ఝరాసంగం మండల్ కొల్లూర్ గ్రామంలో.ఆలయ ధర్మకర్త శ్రీమతి భ్రమరాంబ రాములు గౌడ్ ఆధ్వర్యంలో రెండు రోజులు కనుల పండుగ సాగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవం.ఆలయ కమిటీ చైర్మన్ డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త మాట్లాడుతూ.ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఎస్సై నరేష్ మునిపల్లి మాజీ జెడ్పిటిసి ఫైతరి సాయికుమార్ రైతుబంధు మండల అధ్యక్షులు పరశురామ్ గౌడ్ ఝరాసంగం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం సింగర్ సంధ్య పాటిల్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి బస్వారాజ్ పాటిల్ సతీష్ గౌడ్ రమేష్ గౌడ్ డప్పురు సంగమేష్ నందు పటేల్ శ్రీకాంత్ పటేల్ వేణుగోపాల్ రెడ్డి దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.
గత వారం రోజుల నుండి సిరిసిల్లా జిల్లా చేనేత చౌక్ లో ప్రధాన రహదారిపై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు.దీంతో రహదారిలో వెళ్లే వాహనదారులకు గాని, బాటసారులకు గాని ఇబ్బందులు తలెత్తడం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా చేనేత చౌక్ లో ఓల్డ్ బస్టాండ్ సమీప నా ఎక్కువ రద్దీగా జనసంచారం ఉన్న ప్రదేశంలో సిగ్నల్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇదొక విడ్డూరమని చెప్పవచ్చు అని భావిస్తున్నారు. వాహనదారులకు గాని,బాటసారిలకు గాని ప్రమాదం తలెత్తకుండా వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిర్ చౌరస్తాలో నూతనంగా ట్రెండి వాల్కాస్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా షోరూం యజమాని మహేష్ ఆహ్వానం మేరకు ట్రెండీ వాల్కాస్ షోరూమ్ ను సందర్శించిన టిజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి తో అందరూ అభివృద్ధి చెందాలని అన్నారు వారితోపాటు ఈ కార్యక్రమంలో వారితోపాటు బిజీ సందీప్ వెంకట్ జగదీశ్వర్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
నెల రోజుల నుంచి కూలీ పనులు కల్పించడం లేదు పని చేసిన తర్వాత కొలతలు మేమే తీసుకోవాలి ప్రశ్నిస్తే మీ ఇష్టమున్న చోట చెప్పుకొండి అంటూ దబాయింపు ఎంపిడిఓ ముందు మొర పెట్టుకున్న కూలీలు ఉపాధి హామీ పథకంలో తమకు సరిగా కూలీ పని కల్పించడం లేదని, పనిచేసిన తరువాత కొలతలు కూడా తమే చేసుకోవాల్సి ఉందని మం డల పరిధిలోని తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది ఉపాధి కూలీలు శుక్రవారం ఎంపిడిఓ సుధాకర్ కు మొర పెట్టుకు న్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ పనితీరుకు వ్యతిరేకంగా కూలీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. తమ కు నెలరోజుల నుంచి సరిగా కూలీకల్పించడం లేదన్నారు. కప్పాడ్ గ్రామా నికి చెందిన వ్యక్తిని తమ గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించా దంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడన్నారు. పని విషయంలో ఏదైనా అడుగుతే సరైన సమాధానం ఇవ్వడం లేదు. ఇష్టం ఉంటే చే యండే లేదంటే పని మానుకుండి తమకు దబాయిస్తున్నాడని వారు. వాపోయారు. ఈ విషయంపై ఫీల్డ్ అసిస్టెంట్ కు ఎంపిడినో ఫోన్ చేసి ఆయన పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు పని కల్పించ కపోతే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరిం చారు. విధులకు సక్రమంగా హాజరు కానిఉపాధి హామీ ఈసి ప్రతాప్ రెడ్డిపై కూడా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జహీరాబాద్‌లో ముస్లిం వివాహ మందిరం మరియు హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 1 కోటి వ్యయంతో ఆమోదించబడిన మినీ హజ్ హజ్ మరియు ముస్లిం వివాహ మందిరం యొక్క పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, మాజీ హజ్ కమిటీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, 2022 లో, జహీరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హజ్ హజ్ మరియు ఖూర్ (ఖోర్) శంకుస్థాపనను మాజీ బ్రిక్స్ ప్రభుత్వ రాష్ట్ర ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు వేశారని, కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ, వాటి నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హజ్ గృహాల నిర్మాణ పనులను ప్రారంభించగా, ఇప్పటివరకు అది మెత్ కే పరిమితమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించాలని, జహీరాబాద్‌లోని ముస్లిం వివాహ మండపం, హజ్ గృహం పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని హజ్ కమిటీ మాజీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ డిమాండ్ చేశారు.
నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో నెలకొన్న అనుమానం.
పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వం.
అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ చేరిన గెలుపు తీరం.
బిజేపిని గెలిపించి చూపిస్తా అన్నాడు.
కాంగ్రెస్ ను ఓడిరచి చూపించాడు.
టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.
ఎమ్మెల్సీలను గెలిపించి చూపించిన ఘనత బండిదే.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి సంకేతం.
టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి సంకేతం.
మంత్రిగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం.
బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం.
బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ నేతల ఆకాంక్ష.
బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి చారిత్రక విజయం సాధించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాల మీద వేసుకొని గెలిపించడంతో బిజేపి గొప్ప విజయాన్ని అందుకుంది. తెలంగాణ రాష్ట్రములోని బిజేపి నాయకులంతా అదే స్పూర్తిని అనురించాలి. తమ తమ రాజకీయ చతురతను, రాజకీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే తెలంగాణలో బిజేపి తిరుగులేని శక్తిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. వచ్చే ఎన్నికలలో నాటికి బిజేపి ఎదురులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఓసారి లోతుగా విశ్లేషిస్తే మంత్రి బండి సంజయ్ చూపిన చొరవ అంతా ఇంతా కాదు. గత ఆరు నెలల కాలంగా ఒక్కో ఇటుకను పేర్చినట్లు తన ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేశాడని చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఒక తార్కాణం. ఎన్నికలలో బండి వ్యక్తి గత రాజకీయానికి బిజేపి బలం తోడై కమలం విజయం ఉత్తుంగ తరంగంలా విజయకేతనం ఎగరవేసింది. తెలంగాణ బిజేపి నాయకులు, శ్రేణులు బండి సంజయ్‌ను కొనియాడుతున్నారు. అసలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాదు, సరికొత్త చరిత్ర సృష్టించడం కూడా బిజేపికే చెల్లింది. నిజానికి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. కానీ యూనియన్లు పాలు పంచుకునే రాజకీయానికి కొత్త తరహా రాజకీయం కూడా చూపించింది బండి సంజయ్ అని చెప్పకతప్పదు. గతంలో ఇలా ఏ పార్టీ ధైర్యం చేయలేదు. టీచర్స్ ఎమ్మెల్సీలలో పార్టీల అభ్యర్థులను రంగంలోకి దింపే సాహసం చేయలేదు. బండి సంజయ్ అంటేనే ఒక సాహసం. ఒక ధైర్యం. నలుగురు నడిచే దారిలో నడిస్తే ప్రత్యేకత ఏముంటుంది. నలుగురికి దారి చూపించే సరికొత్త మార్గం వేసేవారికే సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. అది తెలంగాణ రాజకీయాలలో తన మార్క్ రాజకీయాన్ని చూపించి, విజయాన్ని సొంతం చేసిన ఏకైక నాయకుడు బండి సంజయ్. బండి సంజయ్ తోనే తెలంగాణలో బండితోనే కమల వికాసమని మరో సారి రుజువైంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా బండితోనే బిజేపికి ఊపు…బిజేపికి గెలుపు అని చెప్పకతప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బిజేపి రాజకీయాలలో బండి సంజయ్ కు ముందు, తర్వాత అని చెప్పడం కరక్ట్. గతంలో తెలంగాణలో బిజేపి ప్రభావం లేదని కాదు. ఆ పరంపరను కొనసాగించడమే కాదు, ఊపును తెచ్చి విజయ తీరాలను బిజేపి ఒంటరిగా అందుకునేలా బండి నాయకత్వం పని చేసింది. తెలంగాణలో సహజంగా హైదరాబాద్ లో బిజేపి ఎంతో కొంత కీలక భూమికనే పోషించేది. ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడూ జిహెచ్‌ఎంసిలో సీట్లు పది దాటింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కనీస ప్రభావం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ రంగంలోకి దిగారో అప్పుడే సీన్ మారిపోయింది. బిఆర్‌ఎస్ కు సీన్ సితారైంది. బిజేపి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఒక్క అంశం చాలు. బండి రాజకీయం ఎలా వుంటుందో చెప్పడానికి…గత ఎన్నికల ముందు బండి దూకుడుకు ఎందుకు కళ్లెం వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఎన్నికల దాక బండి సంజయ్ అధ్యక్షుడుగా వుండే ఆ రాజకీయాలే మరోలా వుండేవి. కాంగ్రెస్ పార్టీ అధికారపు అంచులను తాకేది కాదు. బిఆర్‌ఎస్ కు 39 సీట్లు వచ్చేవే కాదు. కానీ అనుకోని రాజకీయ ఎత్తుగడలు బండిని లాగేయాలని చూసినా, పార్టీ కోసం నిరంతరం పరిశ్రమించే నాయకుడు సంజయ్. ఇప్పటికీ మించి పోలేదు. బిజేపి నాయకుల చూపంతా బండి నాయకత్వం వైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మరో సారి బండి చాతుర్యం సాక్ష్యంగా నిలిచింది. బండితోనే భవిష్యత్తు బిజేపి గెలుపు కార్యకర్తలు మరింత బలంగా నమ్మడానికి కారణమైంది. తెలంగాణలో ఎప్పుడూ లేనంత గ్రాఫ్ పెంచించే బండి సంజయ్ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ యువతను బిజేపి వైపు మళ్లించడంలో బండిపోషించిన పాత్ర అందరికన్నా పెద్దది. ఒకప్పుడు బిజేపి చిన్న చిన్న పట్టణాలకే పరిమితం. ఇప్పుడు తెలంగాణ లో ప్రతి పల్లెల్లో బిజేపి జెండా ఎగురుతోంది. ప్రతి గ్రామంలో బిజేపి పార్టీ ఏర్పడిరది. ప్రతి ఊరులోనూ బిజేపి బలంగా మారుతోంది. జాతీయ నాయకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిషాల జపం యువత చేస్తున్నారంటే ముమ్మాటికి అది బండి సంజయ్ కృషి అని చెప్పాలి. బండి మాటలతోనే యువత బిజేపి వైపు చస్తున్నారు. జాతీయ రాజకీయాల వైపు యువత ఆలోచనలు చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఎర్ర జెండాలు కనిపించేవి. ఆ జెండాలు పోయి, అంతటా కాషాయ జెండాలు ఎగురుతున్నాయి. అందుకు ప్రధాన కారణం బండి సంజయ్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే బిజేపి అభ్యర్థుల ఎంపికపై ముందు అందరికీ అనుమానాలే వుండేవి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో బిజేపి శ్రేణులలో నిరాశావాదం ఆవహించింది. అంతెందుకు నామినేషన్ల తర్వాత కూడా బిజేపి నాయకులలో అనుమానం అలాగే వుంది. కానీ బండి సంజయ్ ప్రచార రంగంలోకి దిగిన తర్వాత ఆ మాటలు మాయమై పోయాయి. పట్టు వదలని విక్రమార్కుడై బండి సాగించిన ప్రచార పర్వంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది. బిజేపి ప్రచారంలో దూసుకుపోతుంటే అప్పుడే కాంగ్రెస్ చేతులెత్తేసింది. అభ్యర్థుల గెలుపు పట్ల బండి తీసుకున్న చొరవ గెలుపు తీరం చేర్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలో మిగతా బిజేపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర అంతా ఒక ఎత్తు. బండి సంజయ్ సాగించిన ప్రచారం మరో ఎత్తు. ఎందుకంటే బిజేపిని గెలిపించి చూపిస్తా అని బండి సంజయ్ శపధం చేశాడు. బిజేపి అభ్యర్థులను గెలిపించి, కాంగ్రెస్ ను ఓడిరచి చూపించాడు. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బిజేపి ఖాతాలో వేశాడు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బిజేపికి బలం పెరిగిందనడానికి బండి నాయకత్వమే సంకేతం. టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలవడం బండి సారధ్యానికి నిదర్శనం. కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా వున్నా జనంలో వుండడమే సంజయ్‌కు ఇష్టం. జనం సమస్యల పరిష్కారమే బండి సంకల్పం. కేంద్ర మంత్రిగా వున్న వాళ్లు గతంలో కంటికి కనిపించే వారు కాదు. అధికారిక కార్యక్రమాలు తప్ప జనంలో నడిచింది లేదు. కారు దిగి ప్రజల వద్దకు వచ్చే వాళ్లు కాదు. కానీ బండి అలా కాదు. సికింద్రాబాద్ లో గుడి విషయంలో అలజడి నెలకొంటే జనం మధ్యలో వున్నారు. అశోక్ నగర్‌లో గ్రూపు అభ్యర్థులు నిరసనలు తెలియజేస్తుంటే వారికి సంఫీు భావం తెలిపారు. తాను కేంద్ర మంత్రిగా కాకుండా, ఒక బిజేపి సామాన్య