జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య.!

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య

వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల

దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్

జడ్చర్ల / నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో మోదీ చంపినట్లు ఆనవాళ్లు ఉండడంతో పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వరుసగా గుర్తుతెలియని వ్యక్తులు కావేరమ్మపేట ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉండడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. తాజాగా మంగళవారం ఉదయం మృతి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా కలిగి ఉండడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు.

9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు.!

ఎమ్మార్పీఎస్ 9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు

పరకాల నేటిధాత్రి:

పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు మరియు ప్రవేశపెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలనిడిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ రిలే నిరాహార దీక్షకు మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు దాసరి రమేష్,ఎండి పాష,
తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ మాదిగ,మాదిగ విద్యా సమైక్యబొచ్చు నవదీప్ మాదిగ,ఏకు కృష్ణ మాదిగ, ఒంటేరు పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ,బొట్ల జాను మాదిగలు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,,

కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,,

రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,,

వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,,

యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,,

కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,,

రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్)

Sports

మైభారత్ యువభారత్ యువ ఉత్సవ్ యువతనుచైతన్య పంచడానికి క్రీడలు యువజన సర్వీసుల శాఖ స్వయం ఉపాధి అవేర్నెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని యువతకు ఆటల ద్వారా స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిద్దిపేట నెహ్రూ యువ కేంద్ర అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలుపుతూ రామాయంపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా క్రీడలకు ప్రోత్సహిస్తూ అనేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్న యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ కు మెదక్ జిల్లాస్థాయి స్పోర్ట్స్. మీట్ కార్యక్రమాన్ని నెహ్రూ యొక్క కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక యువజ్యోతి నిర్వహిస్తుందని తెలిపారు మెదక్ జిల్లా స్థాయి ఈ పోటీలలో వాలీబాల్ కబడ్డీ ఫుట్బాల్ బ్యాట్మెంటన్ సెటిల్ పోటీలను 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు యువకులకు బాలురకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉచిత గాని క్రీడాకారులకు క్రీడలు నిర్వహిస్తామన్నారు భోజన సదుపాయము కల్పించడంతోపాటు క్రీడల్లో పాల్గొన్న వారికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ క్రీడల వారి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు క్రీడల్లో పాల్గొన్న వారికి అలాగే విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ మెమోటోస్ అందజేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడల్లో పాల్గొనడానికి స్థానిక రామాయంపేట యువజ్యోతి కోఆర్డినేటర్ సత్యనారాయణకు పేర్లు అందజేయాలని కోరారు 9 0 00752850 ఫోన్ నెంబర్ కు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు 18 మార్చి చివరి తేదీ కాగా 19 20 తేదీల్లో క్రీడలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలి.

* తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
రేషన్ డీలర్ లేక ప్రజలు అవస్థలు

నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సింహుల గూడెం ప్రధాన బీటీ రోడ్డునుండి తిమ్మారెడ్డి గూడెం వరకు జరిగేరోడ్డుపనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గ్రామం నుండి రేషన్ బియ్యం కోసం ప్రజలురెండు కిలోమీటర్ల దూరం నుండి తుమ్మలపల్లి గ్రామానికి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు రూ. 2500 ఇవ్వాలని, భూమి లేని పేదలకుఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూమిలేని పేదలకు ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25, 26 తేదీలలో తహసిల్దార్ కార్యాలయల వద్ద నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చిట్టి మల్ల లింగయ్య, ఈరటి వెంకటయ్య, గ్రామ ప్రజలు ముత్తయ్య, యాదయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం.!

మొగిలి దుర్గాప్రసాద్ కు సన్మానం

కల్వకుర్తి/ నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన భాజపా సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ రెండవసారి బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన సందర్భంగా.. కల్వకుర్తి బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు పార్టీ గుర్తించి రెండవసారి రాష్ట్ర కౌన్సిల్ లాంటి కీలక పదవి కట్టబెట్టిందన్నారు.
ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు గుర్రాల రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ నెంబర్ బృంగి వివేకానంద, కల్వకుర్తి మున్సిపాలిటీ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్,
నాయకులు శేఖర్ రెడ్డి, లక్ష్మీనరసింహ, అరవింద్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ.

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

Congress leaders

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో బీసీ లకు 42% శాతం రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని పలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్ల పంపిణీ చేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రెస్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. టిపిసిసి సభ్యుడు సంగీతం శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప. గడ్డం నరసయ్య. మ్యాన ప్రసాద్. ఆకులూరి బాలరాజు. కుడిక్యాల రవి.తదితరులు పాల్గొన్నారు.

పేదలకు వైద్యం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ..

పేదలకు వైద్యం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ..

రామయంపేట మార్చి 18 నేటి ధాత్రి (మెదక్)

Indian Red Cross

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం మేడ్చల్ జిల్లా వారి సౌజన్యంతో కాళ్లకల్ గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య శిబిరమును తెలంగాణ రాష్ట్ర కార్య దర్శి ప్రొఫెసర్ ఏ శ్రీరాములు ప్రారంభిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను నిర్వహిస్తూ పేదలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు… ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాసరావు, కార్యదర్శి టి.సుభాష్ చంద్రబోస్, వైస్ చైర్మన్ పి. లక్ష్మణ్ యాదవ్, కోశాధికారి డి.జీ. శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పి.దామోదర్ రావు,దేమేయాదగిరి, మద్దెల సత్యనారాయణ, సభ్యులు శ్రీనివాస్, వి. సతీష్ రావు, మల్లారెడ్డి హాస్పిటల్ వైద్య సిబ్బంది మరియు జిల్లా మనోహరాబాద్ మండలకు సంబంధించిన వైద్య సిబ్బంది పాల్గొన్నారు కాల్లాకల్ విలేజ్ సెక్రెటరీ ఎం.శేషుడు సిబ్బంది పాల్గొన్నారు

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన..

రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన..

రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి (మెదక్)

 

 

Farmers

ఈరోజు అనగా మంగళవారం రైతు వేదిక రామాయంపేట నందు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం సహకారంతో రైతులకు నేరుగా శాస్త్రవేత్తల ద్వారా వివిధ సాంకేతిక సాగుకు సంబంధ అంశాలపై అవగాహనలో భాగంగా రైతు నేస్తం కార్యక్రమం విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వారం ముఖ్యంగా ఈ వేసవికాలంలో మామిడి పండ్ల తోటల సాగు యాజమాన్య పద్ధతులు చీడపీడల నివారణ నీటి యాజమాన్య పద్ధతులు అధిక దిగుబడులు సాధించడానికి వివిధ సాంకేతిక అంశాలను గూర్చి ప్రముఖ శాస్త్రవేత్త హరికాంత్ పండ్ల పరిశోధన స్థానం సంగారెడ్డి వారు రైతుల కు వివరించడం జరిగింది అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి సయ్యద్ అహమ్మద్ గారు ఈ వేసవికాలంలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన చీడపీడల యాజమాన్యం మరియు నీటి యాజమాన్య పద్ధతుల గూర్చి వచ్చే వానాకాలంలో నేల సంరక్షణ కోసం మరియు సేంద్రియ కర్బన పదార్థం పెంపు కోసం పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా జనుము పంటల సాగు విధానం గూర్చి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయి కృష్ణ ప్రవీణ్ పాల్గొన్నారు

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్.

