వీధి కుక్కలకు వింత రోగాలు
పిల్లలకు వృద్ధులకు పెను ప్రమాదం
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో వీధి కుక్కలకు సోకుతున్న చర్మ వ్యాధులతో ప్రమాదం పొంచి ఉంది గత కొన్ని రోజులుగా వీధి కుక్కలకు కొత్త రోగం అంటుకుంది. కుక్కల ఒంటిపై బొచ్చు ఊడిపోవడం దద్దుర్లు రావడం చిన్న చిన్న పుండ్లు ఏర్పడుతున్నాయి పశువులలో లంపీ స్క్రీన్ వైరస్ సోకినట్లు కుక్కలకు కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ వ్యాధి ఒకదాని నుండి మరొక దానికి వ్యాపిస్తుండడం ఆందోళనన కలిగిస్తుంది మండలంలో సుమారుగా 300 కుక్కలు ఉంటాయి వీటిలో చాలా కుక్కలకు పారాసెట్ ఇన్ స్టేషన్ వ్యాధి బారిన పడ్డాయి ఇవి రెండు రకాలుగా ప్రభావం చూపుతుంది వాటి శరీరంపై బొచ్చు ఊడిపోయి గజ్జి లాంటి దద్దుర్లు రావడం వల్ల ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి
రోగ నివారణకు చర్యలు శూన్యం
వ్యాధి బారిన పడిన కుక్కలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడిన కుక్కలు చని పోకున్న వాటి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. రోగానికి గురైన కుక్కలను చూసి ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు.
పిల్లలు వృద్దులకు పెను ప్రమాదం
మండలంలోని వీధి కుక్కలకు చాలా రోజులుగా శరీరం మీద బొచ్చు ఊడిపోతుంది రాలి పోయిన చోట పురుగులు ఉంటున్నాయి. ఆ కుక్కలను చూస్తే భయం వేస్తుంది అవి నివాసానికి రావడంతో పిల్లలు, వృద్దులకు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.