సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం.!

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం పలికిన విద్యార్థులు

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

Students

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిమీదకు చేరిన సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధులు ప్లైకార్డ్స్ తో స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం.పట్టాభి, ఉపాద్యాయలు విటోభా,పద్మ, అరుణశ్రీ, వెంకట్రావు, శ్రీనివాస్, జ్యోత్స్నప్రభ,రవిచందర్, సబిత, ప్రవళిక , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పట్టాభి మాట్లాడుతూ 9 నెలల 288 రోజుల సుధీర్ఘ కాలం వివిధ పరిశోధనల నిమిత్తం అంతరిక్షంలో ఉండి, దిగ్విజయవంతంగా తిరిగి భూమిపైకి చేరుకున్న సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినవారు కావడం మనందరి గర్వకారణం అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.

Students

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు.

మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల జాగృతి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మాట్లాడుతూ మండలంలో పట్టణంలో తెలంగాణ జాగృతి కమిటీ లను వేశామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అభినందిస్తూ అలాగే రాబోయే ఎన్నికల్లో బీసీలకు అన్ని సంక్షేమ పథకాల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి గాని ఎంపిటిసి గాని సర్పంచ్ గాని ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలని ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ అమలు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవితక్క గారు బీసీల గురించి మండల సభల్లో ఎన్నోసార్లు బీసీల గురించి స్థానికంగా ప్రసంగించారని తెలంగాణ జాగృతి ని రాష్ట్రంలో అన్ని వర్గాలకు అనుకూలంగా ప్రయోజనం పొందేలా ఎమ్మెల్సీ కవితక్క ఎప్పటినుండో పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ముందు రోజుల్లో అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే తెలంగాణ జాగృతి తంగళ్ళపల్లి మండలం యువజన కార్యదర్శిగా అనిల్ గౌడ్ ను తంగళ్ళపల్లి తెలంగాణ జాగృతి పట్టణ అధ్యక్షులుగా విబి రంగమును ఉపాధ్యక్షులుగా భానుమూర్తిని నియమించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగత్.వెంగళ రమేష్ పసుల దుర్గయ్య మనోహర్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు.!

మద్యం సేవించి వాహనం నడిపితే నిండు ప్రాణాలు బలి..

మందుబాబులు ఇకనైనా మారండి..

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సిందే.

ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్..

రామాయంపేట మార్చి 19 నేటి ధాత్రి (మెదక్)

Drunk driving

మద్యం తాగి వాహనాలునడిపితే తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. తాగే వారు మాత్రం తాగక మానడం లేదు. వాహనాలు నడిపేవారు మాత్రం నడపక మానడం లేదు. నిత్యం ఈ తంతు జరుగుతూనే ఉంది. అధికారులు వారు తగిన విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న తాగి నడపడం మాత్రం మానుకోవడం లేదు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు అంటూ అధికారులు ఆదేశించిన ప్రయాణీకుల్లో మాత్రం దృష్టి పెట్టడం లేదు. అధికారులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వాహనాదారులు మాత్రం తాగిన మైకంలో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికి జైలుకు పోతున్న సందర్భాలు ఉన్న, ప్రయాణికుల్లో మాత్రం చలణం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగినడపడమే అని చాలామంది వాదిస్తున్న వారికి ఆలోచనలు మాత్రం రావడం లేదు. తాగిన మైకంలో ద్విచక్ర వాహనదారులు వారి ఇష్టాను రీతిలో వాహనాన్ని నడుపుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారిపై వాహనాల జోరు పెరిగింది. విందులు, వినోదాల పేరుతో దైవదర్శనాలకు వెళుతూ వచ్చేవారు కొంతమంది అయితే, తాగినడిపేవారు ఎక్కువగా ఉన్నారు.

వాహనదారుల తీరు మారాల్సిందే..

Drunk driving

తాగి నడిపిన పాపానికి కేవలం మనమే ఒకరికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. దీని ప్రభావం ఎన్నో కుటుంబాల పైన పడుతుంది. దీనితో వాహనదారులు సైతం తాగి వాహనాలు నడిపే ధోరణిని మానుకోవాలి, రామాయంపేట మండల ప్రాంతంలో తరచు ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాహనదారులు మారితే అందరికీ మేలు కలుగుతుంది.

తాగి నడిపితే జైలు శిక్ష తప్పదు..
ఎస్సై బాలరాజు రామయంపేట.

మందుబాబులు మద్యం సేవించి వాహనాలతో రోడెక్కుతున్నారా అయితే మీకు జైలు శిక్ష తప్పదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న వారిని కఠినంగా శిక్షించి జైలు శిక్షలు విధిస్తున్నాయి. మద్యం మత్తులో వాహనం నడిపే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ న్యాయస్థానాలు కఠినంగా ఆదేశాలు జారి చేసిన వాహనదారుల్లో మాత్రం భయం ఏర్పడడం లేదు. ఇటీవలె మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకమైన వారి ప్రాణాలు బలిగొన్న సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి, వారికి కోర్టుల్లో జరిమానాలు జైలు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. అయినా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు.
మద్యం సేవించి రోడ్డుపై వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించి మద్యం సేవించిన వారిని పట్టుకుని కేసులు చేస్తున్నాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

అటు లంచాలు..ఇటు అరాచకాలు.

