ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించడం జరిగినది.ఈ సందర్శనలో భాగంగా రాజీవ్ యువ వికాసము పథకంలో ఆన్లైన్లో చేసిన దరఖాస్తులు పరిశీలించడం జరిగింది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించినచో వాటిని మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి చేసి ఆన్లైన్ చేయవలసినదిగా,ఇప్పటికే ఆన్లైన్ చేసినచో ఆ దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించవలసిందిగా తెలియజేశారు.కార్యలయమునకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల వారీగా వేరు చేసి తదుపరి కార్యాచరణకు సిద్ధముగా ఉంచవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంఈఓ శ్రీపతి బాబురావు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ఎయిమ్స్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం యూత్ విభాగం ముఖ్య నాయకుల సమావేశం బింగి సదానందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా మారి ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల ఐక్యతను దెబ్బతీస్తూ మనువాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ బిజెపి నరేంద్ర మోడీ అడుగులకు, మడుగులకు ఎస్సీ వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగని వారి ప్రయోగశాలలో ఒక వస్తువుగా వాడుకుంటున్నారు.అనే నగ్న సత్యాన్ని తెలిసి కూడా వారి స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా ఆ బిల్లును ఆమోదించేలా చేయడం దళితుల ఐక్యతను దెబ్బ తీయడమే అని అన్నారు. ముఖ్యంగా మాల ఉపకులాలకు అన్యాయం చేయడమేనని,ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాల జనాభా లెక్కలు లేవని 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడం బీజేపీ రాజకీయంగా కుట్ర చేసిందని రాజ్యాంగాన్ని మార్చి కుట్ర చేయడం లేదని మనువాదాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదని దళితుల ఐక్యతను ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే కుట్రలు చేయకపోతే బిజెపి పాలిత రాష్ట్రాలలో ముందుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం గా ప్రశ్నిస్తున్నాము.ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బిజెపికి మరియు మాదిగ సోదరులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఇది కేవలం ఓట్ల రాజకీయ కోసం మాత్రమే ఇకనైనా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్గీకరణ ఆమోద బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ భూమి అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదు- తిరుపతి నాయక్
కరీంనగర్, నేటిధాత్రి:
లంబాడా జేఏసీ చైర్మన్ భూక్య తిరుపతి నాయక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మీరు వేలం వేస్తున్నది హెచ్సియూ భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియూకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆభూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోతే రెండుసార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ఈరోజు విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం స్పందించడం లేదేందుకో ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని బంజారా జేఏసీ చైర్మన్ భూక్యా తిరుపతి నాయక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కు విచ్చేసిన డాక్టర్ వై .ప్రవీణ్ సర్వమత సమానమైన మన భారతదేశంలో 1949 నాటి నుంచే ఆనవాయితీగా దళిత ముస్లిం క్రైస్తవ లు కలిసి భోజనం చేయడం అన్నదికాలంగా జరుగుతుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిజీవకోన మజీద్ ఏ మహమ్మదీయ లో దళిత ముస్లిం ఇఫ్తార్ విందు కు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్, భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ధర శేఖర్, బీసీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు బోకం రమేష్ ,ఏంజెఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ఈ మహమ్మద్ అలీ తిరుపతి ఈద్గా వైస్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హజ్రత్ మొహమ్మద్ మొహాని 1949లో మొట్టమొదట దళిత ముస్లిం ఇఫ్తార్ విందు ప్రారంభించారు ,వారినీ అనుసరిస్తూ తిరుపతిలోని జీవకోనలో మసీద్ ఏ మహమ్మదీయులో ప్రతి సంవత్సరం రంజాన్ చివరి వారంలో దళిత ముస్లింల ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ,దీని ముఖ్య ఉద్దేశం కులం మతం జాతి వివక్ష లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు సోదర భావంతో సమానత్వంతో మెలగాలని కులాలు కూడు పెట్టవని మతాలు మానవత్వం చూపవని కులాన్ని మతాన్ని ఏ విధంగా అయితే మనం మందిరానికి మసీదుకు వెళ్లేటప్పుడు చెప్పులు బయట వదిలేస్తామో అదేవిధంగా కులాన్ని మతాన్ని మన ఇంటి వరకు వదిలేసి సమాజంలో మనమంతా మానవత్వంతో మెలగాలని తద్వారా మన దేశ ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటాలని ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం సర్వమత సమానత్వమైన భారతదేశాన్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మెలగాలని దీని ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమంలో మసీద్ ఏ మహమ్మదీయ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.అనంతరం తిరుపతి ముస్లిం ఈద్గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన జీవకోనకు చెందిన ఈ మహమ్మద్ అలీ ని ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ ఎలమంచిలి ప్రవీణ్ దళిత సాహిత్య అకాడమీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ధనశేఖర్ ఏ ఎం జేఏసీ జాతీయ అధ్యక్షులు రఫీ హిందుస్తానీ ముస్లిం సహోదరులు దుస్సాలవాతో సన్మానించడం జరిగిందని హిందుస్తానీ ఆల్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ఏ,యం జే ఏసి) జాతీయ అధ్యక్షులు రఫీ ఆ ప్రకటనలో తెలిపారు .
చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.పేదల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రజలు ఎవరు తినలేని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల సమస్య ను గుర్తించి నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగిందని,అదేవిధంగా ప్రజలందరూ కూడా సన్నబియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కొరకు మిట్టపల్లి గ్రామంలో 35 లక్షల అంతర్గత సీసీ డ్రైనేజీలు,ఈజిఎస్ నిధుల నుండి 15 లక్షలు,రెండు కోట్ల రూపాయలతో నర్వ నుండి మిట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం,వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారనీ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు,ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది కలుగకూడదని ఐదు బోర్లుమంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు.ప్రజల సమస్యలను క్షణక్షణం పరిశీలిస్తూ పేద నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఏ కష్టం వచ్చినా సమస్యను తీర్చుకుంటూ వారికి అండదండ నిలుస్తున్న ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం లింగయ్య,కామెర మనోహర్,అల్లూరి స్వామి,జంబిడి కిష్టయ్య,దూట శీను, చంద్రయ్య,మల్లేష్,గోదారి తిరుపతి,భిమిని తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం … సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం లాంటిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాసిల్దార్ సునీత డి ఎం ఎం ఓ డి సి ఎస్ ఓ తో కలిసి ప్రారంభించారు ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
MLA Gandra Satyanarayana Rao.
రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు.అనంతరం మండలంలోని సిఎం రిలీఫ్ ఫండ్ 63 మంది లబ్దిదారులకు రూ.17,63,500/చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఆసుపత్రిలో వైద్యము చేయించుకొని డబ్బు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు.ఈ కార్యక్రమములో సొసైటీ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు మోటే ధర్మారావు తక్కలపల్లి రాజు క్యాథరాజు రమేష్ నీరటి మహేందర్ మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు
ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా చిలుపూరి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసి మొదటి నుండి ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకొని కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉన్నారని చెప్పారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మాధవ రెడ్డికి క్యాబినెట్ లో మంత్రి స్థానం కల్పించాలని పార్టీ అధిష్టానన్నీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజిలో ఇటీవల అకాల మరణం చెందిన పశువుల పేద్దులు కుటుంబానికి రాష్ట్ర టిపిసిసి ఓబిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసముద్రం గ్రామ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ ,బోళ్ల కట్టయ్య ,బోళ్ల అశోక్, పెండ్యాల లక్ష్మణ్, ఉల్లి వెంకటేశ్వర్లు ,బొమ్మరబోయిన సతీష్, జీలకర్ర బాబు ,ఎస్కే యాకోబు, పశువుల సమ్మయ్య ,మరియు మృతుడి కూతుర్లు అల్లుళ్లు బోళ్ల ఉప్పలయ్య గుండు అశోక్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
నియోజకవర్గంలో 63 లక్షలతో 187 పశువుల తొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేపట్టిన ఎమ్మెల్యే అమర్
పలమనేరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 01:
గ్రామాల సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ జే.ఆర్. కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకు నీటి తొట్టెల నిర్మాణ భూమీ పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన పూజలు చేసి పనులను ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో 62 లక్షల రూపాయలతో 187 నీటి తొట్టెలను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
MLA Amar
ఉపాధి హామీ పథకంలో రైతులకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని గ్రామాలలో రోడ్లు, మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ రవికుమార్, అసిస్టెంట్ పిడి ఎస్ రవికుమార్, ఎంపీడీవో సురేష్ కుమార్, తహసిల్దార్ మాధవరాజు, ఏపీవో శ్రీనివాసులు, ఏపీఎం హరినాథ్ లతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాపరెడ్డి,నాగరాజు రెడ్డి, ఆల్ కుప్పం రాజన్న, మునస్వామి రెడ్డి, గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
