కుల గణన చేయడం చారిత్రాత్మక నిర్ణయం
బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల ప్రకారం రాబోయే జనాభా లెక్కల్లో ,కుల గణన చేర్చాలని తీసుకున్నా నిర్ణయం చారిత్రాత్మకమని ఈ నిర్ణయం తీసుకున్న శుభ తరుణంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇన్నేళ్లు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ఏనాడు తీసుకొనటు వంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయ మని రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం గణన అనేది కేంద్ర జాబితాలోని 69 అంశం గా ఉందని, జనగణన కుల గణన బాధ్యత పూర్తిగా కేంద్ర పరిధిలోనిదే రాజకీయ దురుద్దేశంతోటే కావాలనే కొన్ని రాష్ట్రాల్లో తమకు అధికారం లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలు అశాస్త్రీయం గా సేకరించాయి ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూ డదు అన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని అంతేకాకుండా ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ కులగనానికి ఎప్పుడు వ్యతిరేకమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్వహిం చిన ఏ జనాభా గణనలో కూడా కులగణను కాంగ్రెస్ ప్రభుత్వాలు చేర్చలేదని 2010 అప్పటి ప్రధాన మంత్రి మన్మో హన్ సింగ్ కులగణన అంశాన్ని పరిశీలిస్తామని లోక్ సభకు హామీ ఇచ్చారు అంశంపై అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు అనుకూలంగా వారి అభిప్రా యాలు తెలిపిన కూడా కులగణన చేయలేదని ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటు న్నారని మన రాష్ట్రంలో సర్వేల పేరుతో కులగణన నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం సరైన లెక్కలను చూపెట్టక తప్పులతడకగా చూపెట్టడానికి ఇదొక నిదర్శనం అని ఇలాంటి సర్వేలతో కులగణన చేయడం వల్ల సమాజంలో సందేహాలు వస్తాయని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని దేశంలోని సున్నితమైన సామా జిక నిర్మాణం రాజకీయల వల్ల చెడిపోకూడదని అంశంతో ఈ నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు ఈ కులగణన వల్ల రేపు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగు తుందని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, సీనియర్ నాయకులు,బూర ఈశ్వరయ్య, భూతం తిరుపతి, కోమటి రాజశేఖర్, మేకల సుమ, బూత్ అధ్యక్షులు, కడారి చంద్రమౌళి, కన్నెబోయిన రమేష్, ఎర్ర తిరుపతిరెడ్డి, చిందం గణేష్, బత్తుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు