ఓటీటీకి వ‌చ్చేసిన పోలీస్ థ్రిల్ల‌ర్‌! క్లైమాక్స్ మైండ్ బ్లాకే..

స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చేసిన పోలీస్ థ్రిల్ల‌ర్‌! క్లైమాక్స్ మైండ్ బ్లాకే

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స‌డ‌న్‌గా ఓ లేటెస్ట్ మ‌ల‌యాళ‌ చిత్రం రోంత్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స‌డ‌న్‌గా ఓ లేటెస్ట్ మ‌ల‌యాళ‌ చిత్రం రోంత్ (Ronth) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. పోలీస్ ప్రోసిడ్యూర‌ల్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా గ‌త నెల జూన్ 13న కేర‌ళ‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై సైలెంట్‌గా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దిలీష్ పోత‌న్ (Dileesh Pothan), రోష‌న్ మాథ్యూ (Roshan Mathew) కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా, ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ, నాయ‌ట్టు వంటి సినిమాల‌కు క‌థా ర‌చ‌న చేసిన‌ షాహి కబీర్ (Shahi Kabir) ర‌చించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రోంత్ అంటే నైట్ పెట్రోలింగ్ అని అర్థం. తెలుగులో గ‌స్తీ, ప‌హారా ఖాయ‌డం అని అంటారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఒక రాత్రిలో విధుల్లో ఉన్న‌ ఇద్ద‌రు భిన్న మ‌న‌స్త‌త్వాలు ఉన్న‌ పోలీసులు చాలా సీనియ‌ర్ అయున‌ సబ్‌ఇన్స్పెక్టర్ యోహన్నాన్ (దిలీష్ పోథన్) మరియు కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ డినానత్ (రోషన్ మాథ్యూ) ల మ‌ధ్య సాగుతుంది. ఓ రోజు రాత్రి పాట్రోల్ డ్యూటీకి వెళ్లిన ఈ ఇద్ద‌రికి అనుకోకుండా వ‌రుస‌గా ఎదురైన ఘ‌ట‌న‌లు వారిని ఎలా మార్చాయి, వారు ఆ క్ష‌ణంలో తీసుకున్న నిర్ణ‌యాలు ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీశాయి వాటికి వారు రియాక్ట్ అయిన తీరు వ‌ళ్ల‌ ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌చ్చిది, వారి జీవితాలు ఎలా మలుపులు తిరిగాయో థ్రిల్లింగ్ అంశాల‌తో ఈ సినిమా సాగుతుంది. ఓ పిచ్చోడు బిడ్డ‌ను డ్ర‌మ్ములో ఉంచి హింసించ‌డం, ఓ త‌ల్లి త‌న‌ ప‌క్క‌నే పిల్ల‌ల‌ను పెట్టుకుని ఊరేసుకోవ‌డం, ఓ ప్రేమ జంట లేచి పోవ‌డం, వారి స్థానంలో వేరే వారిని ప‌ట్టుకోని కొట్ట‌డం వంటి సిట్యువేష‌న్స్ ఎదుర‌వుతాయి. వాటికి తోడు ఇంటి స‌మ‌స్య‌లు, ఆ రోజే స్టేష‌న్‌కు వ‌చ్చిన కేసులు ఇలా వాళ్ల‌కు అనేక స‌స‌మ‌స్య‌లు అ ఒక్క రోజులో వ‌చ్చి మీద ప‌డ‌తాయి.

ఇప్పుడీ చిత్రం జియో హాట్‌స్టార్‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన‌ రొటీన్ కమర్షియల్ స్టోరీలా మాదిరి కాకుండా, నిజ జీవిత పోలీస్ పట్రోల్ తీరు తెన్నుల‌ను, పోలీసులు అనుభవించే స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర‌ధారులు పోటీ ప‌డి మ‌రీ న‌టించారు. సినిమాటోగ్రఫీ, లైట్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా సంద‌ర్బాల్లో స్లోగా సాగిన‌ప్ప‌టికీ ఎక్క‌డా బోర్ అనే ఫీల్ రాదు. ఎలాంటి యాక్ష‌న్‌, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ చిత్ర నిరాశే మిగులుస్తుంది. సస్పెన్స్, సీరియస్ కంటెంట్, స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్ట‌ప‌డే వారికి ఈ మూవీ ప‌ర‌మాన్నం లాంటిది. అంతేకాదు స్ట‌న్నింగ్ క్లైమాక్స్‌, ఊహ‌కంద‌ని ట్విస్టుల‌తో ఈ మూవీ షాకి ఇస్తుంది. గ‌తంలో మ‌ల‌యాళం నుంచే వ‌చ్చిన నయాట్టు, జన గణమన వంటి రియలిస్టిక్ పోలీస్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్. ఎక్క‌డా ఎలాంటి అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు లేవు ఇంటిల్లిపాది క‌లిసి చూసేయ‌వ‌చ్చు.

