ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి…

జూన్ 25న చలో వరంగల్ రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి…

నేటి ధాత్రి- గార్ల:-

 

 

 

ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి. సక్రు డిమాండ్ చేశారు. మంగళవారం సత్యనారాయణపురం లో ఈ నెల 25న వరంగల్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సక్రు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు పూనుకుందని పేర్కొన్నారు. ఆదివాసి, గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్లు,హత్యాకాండ పతాక స్థాయికి చేరి ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఎవరినైనా కాల్చి చంపి ఎన్ కౌంటర్గా ప్రకటించే ఆనవాయితీని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని అన్నారు.2004లో వైయస్సార్ ప్రభుత్వానికి పీపుల్స్ వార్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరిగాయి కానీ ఆ చర్చల్లో కీలక భూమిక పోషించిన భూమి విషయం వచ్చేసరికి రెండవ దప చర్చల్లో పరిష్కరించుకుందామని మొదటిదప చర్చలను ముగించడం జరిగిందని రెండవ దప చర్చలేమో కానీ మళ్ళీ నల్లమల్ల అంతా రక్తం ఏరులై పారి చర్చల వాతావరణమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరరావు, బొమ్మగంటి రాధా,దబ్బేటి శారద,మంకిడి భారతి, లక్ష్మయ్య,సుమన్, సక్రు, రామదాసు,రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి

కన్నూరి దానియల్ ఏఐ సిసి టియు జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని
ఏఐ సిసిటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 1000 మంది కీ పై చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు ఈమధ్య భారత్లో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి…

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

 

చత్తీస్ ఘడ్ లో బీజేపీ, నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరా సాగిస్తున్న నరమేధాన్ని నిలుపుదల చేసి, కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎమ్ -ఎల్ మాస్ లైన్ పార్టీల జిల్లా కార్యదర్శులు విజయసారధి, సాధుల శ్రీనివాస్, గౌని ఐలయ్య, కొత్తపల్లి రవి, మధార్ లు డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపాలని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, గత 18 నెలలుగా మధ్య భారత అడవుల్లో భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో హత్యకాండ కొనసాగిస్తుందని తెలిపారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కొరిందని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు కోరుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేసి, బలగాలను వెనక్కి రప్పించాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారామ్, బండారి ఐలయ్య,అజయ్ సారధి రెడ్డి, మండల వెంకన్న, గునిగంటి రాజన్న, పెరుగు కుమార్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.

ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 540 మందిని చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు మధ్య భారతంలో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర ప్రజాస్వామ్య శక్తులు, ప్రజలు చర్చలు చేయాలని కోరుతున్నారని, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయకపోవడం విచారకరమన్నారు. శాంతి చర్చల కమిటీ, 10 వామపక్ష పార్టీలు, లౌకిక శక్తుల ఆధ్వర్యంలో ఈ నెల మూడు నుంచి ఆరు వరకు అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో సభలు, సమావేశాలు జరపాలని, ఈనెల 14న హైదరాబాదులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయని, వీటన్నింటినీ జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి.

ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి..

ఎర్రజెండాను రూపుమాపడం బిజెపికి పగటి కలే..!

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్

సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం…

జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్..

నాలగోసారి సిపిఐ పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

సిపిఐ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ మూడవ మహాసభలు పట్టణంలో ఘనంగా జరిగాయి.రాజీవ్ చౌక్ చౌరస్తా నుండి సూపర్ బజార్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, రైల్వే స్టేషన్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో సిపిఐ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. నాలుగోసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెల

అనంతరం వారు మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందిస్తుందని, ఏకపక్ష దాడులు చేస్తూ మావోయిస్టులు లేకుండా చేస్తామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం విడనాడాలని బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంఆరు గ్యారెంటీ పథకాల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.గతంలో రామకృష్ణాపూర్ పట్టణ అభివృద్ధిలో సిపిఐ పార్టీ పాత్ర కీలకమైందని, ప్రస్తుతం అప్పటి అభివృద్ధి పనులే ఇంకా ఉన్నాయని, నేటి పాలకుల అభివృద్ధి శూన్యమని అన్నారు.  సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పోరాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, వనం సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, దాగం మల్లేష్, మిట్టపల్లి పౌల్, మామిడి గోపి, గోపు సారయ్య, కాదండి సాంబయ్య, మణెమ్మ, రాములు రాజేశ్వర్, ఏఐటియూసీ ఫిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, హరి రామకృష్ణ, ముకుంద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

తక్షణమే ఆపరేషన్ కగార్ ఆపాలి.

బేషరతుగా చర్చలు ప్రారంభించాలి.

మారుపాక అనిల్ కుమార్
డి.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నరమేధాన్ని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా ఖండిస్తు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు శివనగర్, తమ్మెర భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతు, నక్సలిజాన్ని అంతం చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం, పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోతుంది అని ప్రశ్నించారు. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 2025లో ఇప్పటివరకు మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు కలిపి సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయారు అని, దేశ చట్టాలు, సాయుధ ఘర్షణలకు సంబంధించిన నియమాలను పక్కన పెట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మావోయిస్టులను భౌతికంగా నిర్మూలించేందుకు సాయుధ బలగాలను వినియోగిస్తోంది అని అన్నారు. కర్రెగుట్ట కొండలను పారా మిలిటరీ బలగాలతో చుట్టివేయటం, ఆదివాసీల హక్కులను పూర్తిగా పట్టించుకోకపోవటం అభీష్టకరమైంది కాదన్నారు.

శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం నిర్లక్ష్యం.

సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తమ శాంతియుత చర్చల సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇకపోతే, మావోయిస్టులు ఒకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాస్వామిక శక్తులు ఐక్యం కావాలి అని,
మావోయిస్టుల ప్రతిపాదనకు బదులుగా ప్రభుత్వం షరతులు విధించడం శాంతి లక్ష్యాలకే వ్యతిరేకమని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే శాంతిని సాధించాలి. అందుకే అన్ని ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తక్షణ కాల్పుల విరమణ, బేషరతు చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. భౌతిక నిర్మూలన కాదు, రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలి అని డి హెచ్ పి ఎస్ స్పష్టం చేస్తోంది అని అన్నారు.

*కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలి.

*కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలి..

*అమాయక గిరిజనుల ప్రాణాలను కాపాడాలి..

*సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకటరత్నం డిమాండ్..

తిరుపతి(నేటి ధాత్రి) మే 02:

 

 

 

తెలంగాణ
చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తక్షణం ఆపివేయాలని సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. కగార్ ఆపరేషన్ ను నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి వెంకటరత్నం మాట్లాడుతూ మోది నాయకత్వంలో నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ కేంద్రం సాయుధ బలగాలను రంగంలో దింపి అడవులను జల్లెడ పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న అమాయక గిరిజనులు తూటాలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల దాష్టికాన్ని తట్టుకోలేక గిరిజనులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ప్రకృతిని నమ్ముకుని నివసిస్తున్న అమాయకులను బలి తీసుకోవడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో అటవీ ప్రాంతాల్లోని విలువైన ఖనిజ సంపాదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఆయన ఆరోపించారు. తక్షణం కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.వెంకయ్య, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి.లోకేష్, పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ అలాగే వెంకటేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

ఆదివాసీల అంతం కోసమే కేంద్ర ప్రభుత్వం.!

ఆదివాసీల అంతం కోసమే కేంద్ర ప్రభుత్వ కుట్ర ఆపరేషన్ కగార్ ను నిలిపి వేయాలి.

తుడుందెబ్బ డిమాండ్.

కొత్తగూడ, నేటిధాత్రి:

ఆదివాసీ ల భూభాగం లోని అడవి బిడ్డల కాళ్ళ కింద ఉండబడిన వనరులను,విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు,సిద్దపడి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల ఆవాస నివాస ప్రాంతం లోకి మిల్టరీ,సి ఆర్ పి యఫ్,కొబ్రా,బ్లాక్ కామోండో బాలగాలను దించి ఆదివాసీల స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా,ఇష్టా రాజ్యాంగ ఆదివాసీల పై ఉచ్చకోత కోస్తుందని, పౌర హక్కుల ను కాలరాస్తూ, అల్లకల్లోలం సృష్టిస్తూ ఆదివాసీలని అంతం చేయాలనే కుయుక్తులు పన్నుతుందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దమణ కాండను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుందని, ఆదివాసుల పై వనరుల దోపిడీ కోసం జరుగుతున్న దుచర్యలను యావత్ పౌర సమాజం ముక్తాఖంఠం తో వ్యతిరేకించి ఆపరేష్ కగార్ ను నిల్పివేసే వరకు తమ నిరసన ను తెలిపాలని కర్రే గుట్టలనుండి సాయుధ బలగాలను వెంటనే వెనుకకు రప్పించెందు కు హక్కుల సంఘాలు,బిజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పై పోరాటాలు చేయాలని ఈ రోజు కొత్తగూడ గ్రామ పంచాయితీ ఆవరణములో మండల అధ్యక్షులు ఈక విజయ్ అధ్యక్షతన జరిగిన కగార్ వ్యతిక సమావేశం లో జిల్లా అధ్యక్షలు కుంజ నర్సింగరావు డిమాండ్ చేశారు సమావేశం లో పూనెం సురేందర్,ఈక సాంబయ్య,సిద్దబోయిన లక్ష్మీ నారాయణ,బంగారు సారంగా పాణి,భూపతి రమేష్ లు పాల్గొన్నారు.

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపి వేయాలి.

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపి వేయాలి

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

ఆదివాసి,దళిత,గిరిజన,ప్రజా సంఘాల నాయకుల డిమాండ్..

నేడు ములుగులో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు..

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:

 

 

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర బలగాలు గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి,దళిత,గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మూలంగా నిరాయుదులైన ఆదివాసీలు,మహిళలు,చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని,ప్రజలు సాధారణ జీవితం గడపలేక భయాందోళనలు చెందుతున్నారని,తాగు నీరును కూడా సేకరించుకోలేని దీన స్థితిలో చనిపోయే స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సైనిక చర్యను నిలిపివేసి,ఆదివాసి ప్రాంతంలో అభివృద్దిని స్థాపించుటకు తక్షణం మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.నేడు ములుగు జిల్లా కేంద్రంలో జరిగే శాంతిర్యాలీలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు,వివిధ ప్రజాసంఘాలు,కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన,ఆదివాసి,ప్రజాసంఘాల నాయకులు సోమ రామ్మూర్తి,జిలుకర శ్రీనివాస్,మాదాసి సురేష్,బొట్ల బిక్షపతి,జై సింగ్ రాథోడ్,నున్న అప్పారావు,సిద్ధమైన లక్ష్మీనారాయణ,తెలంగాణ కొమురయ్య,ఐతం నగేష్ బాదావత్ రాజు,అజ్మీర వెంకట్,సిద్దిరాజు యాదవ్ తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version