గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలి
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి
-రైతుల నష్టపరిహారంకై బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు
-ఈటల చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి నేతృత్వంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా భూములను కోల్పోయిన రైతులతో కలిసి ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే సందర్భంగా ఎంతోమంది రైతులు భూములను కోల్పోయి నిరాశ్రయులవుతున్నారని, వారికి మార్కెట్ ధర కల్పించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒక ఎకరాకు మూడు కోట్ల రూపాయలను విలువచేసే భూములు కోల్పోతున్నప్పటికీ..వారికి తూతూ మంత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇట్టి విషయంలో భాజపా ఎంపీ ఈటల రాజేందర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సందర్భంగా భూములను కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారని, ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి భాజపా శ్రేణులు మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి రైతులు అడ్డూరు రాజేందర్ సత్యనారాయణ రెడ్డి రామచంద్ర రావు బండారు రవీందర్ బండారు శ్రీనివాస్ బండారు తిరుపతి కొల్లూరు స్వప్న గుర్ర సునంద రెడ్డి మోరే పద్మ శనిగరపు శ్రీనివాస్ మొగులపల్లి టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాల రైతులు పాల్గొన్నారు