మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ.

మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ…

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మన ఆలోచన మన సాధన సమితి జెండా ఆవిష్కరణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబాపూ పూలే ఆలోచన విధానం తో బిసి లు అందరూ ఐక్యవేదిక కిందికి రావాలని బీసీ బంధువుల సమక్షంలో సిరిసిల్ల జిల్లా శాఖ గాంధీ చౌక్ లోను మాస్ కన్వీనర్ వెంగల లక్ష్మణ్ జెండా ఆవిష్కరించారు.పాత బస్టాండ్ నేతన్న సాక్షిగా కన్వీనర్ డాక్టర్ జనపాల శంకరయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దొంత ఆనందం గారు ,రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటి యాదవ్ ,పాల్గొని విద్యార్థుల విద్యా ఉద్యోగాల అవకాశాలలో బీసీలకు కేటాయించిన సీట్లు తారుమారు కాకుండా ఉండాలంటే బీసీలు ప్రశ్నించే తత్వం డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ ఎంతోమంది బీసీ జనాభా ఉన్న అనైక్యత కారణంగానే ప్రశ్నించే తత్వం లోపించడం వల్లే ఎవరికో వంత పాడుతూ తిరగడం వల్లే బీసీల అనైక్యత చోటుచేసుకుందని ఈ కట్లను వదిలించుకొని ఐక్యంగా ముందుకు సాగితే అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగుతుందని వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యమైతే మనదే రాజ్యాంగ మై మన ఆత్మగౌరవాన్ని కాపాడు కుంటా మన్నారు అందుకు ఒక గేయాన్ని కోశాధికారి దొంత దేవదాస్ అందరూ పిలువ గానే తమ పనులను వదులుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు ఏనుగుల ఎల్లయ్య మాట్లాడుతూ అందరిని ఏకమైతే అధికారం సొంతమవుతుందన్నారు. కోడం నారాయణ బీసీ లందరూ సమైక్యత సాధిస్తే సాధికారం అందుతుందన్నారు. వెంగళ శ్రీనివాస్
గజ్జల్లి రామచంద్రం, ముత్తయ్య గౌడ్, కైరం కొండ నర్సింగ్ గంగపుత్ర రాష్ట్ర కార్యదర్శి,బూర దేవానందం, తడుక శ్రీహరి, దుంపటి కిషన్, మిరియాలు లక్ష్మణరావు,బాల రామస్వామి, మిరియాలుకార్,మేన రాములు, లైసెట్టి వెంకటేశం వడ్లకొండ తిరుపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేటీఆర్ కి మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు.

కేటీఆర్ కి మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కి మద్దతుగా జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవకతవకల ప్రచారంపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ ఫార్ములా ఈ రేసుపై తిరిగి విచారణ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌.

స‌రిపోయారు ఇద్ద‌రు.. సురేఖా, సుప్రీత‌ డ‌బుల్ డోస్‌

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి, అమె ముద్దుల త‌న‌య సుప్రీత మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు.

 

 

 

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ సురేఖా వాణి (Surekha Vani), అమె ముద్దుల త‌న‌య సుప్రీత (Supritha) మ‌రోమారు సోష‌ల్‌ మీడియా దుమ్ము దులిపేస్తున్నారు. రీసెంట్‌గా.. ఇద్ద‌రు క‌లిసి వెకేష‌న్ వెళ్లిన వారు అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతూ, ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలో త‌మ డ్రెస్సింగ్ స్టైల్‌లో హాట్ నెస్ పెంచి వీక్ష‌కుల‌కు అదిరే ట్రీట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు త‌మ ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో చూసిన వారంతా వారి గ్లామ‌ర్‌కు ఫిదా అవుతున్నారు.

 

ఈ దృశ్యాలు తిల‌కించిన‌ ఫాలోవ‌ర్లంతా స‌రిపోయారు ఇద్ద‌రు.. సాగుతుంది మీక‌లాగా అంటూ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలోని బామ డైలాగును వీరిద్ద‌రికి అన్వ‌యిస్తూ కామెంట్లు చేస్తునే ఒక‌టికి రెండు మార్లు ఆ చిత్రాలు చూసేస్తున్నారు.

 

ప్ర‌స్తుతం వీరి వీడియో, ఫొటోలు సామ‌జిక మాధ్య‌మాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వ‌య‌స్సుకు సంధం లేకుండా చాలా మంది వారి ఫొటోల‌కు లైక్‌లు కొడుతూ మీరిలాగే క‌ల‌కాలం హ్యాపీగా ఉండాల‌ని కోరుకుంటున్నారు.

 

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు.

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు…

రైతు కుటుంబంపై విచక్షణరహితంగా భౌతిక దాడులు..

మహిళా రైతుపై భౌతిక దాడి చేస్తే చర్యలు ఉండవా..?

మహిళల రక్షణ పట్ల కొత్త చట్టాలు తెస్తున్న ప్రభుత్వం… తుంగలో తొక్కుతున్న అధికారులు..

పలుమార్లు కేసులు పెట్టిన బాధితులు… దాడికి పాల్పడ్డ వారికి అండగా పోలీసులు..?

కోర్టు ఆదేశాలను ధిక్కరించి… నిర్లక్ష్యపు ధోరణిలో పోలీసులు..?

భూమి కొనుగోలుకు సాక్షులు వీరే.. ప్రస్తుతం దాడులు చేసేది వీరే..

ప్రాణాలు తీసిన దిక్కులేని స్థితిలో బాధిత రైతు కుటుంబం..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్, భూమి అగ్రిమెంటు ప్రకారం న్యాయం చేయాలని బాధిత రైతు కుటుంబం ఆవేదన..

ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు.. సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎస్సై రాజేష్ రెడ్డి..

నర్సంపేట నేటిధాత్రి:

తన వ్యవసాయ భూమిని మరో వ్యక్తికి అమ్ముకొని కౌలుదారు అవతారమెత్తిన ఒక వ్యక్తి పక్కనే ఉన్న ఒక రైతు కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నాడు.తన సొంత భూమి ఉన్నప్పుడు పక్కనే ఉన్న రైతుతో సన్నిహితంగా ఉంటూ పక్కలో ఇప్పుడు బల్లెంల మారాడు.తనకున్న వ్యవసాయ భూమిని మరొక వ్యక్తికి అమ్ముకొని అదే భూమిని కౌలుకు చేస్తూ పక్కనే అన్న రైతు కుటుంబంపై భౌతికదాడులకు తెగబడుతున్నాడు. కౌలుదారు కొనుగోలు చేసిన వ్యక్తి ఆయనను పక్కనే అన్న రైతు కుటుంబంపై ఒసిగొలుపుతూ అంటిఅంటకుండా వ్యవహరిస్తున్నాడు.నిత్యం కౌలుడారుడు చేసే దౌర్జన్యాలు,భౌతిక దాడుల పట్ల పోలీస్ స్టేషన్ వెళ్తే పట్టించుకోవడం మాట దేవుడెరుగు గాని బాధిత రైతు కుటుంబాన్ని బైండోవర్ చేసి ముప్పుతిప్పలు పెడుతున్న పరిస్థితి నెలకొన్నది.కోర్టు ఉత్తర్వులు తెచ్చిన కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.ఈ వ్యవహారం మొత్తం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరుగుతున్నది.

పూర్తి వివరాల్లోకి వెళ్ళితే…. చెన్నారావుపేట ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబ సభ్యులు సామల శాంత సాంబయ్య దంపతులు అదే గ్రామం నుండి ముదిగొండ వైపు వెళ్లే కంకర రోడ్డుకు సుమారు 3 ఎకరాల వ్యవసాయ భూమిని గత రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.రోడ్డుకు ఉన్న వీరి భూమి కింది మొదటి బాగాన చీమల కర్ణాకర్ సంబంధించిన ఎకరం వ్యవసాయ భూమి ఉన్నది.అలాగే కర్ణాకర్ కింద భాగాన కావటి ముత్యాలు అనే రైతు ఎకరం భూమి ఉన్నది.ఈ ముగ్గురు రైతులు సాంబయ్య,కర్ణాకర్,ముత్యాలు వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కోసం పొత్తుల భావి సాంబయ్య,కర్ణాకర్ ల భూముల్లో ఉన్నది. ఐతే కావటి ముత్యాలు తన ఇంటి అవసరాల నిమిత్తం ఆ ఎకరం అమ్మకానికి నిర్ణయించుకున్నాడు.ముందుగా చీమల కర్ణాకర్ అనే రైతును భూమి అమ్మకం పట్ల తెలుపగా నేను కొనుగోలు చేయనని తేల్చి చెప్పేశారు.అనంతరం సామల శాంత సాంబయ్య రైతును అమ్మకం పట్ల అడుగగా వారు కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారు.గ్రామ పెద్దల సమక్షంలో ఎకరాకు రూ.7 లక్షల 60 వేలకు మాట్లాడుకొని బయాన ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు.మరల కొద్ది రోజుల తర్వాత చీమల కర్ణాకర్ ఆ భూమిని నేను కూడా తీసుకుంటామని పెద్దనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు.అనంతరం ముత్యాలుకు సంబంధించిన సర్వే నంబర్ 399 గల ఎకరం భూమి సామల శాంత సాంబయ్య,చీమల కర్ణాకర్ అదే రేటు ప్రకారంగా ఒక్కొక్కరు 20 గంటల చొప్పున కొనుగోలు చేసుకున్నారు.ఐతే ఇద్దరి భూమి సమాన ఓకె విధంగా ఉండేందుకు గాను కర్ణాకర్ కు సంబంధించిన 20 గంటల భూమిని సామల సాంబయ్యకు కేటాయించిన కర్ణాకర్.. ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల 2018 లో కొనుగోలు చేసిన ఎకరం భూమిని తనే తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు.ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో డాక్యుమెంట్ ప్రకారం సర్వే నంబర్ 399 తో చేర్చి వారి ఒప్పందంలో భాగంగా కర్ణాకర్ కు గల 20 గంటల భూమిని సాంబయ్యకు మారుస్తూ తూర్పున భూమి కొనుగోలు చేసిన సాంబయ్య భూమి ,ఉత్తరము రెడ్డబోయిన సాయిలు,పడమర చీమల కర్ణాకర్,దక్షణం వైపు వాగు ఉన్నట్లుగా హద్దులు నిర్ణయిస్తూ భూమిని సాంబయ్యకు రిజిస్ట్రేషన్ చేస్తూ కర్ణాకర్ సాక్షిగా ఉన్నారు.మొత్తం భూమిని వారివారి ఒప్పందాల ప్రకారం కావటి ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమిని కర్ణాకర్ తన భూమితో కలిపి 1 ఎకరం 20 గంటల భూమిని సాగుచేసుకుంటున్నాడు.అలాగే సామల సాంబయ్య తన 3 ఎకరాల భూమితో పాటు అగ్రిమెంట్ కర్ణాకర్ తో కుదుర్చుకున్న 20 గంటల భూమితో కలిసి గత ఏడేండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.అలాగే వాటాల ప్రకారంగా వ్యవసాయ బావిని వాడుకుంటున్నారు.గత సంవత్సరం నర క్రితం చీమల కర్ణాకర్ తన ఎకరం 20 గంటల భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మకం చేశారు.పక్కనే ఉన్న లావన్ పట్టా భూమి గల వాగును దారి కోసం తన అధీనంలోకి తీసుకుందామని విక్రయదారులు కర్ణాకర్ తో ప్లాన్ చేయగా అది కాస్త బెడిసికొట్టింది.పైన రోడ్డు బాగం నుండి ఉన్న రైతు సామల శాంత సాంబయ్యను అడుగగా వారు ఒప్పుకోలేదు.ఎలాగైనా సాంబయ్య భూమి నుండి తన భూమిలోకి దారి తీసుకోవాలని కర్ణాకర్ ను నగేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.ఐతే అదే భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అమ్మకం చేసిన కర్ణాకర్ కు కౌలుకు ఇచ్చాడు.దీంతో సాంబయ్య భూమిలో నుండి ఎలాగైనా దారి పొందాలని భావించిన క్రయ విక్రయ దారులు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో భూమిని విక్రయించిన చీమల కర్ణాకర్.