కుక్కకాటుకు గురైన బాలికను పరామర్శించిన జిల్లా కలెక్టర్
విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్నబోనాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టేముక్కల సువర్ణ పై వీధి కుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని జిల్లా కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆమె తల్లితండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు.
అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్ బ్యాంక్ ను కలెక్టర్ పరిశీలించారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి, వైద్య సేవల తీరుపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించకుండా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా.!

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ప్రజలకు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రజలు అప్రమత్తంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.తెలిపారు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉ ష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ జారీ చేయడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం అయితేనే బయటకు రావాలని వచ్చేముందు వాహనదారులు తలకు హెల్మెట్ ధరించాలని తెలిపారు హైదరాబాద్ సంగారెడ్డి మంచిర్యాల జిల్లాలలో 42 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఒకవైపు ఎండలు పెరగడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అవసరమైతేనే తప్ప ఎండలో బయటకు వెళ్లకూడదని సూచించారు. బయటకు వెళ్లిన గొడుగులు వెంట తీసుకువెళ్లాలని సూచించారు ఎండ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు సజావుద్దీన్.సూచించారు.

ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన.!

ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పరామర్శించిన రమేష్ మేడి

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ ఏఏఓ గత నెల బైక్ యాక్సిడెంట్లో గాయపడిన విషయాన్ని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల అసోసియేషన్ సెక్రటరీ జనరల్ (ప్రధాన కార్యదర్శి) రమేష్ మేడి వచ్చి పరామర్శించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డివిజన్ నూతన కమిటీ కూడా పాల్గొనడం జరిగింది కమిటీని కార్యక్రమాలను అభినందించడం జరిగింది భవిష్యత్తులో ఏ కార్యక్రమం నిర్వహించిన అందరూ చురుకుగా పాల్గొనాలని చెప్పారు
రాహుల్ (సబ్ ఇంజనీర్) డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ (సబ్ ఇంజనీర్) సెక్రటరీ మొగులప్ప ( ఆర్టిజన్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ (సబ్ ఇంజనీర్) అడిషనల్ సెక్రటరీ రాములు (జే ఏ ఓ) ట్రెజరర్ కిరణ్ ( ఏ ఎల్ ఎం )
ఉపాధ్యక్షులు ,సంగమేష్ (ఎల్ ఎం) మాజీ అధ్యక్షులు ,
ఏఎల్ఎంలు జేఎల్ఎంలు ఆర్టిజన్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించిన మేము సైతం అని ముందుకు రావడానికి జహీరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగ అరుంధతి సంఘం నాయకులు వరాలు , స్వామి దాస్, జయరాజ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

పిల్లలతో సహా తండ్రి అదృశ్యం…

పిల్లలతో సహా తండ్రి అదృశ్యం…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో గల చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి అదృశ్యమైనట్లు చిరాగ్ పల్లి ఎస్సై కె.రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 17 తారీకు న పర్వతాపూర్ గ్రామానికి చెందిన గురడి గోపాల్ రెడ్డి (38) సంవత్సరల వయస్సు గల వ్యక్తి తన కూతురు అనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డి తో కలిసి సంగారెడ్డికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని బంధువుల దగ్గర చుట్టూ ప్రక్క ల గల గ్రామాలలో ఆచూకీ కోసం ప్రయత్నించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో పిల్లలతో సహా అదృశ్యం అయినా తండ్రి గోపాల్ రెడ్డి తల్లి గూరడి శోభమ్మ చిరాగ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్ పల్లి ఎస్ఐ కె. రాజేందర్ రెడ్డి తెలిపారు.

ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి.!

ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ మునిసిపల్ పరిధిలో ఇంటి స్థలం ఇంటి ట్యాక్సీలను వినియోగదారులు ల్యాండ్ రెగ్యులరైజర్ తమ ఆస్తులను చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం నాడు జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణం లో ప్రజలందరూ ఇంటి స్థలాలకు సంబంధించి ఖాళీగా ఉన్న ప్లాట్లకు కాలంలో 25 శాతం రాయితీతో చెల్లించి తమ ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవాలని తెలిపారు. ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని మిగతా వచ్చే 31 తారీకు లోపల చెల్లించి 25 శాతం రాయితీ పొందాలని ఆయన తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా.!

రంజాన్ మాసంలో ఉపవాసాన్ని ఖర్జూరాలు తిని ఎందుకు విరమిస్తారో తెలుసా..

జహీరాబాద్. నేటి ధాత్రి:

Ramadan

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్‌ నెలలో సెహ్రీ, ఇఫ్తార్‌లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా రంజాన్ నెలలో ఉపవాసం చేసిన ముస్లింలందరూ ఖర్జూరం తిని తమ ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉన్న ముస్లింలు రకరకాల ఆహారపదార్ధాలు, పండ్లు ఉన్నా… ఒక్క ఖర్జూరంతోనే అది కూడా మూడు ఖర్జూరాలు తిని ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా.. ఇలా చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..ఇస్లాం మతంలో రంజాన్ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి 28న సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. దీంతో రంజాన్ మాసం ప్రారంభం అయింది. మార్చి 1వ తేదీన మొదటి ఉపవాసం పాటించారు. మార్చి 1న భారతదేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. దీంతో భారతదేశంలో రంజాన్ నెల ప్రారంభం అయింది. ఉపవాసం దీక్షను మార్చి 2నుంచి ప్రారంభిస్తున్నారు. రంజాన్ నెలలో ఉపవాసం చేసే ముస్లింలకు సెహ్రీ, ఇఫ్తార్ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
ఉపవాసం దీక్ష విరమించి తర్వాత తీసుకునే విందుని ఇఫ్తార్ అని అంటారు. ఈ ఇఫ్తార్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖర్జూరం. సౌదీ అరేబియా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా అనేక ఇతర దేశాల్లోని ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండి.. సూర్యాస్తమం తర్వాత ఖర్జూరంతో ఉపవాసం విరమిస్తారు. అయితే ఖర్జూరంతోనే ఉపవాసం ఎందుకు విరమింస్తారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఖర్జూరంతో ఉపవాసం ఎందుకు విరమిస్తారంటే..

