ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ. 6లక్షల జరిమానా..

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ. 6లక్షల జరిమానా..

*తీర్పు వెల్లడించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి.

తిరుపతి(నేటిధాత్రి)

 

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షలు జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి మంగళవారం తీర్పు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం(
ఆర్ ఎస్.ఏ,యస్,టి యఫ్
కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్, ఎల్ సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగూరి అమర నారాయణ ద్వారా పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు.ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 06/2017 కేసులో ఇద్దరు ముద్దాయిలు తిరుపతి జిల్లా నాగపట్ల అటవీ పరిధిలోని టీఎన్ పాళెం సెక్షన్ లో అరెస్టయ్యారు. వీరు తమిళనాడు, తిరువన్నామలై జిల్లా కు చెందిన విజయకుమార్, మణి కాగా వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్, తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న టాస్క్ ఫోర్స్ దర్యాప్తు అధికారులను, కోర్టు సిబ్బందిని ఆయన అభినందించారు.

రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం స్వాధీనం..

రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

*ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు..

*రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం..

తిరుపతి నేటి ధాత్రి :

కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నించి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version