ఆర్ట్స్ కళాశాలలో 15, 16 తేదీలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్…

ఆర్ట్స్ కళాశాలలో 15, 16 తేదీలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్.
సుబేదారి, నేటి దాత్రి

 

 

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం ,బీఎస్సీ, బి ఎ (ఆనర్స్) మొదటి సంవత్సరంలో అడ్మిషన్ కోసం ఈనె 15 ,16 తేదీలలో స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడుతుందని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ కు వచ్చే విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి) టెన్త్ మేమో, ఇంటర్మీడియట్ మేమో, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఏడవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీని కూడా వెంట తీసుకొని రావాలని, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు వెనువెంటనే సంబంధిత కోర్సు ఫీజును చెల్లించాలన్నారు. స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందిన విద్యార్థుల కు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబడుతుందన్నారు.

యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.

యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమకృత కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది.రాబోయే అంతర్జాతీయ జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థిని, విద్యార్థులు, యువకులు,వృద్ధులు,జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశి ప్రభ, సహాయ నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత,రాజన్న సిరిసిల్ల జిల్లా డి.పి.ఎం తిరుపతి యోగ శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల.

జహీరాబాద్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను WWW. bsetelangana. cgg. gov. in సెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ మూడవ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ ర్యాంకులు,గ్రేడ్లు ప్రాముఖ్యత కాకుండా ఆవరేజ్ విద్యార్థులను తీసుకొని అందరినీ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రతి సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నారు.భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులు కావడానికి వారే స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలని అనేక రంగాలలో ప్రవేశించడానికి( ఐటిఐ, పాలిటెక్నిక్,డిప్లమా కోర్సులు, ఇంటర్మీడియట్) తదితర కోర్సులలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,ఎవరిని బలవంతం పెట్టకుండా భవిష్యత్తులో మంచి మార్గం ఎన్నుకోవడానికి విద్యార్థులను కృషి చేయాలని కోరారు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .

అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version