పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి రూరల్ మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్‌ పౌడర్‌ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రైతుల ప్రభుత్వమని పేదల కోసం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశం పెట్టిన ప్రభుత్వం అని అన్నారు అలాగే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం లోని చిట్యాల టేకుమట్ల మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు దాదాపు 25 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిలుకల రాయకు ఉండు లక్ష్మణ్ గౌడ్, చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

 

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొ హాజరై, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగ నిర్మూలించామని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దబ్బట అనిల్ బుర్ర శ్రీనివాసు, చిలుముల రాజమౌళి ,అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version