత అధికారి గుర్తు చప్పుడు కాకుండా, మండలంలో నిర్వహించబడుతున్న కొన్ని ఇసుక క్వారీల వద్ద సందర్శించడం జరిగిందని తెలుస్తుంది.

officer

వచ్చిన ఆ అధికారి లారీల డ్రైవర్ లను ఏమైనా ప్రశ్నించడం జరిగిందా, కాంటాల వద్ద “రీబూట్” చేసి చూడడం లాంటి జరిగిందా, అంటే అలాంటిది ఏమీ లేదు, మరి ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు, అంత పెద్ద అధికారి వస్తే ఎవరికైనా సమాచారం ఇవ్వాలి కదా, అలాంటిది ఏమీ జరగలేదు, ఆ ఉన్నత అధికారి వచ్చి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఆ అధికారి పర్యటన వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉందని మాత్రం చర్చలు జరుగుతున్నాయి.

officer

టి జి ఎం డి సి, నిర్లక్ష్యం, హద్దులు దాటుతున్న ఇసుక అక్రమాలు.

ఇక టీజీఎండిసి నిర్లక్ష్యం మండలంలో నిర్వహించబడుతున్న క్వారీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయని పరిస్థితి కొనసాగుతుంటే, మరోవైపు పక్క జిల్లా క్వారీలు కూడా, గోదావరి సరిహద్దుకు ఆనుకొని ఉన్నాము కదా, “ఆ ఇసుక, ఈ ఇసుక” అంతా ఒకటే, అనుకున్నారేమో వారం రోజులుగా గోదావరిలో రోడ్డు నిర్మించి, పెద్ద మొత్తంలో కుంట్లం సరిహద్దు నుండి ఇసుక రవాణా చేస్తుంటే, జిల్లా టీజీఎండిసి మైనింగ్ తో పాటు శనివారం వచ్చిన ఆ ఉన్నత అధికారికి, స్థానిక అధికారులు చూపెట్టారో లేదో, కానీ పాపం పక్క జిల్లా ఎర్రాయిపేట క్వారీ కాంట్రాక్టర్ మాత్రం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మించి, దర్జాగా నేను కూడా టీజిఎండిసి ఇసుక కాంట్రాక్టర్ నే కదా అని కుంట్లం సరిహద్దు ఇసుకను ఎర్రాయిపేట క్వారీ వద్ద రవాణా చేసుకుంటున్నాడు, ఈ వ్యవహారాన్ని చూస్తే శభాష్ టీజీఎండిసి అనాలనిపిస్తుంది ఆట గ్రామస్తులకు, ఎందుకంటే గతంలో పలువుల 8 పేరుతో నిర్వహించబడిన ఇసుక క్వారీ, కేవలం రోడ్డు కొరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు సరిహద్దు గోదావరి ఇసుకను తీస్తుంటే, కాంట్రాక్టర్ టి ఎస్ జి డి సి పి ఓ గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు టీజీఎండిసి రూల్ మారిపోయింది. మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీలో అక్రమాలు సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన చర్యలు తీసుకొని టీజీఎండిసి, ఇక పక్క జిల్లా వారు వచ్చి అక్రమంగా దోచుకుంటే ఇలా ఆపుతుంది అని చెప్పుకొస్తున్నారు కులం గ్రామస్తులు.

officer

ఆ అధికారి వచ్చి ఏమి చేసినట్లు, గుట్టు చప్పుడు కాకుండా వచ్చుడు ఎందుకు.

