అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ..

అప్పుడే ఎంత ఎదిగావు తల్లీ

కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్‌ జంట మనస్పర్థల కారణంగా…

న్యూఢిల్లీ: కూతురు ఐరా 10వ పుట్టిన రోజును పురస్కరించుకొని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. షమి-హసీన్‌ జంట మనస్పర్థల కారణంగా 2018లో విడిపోయినప్పటినుంచి ఐరా తల్లి వద్ద ఉంటోంది. ‘నువ్వు ఇంత త్వరగా ఎదిగావంటే నమ్మలేకపోతున్నా. జీవితంలో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. భగవంతుడు నీకు ప్రేమ, ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఐరాతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నాడు.

కథ విని ఉద్వేగానికి లోనయ్యా..

కథ విని ఉద్వేగానికి లోనయ్యా

‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్‌’ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా….

‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్‌’ సినిమా స్ర్కిప్ట్‌ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. బలమైన భావోద్వేగాలతో పాటు ప్రేమ, కుటుంబ విలువలతో సినిమా ఆద్యంతం హృద్యంగా ఉంటుంది’ అని సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 18న ‘జూనియర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన సెంథిల్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కొత్త హీరోకు ఇలాంటి సినిమా చేయడం కొంచెం కష్టమే. కానీ కిరీటి ఒక సవాల్‌గా తీసుకొని ఈ సినిమా కోసం కష్టపడిన తీరు నాకు నచ్చింది. ఈ సినిమాలో పాటలతో పాటు కిరీటీ, శ్రీలీల జంట చేసిన డాన్స్‌లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. కిరీటి మంచి నటుడు, అద్భుతమైన డాన్సర్‌. సెట్స్‌లో చాలా కష్టపడ్డాడు. తొలి చిత్రం ‘జూనియర్‌’తోనే ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే గట్టి నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా అందించాలనే తపనతో నిర్మాతలు ఈ సినిమా తీశారు’ అని చెప్పారు.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్.

కొడుకు ఎంట్రీపై విష్ణు ఎమోషనల్ పోస్ట్

 

 

 

 

మోహన్ బాబు, విష్ణు, అతని పిల్లలు కలిసి నటించిన సినిమా ‘కన్నప్ప’.

 

ఆ రకంగా మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులను డైరెక్ట్ చేసే ఛాన్స్ ముఖేష్ కుమార్ సింగ్ కు లభించింది.

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో రాబోతోంది.

 

అందులో మోహన్ బాబు (Mohan babu) తో పాటు మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలను పోషించారు.

 

ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన

 

ఈ సినిమాలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానాతో పాటు కొడుకు అవ్రామ్ సైతం చిన్నప్పటి తిన్నడుగా తెర మీద మెరిశాడు.

‘కన్నప్ప’ సినిమాలో విష్ణు తిన్నడు పాత్రను పోషించాడు. గూడెంలోని మూఢాచారాల కారణంగా దేవుడంటే ఇష్టం లేని తిన్నడు…

 

చివరకు శివయ్యకు ఎలా దాసోహమయ్యాడు…

తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి ఎలా సిద్థమయ్యాడు అనేదే ‘కన్నప్ప’ చిత్రం.

ఇందులో చిన్నప్పటి తిన్నడుగా అవ్రామ్ నటించాడు.

అతని మీద కూడా కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ చిత్రీకరించాడు.

మోహన్ బాబు, విష్ణు, అతని కుమార్తెలు, కుమారుడు ఇందులో యాక్ట్ చేయడంతో మొత్తం మూడు తరాలను కవర్ చేసినట్టు అయ్యింది.

ఇదో రేర్ ఫీట్.

ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంటూనే విష్ణు…

తాజాగా అవ్రామ్ షూటింగ్ సమయంలో చేసిన చిలిపి పనులను, అతని పై చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను ఓ మేకింగ్ వీడియోగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు.

అవ్రామ్ సెట్‌లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం…

ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు.

ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.

ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు..

నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం.

నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను.

 

అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

పూజా హెగ్దే ఎమోషనల్ కామెంట్స్.

చాలా బాధగా ఉంది.. ఇదొక చేదు వార్త.. పూజా హెగ్దే ఎమోషనల్ కామెంట్స్

 

నేటిధాత్రి

 

 

ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య (Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్దే(Pooja Hegde)..

తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది.

దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సాంగ్తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి.

దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్లు కరువయ్యాయి.

దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) నటించిన ‘రెట్రో’ (Retro) మూవీతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకుంది.

ప్రస్తుతం దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్తో జరుగుతుంది.

ఇక పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా పూజా హెగ్దే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ..

‘ఈ మధ్య కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి.

కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్థం మారిపోయింది.

కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్..

భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చూపిస్తాయని అనుకుంటున్నా..

సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..

వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది.

అందరి జీవితంలో హెచ్చుతగ్గులు కచ్చితంగా ఉంటాయి.

మేము నటులం ఫ్లాప్లను కూడా స్వీకరించాలి.

‘బీస్ట్'(Beast) సినిమా తర్వాత ఇప్పుడు ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమాలో నటించడం ఆనందంగా ఉంది.

కానీ ఇది విజయ్ చివరి చిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది.

నా దృష్టిలో ఇదొక చేదు వార్త.

ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్ సినిమాల్ని ఇష్టపడతారు.

ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురు చూసేవాళ్ళం’ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పూజా హెగ్దే చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version