అసలేం జరుగుతోంది…

అసలేం జరుగుతోంది…

అధర్వ మురళీ తాజా చిత్రం ‘డి.ఎన్.ఎ.’ తెలుగులో ‘మై బేబీ’గా రాబోతోంది. అయితే ఈ తెలుగు వర్షన్ విడుదల అయ్యి కాగానే ఓటీటీలో దర్శనం ఇవ్వబోతోంది. ఇది తెలుగు నిర్మాతలను షాక్ కు గురిచేసే అంశం.

ప్రముఖ నటుడు అధ్వర్య మురళీ (Atharvaa Murali), నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటించిన తమిళ చిత్రం ‘డి.ఎన్.ఎ.’ (DNA). ఇది జూన్ 20న తమిళంలో విడుదలైంది. అదే సమయంలో తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. కానీ కారణాలు ఏవైనా ఆ సినిమా తెలుగులో ఆ టైమ్ లో రాలేదు.

నెల్సన్ వెంకటేశ్‌ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ మూవీ ‘డిఎన్ఎ’ తమిళ నాట విమర్శకుల ప్రశంసలు పొందింది. దాంతో తిరిగి దీనిని తెలుగు విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ సురేశ్‌ కొండేటి… ఈ సినిమాను తెలుగులో తన ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ లో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ‘డి.ఎన్.ఎ.’ టైటిల్ ను తెలుగులో ‘మై బేబీ’గా మార్చారు. ఘనంగా విడుదలకు సంబంధించిన ప్రమోషన్స్ జరిపారు. జూలై 11న ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తామన్నారు. అయితే… అనుకున్న సమయంలో తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు కాకపోవడంతో… ఈ నెల 18న దీన్ని జనం ముందుకు తీసుకొస్తున్నట్టు ఆ తర్వాత ప్రకటించారు.

అయితే అప్పటికే ఈ సినిమా ను ఐదు ప్రధాన భారతీయ భాషల్లో జియో హాట్ స్టార్ ద్వారా జులై 25న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. అంటే తెలుగు వర్షన్ విడుదలైన వారానికే ఈ సినిమా జియో హాట్ స్టార్ లో వచ్చేస్తుందన్న మాట. డబ్బింగ్ సినిమాకు వారం కంటే థియేట్రికల్ రన్ ఉండదనే నమ్మకం బహుశా నిర్మాతలకు వచ్చి ఉండొచ్చు. ఇక్కడే చిత్రంగా ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. తెలుగు వర్షన్ రిలీజ్ జూలై 11 నుండి 18కి పోస్ట్ పోన్ అయినట్టుగానే… ఇప్పుడు జియో హాట్ స్టార్ తన స్ట్రీమింగ్ డేట్ ను జూలై 25 నుండి జూలై 19కి ప్రీ పోన్ చేసేసింది. అంటే… ఇప్పుడు తెలుగు వర్షన్ ‘మై బేబీ’ విడుదలైన రోజే… అర్థరాత్రి నుండి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో దర్శనమిస్తుందన్న మాట.

ఒక తమిళ డబ్బింగ్ మూవీ ఇలా విడుదలై కాగా ఓటీటీలో దర్శనం ఇవ్వడం ఏమిటనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ముందే ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్స్ తో ఒప్పందం చేసుకుని ఉంటే… తెలుగు హక్కుల్ని వేరొకరికి ఎందుకు అమ్మారు? అనే సందేహం కలుగుతుంది. తెలుగులో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారికి ఈ చిత్ర ప్రధాన నిర్మాతలకు మధ్య ఏమైనా వ్యవహారం బెడిసి కొట్టిందా అనే డౌట్ కూడా వస్తుంది. ఒకేసారి తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయకపోవడం, ఆ తర్వాత ముందుగా జులై 11 అని చెప్పి ఒకసారి… కాదు… 18న వస్తున్నాం అని మరోసారి వాయిదా వేయడం వెనుక ఏం జరిగిందనేది కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా… జూలై 25వ తేదీన స్ట్రీమింగ్ చేస్తామని చెప్పి జియో హాట్ స్టార్, హఠాత్తుగా ఓ వారం ముందుకు ఎందుకొచ్చిందనేదీ పలు ఆలోచించాల్సిన అంశమే. ఈ విషయంలోని లొసుగుల్ని తేల్చి చెప్పాల్సింది తమిళ నిర్మాతలు… తెలుగు సినిమా హక్కుల్ని తీసుకున్న వారే! వారి నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. ఏదేమైనా తెలుగులో ‘డీఎన్ఎ’ను ‘మై బేబీ’గా విడుదల చేద్దామని అనుకున్నవారికి మాత్రం ఈ నిర్ణయం అశనిపాతం లాంటిదే!