రంజాన్‌ సమయంలో ఖర్జూరాలను ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది. దీని కారణం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ఖర్జూర పండ్లను చాలా ఇష్టపడేవాడట. దీంతో ఆయన ఉపవాసం ముగించే సమయంలో ఖర్జురాలను తినేవారు. అంటే ఆయన ఖర్జూరాలు తిని ఉపవాసం ముగించేవారు. అప్పటి నుంచి ఖర్జూరంతో ఉపవాసం విరమించడం సంప్రదాయంగా.. మారింది. దీనిని సున్నత్ గా పిలుస్తారు.. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

ఇస్లాంలో సున్నత్ అంటే అర్ధం ఏమిటంటే..

ఇస్లాంలో సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం అంటే ప్రవక్త ముహమ్మద్ చూపిన అడుగుజాడలను అనుసరించడం. సున్నత్ అనే పదానికి అర్ధం ఖురాన్‌లో చాలా చోట్ల దేవుని మార్గం అని సూచిస్తుంది.

ఇఫ్తార్‌లో ఎన్ని ఖర్జూరాలు తింటారంటే..

ప్రవక్త ముహమ్మద్ తన ఉపవాసం ముగించడానికి మూడు ఖర్జూరాలు తిని.. నీటిని ఉపయోగించేవారట. దీంతో ఇప్పటికీ చాలా మంది ముస్లింలు మూడు ఖర్జూరాలు తిని అనంతరం నీటిని తాగి తమ ఉపవాసాన్ని ముగిస్తారు. అల్లాహ్ దూత ప్రార్థనకు ముందు పండిన ఖర్జూర పండ్లు తిని తన ఉపవాసాన్ని విరమించారని హదీసులో ప్రస్తావించబడింది. అదే విధంగా

సహీహ్ అల్-బుఖారీ (5445)లో ఎవరైతే సూర్యోదయ సమయంలో అంటే ఉదయం ఏడు అజ్వా ఖర్జూరాలు తింటారో ఆ రోజు వారికి ఎటువంటి విషం లేదా మంత్రవిద్య హాని కలిగించదని.. అతని అల్లా రక్షణలో ఉండటాన్ని పేర్కొన్నారు.

ఖర్జూరంతో ఉపవాసం విరమించడం అవసరమా?

రంజాన్ నెలలో ఖర్జూరంతో ఉపవాసం విరమించడం సున్నత్.. అయితే ఇలా చేయడం తప్పనిసరి కాదు. ఖర్జూరాలతో ఉపవాసం విరమించకపోయినా ఎటువంటి సమస్య లేదు. అయితే ఖర్జూరంతో ఉపవాసం విరమించడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు.

రంజాన్‌లో ఖర్జూరాలు ఎందుకు ఉపయోగిస్తారంటే
శాస్త్రీయ కారణం- ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉపవాసం తర్వాత వచ్చే బలహీనత, అలసట లేదా తలనొప్పి వంటి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అందువల్ల ఉపవాసం విరమించే సమయంలో ముందుగా ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరం.

ఖురాన్ లో ఖర్జూరాల గురించి ప్రస్తావన.

ఇస్లాంలోని అత్యంత పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లో ఖర్జూరం ఇతర చెట్ల గురించి దీని పండ్ల కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడింది. ఖురాన్‌లో ఖర్జూరాలను 22 సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇస్లాంలో వీటికి ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త ముహమ్మద్ కూడా ఖర్జూరాలు తిని వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పేవారట.

 

చలివేంద్ర ప్రారంభించిన కుంకుమేశ్వర స్వామి.!

చలివేంద్ర ప్రారంభించిన కుంకుమేశ్వర స్వామి మాజీ చైర్మన్ గంద వెంకటేశ్వర్లు

ప్రయాణికులకు చల్లని నీరు అందించెందుకే చలివేంద్రం ఏర్పాటు

పరకాల నేటిధాత్రి:

పట్టణంలోని స్థానిక బస్టాండ్ లో కుంకుమేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్స్ యజమాని నాగబండి సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని ఇమ్మడి లక్ష్మణ్ లు చలివేంద్రం(కూల్ వాటర్) కేంద్రాన్ని ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్టాండ్ లోకి చుట్టుపక్కల మండలాల ప్రజలు నిత్యం విద్య వ్యాపార అవసరాల నిమిత్తం కోసం రవాణా చేస్తుంటారు.అందులో భాగంగా వేసవికాలం దృష్ట్యా ప్రజల దహర్తి తీర్చడానికి మా వంతు సహాయంగా చలివేంద్రం ఏర్పాటు చేశామని,ఎండాకాలం మార్చి మాసం మండుటెండల్లో ప్రజల దాహార్తిని తీర్చే సదుద్దేశంతో తమ వంతు సహాయం అందించే దిశగా బస్టాండ్ ఆవరణలో ప్రయాణీకులకు ప్రజలందరికీ చల్లని నీళ్లను అందించాలనే ఉద్దేశంతో మార్చి మాసం నుండి మే ఎండాకాలం పూర్తయ్యే వరకు చలివేంద్రమును నిర్వహిస్తామని తెలిపారు.మానవసేవయే మాధవ సేవగా భావించి ఈ చలివేంద్రమును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంతో సంతోషంగా ఉందని ప్రజల సహాయ సహకారాలతో దేవుని అనుగ్రహంతో రాబోయే కాలంలో మరింత ప్రజాసేవ చేయడానికి కృత నిశ్చయంతో కృషి చేస్తామని శ్రీ కుంకుమశ్వరా స్వామి దేవాలయ మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల బస్ డిపో ఎస్ టీ ఐ.కృష్ణకుమారి, బస్టాండ్ ఇన్చార్జి సురేందర్, డిపో కంట్రోలర్ రమేష్,సిఆర్సి.తిరుపతి,

Cold water

విలేజి బస్సు ఆఫీసర్ సదానందం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Narendra Modi leading the country in success path

• Stable economy

• Strong foreign policy

• Demonetization to prevent black money

• People stood in full support to Government

• Pakistan fell in serious troubles

• Narendra Modi transformed the country as ‘Viswa Guru’

• Revoke of Article-370

• Implementing the GST is greatest achievement 

During 2014 election campaign as BJP candidate for Prime Minister Post Narendra Damodar Das Modi portrayed himself as a pragmatic leader who could turn around the economy which is in underperforming state. BJP emerged victorious with clear cut majority in the Parliament. On 26th, May 2014 Narendra Modi sworn in as Primi Minister. Immediately after coming to power the Government embarked on several reforms especially transport related infrastructure development and liberalising the rules relating to foreign direct investment in the country. 