అదే భూమికి కౌలుదారుగా అవతారమెత్తాడు.గత ఏడు సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న సాంబయ్య కుటుంబంపై దాడులకు పాల్పడటం మొదలుపెట్టారు.మీరు సాగుచేసుకుంటున్న 20 గంటల భూమి మాదే అంటూ 2024 జనవరి నెలలో సామల శాంత సాంబయ్య దంపతులపై దాడి చేసి వ్యవసాయ బావికి సంబంధించిన మోటార్,స్టార్టర్ లను చీమల కర్ణాకర్,అతని సోదరుడు సతీష్ లు ధ్వంసం చేశారు.వెంటనే బాధితులు స్థానిక చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.కొద్ది రోజులకే మొక్కజొన్న పంటపై కర్ణాకర్,సతీష్ లు గడ్డిమందు ప్రయోగం చేశారు.మరల బాధితులు శాంత సాంబయ్య దంపతులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.మరుసటి రోజున అదే మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో ఫాల్టర్ కొట్టించి దున్నించి నాపై కర్ణాకర్,సతీష్ లు మహిళా అనే ఇంగీతజ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితురాలు సామల శాంత ఆరోపించారు.ఐనప్పటికీ పోలీస్ స్టేషన్ చేసిన పిర్యాదు మేరకు ఎస్సై,సీఐలు వ్యవసాయ భూమివద్ద విచారణ చేపట్టగా సాక్షులు కూడా తమదే న్యాయం అని పోలీస్ అధికారులకు తెలిపారని వాపోయారు.తీవ్రంగా గాయాలపాలైన మమ్మల్ని ఆస్పత్రికి వెళ్ళనివ్వకుండా మా దాడికి పాల్పడ్డ వారికి సహకరిస్తూ మండల రెవెన్యూ అధికారి వద్ద బైండోవర్ చేయించారని బాధిత రైతు కుటుంబం సభ్యులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.పెద్ద మనుషుల ఒప్పందం,భూమి అగ్రిమెంట్,రిజిస్ట్రేషన్ లో హద్దుల ప్రకారంగా తమకే భూమి చెందుతుందని కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని భూమి సాగుచేసుకుంటున్న క్రమంలో సతీష్ , కర్ణాకర్ లు నానా దుర్భాషలాడుతూ, వెంట్రుకలు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారని మహిళా రైతు సామల శాంత రోదిస్తూ తెలిపారు.ఈ నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మా కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని బాధితులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.భూమితో వారికి ఎలాంటి సంబంధం లేకున్నా కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నగేష్ సహకారంతో నిత్యం భయాందోళనల కల్పిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.మా కుటుంబంపై దాడి చేసిన చీమల సతీష్ ,కర్ణాకర్ లపై పిర్యాదులు చేస్తే భూమి కొనుగోలు చేసిన నగేష్ తో సెటిల్ చేసుకోండని ఎస్సై రాజేష్ రెడ్డి తెలుపుతున్నారని బాధిత రైతు కుటుంబం శాంత సాంబయ్యలు ఆరోపించారు.ఎన్నిసార్లు పిర్యాదు చేసిన కానీ సతీష్ , కర్ణాకర్ లకు అండగా ఉంటూ మా ఫిర్యాదుల పట్ల

తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి మాపై నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.మా కుటుంబంపై జరుగుతున్న సంఘటనల పట్ల పోలీస్ కమిషనర్,నరంపేట ఏసిపిలకు పిర్యాదులు చేయనున్నట్లు బాధిత రైతు కుటుంబం సామల శాంత సాంబయ్యలు తెలిపారు.

ఇరువురి ఫిర్యాదులతో కేసులు చేసిన..సివిల్ కేసుల పట్ల నాకు సంబంధం లేదు… చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి..

చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సామల శాంత సాంబయ్య అనే రైతులు,అదే గ్రామానికి చెందిన చీమల కర్ణాకర్,సతీష్ అలాగే నగేష్ అనే వ్యక్తుల మధ్య భూ తగాదాల గొడవలు జరుగుతున్నాయి.ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినం అని ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.భూ తగాదాలు సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదని నేటిధాత్రి ప్రతినిధి అడిగిన వివరణకు ఎస్సై రాజేష్ రెడ్డి సమాధానం చెప్పారు.

కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం.