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్.

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్…

శివ సినిమాను అతి త్వ‌ర‌లో 4కేలో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అక్కినేని నాగార్జున.

రామ్‌పాల్ వ‌ర్మ (RGV) , నాగార్జున (Akkineni Nagarjuna) కాంబోలో వ‌చ్చి టాలీవుడ్‌ క‌ల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం శివ (Siva). ఈ యేటితో 35సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే చాలాసార్లురీ రిలీజ్ అవుతూ వ‌చ్చిన ఈ సినిమాను 4కే ఫార్మాట్‌లో అతి త్వ‌ర‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కింగ్ నాగార్జున ఆదివారం స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న‌, ధ‌నుష్ కీల‌క పాత్ర‌ల్లో రూపొందిన కుబేర ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో ఫ్యాన్స్ అదే ప‌నిగా శివ శివ గోల చేస్తుండ‌డంతో అతి త్వ‌ర‌లో శివ సినిమా 4కేను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. అయితే ఈ సారి ఇంకా బెట‌ర్ క్వాలిటీతో సినిమాను తీర్చిదిద్ది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు నెలాఖ‌రున గానీ సెప్టెంబ‌ర్‌లో గానీ ఈ శివ (Shiva4K) సినిమా ప్రేక్ష‌కుల‌కు ముందు మ‌రోసారి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రీ రిలీజ్‌ అయిన ప్ర‌తీసారి ఆడియెన్స్ నీరాజ‌నాలు అందుకున్న ఈ చిత్రం ఈ సారి ఏమేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి.

మా సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయి…

ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం… మహమూద్ పట్నం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మహిళలకు అలాగే ప్రతి పేదవానికి లబ్ధి చెందేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిజమైన లబ్ధిదారులకే చెందేలా ఎంతో పటిష్టంగా అధికారులచే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలో ఇసం పెళ్లి సారమ్మ వైఫ్ ఆఫ్ మల్లేష్, సొంత ఇంటి కలను నిజం చేస్తూ వారి ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మిట్ట గడుపుల యాకు తొగరి నవీన్ మాజీ ఎంపిటిసి ముంజల శ్రీనివాస్ కాసు రాజేంద్ర చారి చిలువేరు శివాజీ పోలు శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ వామ్మో.

జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ వామ్మో జూన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది. ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది. ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది. జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు. ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి. మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు. 

జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి. మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి. దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు.. ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు.

24 మే 2025 నాడు జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆ‌‌క్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లే.!

అమ్మమ్మ ఇంటికి వచ్చి… అనంత లోకాలకు వెళ్లే…

శోకసముద్రంలో మునిగిన శివశంకర్ కుటుంబ సభ్యులు

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ లోని గేటు పల్లిలో భూక్య శివశంకర్ వయసు (8) సంవత్సరాలు విద్యుత్ షాక్ తాకి మృత్యువాత వాత పడడంతో ఇ టు గెట్ పల్లి లో విశ్వనాధపురం లో విషాదం ఛాయలు అమ్ముకున్నాయి ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే గీసుకొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన భూక్య నరేష్ కుమారుడు శివ శంకర్ తన అమ్మమ్మ అయినటువంటి బాధావత్ గొజి నివాసముంటున్న గేటు పల్లి గ్రామానికి వేసవి కాలం సెలవుల కోసం రావడంతో మంగళవారం సాయంత్రం గేటు పల్లి లోని భూక్య శంకర్ ఇంటి వద్ద శివశంకర్ ఆడుకుంటున్న సందర్భంలో శంకర్ ఇంటికి కరెంటు సప్లై రావడంతో అది గమనించని శివశంకర్ ఇంటికి సంబంధించిన మెట్ల కు ఉన్నటువంటి ఇనుప చువ్వలను పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు వెళ్లాడని మృతుని తండ్రి భుక్య నరేష్ బోరున వినిపిస్తూ బుధవారం నెక్కొండ ఎస్సై మహేందర్ కు దరఖాస్తు ఇవ్వడంతో దరఖాస్తు స్వీకరించిన ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version