తొలిసారిగా తెలుగులో

తొలిసారిగా తెలుగులో

 

తమిళ డబ్బింగ్‌ చిత్రాలతో ఇన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు కమెడియన్‌ యోగిబాబు. ఇప్పుడు ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రంలో యోగిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉడ్రాజు అనే పాత్రలో వినోదం పంచనున్నారు. మంగళవారం యోగిబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో వేణు సట్టి, అమర్‌ బురా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మనసులో నిలిచిపోతుంది..

మనసులో నిలిచిపోతుంది

‘పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ సినిమాలోని పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. విభిన్నమైన..

‘పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ సినిమాలోని పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. విభిన్నమైన.. విలక్షణమైన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రవీణ. ఆమె గొప్ప విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’ అని నటుడు రానా కోరారు. ఆయన సమర్పణలో ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రవీణ మాట్లాడుతూ ‘ఇది నాకు నిర్మాతగా మూడో సినిమా. దర్శకురాలిగా తొలి సినిమా. మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి’ అని కోరారు. ‘నా సినీ గమనాన్నే మార్చే పాత్రను ఈ సినిమాలో చేశాను. మా టీమ్‌ అంతా చాలా కష్టపడి మీ ముందుకు మంచి సినిమాతో వస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది’ అని హీరో మనోజ్‌ చంద్ర చెప్పారు.

పల్లెటూరి సరదాలు..

పల్లెటూరి సరదాలు

మనోజ్‌ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు.

మనోజ్‌ చంద్ర, మోనికటి, ఉషా బోనెల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్రామీణ నేపథ్య వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో గోపాల కృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. ఈనెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. మనోజ్‌ చంద్ర రికార్డ్‌ డ్యాన్స్‌ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా ఈ చిత్రంలో చూపించబోతున్నామని చిత్రబృందం పేర్కొంది.

అలరించే వంతెన.

అలరించే వంతెన…

 

కనుచూపుమేర పచ్చందనం… అక్కడే రెండు సుందరమైన కొండలు… వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం… దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన…

భారీ, విభిన్న నిర్మాణాలతో తరుచూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ‘రుయి’ బ్రిడ్జ్‌. దీనిని మూడేళ్ల పాటు నిర్మించి, 2020లో వంతెనపైకి పర్యాటకులను అనుమతించారు. చైనీస్‌ రుయి (అదృష్టానికి ప్రతీక) చిహ్నం ప్రేరణతో దీనిని నిర్మించారు. ఇది భూమి నుంచి 140 మీటర్లు(460 అడుగులు) ఎత్తులో ఉంటుంది. దీని పొడవు 100 మీటర్లు(330 అడుగులు). ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల మంది సందర్శించడం విశేషం. స్థానికులు ఈ వంతెనను ‘బెండింగ్‌ బ్రిడ్జ్‌’ అని పిలుస్తారు.

మెట్లూ ఉన్నాయి…

కళ్లు చెదిరే ఈ బ్రిడ్జ్‌ చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఇదొక గాజు వంతెన. వంతెన నిర్మాణాల్లో విశేష అనుభవమున్న హీయున్‌చాంగ్‌ అనే ఇంజనీర్‌ దీనికి రూపకల్పన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే వంతెనను ఓచోట మూడు దారులుగా విభజించారు. ఇంకోచోట కలిపినట్లుగా ఉంటుంది. దీనిపై సులువుగా నడవటానికి మెట్లు కూడా ఉన్నాయి. సందర్శకులు వంతెనపై నడుస్తున్నంతసేపూ గాల్లో తేలుతున్నట్లు, మేఘాలు హాయ్‌ చెప్పుతున్నట్లు అనుభూతి చెందుతారట.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version