కూతురి ప్రేమతో తల్లి కి సత్కారం

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

 

భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో పితృదినోత్సవం సందర్భంగా  నాన్నకు ప్రేమతో. కవితా సంకలనం పుస్తకం లో నాన్న గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ (ఉషోదయ భానుడు నాన్న)అనే అంశంపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవయిత్రి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి కవితా గానం చేసినందుకు గాను సభఅధ్యక్షులు, నాన్నకు ప్రేమతో కవితా సంపుటి సంపాదకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ముఖ్య అతిథి ఎన్వీ రఘువీర్ ప్రతాప్, విశిష్ట అతిథులు కృషిరత్న బుస్స శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు నరహరి లక్ష్మారెడ్డి, సమీక్షకులు
కూర చిదంబరం, ఆధ్యాత్మికవేత్త బొమ్మకంటి కిషన్,తెలుగు సాహితీవేత్త ,విమర్శకులు
డాక్టర్ మోతుకుల నారాయణ గౌడ్ చేతుల మీదుగా ప్రముఖ తెలుగుసాహితీవేత్త,
కవి,రచయిత్రి శ్రీమతి తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (ఝాన్సీ) ఆమె తల్లి శ్రీమతి తాళ్లపల్లి బాలవ్వలను ఆత్మీయతతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవయిత్రి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు

◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి చేరుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ కావాల‌నే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించి విచార‌ణ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మ‌ళ్లీ కేటీఆర్‌ గారికి ACB నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్,మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్,జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్,మాజీ సర్పంచ్ లు బస్వరజ్,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్,అశోక్ పాటిల్,రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మాజి ఎంపీటీసీ రజినీ సంతోష్ మల్లిపాటెల్ గార్ల ఆహ్వానం మేరకు కక్కర్వాడ గ్రామంలో నిర్వహించిన నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ ,పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా,మాజి సర్పంచ్ భోజి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్.

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్…

శివ సినిమాను అతి త్వ‌ర‌లో 4కేలో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అక్కినేని నాగార్జున.

రామ్‌పాల్ వ‌ర్మ (RGV) , నాగార్జున (Akkineni Nagarjuna) కాంబోలో వ‌చ్చి టాలీవుడ్‌ క‌ల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం శివ (Siva). ఈ యేటితో 35సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే చాలాసార్లురీ రిలీజ్ అవుతూ వ‌చ్చిన ఈ సినిమాను 4కే ఫార్మాట్‌లో అతి త్వ‌ర‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కింగ్ నాగార్జున ఆదివారం స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న‌, ధ‌నుష్ కీల‌క పాత్ర‌ల్లో రూపొందిన కుబేర ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో ఫ్యాన్స్ అదే ప‌నిగా శివ శివ గోల చేస్తుండ‌డంతో అతి త్వ‌ర‌లో శివ సినిమా 4కేను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. అయితే ఈ సారి ఇంకా బెట‌ర్ క్వాలిటీతో సినిమాను తీర్చిదిద్ది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు నెలాఖ‌రున గానీ సెప్టెంబ‌ర్‌లో గానీ ఈ శివ (Shiva4K) సినిమా ప్రేక్ష‌కుల‌కు ముందు మ‌రోసారి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రీ రిలీజ్‌ అయిన ప్ర‌తీసారి ఆడియెన్స్ నీరాజ‌నాలు అందుకున్న ఈ చిత్రం ఈ సారి ఏమేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిధిలో గల ఝరాసంగం రోడ్డు పై జర్నలిస్ట్ కాలనీ సమీపంలో రాకపొకలు సాగించే చిన్న మధ్య తరహా వాహనాలను ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూ రెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్ పట్ల పోలీసు సిబ్బంది వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:.

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు షైక్ రబ్బాని యొక్క తమ్ముడు షైక్ సులేమన్ తనయుని కూతురు అజ్వ యొక్క జన్మదిన సంధర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. షేక్ రబ్బాని మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ షఫీ ఉద్దీన్ షేక్ సజ్జహోద్దీన్ బంధుమిత్రులు కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 

యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. వాళ్లు నోరెత్తకుండా చేశాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా ఏ-ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు ఔట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ నాక్‌తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు.

 

నోళ్లు మూయించాడు..

ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మూయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే గాక బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.. ఇలాంటోడ్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు.

అగార్కర్ ముందే..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యాడు. అగార్కర్ ముందే బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతడ్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌కు మీడియా, అభిమానులను అనుమతించలేదు.

సఫారీలు సాధించారు.

సఫారీలు సాధించారు

 

రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన…

ఫైనల్లో ఆసీ్‌సపై ఘనవిజయం

27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ సొంతం

 

 

 

 

 

ప్రైజ్‌మనీ

దక్షిణాఫ్రికాకు – రూ. 31.05 కోట్లు

ఆస్ట్రేలియాకు – రూ. 18.63 కోట్లు

 

ఏళ్లు కాదు.. దశాబ్దాలపాటు ఎదురుచూసిన తరుణమిది. తమ శక్తి యుక్తులన్నీ ధారపోసి పోరాడినా ఐసీసీ టోర్నీల్లో నిరాశగా వెనుదిరగడమే చూసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు సగర్వంగా ‘గద’ ఎత్తుకుంది. ఒత్తిడికి చిత్తయ్యే జట్టంటూ.. చోకర్స్‌గా ముద్ర వేసి క్రీడాలోకం పరిహసించినా.. క్రికెట్‌ పుట్టినిల్లుగా భావించే లార్డ్స్‌లోనే ‘ఇదిగో ఇదీ మా సత్తా’ అంటూ వరల్డ్‌ టెస్టు చాంపియన్స్‌ హోదాలో పోడియంపై నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఆసీస్‌ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడిన బ్యాటర్లు లక్ష్య ఛేదనలో మాత్రం తెగించి నిలబడ్డారు. శతక వీరుడు మార్‌క్రమ్‌తో పాటు చీలమండ గాయం ఇబ్బందిపెట్టినా గెలుపు కోసం కెప్టెన్‌ బవుమా క్రీజులో నిలిచిన తీరుకు వహ్వా.. అనాల్సిందే. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీల్లో సఫారీలు విజేతలయ్యారు