ఇక ప్రస్తుతం మండలంలో గుట్టు చప్పుడు కాకుండా ఉన్నత అధికారి పర్యటన కాస్త చర్చగా మారింది, మండలంలో భారీగా అక్రమ వసూళ్లు నిర్వహిస్తున్న ఐదు ఇసుక రీచ్ లో, పూసుకుపల్లి ఒకటి తమ క్వాంటిటీని అక్రమ వసూళ్ల పర్వంతో సమాప్తం చేసుకొని దుకాణం లేపేసింది, కానీ టీజీఎండిసీ, కమిట్మెంట్ తప్ప ఏమీ చేయలేకపోయింది. అలాగే కాలేశ్వరం గ్రామానికి ఆనుకొని నిర్వహించబడుతున్న పుసుపల్లి పలుకుల సిక్స్ కూడా గత రెండు రోజులుగా లోడింగ్ నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం పలువుల 8 పలువుల తొమ్మిది మహాదేవపూర్ పూసుకుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లలో తగ్గేదే లేదని మరింత రెట్టింపు ఉత్సాహంతో రోజుకు 80 నుండి 100కు పైచిలుకు లారీల్లో ఇసుక రవాణా చేస్తుంటే, వచ్చిన ఉన్నత అధికారి ఈ క్వారీ ల వద్ద వెళ్లి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా, అంటే అలాంటిది ఏమీ లేదు ఉన్నత అధికారి వచ్చిందంటే, కింది స్థాయి అధికారి నుండి కాంట్రాక్టర్ ల వరకు భయం గుప్పిట్లో ఉంటుంది కానీ ఇక్కడ అంత సీన్ లేదు ఆటా, ఎందుకో మరి, దేవుని దర్శనముగా ఉన్నత అధికారులు ఇసుక క్వారీలకు సందర్శిస్తే, ప్రసాదం దొరుకుతుంది, కానీ అక్రమార్కులకు భయం ఎందుకు కలుగుతుంది, కానీ ఆ ముక్తిశ్వరుని పాపం మాత్రం కలుగుతుందని అంటున్నారు ఆ లారీ డ్రైవర్లు ఓనర్లు.

ఇప్పటికే” ఐదు “క్వారీల్లో అక్రమ వసూళ్ల పర్వం, కొత్తగా తెరపైకి పక్క జిల్లా క్వారీకి ఇసుక రవాణా ఆగేనా.

గుర్తుచప్పుడు కాకుండా ఉన్నత అధికారి ఇసుక రీచులకు సందర్శించినప్పుడు,మంచిర్యాల జిల్లా కు సంబంధించిన ఎర్రయ్య పేట పేరుతో నిర్వహించబడే క్వారీ, కుంట్లం ఇసుక తీస్తుంటే ఆ అధికారి దృష్టికి కిందిస్థాయి అధికారులు ఎందుకు తీసుకపోలేదు, లేకుంటే కావాలని చూసి చూడనట్టుగా వివరించారా ఇలా అనేక అనుమానాలు తెరపైకి రావడం జరుగుతుంది. అక్రమాలపై సాక్షాలతో తెరపైకి వస్తున్న క్రమంలో చర్యలకు బదులు దేవుని దర్శనంగా అధికారుల ఇసుక క్వారీలు సందర్శిస్తే, కాంట్రాక్టర్లు అధికారుల సందర్శనలు లెక్కచేయకుండా రెట్టింపు ఉత్సాహంతో అక్రమ వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీల్లో అక్రమాలకు పురుడు పూసింది టీజీఎండిసి,ఏ అని చెప్పడంలో సందేహం లేదు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి చీకటి ఒప్పందమే, దర్జాగా అనేక అక్రమాలు అక్రమ వసూలు అయినా అధికారుల నిశ్శబ్దం, ఇదే పెద్ద సాక్ష్యం, 24 రోజుల్లో 14 సంచలన కథనాలు సాక్షాలతో తెరపైకి వచ్చిన ఒక్క క్వారీని కూడా టీజీఎండిసి సీజ్ చేయలేదు, అంటే అక్రమ ఇసుక రవాణాపై, ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇక్కడ అమలవుతుంది. అంతేకాకుండా పక్క జిల్లాలకు కేటాయించిన ఇసుక క్వారీల ల్యాండ్ మార్కులను కూడా, కాంట్రాక్టర్లు వదిలిపెట్టి గోదావరి హద్దు దాటి అక్రమ రోడ్ల నిర్మాణాలు, చేపట్టి గోదావరి అవుతలి వైపు నుండి ఇసుక తరలిస్తుంటే టీజీఎండిసి చర్యలకు బదులు గుట్టు చప్పుడు కాకుండా, ఉన్నత అధికారులను దేవుని దర్శనంగా ఇసుక రీచులకు సందర్శనకు పంపిస్తుంటే అక్రమాలు ప్రభుత్వ సెండ్ పాలసీ విధానం ఎక్కడ అమలు అవుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు మండలంలో ఇసుక క్వారీల అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించిన.!