కార్యకర్తగా నిరుద్యోగుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిజేపి పార్టీ బలోపేతమే బండి లక్ష్యం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి విజయం సాధించడం ఆ పార్టీకి ఎంతో ఊపునే కాదు, మరింత ఊపిరి పోసినట్లైంది. దాంతో బండి సంజయ్ పై బిజేపి నాయకులలో మరింత నమ్మకం పెరిగినట్లైంది. అందువల్ల బండికే మళ్ళీ పగ్గాలివ్వాలని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో కోరుతున్నారు. బండితోనే తెలంగాణ కాషాయమయం కావడం పక్కా బలంగా విశ్వసిస్తున్నారు. కేంద్ర బిజేపి నాయకత్వం కూడా అదే ఆలోచిస్తోంది. ఈ సారి అధ్యక్ష ఎంపిక బండి సంజయ్‌కే అప్పగించాలని అనుకుంటోంది. మంత్రి పదవి బండి సంజయ్ కు అడ్డంకి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో వుండి కూడా బండి మంత్రిగా కొనసాగడం ఇబ్బంది ఏ మాత్రం కాదు. మంత్రిగా కొనసాగిస్తూనే బండికి అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలి
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి
-రైతుల నష్టపరిహారంకై బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు
-ఈటల చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
National
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులతో కలిసి ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా ఎంతోమంది రైతులు భూములను కోల్పోయి నిరాశ్రయులవుతున్నారని, వారికి మార్కెట్ ధర కల్పించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒక ఎకరాకు మూడు కోట్ల రూపాయలను విలువచేసే భూములు కోల్పోతున్నప్పటికీ..వారికి తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇట్టి విషయంలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సందర్భంగా భూములను కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారని, ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భాజపా శ్రేణులు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి రైతులు అడ్డూరు రాజేందర్ సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రావు బండారు రవీందర్ బండారు శ్రీనివాస్ బండారు తిరుపతి కొల్లూరు స్వప్న గుర్ర సునంద రెడ్డి మోరే పద్మ శనిగరపు శ్రీనివాస్ మొగులపల్లి టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాల రైతులు పాల్గొన్నారు
“వరంగల్ ఈస్ట్ జోన్ నూతన డీసీపీ” గా ఎస్. అంకిత్ కుమార్
వరంగల్, నేటిధాత్రి :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ “ఈస్ట్ జోన్ డీసీపీ” గా అంకిత్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంకిత్ కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ట్రైనీ ఐ. పి. ఎస్ గా పని చేశారు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ గా పనిచేస్తున్న రవీందర్ ను సీఐడీ విభాగం ఎస్పీ గా బదిలీ అయ్యారు
మండల ప్రజా పరిషత్ పరకాల కార్యాలయములో అంతార్జీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల పరిధిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ఎదుగుతున్నారని అయినప్పటికీ కుటుంబంలో ఎవరి పాత్ర వారు పోషించినప్పుడే సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ యన్. శ్రీలత,సూపరిండెంట్ సిహెచ్ శైలశ్రీ,ఈ టెక్నికల్ అసిస్టెంట్ సుమలత,పంచాయతీ కార్యదర్శులు బి.సుమలత , మహ్మద్ రిజ్వానా,కంప్యూటర్ ఆపరేటర్ అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల,ఈసీ రజనీకాంత్ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టే ఎస్సై శ్రీనివాస్ రెడ్డి
నిజాంపేట , నేటి ధాత్రి
కేసులలో కోటు చుట్టూ తిరిగే వారికి ఈనెల 8 తారీకున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టేనని రాజీ మార్గమే రాజా మార్గమన్నారు.
సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం బస్టాండ్ సమీపం లోని రాజీవ్ రహదారి పై శుక్రవారం సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఏ హెచ్ కె ఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ సిస్టమును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వారు మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలు తగ్గుతాయని అన్నారు.ఇందారం ఓసిపి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి పవర్ ప్లాంట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు హెచ్ కె ఆర్ సంస్థ చొరవ చూపాలని ఎమ్మెల్యే వివేక్ వారిని కోరారు.
న్యాల్ కల్ మండలంలోని మల్గి గ్రామంలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు జరిగిన సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.మల్గి శివారులోని మల్లన్న స్వామి ఆలయానికై సీసీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది.ఇట్టి రోడ్డును డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ పూజలు చేసి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ మల్గి గ్రామ సర్పంచ్,మల్లన్న స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి,మాజీ ఎంపీటీసీ శివానంద నాయకులు సిద్ధారెడ్డి, కుశాల్ పాటిల్ ,అర్జున్,వైద్యనాథ్,బీరప్ప, తుకారం,మారుతి,హనుమంత్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.
– రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ ల ట్రాన్స్ ఫర్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ,
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా ను రామగుండం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సూర్యపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ ను వరంగల్ కమిషనరేట్ కు బదిలీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసును సీఐడీకి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదేవిధంగా పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతనను తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పి.కరుణాకర్‌ను బదిలీ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, కంరీంనగర్ సీపీగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగాఅఖిల్ మహాజన్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, సిరిసిల్లా ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యపేట్ ఎస్పీగా నరసింహా, సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, సీఐడీ ఎస్పీగా రవీందర్ బదిలీ అయ్యారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పాలకుల ఎన్నికల హామీల అమలుకై, పోడు రైతులకు అటవీ హాక్కుపత్రాలకై ప్రజా ఉద్యమాలే ఏకైక శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఎంసీపీఐ(యు) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి కలకోట్ల యాదగిరి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోగా పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తుల ఆస్తులు వందలరేట్లు అధికంగా పెరిగాయని దేశ సంపద వనరులు దోచుకునే విధంగా పాలకులంతా అదే పనిలో ఉన్నారని ఆరోపించారు.ఆకలి, దారిద్రం,నిరుద్యోగం,ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని దీనికి తోడు ప్రజల మత బలహీనతలను ఆసరా చేసుకొని విభజించు పాలించు అనే విధంగా దేశ సమైక్యత సమగ్రతను విచ్చిన్నం చేసే విధంగా మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని అవేదన వ్యక్తం చేస్తూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను భ్రమలకు ఆశలకు గురిచేసి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి తమ ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు.పోరాడే వ్యక్తులు శక్తులను అప్రజస్వామికంగా అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హింసను ప్రేరేపించుటకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దశాబ్దాల క్రితం పోడు వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని,ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా ప్రజలను చైతన్యపరిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యం ఎర్రజెండాపై ఉందని అందుకోసం కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు గనపాక నర్సయ్య, రాఘవరావు గోపాల్,లక్ష్మి, యాకయ్య, గంగాధర నర్సయ్యగ్ జి ఎల్లమ్మ, రాజేందర్, రామ తదితరులు పాల్గొన్నారు.
అధికారం కోల్పోయి ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి :
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో నేను జై తెలంగాణ అంటూ తిరుగుతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక సంస్కారహీనులుగా మాట్లాడు సభ్య సమాజం తలదించుకునే విధంగా విచక్షణ కోల్పోయి కేటీఆర్ ముప్పు కోసం కేకే పై కారుకూతలు కూస్తావా నీ జిల్లెల్ల గ్రామంలో పది సంవత్సరాలు సర్పంచ్ గా చేసి ఏం చేసినావు నిరూపించాలి బాత్రూంలో పైసలు దోచింది నిజం కాదా గ్రామంలో అరాచకం ఎవరికి తెలవద కేటీఆర్ పర్యటనలు అప్పుడు క్రషర్ వల్ల రైతులు నష్టపోతున్నారని అని నిరసన తెలుపలేదా ఎల్లారెడ్డి పేట మండలంలో చిన్నారిపై అగైత్యానికిపాల్పడిన మీ నాయకుడు కాదా పై నాయకుడిపైఏ చర్యలు తీసుకున్నారు కనీసం చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగ్యస్వామిగా పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి రావాల్సిన టికెటు మీ నాయకుడు గద్దలగా తందికపోయింది నిజం కాదా కేకే మహేందర్ రెడ్డి కి జరిగిన అన్యాయం విషయంలో కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు సిగ్గుపడతారు తెలుసుకో సిరిసిల్ల పట్టణంలోని దళిత గిరిజన మైనార్టీ హాస్టల్లో జరిగిన అగైత్యానికి ఎవరు పాల్పడ్డారు తెలుసుకోవాలని మేము గెలవకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్లకి అండగా ఉన్నామని మీరు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఏం చేసిండు ఆయన కంట్రిబ్యూషన్ ఎంత మొట్టమొదటిగా జెండా పార్టీ పార్టీ ఉద్యమంలో సబ్బండ వర్గాలను మమేకం చేసి ఉద్యమాన్ని లేపిన వ్యక్తి కేకే అని ఉద్యమం ఉనికి కాపాడాలని ప్రజలు కేటీఆర్ ను గెలిపిస్తే మీరు ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా మారి వారికి ఎన్నో కాంట్రాక్టులు ఇప్పించింది మీరు కాదా మీరు దొంగలాగా రాజకీయాలు చేసేది మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేది మీ ప్రభుత్వ పాలనలో 3500 కోట్లు ఇసుకను తరలించాలని ధర్నాలు చేస్తే స్పందించలేరు ఇందులో కేటీఆర్ వాటా ఎంత నేరెళ్లఘటనలో ఒక వ్యక్తి చనిపోయితే దళితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు స్పందించలేదు అప్పుడు ప్రశ్నించని మీరు ఇప్పుడు ప్రశ్నిస్తారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలు చెప్పడానికి కేటీఆర్ ను కలిసిన పట్టించుకోలేదని జిల్లా ఉద్యమ సమయంలో కేటీఆర్ ను కలిసిన జిల్లా ఏర్పాటు విషయం వివరించినామని తంగళ్ళపల్లి మండలంలో కొన్ని గ్రామాలను మున్సిపల్ చేస్తారంటే కలపడానికి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేసింది మేమే కాదా ప్రజలను హాస్పిటల్లో చేర్పించి నట్టు నటించి డాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్నది నువ్వు కాదా అగ్రికల్చర్ కాలేజీలో భూములకు పోయి 12 కుటుంబాలకు న్యాయం జరగలేదని కానీ నీ భార్య పేరు మీద సర్వే నెంబర్ 1.2.గుంటల భూమి పట్టా పొందిన ముచ్చట వస్తాము కాదా మీ పార్టీ నాయకురాలు సరస్వతి ఒకటి నాలుగు సార్లు ప్రభుత్వ లోన్ తీసుకున్నది నిజం కాదా ఆమె 2.20. గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించు కున్నదివాస్తవం కాదా గత అధికార మందాన్ని ఇప్పుడు చూపిస్తే ఊరుకోం. మీ నాయకుడు మీకు ఇదే నేర్పిస్తున్నాడా అక్రమ మైనింగ్ ద్వారా క్రషర్ నడిపించి పక్క పొలాల రైతులను ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా ప్రగతి భవన్ ఊరి అవతల కట్టిన దావతులకు అండగా మార్చిన నీవు కాదా మీ అగ్రికల్చర్.కాలేజీ నిర్మాణంలో భూమి కోల్పోయిన మీ ఊరి వ్యక్తి నీ వల్ల గుండె ఆగి చనిపోయారు నా భూమి నాకు ఇప్పించమంటే కుల బహిష్కరణ కేసు పెట్టింది వాస్తవం కాదా అప్పుడు నీళ్ళు ఇచ్చారనిఅడ్డగోలుగా మాట్లాడుతున్న మీరు ఇప్పుడు నీళ్లు ఎందుకు రావడం లేదో చెప్పాలి. కాల్వ నిర్మాణం కోసం రైతు చంద్రారెడ్డి నష్టపరిహారం ఇస్తానని ఇవ్వలేదు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇప్పుడు మాత్రం ఇస్తానని అనడం సిగ్గుచేటు ఏది నిజమో ఏది అబద్ధము తెలుసుకొని మాట్లాడాలి ఓడిపోయి ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి విమర్శించడం సరికాదు అని అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దారి నిర్మించినావా అలాగే మమ్మల్ని కాపాడు మహాప్రభు అంటూ కేకే మహేందర్ రెడ్డి చుట్టూ మీ నాయకులు తిరుగుతున్నారు మీ నాయకులు వెంటనే కేకే మహేందర్ రెడ్డి కి బే షరతుగాక్షమాపణ చెప్పాలని సందర్భంగా ఇకనైనా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో నేరెళ్ల నరసింహం గౌడ్ మునిగల రాజు పెట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి రాము పొన్నాల పరిసరం ఆరేపల్లి బాలు చుక్క శేఖర్ జలంధర్ రెడ్డి బాలసాని శ్రీనివాస్ గౌడ్ సామల గణేష్ కాబట్టి మల్లేశం యాదవ్ బండి పరశురాం అని సుద్దాల శ్రీనివాస్ గుగ్గిళ్ళ అభినయ్ తదితరులు పాల్గొన్నారు
గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం .రీజనల్ మేనేజర్ కు సీపీఐ(ఎం) వినతి నల్లగొండ జిల్లా, నేటిదాత్రి: గుజ్జ గ్రామానికి నార్కట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన బస్సును గ్రామం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం)నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నారి ఐలయ్య,బండ శ్రీశైలం మాట్లాడుతూ కరోనాకు ముందు నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 6.30 గంటలకు నార్కట్పల్లి నుంచి బయలుదేరి బ్రాహ్మణ వెల్లేముల,పలివెల,గుజ్జ, సర్వేలో గ్రామాల మీదగా చౌటుప్పల్ కు వెళ్లి తిరిగి అదే గ్రామాల మీదగా నార్కట్పల్లికి చేరుకునేది అన్నారు.ఉదయం సాయంత్రం ఇలా రోజుకు రెండు పర్యాయాలు తిరిగేదన్నారు.ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామం లోపలికి వెళ్లి హైదరాబాదులోని దిల్సు ఖునగర్ వరకు పెళ్లి తిరిగి వచ్చేదన్నారు.కరోనా సమయంలో బంధయిన ఈ బస్సులు తిరిగి నల్లగొండ డిపోకు చెందిన బస్సు ప్రారంభమైనప్పటికీ నార్కట్పల్లి డిపోకు చెందిన బస్సు ప్రారంభం కాలేదన్నారు.వాణిజ్య పంటలకు కేంద్రమైన గుజ్జ గ్రామానికి బస్సు సౌకర్యాలు లేకపోవడం వల్ల పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు, విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు,వివిధ అవసరాల కోసం వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. నార్కట్ పల్లి ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలని, నల్లగొండ నుంచి వస్తున్న బస్సులు గ్రామంలో పలికి రప్పించాలని కోరుతూ శుక్రవారం ఆరంభకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య,గుజ్జ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, నారాయణపురం మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, గుజ్జ మాజీ సర్పంచ్ చాడ నరసింహ,ఉప సర్పంచ్ వెలిజాల గోపిక,రైతు సంఘం నాయకులు బొమ్మగాని శంకరయ్య, మహిళా సంఘం నాయకురాలు కుకుడాల మంగమ్మ తదితరులు ఉన్నారు.
పలమనేరు పట్టణం గుడియాత్తం రోడ్డు సమీపంలో ఉన్న ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో ముందస్తు మహిళా దినోత్సవం నిర్వహించినట్లు సిడిపిఓ ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాల్సి ఉండగా శనివారం సెలవు రోజు కాబట్టి ముందుగా జరపాలసి వచ్చిందన్నారు. ఈ దినోత్సవానికి మహిళా డాక్టర్లు శారద, సుధారాణి, ఎస్సై స్వర్ణ తేజ ,లెక్చరర్ రుక్మిణి, బాలికల పాఠశాల హెచ్ఎం కుప్పమ్మ ముఖ్య అతిథులుగా హాజరైనారు.ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులకు సామాజిక సేవాదాత శ్రీపురం సీతారామయ్య, వీరి పెద్ద కోడలు సునీత చేతుల మీదుగా శాలువులు కప్పి ఘనంగా సన్మానించారు. లెక్చరర్ రుక్మిణి, ఎస్సై స్వర్ణ తేజ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అప్పుడే సమ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళలు, బాలికల యొక్క మేదస్సు దానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, వాటికోసం మనమందరము పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే భారతదేశంలో పురుషాధిపత్యం చెలరేగుతున్నదనడానికి మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలే నిదర్శనం అన్నారు.ఎక్కడో అమెరికా దేశంలో ఓ రాష్ట్రమునందు 5000 మంది మహిళా కార్మికుల చేత ప్రారంభమైన పోరాటం ప్రపంచ దేశాల్లో అలుముకుందని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక చారిత్రాత్మకమైన ఉద్యమ పండుగగా జరుపుకోవాలని కోరారు. పిల్లల తల్లిదండ్రులు చిన్నతనం నుండి విద్యతోపాటు, సామాజిక నైపుణ్యతలు, మానవతా విలువలు ఇంటి దగ్గరే వారికి బోధించాలన్నారుబాలికలను అన్ని రంగాల్లో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం కల్పించి ధైర్యంగా ముందుకు పంపించాలన్నారుఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నజ్మా, మాధవి లత, గీత, శారదమ్మ, ద్రాక్షాయని, పుష్ప, అంగన్వాడి వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి – కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
రాజన్న సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )
ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా, 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని,1230 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్ 1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్ 2 వద్ద 385 , ఎల్ 3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారుల ను ఫాలో అప్ చేయాలని అన్నారు.జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 లోపు రు
రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
*ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు..
*రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం..
తిరుపతి నేటి ధాత్రి :
కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నించి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
జహీరాబాద్ నియోజకవర్గ ము ,స్థానిక జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల లో జయ విజ్ఞాన భారతి సొసైటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి,రచయిత డా.పెద్దగొల్ల నారాయణ జహీరాబాద్ పట్టణంలో ని అన్ని డిగ్రీ కళాశాల లో విద్యార్థుల ఉన్నతి కోసం ,ఉత్తమ విలువలకోసం మొదటి రోజు ఆచార్య డిగ్రీ కళాశాలలో ట్రైన్ థ మైండ్ ఫర్ బ్రెట్ ఫ్యూచర్ ప్రోగ్రాం ను నిర్వహించారు. కళాశాల లో చదువుకుంటున్న విద్యార్థులకు వ్యాస రచన ,ఉపన్యాస, చిత్ర లేఖన పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మొదటి బహుమతి గోల్డ్ మెడల్, ద్వితీయ ,తృతీయ బహుమతులుగా సిల్వర్ మెడల్ లను ప్రదానం చేశారు.విద్యార్తులనుద్దేశించి ముఖ్య అతిధిగా పాల్గొన్న జహీరాబాద్ మండల విద్యాధికారి బస్వరాజ్ మాట్లాడుతూ చదువు తో పాటు ఉన్నత విలువల తో విద్యార్థులు బాగా చదువు కొని జీవితం లో ఎదగాలని, కేవలం చిన్న చిన్న ఉద్యోగం తో సరి పెట్టుకోకుంటా గ్రూప్స్ ,మరియు సివిల్స్ లాంటి ఉన్నత మైన ఉద్యోగాలు సాధించాలని కొనియాడారు. వశిష్ఠ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రమ శిక్షణ తో విద్యార్థులు ఏదైనా సాధించ వచ్చు అని,అదే విద్యార్థులు డిగ్రీ కె పరిమితం కాకుండా వి భిన్న కోర్స్ లు చేసి ఉన్నత ఉపాధి,ఉద్యోగులుగా స్థిరపడలని తెలియజేసారు.జయ విజ్ఞాన భారతి చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతం లో చదువు కుంటున్న విద్యార్థులు బాగా చదివి సివిల్స్ లో మంచి ర్యాంకు లు సాధించాలని, విద్యార్థులు తప్పకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ ,మనేజ్మెంట్ స్కిల్స్, చక్కని చేతి రాతను, కంప్యూటర్ కోర్సు లను నేర్చుకోవాలని చూచించారు. సీనియర్ జర్నలిస్ట్ షకీల్ మాట్లాడుతూ చదువే అన్నింటికీ మూలం అని, చదువు బాగా చదువుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని తెలియజేసారు. ముఖ్య అతిధులకు శాలువా ,మెమోంటో తో సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల విద్యాధికారి బస్వరాజ్,ఆచార్య కళాశాల ప్రిన్సిపాల్ డా.హరికుమార్,వశిష్ఠ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఉప్పరి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ షకీల్, డా.పెద్దగొల్ల నారాయణ, సంస్థ డైరెక్టర్ లు డోరే బాలకృష్ణ, మొహమ్మద్ ఫహిమ్, నితీష్ రెడ్డి,మిథున్ నాయక్,మొహమ్మద్ ఖయూమ్, విశాల్,ఆచార్య డిగ్రీ కళాశాల అధ్యాపకులు నందకుమార్ గౌడ్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.