కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు.

కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి నివాళులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోత్వాల్ రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సేవకులు , విద్యాదాత, మతసామరస్యం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని ప్రతి మనిషికి చదువు తప్పక అవసరమని పేద విద్యార్థుల కోసం ఎన్నో బడులకు, కళాశాలలకు, వసతిగృహాలకు, డబ్బులు దానం చేసిన గొప్పదాత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో రెడ్డి పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా రెడ్డి హాస్టల్ ని నెలకొల్పిన వ్యక్తి బహదూర్ వెంకట రామిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగు మామిడి కృష్ణారెడ్డి ఎడుమల,హనుమంత రెడ్డి,వేసి రెడ్డి రామిరెడ్డి, కుంబాల మల్లారెడ్డి,కంది భాస్కర్ రెడ్డి, మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version