ఎస్టిపిపి డిస్పెన్సరీని ఆకస్మికంగా సందర్శించిన

సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్న డిస్పెన్సరీని సోమవారం సింగరేణి సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ డిస్పెన్సరీలోని వసతులు, ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.అలాగే ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు యజమాన్యం పెద్దపీట వేస్తుందని తెలిపారు. వైద్యులు,సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలన్నారు. Dr. Ravinder, Dr. Shyamala, and the dispensary staff participated in this program.

ప్యారవరం బ్రిడ్జి పనులు ఎప్పుడో..?

ప్యారవరం బ్రిడ్జి పనులు ఎప్పుడో..?

◆ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు రూ.3 కోట్ల మంజూరు శంకుస్థాపనకే పరిమితమా..?

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్యారవరం గ్రామ ప్రజల దశాబ్దాల నాటి కల. వంతెన నిర్మాణం ఇంకా కలగానే మిగిలి పోతోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణా నికి గ్రామీణ రహదారుల నిధుల నుంచి రూ.3కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 30న ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జహీరాబాద్ ఎంపీ మాణిక్ రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్టా పన చేశారు.

Pyaravaram Bridge


త్వరలో పనులను ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, పనులను ప్రారం భించడంలో ఎలాంటి కదలిక లేదు. వర్షాకాలం సమీపిస్తుండటంతో వరద నీటి భయంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మళ్లీ బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడనుంది. వంతెన నిర్మాణం పూర్తయితే వరద కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తు న్నారు. ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి,

దిగ్వాల్ గ్రామాల ప్రజల ఆశలు నిరాశగా మారు తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ. 3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవ డంతో ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గం మీదుగా రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వస్తే బ్రిడ్జి కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి కైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన పనులు వెంటనే ప్రారంభించా లని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అగ్రిమెంట్ పూర్తి కాలేదు.

వంతెన నిర్మాణం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, సంబంధిత గుత్తేదారులతో అగ్రిమెంట్ పూర్తి కాలేదు. మరో ఆరునెలల సమయం పట్టవచ్చు. ఒకవేళ గుత్తేదారులు వెంటనే అగ్రిమెంట్ పూర్తి చేసుకుంటే ప్రారంభ పనులు ప్రారంభిస్తాం.

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం.!

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం

భైరవభట్ల చక్రధర్, నాగేళ్ల హరికృష్ణ , కొడకండ్ల రాధాకృష్ణ శర్మ

చేర్యాల నేటిధాత్రి:

చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో అతి పురాతన దేవాలయం శ్రీ భవాని రుద్రేశ్వర ఆలయం లో శ్రీ రుద్ర సహిత శత చండీయాగం మహోత్సవం నిర్వహిస్తున్నారు.

village

భైరవభట్ల చక్రధర్ నాగేళ్ల హరికృష్ణ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈనెల 30 వ తేదీ బుధవారం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం తో యాగం ముగుస్తుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనవలసినదిగా కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు

వనపర్తి లో బచ్చు రామ్ నివాసంలో.!

వనపర్తి లో బచ్చు రామ్ నివాసంలో శ్రీ ఆంజనేయస్వామి ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి
పట్టణంలో పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం నివాసంలో శ్రీ ఆంజనేయ స్వామి మాలాధార మాలాధార స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం స్వాములకు భక్తులకు అన్న ప్రసారం ఏర్పాటు చేశామని పట్టణ బిజెపి మాజీ అధ్యక్షులు బచ్చురాం ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర బిజెపి నాయకులు న్యాయవాది మున్నూరు రవీందర్ అయ్యగారి ప్రభాకర్ రెడ్డి సబి రెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు డి నారాయణ వెంకటేశ్వర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాకాశి లోక్ నాథ్ రెడ్డి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి అశ్విని రాధా జిల్లా బిజెపి కిసాన్ మోర్చా నాయకుడు ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ రాయన్న సాగర్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ కాలూరు శ్రీనివాసులు శెట్టి శ్రీకాంత్ గోనూరు వెంకటయ్య చవ్వ పండరయ్య లగిశెట్టి అశోక్ వై వెంకటేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారు

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం.!