 

లండన్‌: రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన బవుమా సేన ఐసీసీ టెస్టు గదను సగర్వంగా అందుకుంది. అలాగే ఈ జట్టుకిది వరుసగా ఎనిమిదో టెస్టు విజయం కాగా.. 1998లో నాకౌట్‌ ట్రోఫీ తర్వాత రెండో ఐసీసీ టోర్నీ విజయం కావడం విశేషం. అటు ఇప్పటికే పది ఐసీసీ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న ఆసీస్‌ రెండోసారి డబ్ల్యూటీసీ టైటిల్‌పై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. 2010 (టీ20 వరల్డ్‌కప్‌) తర్వాత కంగారూలు ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓడడం ఇదే తొలిసారి. నాలుగో రోజు కేవలం విజయానికి 69 పరుగుల దూరంలో నిలిచిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌లో 282/5 స్కోరు సాధించారు. మార్‌క్రమ్‌ (136), బవుమా (66) గెలుపులో కీలక పాత్ర పోషించారు. స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 212, సౌతాఫ్రికా 138 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు సాధించిన ఆసీస్‌ ప్రత్యర్థి ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మార్‌క్రమ్‌ నిలిచాడు.

 

 

తొలి సెషన్‌లోనే..: నాలుగో రోజు 213/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌతాఫ్రికా గెలుపునకు మరో 69 పరుగులే చేయాల్సివుంది. ఆసీస్‌ బౌలర్లు సఫారీలపై ఒత్తిడి పెంచేందుకు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరారు. వికెట్ల కోసం ఆసీస్‌ తమకున్న మూడు రివ్యూలను కూడా వాడేసుకుంది. కొత్త బంతిని సైతం తీసుకున్నా.. మొక్కవోని ఏకాగ్రతతో బ్యాటర్లు క్రీజులో నిలిచారు. తొలి సెషన్‌లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే వచ్చాయి. అయితే మూడో ఓవర్‌లోనే కెప్టెన్‌ బవుమాను కమిన్స్‌ దెబ్బతీయడంతో మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ మార్‌క్రమ్‌ వారికి అడ్డుగా నిలిచాడు. స్టబ్స్‌ (8)తో కలిసి నాలుగో వికెట్‌కు 24.. బెడింగమ్‌ (21 నాటౌట్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. గెలుపునకు మరో 6 పరుగుల దూరంలో అతడి 6 గంటల 23 నిమిషాల సుదీర్ఘ పోరాటానికి పేసర్‌ హాజెల్‌వుడ్‌ తెరదించాడు. మార్‌క్రమ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటులార్డ్స్‌ ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. చివరకు 84వ ఓవర్‌లో స్టార్క్‌ వైడ్‌ ఫుల్‌టా్‌సను కవర్‌ పాయింట్‌ వైపు వెరెయిన్‌ (4 నాటౌట్‌) సింగిల్‌ తీయడంతో దక్షిణాఫ్రికా అంతులేని సంబరాల్లో మునిగింది.

 

 

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు…

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.

ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు.

ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు..

 

పర్సు లాక్కోవడంతో చూస్తుండగానే..

 

 

 

 

ఓ మహిళ ఓ భవనంలో నుంచి బయటికి వెళ్తుంటుంది. అయితే ప్రధాన ద్వారం వద్ద కొంత మంది యువకులు అడ్డుగా నిలబడి ఉంటారు. ఆ యువతి దగ్గరికి రాగానే.. ఆమె చేతిలోని పర్సు లాక్కుని దూరంగా పడేశారు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే..

ఒంటరి మహిళలపై నిత్యం అనేక రకాలుగా దాడులు జరగడం చూస్తున్నాం. శారీరకంగా కొందరు, మానసికంగా మరికొందరు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంకొందరు వారి పర్సులు, మెడలోని గొలుసులు లాక్కుని పారిపోవడం చూస్తున్నాం. దీంతో ఆత్మ రక్షణకు సంబంధించిన శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అయింది. ఇలాంటి శిక్షణ తీసుకోవడం వల్ల మహిళలు తమని తాము రక్షించుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి శిక్షణ ఎంత ఉపయోగపడుతుందో తెలిపేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఓ భవనంలో నుంచి బయటికి వెళ్తుంటుంది. అయితే ప్రధాన ద్వారం వద్ద కొంత మంది యువకులు అడ్డుగా నిలబడి ఉంటారు. ఆ యువతి దగ్గరికి రాగానే.. ఆమె చేతిలోని పర్సు లాక్కుని దూరంగా పడేశారు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఆమె.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది.

అక్కడున్న యువకులందరినీ (Woman Beat Up The Thieves) తన పవర్‌ఫుల్ పంచ్‌లతో కుమ్మేస్తుంది. దెబ్బకు వారంతా కిందపడిపోయి.. నొప్పితో కుయ్యో.. ముర్రో అనుకుంటూ పడిపోతారు. చివరకు దూరంగా పడిపోయిన పర్సును తిరిగి తెచ్చి ఆమెకు ఇచ్చేస్తారు. వెళ్తూ వెళ్తూ పర్సు ఇచ్చిన వ్యక్తికి కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తుంది. ఇలా వారందరికీ తన పంచ్ దెబ్బ రుచి చూపించి తనని తాను రక్షించుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది.