జైపూర్,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి మాట్లాడుతూ ఇప్పటివరకు ధనవంతులు తినే సన్నబియ్యం ఇకపై ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పోషక విలువలతో కూడిన సన్న బియ్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.అలాగే సన్న బియ్యం పథకం ప్రారంభించడం పేదలు అదృష్టంగా భావిస్తున్నారు.సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని సరైన గిట్టుబాటు ధరలు కూడా వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి పాండరి, మాజీ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు చేలుకల పోశం,గుండా సురేష్ గౌడ్, కొట్టాల మల్లయ్య పోతుగంటి సుమన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లాలో షీ టీం అవగాహన సదస్సు ఏర్పాటుచేసిన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే
మహిళలకు రక్షణగా షీ టీం
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లాలో మహిళల, విద్యార్థుల రక్షణయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన షీ టీం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళ చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పొక్సో, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, వేధింపులకు గురైతే ఎవరిని సంప్రదించాలి అనే మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల,విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పించడం జరుగుతుంది.గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో విద్యార్థినిలను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిలపై 02 కేసులు, 07 పెట్టి కేసులు నమోదు చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే మాట్లాడుతూ..విద్యార్థినులు, మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ.టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.
భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం
పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.
టీ.ఎస్.జె.యు జిల్లా జర్నలిస్ట్ నాయకులను ఘనంగా సన్మానించిన సేవాలాల్ సేన జిల్లా కమిటీ
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్రం లోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నూతన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు ఇటీవల ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా బంజారా సేవాలాల్ సేన జిల్లా కమిటీ నాయకులు కాకతీయ ప్రెస్ క్లబ్ లో టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టీ.ఎస్.జె.యు జిల్లా కమిటీ ఎన్నిక కావడం వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది మరెన్నో ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అన్నారు బంజారా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ ముఖ్య రూప్ సింగ్ సేవాలాల్ సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రాజు నాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు నగవత్ రాజేందర్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా నాయకులు, ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు బండారి రాజు,సంయుక్త కార్యదర్శి కడపక రవి,ఆర్గనైజ్ సెక్రెటరీ చంద్రమౌళి,జిల్లా నాయకులు బొల్లేపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల(కేవీ స్కూల్)ని తంగళ్లపల్లి మండలం లోని పద్మనగర్ లో గల సొంత భవనంలోకి మార్చాగ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్ ని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు కొబ్బరికాయ కొట్టి బస్ ని ప్రారంబించారు..సుమారు 180 మంది విద్యార్థులు సిరిసిల్ల పట్టణం నుండి విద్యాభ్యాసం కోసం కేవీ స్కూల్ కి వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్.టి.సి ని లాభాల్లోకి తీసుకురావాలని కోరారు..విద్యార్థుల కోసం మరో బస్ ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రోజు ఈ బస్ ఉదయం 7:30 నిమిషాలకి కొత్త బస్ స్టాండ్ నుండి ప్రారంభం అయ్యి పాత బస్టాండ్,గాంధీ చౌక్,పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిపో మేనేజర్ ని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ వర్జిలాల్, కంట్రోలర్ రామ్ రెడ్డి, కార్గో డి.ఎం. ఈ శేఖర్ రావు, ఆర్. టి. సి సిబ్బంది మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పెద్ది నవీన్ కుమార్,బండరాజు, కొండికొప్పుల రవి , తడుకల సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ : 1 మరియు రేషన్ షాప్ నెంబర్ 2 లో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఉచిత సన్న రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి* చిత్రపటానికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కుమ్మరి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు తానేష్ , కనకనాల శంకర్ , కంచర్ల రాములు , పాలడుగుల రఘుపతి , ఎలావెణ శివకుమార్ , కట్టెకొల్ల మల్లేష్ , చెలుపురి రాజయ్య , జంగ మల్లేష్ , నగునూరి వెంకటేష్ , జంబుల నరసయ్య , రాయరాకుల రమేష్ అందుగుల రాజు , జంగా కుమార్ , కంచర్ల ప్రభాకర్ , మొగిలి , గడ్డి రాములు , శ్యామల శ్రీనివాస్ , రాజు , కుమార్ తదితరులు పాల్గొన్నారు..