In his early term Modi also registered two diplomatic achievements. One is Chinese Premier Xi-Jinping visited India in the mid of September month. Another one is granting of VISA to Modi which till then rejected by US Government. Having been granting of this VISA Narendra Modi made successful visit to New York City where he had diplomatic discussions with then US President Barack Obama. 

During the tenure of Narendra Modi we can observe the rise of ‘Hindutva’. Till then most of the Hindus in the country were not in united opinion on this concept because the parties those ruled till then had not shown any inclination towards the unification of Hindus. Their main attempt continued on vote bank politics. For this purpose they followed the policy of dividing the Hindu community. The advent of Modi, facilitated the continuous enlightenment among Hindus which began to spread in silent manner. Proof for this is, the continuous decline of ‘communism’. Once it was widely accepted by the people irrespective of religion but lost its prominence due to lack of adaptability to the changes. At the same time this ideology mainly concentrated on minorities especially Muslims. Communists’ greatest failure is non recognition of poor people in the communities which they treated as forward one. Their ideology confined to some groups and sections of the society is the main cause for their downfall. Fall of communists’ is shows how the ‘Hidutva’ rise which cover entire Hindu population. The Congress like parties those who continue to play vote bank politics also lost their ground for their neglect of Hindus. At the same time movement against ‘slaughter of cows’ also got its prominence.

Narendra Modi Government introduced structural reforms in economy which are sweeping in nature meant for the long term benefits. But the temporary disruptions caused by them were not felt by the people and they stood strong enough behind the Government. Among them most far-reaching was demonetization and replacement of Rs.500 and Rs.1000 notes. This announcement had made just before few hours of implementation. This action was to prevent those who have large sums of black money from exchanging in banks. Really this action caused very much difficulty for such black money holders. The media and the supporters of such rich people who accumulated crores of black money created uproar against this action. But the common people fully supported Narendra Modi move. One should not forget the motto in implementing such decision. Behind the screens there held serious discussions on repercussions to be faced after taking this decision. Ultimately black money holders received greatest debacle when failed to change their money into white. 

The next step Narendra Modi took was implementing the GST. By introducing this, Government centralised the consumption tax. This suspended the confusing system of local consumption taxes and eliminated effect of cascading tax imposed by various states. These changes caused the slowdown of GDP which recorded 8.2% during the year 2015. 

In 2018 Assembly elections were held in five states, where BJP lost power in all these states. Among them Mahdyapradesh, Rajasthan and Chattisgharh were strong holds for BJP. Congress party gained in these elections. Some observers felt these results portended for Naredra Modi and BJP for National Elections set for the spring of 2019. But others expressed their strong opinion that Modi Charisma left intact. While things are going like that on 14th, February 2019 terrorist attack took place in Pulvama were 40 paramilitary members killed. This incident incited anger in entire country. On 26th, February our Air force planes attacked Balakot, in which hundreds of terrorists had been killed. This retaliation act raised the prestige of the Modi Government. This action also had shown the international community on the changed attitude of Present Government. The enthusiasm caused by this success made the Modi and NDA parties to campaign like airwaves. In contrast Congress leader Rahul Gandhi campaign faded away which caused the victory of BJP led NDA group. This time BJP won its own majority to form the government. This time Modi created record of becoming Prime Minister for second time as non-Congress leader. 

In the month of October 2019, Modi Government successfully striped downed the autonomy of Jammu-Kashmir State which was long pending and every one the country was in strong opinion that it is highly impossible to revoke Article-370 which giving autonomous status to the state. This is also remained as land mark victory for the Modi government. During 2020 Covid-19 pandemic spread all over the country. Modi Government encouraged the local biotech companies to produce vaccines to prevent this decease. Finally Covid-Shield like vaccines produced and made available to the people. At the same time Modi Government freely distributed this to other countries like Africa. This raised the prestige of our country and began to treat as ‘Viswa Guru’. 

During 2020 Modi Government brought agriculture reforms. Really speaking these reforms meant for the benefit of the farmers of our country. These reforms facilitate the farmers to sell their agriculture produce to other states where demand is more without any hassle. Unfortunately the brokers in Punjab and Hariyana began to agitate against these reforms in the name of farmers. Khalistani elements also took advantage of the situation and made their entry in disguise as farmers. No other state in the country is against these reforms except Punjab and Haryana. Finally some unscrupulous elements belong to Khalitani movement entered Delhi and replaced the National Flag with Khalisthani flag at Red Fort. This created tremors and Government resort to take stern action against such elements. These actions continued and successfully prevented the second agitation of these elements. Unfortunately Canada then Prime Minister Justin Trudo also extended his support this agitation which caused deterioration of diplomatic relations between these two nations.

దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నరేంద్రమోదీ

ఆర్థిక వ్యవస్థ సుస్థిరం

పటిష్ట విదేశాంగ విధానం

 

నోట్ల రద్దుతో నల్లధానికి అడ్డుకట్ట

ఇబ్బందులు పడ్డా మోదీ వెంటే దేశ ప్రజలు

పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న మోదీ

దేశాన్ని ‘ప్రపంచ గురు’గా మార్చిన ప్రధాని

370 అధికరణం రద్దు

జీఎస్టీని అమల్లోకి తెచ్చిన ఘనత మోదీ సర్కారుదే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

దేశాన్ని ఆర్థిక దుస్థితినుంచి గట్టెక్కిస్తానంటూ 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడమే కాదు, ఇటువంటి విపత్కర పరి స్థితుల్లో దేశానికి సుస్థిరపాలనతో పాటు, దేశ గౌరవాన్ని మరింత ఇనుమడిరపజేస్తానంటూ తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో వివిధ రాష్ట్రాల ప్రజలను సమ్మోహితులను చేసిన నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ పార్టీని పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు. అంతకుముందు పార్టీ అధికారంలోకి వచ్చినా కూటమికి నేతృత్వం వహిస్తూ సంకీర్ణపాలనను మాత్రమే అటల్‌బిహారీ వాజ్‌ పేయి హయాంలో అందించింది. కానీ తొలిసారి స్పష్టమైన మెజరిటతో 2014 మే 26న దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టడమే కాదు దేశానికి కొత్త దశ, దిశను చూపేందుకు ఉపక్రమిం చారు. ముందుగా ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేయడంపై. ఆవిధంగా దేశంలోకి విదేశీ పెట్టుబడులను రావడానికి ఆయన మార్గం సుగమం చేశారు. అదే ఏడాది ఆ యన రెండు దౌత్యపరమైన విజయాలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మొట్టమొదటిది సెప్టెంబర్‌ మధ్యకాలంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను దేశానికి ఆహ్వానించడం, ఈ పర్యటనను విజయవంతం చేయడం. రెండవది అప్పటివరకు మోదీకి వీసా అనుమతిని నిరాకరించిన అమెరికా, వీసా అనుమతినివ్వడం. వెంటనే ప్రధాన హోదాలో నరేంద్రమోదీ న్యూయార్క్‌లో పర్యటించి అప్పటి యు.ఎస్‌. అధ్యక్షులు బరాక్‌ ఒబామాతో చర్చలు జరిపారు. ఈ పర్యటన గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. ఇక్కడ గుర్తించాల్సింది మరే ఇతర నాయకుడు సాధించని ఒక గొప్ప విజయాన్ని మోదీ సాధించి చూపిన విషయాన్ని గుర్తించాలి. ఏ దేశమైతే వీసా నిరాకరించిందో ఆ దేశమే చివరకు వీసాను ఇవ్వడమేకాదు, దేశ పర్యటనకు ఆహ్వానించడం నిజంగా మోదీ ఖాతాలో న మోదైన గొప్ప విజయం.

నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో జరిగిన సానుకూల పరిణామం హిందువులు జాగృతం కావడం. హిందూత్వను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అప్పటివరకు ఏకతాటిపైలేని హిందువులను సుసంఘితం చేసేందుకు యత్నాలు జరిగాయి. ఇవి చాలావరకు సత్ఫలితాలని చ్చాయనడానికి ఉదాహరణ కమ్యూనిస్టులు క్రమంగా తెరమరుగైపోవడం! కమ్యూనిస్టు భావజా లం క్రమంగా పతన పథంలో ప్రయాణించి ఒకప్పుడు విశేష ప్రాచుర్యం పొంది, ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పటికీ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం అంతరించిపోయే స్థితికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం హిందువుల్లో పెరుగుతున్న చైతన్యం. మైనారిటీల ముసుగులో జరుపుతున్న రాజకీయాలు తమను ఏవిధంగా అథ్ణపాతాళానికి తొక్కేస్తున్నాయో హిందువులకు బాగా అవగతం కావడం. అంతకుముందు ఇంతలా అవగాహన కల్పించిన పార్టీలు లేవు. చైతన్యం తీసుకు రాగలిగే భాజపా అంతగా బలపడలేదు! ఇదే సమయంలో గోహత్య నిషేధ ఉద్యమం మరింత ఊపందుకోవడం విశేషం.

ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ రెండు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. నిజం చె ప్పాలంటే ఇవి దేశ వ్యవస్థలో సమూల మార్పులకు దోహదం చేశాయనే చెప్పాలి. మొదటిది నోట్ల రద్దు. అంటే రూ.500, రూ.1000నోట్లను రద్దుచేయడం. నోట్లమార్పిడికి చాలా తక్కువ స మయం ఇవ్వడం ద్వారా దేశంలో నల్లధనాన్ని చాలావరకు దెబ్బతీయాలన్న వ్యూహం అనుసరిం చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన వెనుకాడలేదు. ప్రజలు కూడా మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని గ్రహించి కష్టాలు సహించి, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఈ నిర్ణయం వెనుక సుదీర్ఘమైన, లోతైన ఆలోచన, చర్చలు, మేధోమధనం వున్నాయ న్న సత్యం మరువరాదు. నిజం చెప్పాలంటే నల్లధనం పోగేసుకున్న వర్గాలకు అనుకూలురు మా త్రమే నిర్ణయాన్ని వ్యతిరేకించారు తప్ప ఇతరులెవ్వరూ అడ్డు చెప్పలేదు. ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల పెద్దమొత్తంలో పోగేసుకున్న నల్లధన మార్పిడి కష్టతరం కావడంతో, ‘నల్ల కుబేరులు’ నిం డా మునిగారు. ఇక నరేంద్రమోదీ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం ‘వస్తుసేవల పన్ను’ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) విధింపు. నిజానికి ఇది నాటి యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయమే కానీ, సంకీర్ణ భాగస్వాములనుంచి విపరీతమైన ఒత్తిడి రావడంతో నాటి మ న్మోహన్‌ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేకపోయింది. కానీ నరేంద్రమోదీ దీన్ని తక్షణమే అమల్లో కి తెచ్చారు. దీనివల్ల దేశమంతా ఒకే జీఎస్టీ అమలు కావడమే కాదు, వివిధ రాష్ట్రాలు విధించే రకరాల పన్నుల భారం తగ్గింది. సగటు పౌరుడు ఏ వస్తువును కొనుగోలు చేయాలన్నా, వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కట్టాల్సి వచ్చేది. జీఎస్టీ అమల్లోకి తేవడంతో ఆ సమస్య కు పరిష్కారం లభించినట్లయింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలవల్ల 2015లో 8.2% వున్న జీడీపీ కొద్దిగా నిదానించినా, దీర్ఘకాలంలో సత్ఫలితాలిచ్చాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

2018లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో భాజపా అధికారా న్ని కోల్పోయింది. వీటిల్లో పార్టీకి గట్టిపట్టున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లు వుండటం గమనార్హం. వీటిల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో లోక్‌సభకు ఎన్నికలు జ రు గనున్న తరుణంలో పలువురు విశ్లేషకులు భాజపా పని అయిపోయిందనే అనుకున్నారు. మరి కొందరు మాత్రం మోదీ ఛరిష్మాకు ఎటువంటి ఢోకాలేదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా 2019 ఫివ్రబరి 14న తీవ్రవాదులు పుల్వామాలో జరిపి ఉగ్రదాడిలో 40మంది పారా మిలిటరీ సిబ్బంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు ప్ర తీకారంగా అదేనెల 26వ తేదీన బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన వాయుసేన జరిపి న దాడిలో ఉగ్ర ముష్కరులు వందల సంఖ్యలో మరణించారు. మోదీ ప్రభుత్వ సామర్థ్యాన్ని మరోసారి దేశ ప్రజలకు, ప్రపంచ దేశాలకు వెల్లడిరచిన సంఘటన ఇది. పర్యవసానంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పార్టీలు ఇనుమడిరచిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో పాల్గనగా, విపక్ష కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రచారం వెలవెలబోయింది. చివరకు ఈ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రెండోసారి అధికారాన్ని చేప ట్టింది. అంతేకాదు బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడం విశేషం. రెండోసారి పూర్తికా లం ప్రధానిగా కాంగ్రెస్సేతర రెండో నాయకుడిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న మరో ప్రధాన నిర్ణ యం జమ్ము`కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణాన్ని రద్దుచేయడం. నిజానికి మైనారిటీ బుజ్జగింపులకు అలవాటుపడిన వర్గాలు, పార్టీలు దీన్ని సహజంగానే విమర్శించాయి. కొందరు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఇది కార్యనిర్వాహక శాఖ’ అధికారపరిధిలోనిదంటూ కోర్టు జోక్యం చేసుకోలేదు. ఫలితంగా పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందిన తర్వాత, దశాబ్దాలుగా జమ్ము`కశ్మీర్‌ అభివృద్ధిని అంధకారంలోకి నెట్టడమే కాదు, కొన్ని లక్షలమంది మైనారిటీలైన హిందువులైన కశ్మీరీ పండిట్లను రాష్ట్రంనుంచి వెళ్లగొట్టిన అంథకార చరిత్రకు అంతం పలకడంలో ఒక అడుగు ముందుకు పడినట్లయింది. ఈ అధికరణం రద్దయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వీచికలు ప్రారంభమయ్యాయి.