ఆకునూరు గ్రామంలో శ్రీ రుద్ర సహిత శత చండీ యాగం

భైరవభట్ల చక్రధర్, నాగేళ్ల హరికృష్ణ , కొడకండ్ల రాధాకృష్ణ శర్మ

చేర్యాల నేటిధాత్రి:

చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో అతి పురాతన దేవాలయం శ్రీ భవాని రుద్రేశ్వర ఆలయం లో శ్రీ రుద్ర సహిత శత చండీయాగం మహోత్సవం నిర్వహిస్తున్నారు.

village

భైరవభట్ల చక్రధర్ నాగేళ్ల హరికృష్ణ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈనెల 30 వ తేదీ బుధవారం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం తో యాగం ముగుస్తుంది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనవలసినదిగా కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు.

పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ.

పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్పీ
మల్లాపూర్ ఏప్రిల్ 28

నేటి ధాత్రి

మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వెంకటేష్ గౌడ్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.

లక్షల కోట్లు అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్న కెసిఆర్.

లక్షల కోట్లు అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్న కెసిఆర్

గంగారం, నేటిధాత్రి

బిఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన రజత్సోహ సభ కార్యక్రమం లో నీతి వ్యాక్కలు మాట్లాడిన కెసిఆర్ మా ప్రశ్నలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి సంయుక్త ప్రకటన చేశారు..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్టులు కట్టాము, సంక్షేమ పథకాలు అమలు చేశామని కేసీఆర్ గారు చెప్పుకున్నారు. కానీ ఈ పథకాలు, ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయాన్ని, వాటి ద్వారా కేసీఆర్ గారి కుటుంబం కమీషన్లు తీసుకున్న విషయాన్ని మాత్రం దాచేశారు. ఇలా కేసీఆర్ గారి కుటుంబం కమిషన్ల రూపంలో దోచుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఖజానాకు రాబట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి నిధులు అవసరం కన్నా ఎక్కువే సమాకూరుతాయి. అసెంబ్లీకి వస్తే, కాంగ్రెస్ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తారనే భయంతో.. తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అన్నట్లు కేసీఆర్ గారి వైఖరి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి, హద్దులు దాటవద్దని కేసీఆర్ గారు పోలీస్ వారికి వార్నింగ్ ఇవ్వడం చాలా విడ్డూరం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తొత్తులుగా వాడుకుని, చట్ట విరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు టాప్పింగ్ చేయించారు. మీ ఉచ్చులో పడిన కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటడం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ గారు, గద్దర్ గారు కలవడానికి వస్తే ప్రగతిభవన్ గేట్లను కూడా తెరవని కేసిఆర్ గారు… ఇప్పుడు మావోయిస్టులను చర్చలకి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చెయ్యడం కేవలం అవసరవాదం.పాతికేళ్ళ బీఆర్ఎస్ ప్రస్థానంలో తెలంగాణను అభివృద్ధి చేశామని కేసిఆర్ గారు చెప్తున్నారు ఈ పాతిక సంవత్సరాలలో తెలంగాణ ఆర్ధిక అభివృద్ధి కంటే కేసిఆర్ గారి కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థోమత ఎన్ని వేల రెట్లు పెరిగిందో చర్చిండానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముందు కేసిఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఒకొక్కరి ఆస్తులు ఎన్ని వేలకోట్లకు చేరాయో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమా…అని
వారు ప్రశ్ననించారు…

మేడే కార్యక్రమాలను విజయవంతం చేయండి.!

“మేడే” కార్యక్రమాలను విజయవంతం చేయండి

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రంపేట ఏరియాలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 “మే డే” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆవిష్కరించారు. అనంతరం తాను మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవులు పోరాడి హక్కులు సాధించిన రోజు “మే డే” అని అన్నారు.
సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా “మేడే” కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మే 1 వ. తేదీన ఉదయం 8 గంటలకు చంద్రంపేట ఏరియాలో సి.ఐ.టి.యు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లోని జెండా చౌరస్తా వద్ద “మే డే” అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి భారీ బహిరంగ సభ , భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇట్టి “మేడే” కార్యక్రమాలు , వేడుకలలో పవర్లూమ్ , వార్పిన్ , వైపని అనుబంధ రంగాల కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుండు రమేష్,సబ్బని చంద్రకాంత్, రమేష్, శ్రీను, నర్సయ్య, శ్రీకాంత్, వైపని వర్కర్స్ యూనియన్ నాయకులు ఎక్కల్ దేవి జగదీష్,చెముటి రాము , మ్యాన రాజు,గడుదాస్ వేణు,ఇమ్మశెట్టి లక్ష్మణ్,మిట్టపల్లి ప్రసాద్,బోగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల.!

