శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం.!

గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సిరిసిల్ల జడ్జి ప్రత్యేక పూజలు

సిరిసిల్ల టౌన్ మే 20 (నేటిధాత్రి):

ఈరోజు పట్టణ కేంద్రంలోని బహుళ అష్టమి సందర్భంగా సిరిసిల్లలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి వారి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాధికా జైస్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ , ఆలయ కార్యదర్శి కుడిక్యాల శంకర్ మేజిస్ట్రేట్ ని శాలువాతో సన్మానించారు. అలాగే ఆలయ పూజారి గోషికొండ సత్తయ్య పంతులు జడ్జి కి ఆశీర్వచనాలు అందించారు. వీరి వెంట ఆలయ కమిటీ సభ్యులు పంతం రవి, శ్రీపతి పరుశరాం, చిలగాని శ్రీనివాస్ ఉన్నారు.

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో.!

మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో మహా అన్నప్రసాద వితరణ

పరకాల నేటిధాత్రి:

 

పరకాల మండలంలోని
మల్లక్కపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం మల్లక్కపేట
లో సోమవారం రోజున విఎస్స్సార్ ఫ్యామిలీ మార్ట్ యాజమాన్యం పరకాల,నర్సంపేట
మరియు దోషిని మహేష్,శ్రీనివాస్ నాగారం లు మహా అన్న ప్రసాద వితరణ హనుమాన్ మాలాధారణ దీక్ష స్వీకరణలో ఉన్న హనుమాన్ స్వాములకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అలాంటి అవకాశాన్ని కల్పించిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ అంబీర్ మహేందర్ కి సహకరించిన ఆలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా.!

భక్తాంజనేయ స్వామి ఆలయకమిటీ చైర్మన్ గా అంబీరు మహేందర్ ప్రమాణ స్వీకారం

 

పరకాల నేటిధాత్రి

మండల పరిధిలోని మల్లక్కపేట గ్రామంలో బుధవారం రోజున ఉదయం 9:45 నిమిషాలకు శ్రీ భక్తాంజనేయ స్వామి పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మల్లక్కపేట గ్రామానికి చెందిన అంబీరు మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పరకాల మండల మరియు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు సర్పంచులు,వార్డ్ మెంబర్లు మరియు పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్,డైరెక్టర్స్, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్స్ పరకాల మండల మరియు పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావలని అంబీరు మహేందర్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version