కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సేవకులు , విద్యాదాత, మతసామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతిగృహాలకు, డబ్బులు దానం చేసిన గొప్పదాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ ని నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకట రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి ఎడుమల,హనుమంత రెడ్డి,వేసి రెడ్డి రామిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి,కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు
నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ ర్యాంకులు,గ్రేడ్లు ప్రాముఖ్యత కాకుండా ఆవరేజ్ విద్యార్థులను తీసుకొని అందరినీ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రతి సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నారు.భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులు కావడానికి వారే స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలని అనేక రంగాలలో ప్రవేశించడానికి( ఐటిఐ, పాలిటెక్నిక్,డిప్లమా కోర్సులు, ఇంటర్మీడియట్) తదితర కోర్సులలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,ఎవరిని బలవంతం పెట్టకుండా భవిష్యత్తులో మంచి మార్గం ఎన్నుకోవడానికి విద్యార్థులను కృషి చేయాలని కోరారు.
అకాల వర్షానికి కూలిన ఇండ్లు బాధితులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామ పంచాయతీలోని గోపాల్ పూర్,శివ్వారం గ్రామాలలో గురువారం రాత్రి వీచిన గాలివానకు ఇండ్లు పూర్తిగా దెబ్బతిని,పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయి పలు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా మారిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి,ఆర్థిక సాయం అందించి,బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఉప్పల్ భగాయత్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా ఉప్పల్ వార్డు ఆఫీస్ లో జిహెచ్ ఎం సి అధికారులు మరియు ఉప్పల్ హెచ్ఎండిఏ బాగాయత్ రెసిడెన్షల్ వెల్ఫర్ అసోసియేషన్ సభ్యుల సామావేశం లో కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సిబ్బంది నియామకం, డస్ట్ బిన్‌ల ఏర్పాటు వంటి అంశాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు, సిబ్బంది కూడా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఉప్పల్ సర్కిల్‌లోన పారిశుద్ధ్య విభాగం, వీధి దీపాల నిర్వహణకు విద్యుత్ శాఖ అధికారులతో కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య సిబ్బంది నియామక ప్రక్రియ తుది దశలో ఉందని ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతలోనే భగాయత్‌లో పారిశుద్ధ్యం కోసం 25 మంది సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. అతి త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రెండో విడతలో ఇంకా కావాల్సిన పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరుగుతుందన్నారు.
Sanitation.
భగాయత్‌లోని వీధుల్లో చెత్త వేయకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్టుగా రజితాపరమేశ్వర్‌రెడ్డి చెప్పారు. భగాయత్‌లోని అన్ని వీధుల్లో చెత్త డబ్బాలను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేశామన్నారు.
వీధి దీపాల నిర్వహణపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా రజితాపరమేశ్వర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే భగాయత్ లో వీధి దీపాల ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏఎంహెచ్ ఓ రంజిత్ ,జి హెచ్ ఎంసీ ఎలక్ట్రికల్ డిఈ రవీందర్, ఏ ఈ టి ఆర్ ప్రసాద్ ,ఉప్పల్ హెచ్ ఎం డి ఎ బాగాయత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రావు గారు సుధాకర్ రెడ్డి ,వంశీ దార్ రెడ్డి ,ఈగ సంతోష్,లింగంపల్లి రామకృష్ణ,చిరంజీవి రెడ్డి ,మహేష్,నరేంద్ర చౌదరి ,మనోహర్ రెడ్డి ,అంజి రెడ్డి ,శివ ప్రసాద్ శుభన్ రెడ్డి సామ్ జంగయ్య పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం ..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి సుమారు 3500 వరకు మంజూరి అయినవి ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంతకు ముందు ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారు కాకుండా, ఇల్లు లేని వారికి,స్వంత ప్లాటు ఉండి ఇల్లు కట్టే స్థోమత లేని వారికి,దివ్యాoగులకు,ఒంటరి మహిళలకు,వితంతువులకు,అనాదలకు,పాకిపని వారికి,మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరిగిన తీరును పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఉన్న వారికి,ఇంతకు ముందు లబ్దిపొందిన వారికి కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ ఇండ్లకు ప్రభుత్వం ఇచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే దానికి అధికారులు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టాలని నిర్బంధం చేస్తున్నారు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టితే 2రేట్లు అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది మిగతా డబ్బులు వారు ఎక్కడి నుండి తేవాలి వారు ముందే బీదవారు ఇల్లు కట్టలేని పస్థితిలో ఉన్నప్పుడు ఈ అధిక వ్యయం ఎక్కడినుండి తేవాలి అదనపు భారం కొరకు తప్పని సరి అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే ఇండ్లు పొందిన వారు అప్పుల పాలు కావల్సిందేన కాబట్టి ప్రభుత్వం,అధికారులు కేవలం నాయకులు చెప్పిన వారికి కాకుండా నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని,మరియు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు సరిపడే విధంగా ఇంటి ప్లాన్ కుదించాలని,ఆపై ఇల్లు కట్టు కుంటే లబ్ధిదారుల ఇష్టానికి వదలాలని డిమాండ్.ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్శింలు,యస్.గోపాల్,పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి జైపూర్ మండలంలోని ఇందారం,టేకుమట్ల, కిష్టాపూర్,వేలాల గ్రామపంచాయతీలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎక్కడ ఉండకూడదని,క్రమం తప్పకుండా డ్రై వేస్ట్ కలెక్షన్ చేయాలని,డ్రైనేజీలలో పూర్తిస్థాయిలో మట్టి తీయాలని,క్రమం తప్పకుండా రికార్డులను అప్డేట్ చేయాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. గనుక ముందస్తుగా గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని,అదేవిధంగా నీటిని పంపిణీ చేసే ప్రతిసారి బ్లీచింగ్ పౌడర్ కలపాలని,క్రమం తప్పకుండా నీటిని పరీక్షించాలని,వేస్ట్ కలెక్షన్ రిజిస్టర్,కంపోస్ట్ కంజుమ్షన్ రిజిస్టర్ నిర్వహించాలని,క్యాష్ ఇన్ హ్యాండ్ త్వరగా గ్రామపంచాయతీ సాధారణ నిధికి జమ చేయాలని,విధి నిర్వహణలో ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గురువారం రాత్రి సంభవించిన గాలి దుమారానికి ఎగిరిపోయిన నర్సరీ షేడ్ నెట్ ను సరిచేయాలని,చలివేంద్రంలో వాటర్ క్రమం తప్పకుండా నింపాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,పంచాయితీ కార్యదర్శులు ఏ.సుమన్,ఆర్. శ్రావణి,ఎల్.ప్రశాంత్,రాకేష్ గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎల్లా జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, శనిగారపు అనిల్ కుమార్, తదితరనాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన పదవి తరగతి పలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హై స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈవిద్యా సంవత్సరం కూడా కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధించారని కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర హై స్కూల్ లో 95 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 500 పైగా మార్కులు 63 మంది విద్యార్థులు సాధించారు. 550కిపైగా 22 మంది విద్యార్థులు సాదించారు. అత్యధిక మార్కులు సాధించిన జి.మనస్విని 568, టి.తేజ 562, ఈ.సాక్షిత 560, కే.మమత 559, ఎల్.కార్తీక్ 558, విద్యార్థులను కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ విద్యార్థులను పుష్పగుచ్చములతో అభినందించిన అనంతరం మునిందర్ మాట్లాడుతూ 500 పైన మార్కులు జిల్లా స్థాయిలో ఎక్కువ మంది అక్షర విద్యార్థులే సాధించడం గొప్ప విజయమని విద్యార్థులను కొనియాడారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ మినుకుల రాధ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.
మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్ల పల్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్
కరీంనగర్, నేటిధాత్రి:
మే 15-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో జరగనున్న ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపెళ్లి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేయడంజరిగింది. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భామండ్లపెళ్లి యుగంధర్ రాష్ట్ర సమితి సభ్యులు బోనగిరి మహేందర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు. ఈ చర్యల మూలంగా దేశంలో గత పది సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే 2025 మే 15-18వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో జరగనున్నాయని, ఈమహాసభలలో ప్రధానంగా నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, పాలకుల విధానాలు తదితర అంశాలపై బోధనలు, చర్చలు, తీర్మానాల ద్వారా నిర్ణయాలు ఉంటాయని, ఈజాతీయ మహాసభలకు దేశం నలుమూలల నుండి సుమారు ఎనిమిది వందల మంది డెలిగేషన్ నాయకత్వం పాల్గొంటారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎనభై మంది డెలిగేషన్ పాల్గొంటున్నట్లు, మే15న తిరుపతిలో జరగనున్న మహాసభల ర్యాలీ, బహిరంగ సభకు వెయ్యి మంది పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఈపోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్, చిన్న సదాశివ్, అవినాష్, రమేష్ , దామోదర్, అఖిల్, మురళి, భాస్కర్, రవి, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు హాజరైనారు
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు, సరఫరా సమస్యలు, నిర్మాణ వ్యయం పెరుగుదల వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పునాది రుణాలు, ఉచిత ఇసుక సరఫరా, నమూనా ఇళ్లపై స్పష్టత లేకపోవడం, ఐకేపీలపై అవగాహన లోపం సమస్యలుగా ఉన్నాయి. లబ్ధిదారులు ఈ సమస్యల పరిష్కారాన్ని కోరుతున్నారు. ఈ వారంలో రెండో విడత లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది.
బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..
ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్రత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు.
Students
అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట మండల కేంద్రానికి నూతన ఎమ్మార్వోగా శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిసిఎల్ కమిషనర్ ఆఫీసులో పనిచేసిన ఆయన బదిలీపై నిజాంపేట మండలనీకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
దేశవ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం అని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు గత రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం దేశవ్యాప్త కులగనన చేయడం హర్షించదగ్గ విషయమని శుక్రవారంనాడు చిట్యాల మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది, అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి బీసీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి రుణపడి ఉన్నారని ఎన్నో సంవత్సరాలుగా బీసీలను జెండాలు మోసే బానిసలుగానే వివిధ రాజకీయ పార్టీలు చూసాయని కానీ భారతీయ జనతా పార్టీ బీసీలకు రాజ్యాధికారం అందాలని ప్రతి ఒక్క బిసి రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదగాలని ఆశించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నారని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ అని ఆయన అన్నారు ఇప్పటికైనా మిత్రులందరికీ ఏకతాటి మీద నిలబడి నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గుండ సురేష్ గజనాల రవీందర్ ఓదెల శ్రీహరి నల్ల శ్రీనివాస్ రెడ్డి, మైదం శ్రీకాంత్ అనుప మహేష్ వల్లల ప్రవీణ్ కేంసారపు ప్రభాకర్ రావుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ మండలం మల్చేల్మా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు గ్రామస్థుల కోరిక మేరకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారు*ఇప్పేపల్లి PACS చైర్మన్ మచ్చండర్ ,మరియు మండల గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో కలిసి ప్రారంభించారు .ఈ సంధర్బంగా గ్రామ నాయకులు,ప్రజలు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గార్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనందం మాజీ ఎంపీటీసీ లు ఇస్మాయిల్,మోయిన్,రాములు, ప్రేమ్ సింగ్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, అధ్యక్షులు,మండల బిసి సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల యూత్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు చిన్నారెడ్డి,నాయకులు గోరెప్ప,భీమ్ రావ్, దత్తు రెడ్డి,మోహన్ రాథోడ్,శ్రీకాంత్, పిజి శంకర్,యేసు, శ్రీనివాస్, పాపన్న కయ్యుమ్, నసీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో కులగణన చేపడతామని, జనగణన తో పాటు కులాల వారీగా కుల గణన చేపడతామని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్య, వైద్య ఉపాధి, ఉద్యోగ, అవకాశాలపై ఏ కులాలకు ఎంత వాటాల రూపంలో తీర్చేందుకే ఈ కుల గణనను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం నుంచి వచ్చిందని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ద్వారా కులగణన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టడం జరిగినదని. ఈ కులగణలలో 1,50,000 మంది సర్వేలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ కులగణలో బీసీల రిజర్వేషన్ శాతం 56.36% శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్య, ఉపాధి కల్పనా రాజకీయంగా గాని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో 42% శాతం అసెంబ్లీ ఆమోదం నిర్ణయించడం జరిగింది . అంతేకాకుండా కరీంనగర్ బీసీ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీసీ కులగనున చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను తోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని బిసి సంఘాలను ఏకం చేసుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా కుల గణన నిరసన తెలుపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన ఒత్తిడి తెచ్చింది అని అందుకు కేంద్ర ప్రభుత్వం కులగననకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ సభ్యుల హవా
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పెద్దకోడే పాక గ్రామంలో ఇష్టానుసా రంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల జాబితా విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ వెనుక రహస్యమేముంది. బహుజన స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇల్లు ఇప్పించా లని ఎమ్మెల్యే ప్రధానంగా కార్యకర్తలకు చెబితే కార్యకర్తలు స్వార్థ స్వభావాల తో ఇల్లు లేని గ్రామ ప్రజలకు గుర్తించకుండా ఐదుగురు కమిటీ సభ్యులకు సంబంధిం చిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఏకపక్ష తీర్మానం చేయడం ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా ఒకేచోట కూర్చుం డబెట్టి తీర్మానం చేసి పై అధికా రులకు పంపించడం జరిగింది. కావున తక్షణమే ఐదుగురు కమిటీ సభ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇల్లు లేని నిరు పేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా చేయాలని ప్రధా నంగా ఎమ్మెల్యే,కలెక్టర్ ను కోరుతున్నాం.లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.