ఇదంతా అవగాహన కల్పించడానికి చేశారో.. రియల్‌గా జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొత్తానికి అందరికీ చుక్కలు చూపించిందిగా’.. అంటూ కొందరు, ‘అమ్మాయిలంతా ఇలా మారితే ఎంతో బాగుంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9,700కి పైగా లైక్‌లు, 7.14 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

అలరించే వంతెన.

అలరించే వంతెన…

 

కనుచూపుమేర పచ్చందనం… అక్కడే రెండు సుందరమైన కొండలు… వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం… దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన…

భారీ, విభిన్న నిర్మాణాలతో తరుచూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ‘రుయి’ బ్రిడ్జ్‌. దీనిని మూడేళ్ల పాటు నిర్మించి, 2020లో వంతెనపైకి పర్యాటకులను అనుమతించారు. చైనీస్‌ రుయి (అదృష్టానికి ప్రతీక) చిహ్నం ప్రేరణతో దీనిని నిర్మించారు. ఇది భూమి నుంచి 140 మీటర్లు(460 అడుగులు) ఎత్తులో ఉంటుంది. దీని పొడవు 100 మీటర్లు(330 అడుగులు). ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల మంది సందర్శించడం విశేషం. స్థానికులు ఈ వంతెనను ‘బెండింగ్‌ బ్రిడ్జ్‌’ అని పిలుస్తారు.

మెట్లూ ఉన్నాయి…

కళ్లు చెదిరే ఈ బ్రిడ్జ్‌ చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఇదొక గాజు వంతెన. వంతెన నిర్మాణాల్లో విశేష అనుభవమున్న హీయున్‌చాంగ్‌ అనే ఇంజనీర్‌ దీనికి రూపకల్పన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే వంతెనను ఓచోట మూడు దారులుగా విభజించారు. ఇంకోచోట కలిపినట్లుగా ఉంటుంది. దీనిపై సులువుగా నడవటానికి మెట్లు కూడా ఉన్నాయి. సందర్శకులు వంతెనపై నడుస్తున్నంతసేపూ గాల్లో తేలుతున్నట్లు, మేఘాలు హాయ్‌ చెప్పుతున్నట్లు అనుభూతి చెందుతారట.

 

బండి కుమారస్వామి బాధితుడు మృతి.

బండి కుమారస్వామి బాధితుడు మృతి

బయటకు వస్తున్న బండి బాధితులు.

నేటిధాత్రి, వరంగల్

 

 

మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ కు పెరుగుతున్న బండి బాధితుల సంఖ్య..

నాలుగు రోజుల క్రితం జరిగిన పెట్రోల్ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మృతి.

బండి మీద పీడీ యాక్ట్ నమోదు చేయండి. దళిత సంఘాల డిమాండ్..

మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ లో పెరుగుతున్న పిర్యాదుల సంఖ్య.

గతంలో ఏకంగా బండి కుమారస్వామి పేరిట బాధితుల సంఘం ఏర్పాటు..

ఒకే వ్యక్తిపై మిల్స్ కాలని పోలీసు స్టేషన్ లో 30 కి పైగా కేసులు?

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి “బండి” పయనం..

 

Bandi Kumaraswamy

 

భూ కబ్జాదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..

న్యాయం చేయాలి

భూ కబ్జాదారుల( బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజీ యాజమాన్యం) ఆగడాలకు బలైపోయిన నిరుపేద దళితుడు పోలేపాక కుమారస్వామి వారి కుటుంబానికి న్యాయం చేయాలి.

మాదాసి సురేష్
ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ హనుమకొండ!

ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు.

ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు

కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.

ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ భూపాలపల్లి పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించారు.

ముందుగా మహాసభ ప్రాంగణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం సుభాష్ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ అద్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం ఎంతోమందిని పాశవికంగా హత్య చేస్తున్నదని అన్నారు.

కార్పొరేట్ శక్తులకు దేశంలోని సహజ వనరులను కట్టబెట్టేందుకు, అడవులను వారికి అప్పగించేందుకు మావోయిస్టులను లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఒకవైపున మావోయిస్టులు తాము చర్చలకు సిద్దం అని ప్రకటించినా, లొంగిపోతున్నా వారిని చంపడమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తామని చెప్పడం ఫ్యూడల్, ఫాసిజం, హంతకుల మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు..

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలకు జరపాలని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మరోవైపు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, సింగరేణి సంస్థలను ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేయడం కోసం కేంద్రం కుట్ర చేస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను వారికి దారాధత్తం చేస్తున్నదని విమర్శించారు.

కార్పొరేట్ శక్తులైన అంబానీ, ఆదానీలకు వంతపాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు.

కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయల రాయితీ కల్పించి పేదల పై మాత్రం పెనుభారాలు మోపుతున్నారని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ప్రధాని మోడీ పావుగా మారాడాని, అమెరికాలో మన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా మోడీ మాట్లాడడం లేదని అన్నారు.

గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రజలు మళ్లీ కాంగ్రెస్ అధికారం ఇచ్చారని అన్నారు.

కాలేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని, కాలేశ్వరం వల్ల ఉమ్మడి వరంగల్ భూపాలపల్లి జిల్లాలకు ఒక్క ఎకరానికి నీరు అందలేదని అన్నారు.

ఎప్పటికైనా ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని, భవిష్యత్తులో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎర్రజెండా ఎగరేద్దాం
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భూపాలపల్లి మున్సిపాలిటీ పై ఎర్రజెండాను ఎగరవేద్దామని సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.

