సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్…

సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్…

సినిమా నటీనటులుకు గౌరవ డాక్టరేట్ రావడం కొత్తేమీ కాదు. అయితే సినిమా రంగానికి చేసే సేవకు గుర్తింపుగా సహజంగా వారికి డాక్టరేట్ లభిస్తుంది. కానీ నటి సంచితాశెట్టికి యువ నాయకురాలిగా ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ వచ్చింది.

మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ప్రముఖ నటి సంచితాశెట్టి (Sanchita Shetty). తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది సంచితా శెట్టి. ఆమె విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’ (Soodhu Kavvaum), అశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’ (Villa) తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ (Bagheera) చిత్రాలలో నటించింది. వివిధ భాషల్లో దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. నటనతో పాటు సంచిత చేసిన యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీ వారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్‌ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ అవార్డుకు తనను ఎన్నుకున్న కమిటీకి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం.!

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 అందుకున్న డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ.

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి పెళ్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు ఆదినారాయణపశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 కార్యక్రమంలో తెలుగు భాష నుండి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ లోహియా అవార్డును బహూకరించారు.భారతీయ భాషలు, సాహిత్యంలో కృషి చేసిన యువ పరిశోధకులు, రచయితలను సత్కరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ అనురాధ లోహియా మాట్లాడుతూ, “ఈ యువ అవార్డు గ్రహీతలు భావి సమాజ చైతన్యానికి మార్గదర్శకులు. వీరి సాహిత్య కృషి భారతీయ భాషల సంరక్షణ, ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది,” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కుసుమ్ ఖేమాని, డైరెక్టర్ శ్రీ శంభునాథ్, ఉపాధ్యక్షులు ప్రదీప్ చోప్రా, సుశీల్ కాంతి తదితరులు పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (పార్ట్‌టైమ్)గా సేవలందిస్తున్నారు. కవిగా, రచయితగా గుర్తింపు పొందిన వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి దళిత ఆత్మకథలపై డాక్టరేట్, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంపై ఎం.ఫిల్ పూర్తిచేశారు. ‘నానీల సుగుంధం’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించిన ఆయన, యుజిసి కేర్ లిస్టెడ్ పరిశోధన పత్రికలతో పాటు దిన, మాస పత్రికల్లో అనేక వ్యాసాలు, కవితలు రాశారు.తెలుగు భాష, సాహిత్యంలో డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకమని, ఈ అవార్డు వారి పరిశోధన, సాహిత్య సేవలకు గుర్తింపు గా నిలుస్తుందని భారతీయ భాషా పరిషత్ పేర్కొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version