మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి..

మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన రవి, శ్రీనివాస్ ల తండ్రి భాషబోయిన ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుడు ఐలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టి పి సి సి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల మధు ముదిరాజ్, నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మట్ట రాజు, భాషబోయిన పాపయ్య, సల్పాల ప్రభాకర్, జగన్మోహన్ రావు,ఆదిరెడ్డి, ఓర్సు తిరుపతి,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి హాజరు.

చిన్నారుల శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి హాజరు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణానికి చెందిన 2వ వార్డు కమలాపురంలో నేడు లోడే రాజు-నాగమణి దంపతుల కుమారులు లోడే కౌశిక్-లోకేష్ ల ధోతి కట్టించుట శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, 2వ వార్డు ఇంచార్జ్ మాజీ ఎంపీటీసీ ముత్తినేని వెంకన్న, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, ఐఎన్టియుసి నర్సంపేట పట్టణ అధ్యక్షులు కంచు రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, జన్ను మురళీ, మాజీ వార్డు సభ్యులు గండి గిరి గౌడ్, 3వ వార్డు అధ్యక్షులు కోరే సాంబయ్య, పూజారి సారంగం గౌడ్, వేల్పుల కృష్ణ, అల్లంశెట్టి సోమయ్య, గాదగోని వీర సోమయ్య, లోడే పెద్దరాజు, వింతల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రిపదవి ఇవ్వాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రిపదవి ఇవ్వాలి

ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా చిలుపూరి భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నర్సంపేట నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేసి మొదటి నుండి ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకొని కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉన్నారని చెప్పారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నర్సంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మాధవ రెడ్డికి క్యాబినెట్ లో మంత్రి స్థానం కల్పించాలని పార్టీ అధిష్టానన్నీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో
వ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

 

హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

హనుమాన్ ఆలయ చైర్మన్ బెజ్జంకి ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి

నెక్కొండ:నేటి ధాత్రి

మండల కేంద్రానికి చెందిన హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి బెజ్జంకి లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బెజ్జంకి వెంకటేశ్వర్లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజిపి బండి శివ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, కాంగ్రెస్ నాయకులు సింగం ప్రశాంత్, రావుల మైపాల్ రెడ్డి, వెంకన్న, శ్రీకాంత్, వీరస్వామి, ప్రభాకర్, షబ్బీర్ ,అన్వర్, తదితరులు లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version