చట్టసభలలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

నూతన కమిటీ నిర్ణయాలను అమలు చేసే దిశగా పనిచేయాలని కోరారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని మహాసభలో తీర్మానించారు.

మీరు చేయబోయే ప్రతి పోరాటం లో రాష్ట్ర, జిల్లా పార్టీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.

ఈ మహా సభల్లో సిపిఐ కౌన్సిల్ సభ్యులు గురుజపెల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, మాతంగి రామ్ చందర్, కొరిమి సుగుణ, మాజీ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ తో పాటు 250 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.

సరికొత్త అధ్యాయం.

సరికొత్త అధ్యాయం…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్న జట్టు దక్షిణాఫ్రికా.

చోకర్స్‌ (కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే జట్టు)గా ముద్ర వేసుకొన్న సఫారీలు ఇప్పుడు చాంపియన్లుగా నిలిచారు.

దిగ్గజాల వల్ల కానిది..: ఏబీ డివిల్లీర్స్‌, గ్రేమ్‌ స్మిత్‌, గ్యారీ కిర్‌స్టెన్‌, అలెన్‌ డొనాల్డ్‌, జాక్‌ కలిస్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టు కోసం ఎంతో శ్రమించారు. వీరందరి కృషితో జట్టు మెరుగుపడినా..

ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే అయింది. ఎట్టకేలకు మార్‌క్రమ్‌, బవుమా అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

ఓటములను దిగమింగుకొని నాకౌట్స్‌లో నిరాశ.. సఫారీలకు 1992 నుంచి వెంటాడుతోంది. ఆ వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో వరుణుడి రూపంలో షాక్‌ తగిలింది.

1999 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియాతో సెమీస్‌ మ్యాచ్‌ టై కావడం అనేది ఎప్పటికీ గుండెల్లో ముల్లులాంటిదే. గతేడాది జూన్‌ 29న జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. ఏడాది తిరిగే సరికి ‘జూన్‌ 14’ను సువర్ణాక్షరాలతో లఖించదగ్గ రోజుగా మార్చుకొంది.

కెరీర్‌ చివర్లో ఉన్న రబాడ.. ఫైనల్‌ మ్యాచ్‌లో కంగారూల పనిబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన మార్‌ క్రమ్‌.. భారీ శతకంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరి పోరాట స్ఫూర్తితో సౌతాఫ్రికా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

తొలినాటి కూరగాయ దొండ…

తొలినాటి కూరగాయ దొండ…

 

తొంటి అంటే తొలినాటిదని అది తొండి కాయ’గా కన్నడంలోనూ దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది.

దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

ఘృతపాకేన కరోతి రోచనమ్‌

తొంటి’ అంటే తొలినాటిదని! అది ‘తొండి కాయ’గా కన్నడంలోనూ, దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

జీర్ణకోశాన్ని శుభ్రపరచటం, తల్లి పాలు పెరిగేలా చేయటం, రక్తహీనత, జ్వరాలు, క్షయ వంటి వ్యాధుల్లో పోషకం ఇది. దీనిలోని కుకుర్బిటాసిన్‌ మధుమేహాన్ని నియంత్రిస్తుందని పరిశోధిస్తున్నారు.

లేత దొండకాయల్ని నిలువు చీలి కలుగా కోసి, ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో మరిగించి ఆ నీటిని పిండేయాలని నలుడు ‘పాక దర్పణం’లో చెప్పాడు. ఉప్పు వేసి పిసికి నీరు పిండటం కూడా చెయ్యదగిందే! ఈ జాగ్రత్త తీసుకోకుండాదొండ ముక్కల్ని నేరుగా కూర,పప్పు పచ్చడి వగైరా చేస్తే తల తిరుగుడు లాంటి సమస్యలు కలుగుతాయి.

ఇగురుకూర: ఒక చెంచాడు నేతిలో ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు జీలకర్రవగైరా తాలింపు గింజలు వేగించి, నీరుపిండిన ముక్కలి అందులో కలిపి మిరియాలపొడి వేసి మగ్గనిస్తే అదే కమ్మని దొండ ఇగురుకూర! పొయ్యి మీంచి దించాక రవ్వంతపచ్చకర్పూరం కలిపితే పరిమళ భరితంగా ఉంటుందన్నాడు నలుడు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది!

మజ్జిగ పులుసు: ‘‘బింబీఫలం సకలమేవఘృతే నిధాన…’’ దొండకాయల్ని నాలుగు పక్షాలుగా చీల్చి నీరుపిండి, కొద్దిగా నెయ్యి వేసి వేగనిచ్చి ఉప్పు, మిరియాలపొడి వేసి, కాయలు మునిగే దాకా చిక్కని మజ్జిగ పోసి ఉడికించాలి.

ఈ మజ్జిగపులుసు జాఠరాగ్నిని పెంచుతుందని క్షేమ కుతూహలం గ్రంథం పేర్కొంది.

ముద్ద కూర: లావుగా పెద్దవిగా ఉండే దొండకాయల్ని నిలువుగా మధ్యకు కోసి, ఇంగువ+ఉప్పు కలిపిన పొడిని ఒక్కో ముక్కకూబాగా పట్టించాలి.తర్వాతభాండీలో తాలింపుగింజలు వేగించిన నూనెలో వేసి నీళ్ళమూత పెట్టి ప్రలేహ విధిలో ముద్దగా అయ్యేలా మగ్గించాలి!

