ధాన్యం కేంద్రాలను సివిల్ సప్లై అధికారులు పరిశీలించారు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సివిల్ సప్లై అధికారులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

గాంధీనగర్, బుద్ధారం, ఘన్‌పూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్ డీఎం, సీఎస్‌సీ రాములు, యూడీఆర్‌ఐ అధికారులతో కలిసి. పరిశీలించారు
ఈ సందర్భంగా పౌర సరఫరాల అధికారి ఇన్‌చార్జీలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎఫ్‌ఏక్యూ (FAQ) ప్రమాణాల మేరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే సంబంధిత బియ్యపు మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని, కేంద్రాలలో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియలను పర్యవేక్షిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పూర్తిస్థాయిలో బాధ్యతతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో
ఆర్ ఐ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం.

బుద్ధారంలో గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ ప్రారంభం

గణపురం నేటి ధాత్రి 

గణపురం మండలం బుద్దారం గ్రామం లో భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భాగ్యలక్ష్మి గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ పీపీసీ సెంటర్ ను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగపెల్లి భాస్కర్ వివో అధ్యక్షులు బిక్కినేని రజిత కలసి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ డీపీఎం నారాయణ సీసీ బాబా సభ్యులు బియ్యాల కవిత.. అల్లెపు మంజుల. మల్లెవెని పుష్పలిల. వివో ఏ పద్మ.విజేందర్. రైతులు  హాజరైనారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version