2020లో దేశంలో కోవిడ్‌ మహమ్మారి దేశంలోకి ప్రవేశించింది. దీని విస్తరణను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా వివిధ బయోటెక్‌ కంపెనీలను ప్రోత్సహించారు. ఫలితంగా కోవిడ్‌ షీల్డ్‌ వంటి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో అనేక ఇతర పేదదేశాలకుకోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించడంతో మనదేశ ప్రతిష్ట అనుమడిరచింది. అనేక దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు నరేంద్రమోదీని ఎంతగానో ఇప్పటికీ అభిమానిస్తున్నాయంటే మన ప్రభుత్వం అనుసరిస్తున్న ‘బహుజన హితాయచ…బహుజన సుఖాయచ’ అనే సూత్రాన్ని తు.చ. తప్పకుండా అనుసరించడమే. ఇదే ఏడాది నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. నిజంగా ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరం. ఎటు వంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా తగిన లాభంతో విక్రయించుకునేందుకు వీలుకల్పించే ఈ చట్టాలను, వ్యవసాయ రంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఏలుతున్న పంజాబ్‌, హర్యానాలకు చెందిన బలీయమైన రాజకీయ పలుకుబడి కలిగిన దళారులు వ్యతిరేకించడమే కాదు, వీటిని రైతు వ్యతిరేక చట్టాలుగా విపరీతంగా ప్ర చారం చేశారు. కేవలం ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దళారులు చేసిన ఆందోళన వల్ల, దేశవ్యాప్తంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వీరికి అనుకూల మీడియా కూడా అసలు నిజాలను దాచి పెట్టి, ఈ దళారులకే వత్తాసు పలకడం, అప్పటి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా వీరికి అనుకూలంగా మాట్లాడటం సంచలనం సృష్టించింది. ట్రూడో వైఖరి వల్ల ఇరుదేశాల సంబంధాలు గతంలో ఎన్నడూలేని స్థాయికి దిగజారిపోవడం వర్తమాన చరిత్ర. చివరకు ఆందోళనకారులు ఢల్లీిలో ప్రవేశించి ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగరేయడం సంచలనం సృష్టించింది. ఆవిధంగా రైతు ఉద్యమాల ముసుగులో ఖలిస్తానీ వేర్పాటువాదులు ఈ అకృత్యానికి పాల్పడ్డారన్న సంగతి కూడా వెల్లడైంది. అప్పటినుంచి కేంద్రం అప్రమత్తమై, ఖలిస్తానీలపై ఉక్కుపాదం మోపే రీతి లో చర్యలు చేపట్టింది. ఫలితంగా రెండోసారి మళ్లీ రైతు ఆందోళన చేపట్టాలన్న ఈ దళారులు,ఖలిస్తానీల ఆటలు సాగలేదు. మొగ్గదశలోనే ప్రభుత్వం అణచివేసింది. దీంతో మళ్లీ ఢల్లీి ముట్టడి ప్రమాదం తప్పింది.

కొత్త ‘‘సిఎస్‌’’. రామకృష్ణారావు?

`వచ్చే నెలలో సిఎస్‌. శాంతి కుమారి రిటైర్‌ అవుతున్నారు!

`గతంలోనే రామకృష్ణారావు సిఎస్‌. అవుతారని అందరూ అనుకున్నారు.

`అనూహ్యంగా శాంతి కుమారి సిఎస్‌. అయ్యారు.

`మళ్ళీ ఇప్పుడు రామకృష్ణారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

`సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు.

`సవాళ్లను అధిగమించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అనుభవం వున్న అధికారి.

`తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాత్ర గొప్పది.

`తెలంగాణ వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌ రూపకల్పన సాగిస్తున్న అధికారి.

`అంతటి అనుభవం వున్న అధికారి మరొకరు కనిపించడం లేదు.

`పైగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

`తెలంగాణ మీద పూర్తి అవగాహన వుంది.

`తెలంగాణ సామాజిక పరిస్థితులు పూర్తిగా తెలిసిన అధికారి.

`తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌లు రూపకల్పన చేసి మెప్పించారు.

`తెలంగాణ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నారు.

`అలాంటి రామకృష్ణారావు సిఎస్‌ అయితే తెలంగాణకు మరింత మేలు.

`రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధుల సమీకరణకు తలనొప్పులుండవు.

`ఉమ్మడి రాష్ట్రంలో పలు ఉమ్మడి జిల్లాలకు కలెక్టరుగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.

`ముఖ్యంగా తెలంగాణ వనరులు, వసతులు, సమస్యలపై పూర్తి అవగాహన వుంది.

`ఏ ఏ ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో తెలిసిన అధికారి.

`అన్ని వర్గాల అభ్యున్నతికి సమ ప్రాధాన్యత కల్పించడం కోసం పరితపించే అధికారి.

`అట్టడుగు వర్గాల ప్రగతిని కోరుకున్న అధికారి.

`ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ లాంటి వెనుకబడిన జిల్లాలో కలెక్టర్‌గా పని చేశారు.

`పట్టణ ప్రజల జీవితాలే కాదు, మారు మూల ప్రజల స్థితిగతులు తెలుసు.

`అలాంటి అధికారి సిఎస్‌ అయితే తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుంది.

