తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు…

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

మంజూరు పట్ల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం.

హెచ్ టి సర్వీసుల మంజూరు పట్ల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం.

వరంగల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

 

విని5యోగదారుల హెచ్ టి. 11 కెవి , 33 కెవి ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టామని వరంగల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ టి. 11 కెవి,33 కెవి, ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా 11 కెవి వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏ.డి. ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని,అలాగే 33 కెవి వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి. ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు.ఈ సింగిల్ విండో కొత్త విధానం వలన మొదట వినియోగదారులు టీజీఎంపీటీసీఎల్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో హెచ్డి దరఖాస్తులు(టీ.జీ ఐపాస్ లో నమోదు కానటువంటివి)నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (యుఐడి) ఉత్పన్నమవుతుందని అలా వచ్చిన కొత్త దరఖాస్తులు టీజీఎంపీటీసీఎల్ యొక్క సంబంధిత సర్కిల్‌లలో డాష్ బోర్డులో కనిపిస్తుందన్నారు. ప్రతిరోజూ ఏడిఈ/కమర్షియల్‌లు అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తుంటారని పేర్కొన్నారు.దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11కెవి,33 కెవి ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని ఎడిఈ/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారని చెప్పారు.33 కెవి, ఆపై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారని
ఇక 33 కే.వి ఆ పై వోల్టేజి దరఖాస్తులు ఐతే,ఆన్‌లైన్‌లో సంబంధిత సిఈ/కమర్షియల్ మరియు ఆర్ఎసి/టీజీ డిఆర్ఏఎన్ఎస్ సీఈవో కు ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుందని తెలియజేశారు.
11కెవి వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్‌లోడ్ చేయబడుతుందని వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు రిమార్క్‌లు వినియోగదారునికి ఎస్ఎంఎస్ రూపేణా పంపబడుతుందని పేర్కొన్నారు.అలాగే 33 కెవి, ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
సింగిల్ విండో వ్యవస్థ వలన త్వరితగతిన సర్వీసులు మంజూరు అవుతాయని,ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు.దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపేణా సమాచారం పంపబడుతుందని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి వివరించారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎల్లా జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, శనిగారపు అనిల్ కుమార్, తదితరనాయకులు పాల్గొన్నారు.

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…
– పీవీ బ్రిడ్జికి రిపేరు చేయించలేని దుస్థితి ఎమ్యెల్యేది
– 16నెలలైనా ఓడేడ్‌ వంతెనకు తట్టెడు మట్టి తీయలే
– అవసరం లేని చోట రూ.300కోట్లతో బ్రిడ్జి మంజూరు
– ఐదేండ్లలో మంథని అభివృద్ది ప్రణాళిక చెప్పని మంత్రి
– ప్రజల అవసరాలను గుర్తించని మంథని ఎమ్మెల్యే
– అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

 

40ఏండ్లు నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి సమీపంలోని మానేరు బ్రిడ్జి మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఆనాడు స్వర్గీయ పీవీ నర్సింహరావు మంథని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారని అన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తండ్రి కొడుకులు ఒక్క వంతెనను తీసుకురాలేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా రెండు బ్రిడ్జిలుమంజూరు చేయించామని, ఒక్కటి ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా మరొకటి ఓడేడ్‌ వద్ద నిర్మాణంలో ఉందన్నారు. తాను అనేక మార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలేదంటే పేరుకోసం తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ కోసం రూ.300కోట్లతో అవసరం లేనిచోట బ్రిడ్జిని తీసుకువచ్చారని అన్నారు. ఆ రూ.300కోట్ల నిధులతో మంథని మండలం ఆరెంద మానేరు లేకపోతే అడవిసోమన్‌పల్లి వద్ద మరో బ్రిడ్జి నిర్మిస్తే అద్బుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మంథని ఎమ్మెల్యే మంత్రిగా అయి 16నెలలు గడుస్తున్న సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండటం విడ్డూరమని, కనీసం మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చకుండా ఇంత పెద్ద పదవిలో ఉండి ఏ ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌, జర్మనీ తరహాలో అభివృధ్ది చేస్తామని, ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు చెబుతున్నారని, మార్పు, అభివృధ్ది ఏమో కానీ ఈ బ్రిడ్జి మాత్రం రిపేరుకు నోచుకోవడం లేదన్నారు. గత 25రోజుల క్రితం మరమ్మత్తు పనులు ప్రారంభించి మధ్యలోనే అపివేయడంతో వాహనదారులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఈ బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, కనీసం ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోరా అని ఆయన అన్నారు. మంత్రి పదవి వస్తే ఎంతో అబివృద్ది జరుగుతుందని, అనేక ప్రయోజనాలు ఉంటాయనుకుంటే చీకట్లోకే నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు. సోమన్‌పల్లి బ్రిడ్జికి రిపేరు చేయకపోగా ఓడేడు బ్రిడ్జి వద్దకు వెళ్లి పనుల్లో నాణ్యతపై విచారణ చేయిస్తామని, బాధ్యులతపై చర్యలు తీసుకుంటామని మాట్లాడిన మంత్రి 16 నెలలు గడుస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ మరమ్మత్తులు పూర్తి చేయకపోగా ఓడేడుబ్రిడ్జి పనులు మొదలు పెట్టకుండా అవసరం లేనిచోట రూ.300కోట్ల నిధులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో మానేరు, గోదావరి, ఆలయాలు, అడవులు, భూములు ఉన్న ఈ నియోజకవర్గ అభివృధ్దిపై ఇప్పటి వరకు ప్రణాళిక చెప్పలేదని, ఐదేండ్లలో అభివృద్ది గురించి చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఎక్కడ ఏం అవసరం ఉంటుందనే విషయంపై మంత్రికి అవగాహణ లేదని అర్థం అవుతోందని, కేవలం ప్రజలను గొర్రెల్లా ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, నోట్ల కట్టలతో ఓట్లు వేయించుకోవచ్చనే ఆలోచన ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి మరమ్మత్తు పనులను పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version