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం
– అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాల అమలు
– మంత్రి పొన్నం ప్రభాకర్
– సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించిన మంత్రి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని మంత్రి, విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లో రెండు లక్షల 91 కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపు 60 వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళల అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు,రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు.
జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా..
రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే ను ఇటీవల నిర్వహించిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పిస్తూ గత బకాయిలను విడుదల చేసిందని, అలాగే యార్న్ బ్యాంకును ప్రారంభించిందని వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దాదాపు 20వేల కోట్ల రూపాయల రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని వెల్లడించారు. త్వరలో పెన్షన్ పంపిణీ ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రకటించారు. జిల్లాలోని 345 రేషన్ దుకాణాలు ద్వారా లక్ష 70 వేల రేషన్ కార్డుల లబ్ధిదారులకు 3275 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
మహిళలను దుర్భాషలాడిన విలేఖరి పై చర్య తీసుకోవాలని ధర్నా రాస్తారోకో.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఈ ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకి మహిళల యొక్క సమస్యలు పరిష్కరించాలని పబ్లిక్ టాయిలెట్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది ఆ కొరతను తీర్చాలని స్థానిక మహిళలైనా చిదిరాల సరోజన, మైదం కర్ణ, ఇతర మహిళలు ఎమ్మెల్యే ని కోరగా సానుకూలంగా స్పందించి ,మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు, ఎమ్మెల్యే , ప్రోగ్రాం అయి పోయిన తర్వాత వార్త రిపోర్టర్ కటుకూరు మొగిలి తాగిన మైకంలో వచ్చి మహిళలను చూడకుండా నానా బూతులు తిడుతూ దుర్భాషలతో మాట్లాడనారు, ఇట్టి విషయంపై దుర్భాషలాడిన విలేఖరి పై స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం పిటిషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం నాడు చిధిరాల సరోజన మై దం కరుణ మరికొందరు మహిళతో కలిసి విలేకరిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేశారు, అనంతరం సరోజన మాట్లాడుతూ మహిళలను దుర్భాషలాడిన వార్త విలేకరిని తొలగించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మహిళలు రాయమల్లమ్మ శారద కరుణ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలి
నిజాంపేట్, నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంగా మంగళవారం రోజున దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఇర్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు బహుజనులు కలసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొదని దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు.
ఘర్షణలో భాగంగా కొంతమంది దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు, అట్టి మంటలు ఆర్పే క్రమంలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది.
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశానికి దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దురదృష్టకరమని దళిత ప్రజా సంఘాలు మండిపడ్డాయి ఇలాంటి సంఘటనలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఏప్రిల్ మాసం మొత్తం మహనీయుల మాసంగా దేశం రాష్ట్రం మహనీయుల జయంతులు చేస్తున్న క్రమంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జీవోలు తెచ్చి రక్షణ కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొమ్మట బాబు, మాల మహానాడు మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం, ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులు జనగామ స్వామి, డొక్కా రామస్వామి, కాకి బాలరాజ్, బ్యాగరి రాజు, గుడ్ల బాబు, కొమ్మాట ఎల్లం, తదితరులు పాల్గొన్నారు.
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొ హాజరై, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగ నిర్మూలించామని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దబ్బట అనిల్ బుర్ర శ్రీనివాసు, చిలుముల రాజమౌళి ,అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.
మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన అతిగం స్వామి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠ తిరుపతి రెడ్డి బాధిత కుటుంబ నీకి 5,000 వేల రూపాయలు తన అనుచరులతో అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల మాజీ కో అప్షన్ మెంబర్ మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు దుబ్బరాజా గౌడ్, గ్రామ నాయకులు అంజా గౌడ్, రాజు, పర్శ గౌడ్, ఫిరోజ్ లు ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.