`ప్రజా ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

అధికారుల సమర్ధత, నైపుణ్యాలు, అవగాహనల మీదనే ప్రభుత్వాల పనితీరు ఆధారపడి వుంటుంది. సమాజం మీద వారికి వున్న పట్టు, ప్రజల సమస్యల మీద అవగాహన, ఉన్నత లక్ష్యాల నిర్ధేశన ఎంతో ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల మీద తమ కర్తవ్య దీక్షా పరిరక్షణతోనే సమస్యల పరిష్కారం జరుగుతుంది. అయితే ఉన్నతాధికారులైనంత మాత్రాన అన్ని విషయాల మీద అందరికీ అన్ని రకాల అవగాహన వుండాలని లేదు. కాని వుంటే ఆ అదికారి సేవలు రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూర్చుతాయి. రాష్ట్రాలను ప్రగతి పథంలో నడిపిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. రాజకీయ నాయకులు చెప్పే విషయాలపై తలూపే అధికారులు కొంత మంది వుంటే, ప్రభుత్వాలు చేయాల్సిన పనులపై సమగ్రమైన నివేధికలతో అమలు చేయడంలో కొంత మందికి మాత్రమే చిత్తశుద్ది వుంటుంది. ఉద్యోగ నిర్వహన అనేది ఎవరికైనా ఒకటే. కాని కొందరి మాత్రం అది ఒక యజ్ఞం. తన ముద్ర పాలనలో కనిపించాలని తపించే అధికారులుంటారు. ప్రజల మేలు కోసమే నిరంతరం ఆలోచిస్తుంటారు. అలాంటి ఆలోచనలు వున్న అధికారుల మూలంగానే ఈ వ్యవస్ధలు సవ్యంగా, సక్రమంగా సాగుతున్నాయి. కొంత మంది అదికారులు తమకు వచ్చిన అవకాశాలను సమర్ధవంతంగా పూర్తి చేసి, ప్రజల జీవితాలను నిలబెడుతుంటారు. ప్రజల ఆనందాన్ని వారి కళ్లలో చూస్తారు. ప్రజల సంతోషంగా వుండేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ఎందుకంటే ఐఎఎస్‌ అధికారులకు ఉద్యోగ నిర్వహణలో సమయం, సందర్భం అంటూ ప్రత్యేకంగా వుండదు. రోజులో 24 గంటల పాటు ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. పని చేస్తుంటారు. ఎంత పని ఒత్తిడైనా సరే, వారి ముఖంలో చిరునవ్వు తగ్గదు. ఉత్సాహం అసలే తగ్గదు. అలాంటి అధికారులు చాలా మంది వున్నారు. అలాంటి అధికారులలో ఒకరైన రామకృష్ణారావు త్వరలో తెలంగాణ సిఎస్‌ అవుతున్నారని సమాచారం. ఆది నుంచి ఆయన ఉద్యోగ నిర్వహణలో సమర్ధవంతమైన, సంక్లిష్టతలను అధిగమించిన అధికారిగా పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా తన ముద్రను వేసుకుంటూ వచ్చారు. ప్రజల మేలు కోసం అహర్నిషలు కృషి చేశారు. నిజానికి రామకృష్ణారావు గతంలోనే సిఎస్‌ అవుతారంటూ వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా ప్రస్తుత చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారి పేరు తెరమీదకు వచ్చింది. గత ప్రభుత్వం ఆమెకు అవకాశమిచ్చింది. శాంతి కుమారి వచ్చే నెల రిటైర్‌ కానున్నారు. ఆమె తర్వాత ఈసారి ఖచ్చితంగా రామకృష్ణారావు సిఎస్‌ అవుతారని అదికార వర్గాల్లో చర్చ సాగుతోంది. రామకృష్ణారావు ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ తెలంగాణ క్యాడర్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా విభాగంలో ప్రత్యేక, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన సేవలు ఎంతో విశిష్టమైనవని చెప్పకతప్పదు. గతంలోనైనా, ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీల అమలుకు నిధుల సమీకరణ, కేటాయింపుల్లో ఆయన చూపిన చొరవ ఎంతో గొప్పది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు, రూపాయి రాకడ, పోకడ, జీతాలు, నిధుల విడుదల వంటి విషయాల్లో ఇప్పటి వరకు ఆర్దిక వ్యవస్ధకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడంతో రామకృష్ణారావు కృషి అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి లోటు లేకుండా, ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా ప్రజలకు రూపాయి చేర్చడంలో రామకృష్ణారావు అనుసరించి ఆర్ధిక సూత్రాలు రాష్ట్రాన్ని ముందు వరసులో నిలబెట్టాయని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు 11 బడ్జెలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ పదకొండు బడ్జెట్‌లు కూడా రామకృష్ణారావు చేతిలో తీర్దిదిద్దబడ్డాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనైనా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని బడ్జెట్‌లు రూపకల్పన చేసిన అధికారి మరొకరు లేదు. బడ్జెట్‌ రూపకల్పన అంటే సమాన్యమైన విషయం కాదు. బడ్జెట్‌ రూపకల్పన చేసే అధికారులకు రాష్ట్ర పరిస్ధితులు, ప్రజల స్ధితిగతులు, సమాజ అవసరాలు, వ్యవస్ధకు అవసరమైన ఖర్చులు, ప్రభుత్వాలు ప్రజలచ్చిన హమీలు, విద్య, వైద్యం వంటి కీలకమైన అంశాలు, రైతాంగ సమస్యలు, ఉపద్రవాలు, వివిధ సమాజిక వర్గాలకు ప్రభుత్వాలు ఇచ్చిన వరాలు, వాటి కోసం కేటాయింపులు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడంత లిస్టు వుంటుంది. వాటన్నింటికీ సమతూకం వేసి రూపాయి కేటాయింపులు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరు ఐఏఎస్‌ అధికారులు ఈ బాధ్యతను నిర్వర్తించలేరు. రామకృష్ణారావు సమర్ధవంతమైన పాత్ర పోషించడం మూలంగానే ఇన్ని బడ్జెట్‌లు ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ అంటేనే ప్రభుత్వం పని తీరుకు నిదర్శనం. రాజకీయపార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే వరాలు, అధికారంలోకి వచ్చాక ఆ పధకాల అమలుకు నిధుల సమీకరణాలు, కేటాంపుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది. అటు ఆర్ధిక నియంత్రణ, ఇటు అవసరాలకు నిధుల సమకూర్పు అనేది కత్తిమీద సాము లాంటి వ్యవహారం. ఆ రెండిరటినీ బ్యాలెన్స్‌ చేసి నిధుల సమీకరణలో ఇప్పటి వరకు తెలంగాణ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొలేందంటే రామకృష్ణారావు బాద్యత ఎంత గొప్పదో అర్దం చేసుకోవచ్చు. అటు ఆర్ధిక శాఖతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ శాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యతను కూడా ఆయన ఎంత సమర్ధవంతంగా పోషిస్తున్నారో తెలంగాణ ఆర్ధిక పురోగతిని చూస్తేనే అర్ధమౌతోంది. ఇక రామకృష్ణారావు గతంలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరక్టర్‌ జనరల్‌గా పని చేసిన అనుభవం వుంది.. అది ఆయనకు తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టెందుకు ఎంతో దోహదపడుతోంది. రాష్ట్రం తరుపున ఐటి రంగ అభివృద్దిపై దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో జరిగిన అనేక సదస్సులకు హజరయ్యారు. అక్కడి ఆచరణలు చూశారు. మన అనుభవాలు అక్కడి రాష్ట్రాలకు నేర్పుతూ వచ్చారు. ఇక ఆయన విద్య, వైద్య రంగాలకు సంబంధించిన శాఖలను కూడా నిర్వహించిన అనుభవం గతంలో రామకృష్ణారావుకు వుంది. ఉమ్మడి రాష్ట్రంలో మారు మూల ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గుంటూరు లాంటి జిల్లాల్లోనూ కలెక్టర్‌గా సేవందించారు. దాంతో ఆయనకు పట్టణ ప్రాంతాల సమస్యలు, ప్రగతి, ఆదిలాబాద్‌ లాంటి వెనుబడిన జిల్లా ప్రాంతాలపై పూర్తి అవగాహన వుంది. కాన్పూర్‌, డిల్లీలో ఐఐటి, మాస్టర్స్‌ డిగ్రీలను పూర్తి చేసిన, రామకృష్ణారావు, ఎంబిఏ పట్టా కూడా పొందారు. దాంతో అటు సామాజిక నిర్వహణతోపాటు, ఆర్ధిక నిర్వహణలపై రామకృష్ణారావుకు మంచి పట్టు సాధించగలిగారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం తొలి రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ఎలా వుంటుందన్నదానిపై అనేక అనుమానాలు వుండేవి. కాని వాటి జాడ లేకుండా, ఆర్ధిక లోటు ఊసు లేకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత ఉన్నతాధికారిగా రామకృష్ణారావుకు దక్కుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర గొప్పది. త్వరలో సిఎస్‌ శాంతికుమారి రైటైర్‌ కానున్న నేపధ్యంలో రామకృష్ణారావుకు వున్నంత అన్ని విభాగాల్లో పాలనానుభం వున్న మరో అధికారి లేడు. కాని ఎవరి ప్రయత్నాలువారు చేస్తుంటారు. కాని తెలంగాణ రాష్ట్రం పరిస్ధితులపై పూర్తి అవగాహ వున్న సీనియర్లలో రామకృష్ణారావు ముందు వరుసలో వున్నారు. పైగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన అదికారి కావడం వల్ల ఆయన సేవలు భవిష్యత్తు తెలంగాణ కూడ గుర్తుంచుకుంటుంది. అదే ఇతర రాష్ట్రాల క్యాడర్‌ అదికారికి అంత అంకితభావం వుండకపోవచ్చు. తెలంగాణ ప్రజలు, అవసరాలు, సమాజిక స్ధితిగతులు, పరిస్దితులు, ప్రజల ఆలోచనలు, ఆశలు, అధికార పార్టీ ఇచి ్చన హమీలు, ఇతర రంగాలు, సంక్షేమ రంగాలు, పారిశ్రామిక రంగాలన్నింటినీ మిలితం చేసుకుంటూ రామకృష్ణారావు ముందుకు వెళ్లే అవకాశం వుంటుంది. బడ్జెట్‌ రూపకల్పనతోనే తెలంగాణను ఇంతగా పరగులు పెట్టించిన రామకృష్ణారావు సిఎస్‌ అయితే తెలంగాణ అన్ని రంగాల్లో మరింత ముందడుగు వేస్తుందని చెప్పడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు.

ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!

ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగిని పట్ల అనుచిత ప్రవర్తన..!

 

నేటిధాత్రి, బ్రేకింగ్, వరంగల్…

 

100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేసిన బంధువులు

మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించిన హాస్పిటల్ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి

సారి చెప్పి సద్దుమనిగించే ప్రయత్నం చేస్తున్న యాజమాన్యం

గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినట్లు సమాచారం

హనుమకొండ “కూరపాటి రమేష్ హాస్పిటల్లో” పనిచేస్తున్న ఉద్యోగిని పట్ల హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ అనుచితంగా ప్రవర్తించిన తీరు..

సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి తన పట్ల డాక్టర్ ప్రవర్తించిన తీరును తెలిపారు. వెంటనే భర్త 100ద్వారా స్థానిక పోలీసులకు పిర్యాదు.

హాస్పిటల్ చేరుకున్న పోలీసులు విచారణ జరిపినట్లు సమాచారం..

విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హాస్పిటల్ చేరుకోగా, ఇది మా కుటుంబ సమస్య అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు సదరు డాక్టర్..

ఈలోగా హాస్పిటల్ ఇన్చార్జి అని చెప్పుకొనే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి మీడియా పట్ల దురుసు ప్రవర్తన.. మేము సర్ది చెప్పుకుంటాం, మీరు ఎక్కువ చేస్తున్నారు బయటకు వెళ్ళండి అంటూ వ్యంగ్య మాటలు..

శ్రీకాంత్ రెడ్డి తీరు పట్ల సదరు డాక్టర్ రమేష్ కు ఫోన్ ద్వారా తెలుపుటకు ప్రయత్నించగా ఫోన్ ఆన్సర్ చేయని డాక్టర్ రమేష్..

గతంలో కూడా హాస్పిటల్ లో కొందరు మహిళా ఉద్యోగినిలపై ఇలాగే దురుసుగా ప్రవర్తించారని, మహిళా సిబ్బందిపై చేతులు వేసేవారిని, హాస్పిటల్ లో పనిచేసి మానేసిన కొందరు ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చారు…

తన కింద పనిచేసే వారిపై బానిసంగా చూస్తూ, ఇష్టం వచ్చినట్లు దుర్భాషాలాడిన ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళా ఉద్యోగులు కోరుతున్నారు..

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ప్రారంభం.!

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్ల ప్రారంభం

కామారెడ్డి జిల్లా/పెద్దకొడఫ్గల్ నేటిధాత్రి :

కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 30 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం సోమవారం పెద్దకొడఫ్గల్ గ్రామంలోని శివాలయం నుండి స్టేట్ నేషనల్ హైవే 161 రోడ్ వరకు మరియు ఈద్గా నుండి శివాలయం రోడ్డు వరకు కలుపుతూ ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా నిధులు పెద్ద కొడఫ్గల్ మండలానికి గ్రామానికి ఇచ్చినందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావుకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ మండల నాయకులు చిప్ప మోహన్, అక్కలి సాయి రెడ్డి, శామప్ప,డాక్టర్ సంజీవ్,బసవరాజ్ దేశాయ్, టీ శ్రీనివాస్ గౌడ్, కల్లూరి పండరి,విట్టల్ మరియు మైనారిటీ నాయకులు జాఫర్ షా, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version