బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలజడ్పీహెచ్ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు బడిబాట మరియు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు జరిగినవి. ఈ సందర్భంగాఎంఇఓ కోడేపాక రఘుపతి మాట్లాడుతూ అందరూ విద్యావంతులైనప్పుడే ఆ సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి పౌరుడు అభివృద్ధి పథంలో కొనసాగాలని కోరారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు సైతం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బైరం కల్పన, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, మహిళా సంఘం నాయకురాళ్లు,, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,మరియు వివో ఏ చందర్, కోమల ఉపాధ్యాయులు బండారి సదయ్య, గోపగాని భాస్కర్, బొమ్మ.రాజమౌళి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సెలవు దినాల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..

అందరూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి..

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల సెక్రటరీ బైరం శంకర్..

రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ సెక్రటరీ బైరం శంకర్ విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version