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి మండలం రామకృష్ణ పూర్ గద్దె రాగడి లోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం…

పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,టీపీసీసీ పరిశీలకులు జంగ రాఘవ రెడ్డి, రాం భూపాల్,డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వివేక్ వెంకటస్వామి ఇలా మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సియం రిలీఫ్ ఫండ్ నిధులను ప్రజలకు అందించింది

చెన్నూరు నియోజక వర్గం లో అవినీతి రహిత పాలన అందిచడమే నాలక్ష్యం.

సింగరేణి సంస్థలో లక్ష ఉద్యోగులు ఉంటే కేసీఆర్ ప్రభుత్వ హయంలో 60 వేల ఉద్యోగాలు తీసేసింది

ఇప్పుడు సింగరేణి సంస్థలో 42 వేల ఉద్యోగులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన .ప్రతి పేదవాడి కి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

చెన్నూరు నియోజక వర్గ అభివృద్ధి కి ఏడాదిన్నర కాలంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

చెన్నూరు నియోజక వర్గం.ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో నే ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దుతాను.

సన్న బియ్యం పథకం.తో ప్రతి పేదవాడు మూడు పూటలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు.

కేసీఆర్ అవినీతి పాలనకు నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ,మిషన్ భగీరథ స్కీములు.

బిఆర్ఎస్ హయంలో.దొడ్డు బియ్యం దందా విచ్చలవిడిగా కొనసాగింది.

కేసీఆర్ అధికారం ఉంది కదా అనుకోని విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని.దుర్వినియోగం చేసిండు.

రాష్ట్రంలో నాణ్యమైన విద్య,వైద్యం అందడమే కాంగ్రెస్ లక్ష్యం.

ఆరోగ్య శ్రీ పథకం ను బిఆర్ఎస్ హాయంలో పట్టించుకోలే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 లక్షలకు పెంచి పేద ప్రజలకు అండగా నిలిచింది.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లలి

ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు దీటుగా ఖండించాలి

ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

గ్రూప్ రాజకీయాలు వదిలేయాలి అప్పుడే పార్టీ బాగుంటుంది.

హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో.!

హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళి…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

కాశ్మీర్ పహాల్గాం లోని ఉగ్రవాదుల దాడిలో అమరులైన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ.. హిందూ జాగృతి లింగంపల్లి ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు ఘన నివాళులు అర్పించారు. గోపినగర్ హనుమాన్ దేవాలయం నుండి.. చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద నుండి.. పీజేఆర్ స్టేడియం నుండి వేరువేరుగా ప్రారంభమైన మూడు శాంతి ర్యాలీలు బిహెచ్ఇఎల్ చౌరస్తా వరకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందువులు అక్కడ కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి పహల్గాం మృతులకు నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలో సంఘ్ పరివార్ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, పతంజలి యోగ సమితి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఉగ్రవాదుల దుశ్చర్యపై మండిపడ్డారు.

Pahalgam

పాకిస్తాన్ ద్వంద్వ నీతి పై ద్వజమెత్తారు. హిందువా కాదా అని తెల్చుకొని మరి కాల్చి చంపడం అమానుషమని అన్నారు. హిందూ దేశంలో హిందువులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్లో హిందువులను తమ స్వస్థలాల నుండి తరిమి కొట్టారని.. ఈరోజు కాశ్మీర్ లోని పహాల్గంలో ఏకంగా పేర్లు అడిగి, కల్మా చదివించి, దుస్తులు విప్పదీసి మరి హిందువులపై దాడి చేయడాన్ని ప్రపంచం మొత్తం చూసిందని వాపోయారు. సమాజంలోని ప్రతి వర్గం వారు ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం నేర్పించాలని మళ్లీ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా వెన్నులో వణుకు పుట్టించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version