 

పెరుగుపచ్చడి: అంగారభర్జితం అంటేనిప్పులు లేదా మంటమీద కాల్చిన దొండకాయల్ని పైన మాడు వలిచి, నెయ్యి, ఉప్పు వేసి పిసికి పెరుగులో కలిపి ఇంగువ తాలింపు పెట్టి కొత్తిమీర వగైరాలతో అలంకరించిన పెరుగు పచ్చడి జీర్ణకోశవ్యాధులన్నింటికీ మంచిది!

ఆవ పెరుగుపచ్చడి: దొండకాయని నిలువుగా మూడుపక్షాలుగా చీల్చి, నీరు పిండి పెరుగులో వేసి ఉప్పు, నల్ల ఆవాల పిండి కలిపిన ఆవ పెరుగుపచ్చడి కృష్ణదేవరాయలు అన్నట్టు ముకుమందు… అంటే జలుబునీళ్లువదిలిస్తుంది!

దొండకాయ పప్పు: నీరుపిండేసిన ముక్కల్ని పెసరపప్పుతో, ధనియాలు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పొడిని కలిపి వండిన పప్పు పోషక విలువలు కలిగి ఉంటుంది.

దొండకాయని చింతపండుతోనూ, అల్లం వెల్లుల్లితోనూ వండే విధానాలను పాకశాస్త్ర గ్రంథాలేవీ చెప్పలేదు. కఫాన్ని తగ్గిస్తుంది. ముక్కులోంచి రక్తస్రావాన్ని తగ్గించే గుణం దీనికుంది. అందుకని, వేడి చేసే వాటితో దీన్ని కలిపి వండటాన్ని శాస్త్రం ఒప్పుకోలేదు.

దొండ కాయ ఉబ్బరాన్ని కలిగిస్తుంది! అందుకని శనగ పిండి వేసి పకోడీ కూరల్లాంటివి కూడా నిషేధం! ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధుల్ని తగ్గిస్తుంది. వాటిని పెంచే అజీర్తికర పదార్థాలతో వండకపోవటమే మంచిది.

దొండకాయలో దోషాలకు విరుగుడుగా దోసకాయ, కాకరకాయ పనిచేస్తాయి. దొండని వండినప్పుడు కాకర లేదా దోస కూడా తప్పకుండా వండుకోండి!

ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: శాండ్విచ్‌ బ్రెడ్‌లు-ఆరు, ఉల్లి ముక్కలు (పెద్దవి)- మూడు కప్పులు, బటర్‌-మూడు స్పూన్లు, గోధుమ పిండి- రెండు స్పూన్లు, బిర్యానీ ఆకు-ఒకటి, ఆపిల్‌ సెడార్‌ వెనిగర్‌-స్పూను, ఉడికించిన కూరగాయలతో నీళ్లు-మూడున్నర కప్పులు, వెల్లుల్లి ముక్కలు-అర స్పూను, మిరియాల పొడి – పావు స్పూను, చీజ్‌-ఆరు స్పూన్లు, కొత్తిమీర తరుగు-స్పూను.

 

తయారుచేసే విధానం: వెడల్పాటి పాన్‌లో కాస్త బటర్‌ వేయాలి. అది కరుగుతుంటే ఉల్లి ముక్కలను చేర్చాలి. ఉల్లి బంగారు రంగులోకి మారాక ఆపిల్‌ సెడార్‌ను వేసి, గోధుమ పిండి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి కలపాలి.

ఉప్పు, మిరియాల పొడితో పాటు కూరగాయల నీళ్లని ఇందులో పోసి, మూతపెట్టాలి. మంటని తగ్గించి, మధ్యలో కలుపుతూ 30 నిమిషాల పాటు ఉడికించాలి.

బ్రెడ్‌ చివర్లు కత్తిరించి, పెనంపై కాస్త బటర్‌ వేసి ఒక్కో ముక్కను అటూ ఇటూ దోరగా కాల్చాలి లేదా ఓవెన్‌లో టోస్ట్‌ చేయాలి. బౌల్‌లలో సూప్‌ వేసి పైన బ్రెడ్‌ ముక్కలను ఉంచాలి. పైన ఛీజ్‌ తురుమును, కొత్తిమీర తరుగును చల్లితే సరి.

తవా పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు – పదహారు, ఉల్లి, టమాటా ముక్కలు- కప్పు, క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – స్పూను, పెరుగు – పావు కప్పు, పసుపు- అర స్పూను, కారం- రెండు స్పూన్లు, జీలకర్ర పొడి – అర స్పూను, ధనియాల పొడి – అర స్పూను, గరం మసాలా – అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు – తగినంత.

తయారుచేసే విధానం: గిన్నెలో పావు కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, స్పూను కారం, పావు కప్పు గరం మసాలా, కాస్త జీలకర్ర పొడి, అర స్పూను ఉప్పు, రెండు స్పూన్ల నూనె వేసి అంతా బాగా కలపాలి.

ఇందులోనే పనీర్‌ ముక్కలనీ వేసి, బాగా కలిపి అరగంట పాటు మూత మూసి పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి జీలకర్ర చిటపటలాడించి, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ జతచేయాలి.

ఉల్లి రంగు మారగానే, మంట తగ్గించి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర చేర్చాలి. నిమిషం తరవాత టమాటా ముక్కలూ వేయాలి. కాస్త దగ్గరకి వచ్చాక క్యాప్సికం ముక్కలూ చేర్చాలి. క్యాప్సికం కరకరలాడుతుంటే నానబెట్టిన పనీర్‌ను కలపాలి.

అరకప్పు నీళ్లు, అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత మూత తీసి గరం మసాలా, మిగతా కొత్తిమీర వేసి అంతా కలిపితే తవా పనీర్‌ సిద్ధం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version