మంత్రి ‘‘శ్రీనివాస్‌ రెడ్డి’’ ఆదేశాలు అంటే అంత లెక్క లేకుండా పోతుందా!

-ఒక్కొక్కటిగా బైట పడుతున్న రెవెన్యూ అధికారుల అగడాలు

-నిత్యం వెలుగు చూస్తున్న అనేక మంది ఎమ్మార్వోల బాగోతాలు.

-రాబందులకెక్కువ..రాక్షసులకు తక్కువగా తయారౌతున్నారు.

 

-మానవత్వం మర్చిపోతూ లంచాలకు తెగబడుతున్నారు.

-అక్రమాలు ఆపరు..లంచాలు మానరు.

-రైతులను తిప్పితిప్పి పిప్పి చేయకుండా వుండలేరు.

-ఒకరి భూములు మరొకరికి అంటగట్టకుండా అసలే వుండలేరు.

-రైతుల ఉసురు పోసుకుండా వుండరు.

-ఆఖరుకు రైతు చనిపోతే వచ్చే పరిహారంలో ఫలహారం కోరుతున్న వాళ్లున్నారు.

-ఆత్మకూరు ఎమ్మార్వో నిర్వాకానికి సజీవ సాక్ష్యం.

-పిండాలను కూడ వదలనంత దుర్మార్‌ంగా వ్యవహరిస్తున్నారు.

-2014లో చనిపోయిన రైతుకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు.

-హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయలేదు.

-తహసీల్దారుకు జీతభత్యాలు ఆపాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-మోతె మండల ఎమ్మార్వో అరెస్టు అయ్యారు.

-ఫైళ్లను టాంపరింగ్‌ చేసిన ఆరోపణలు రుజువయ్యాయి.

-ఇంతగా దిగజారి బతకాలా!

-ప్రజలను పీడిరచడమేమైనా హక్కు అనుకుంటున్నారా!

-రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా మారరా?

-ప్రభుత్వాల ఉదాసీనత చేతగాని తనం అనుకుంటున్నారా?

-ప్రజల రక్తం తాగడం మానరా?

-చేసే తప్పులు చేస్తూనే అహంకారమా!

-అశుద్దాన్ని అద్దుకుతింటూ గొప్పలకు పోవడమా?

-మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగుతుండడమా?

మీరు మారరా? మీలో మార్పు రాదా? మీలో మానవత్వం లేదా? అంటే మారితే మేమెందుకు అదికారులమౌతాము? మారితే మాకు అక్రమ సంపాదనలు ఎవరు సమకూర్చిపెడతారు? అని ప్రశ్నించే కాలమొచ్చినట్లుంది. అందుకే మమ్మల్ని ఎవరేం చేయలేరు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. దొరికినప్పుడు చూద్దాం..లే..ముందైతే లెక్క చెప్పు అనే వరకు వచ్చింది. అందుకే లంచాలు తీసుకోవడం కూడా మరింత పెరిగింది. దీనికి పుల్‌ స్టాప్‌ పడుతుందని ఆశించడం కూడా తప్పే అనుకుంటున్నారేమో! జనానిది అవసరం. మాది అదికారం. పాలకులు వచ్చి వెళ్తుంటారు. మేం లోకల్‌.. అన్నట్లుగా వుంది. ఈ మండలం కాకపోతే మరో మండలం..అన్నీ మండలాలు అక్షయపాత్రలే..ఎక్కడ కూర్చున్నా లక్షలు వచ్చిపడేవే.. మా సంతకానికి అంత విలువ. అందుకే లంచాలు తీసుకుంటున్నామనంటున్న వాళ్లు చాలా మంది తహసిల్థార్‌లు వున్నారు. ఎవరికి చెప్పుకున్నా, ఎవరితో మొరపెట్టుకున్నా ఆఖరుకు పనిచేయాల్సింది మేమే..సంతర్పణలు చేసుకోవాల్సింది మాకే అంటూ పని కోసం వచ్చిన వారితో బరితెగించి చెబుతున్నారంటే ఇక పరిస్దితి ఎంత దూరం వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. అలా పేట్రేగిపోయిన వారిలో తాజాగా నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తహసిల్ధార్‌ జీతభత్యాలు ఆపేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాని అది ఆ తహసిల్ధార్‌కు శిక్ష కాకపోవచ్చు. ఎందుకంటే జీతం మీదే ఆధారపడి బతకాలన్న భయం వుంటే లంచం అన్న మాట వింటేనే ఎవరికైనా చేతులు వణికిపోతాయి. కాని లంచాల ముందు జీతాలు బలాదూర్‌. కొంత మంది తహసిల్ధార్‌ల జల్సాలకు ఒక్క రోజు పెట్టే ఖర్చు జీతంకన్నా ఎక్కువగా వుంటుందని గొప్పలు చెప్పుకునేవారు కూడా వున్నారు. అలాంటి ఎమ్మార్వోలు జీతం ఆగుతుందంటే భయపడతారా? అయినా ఆగిన జీతం ఎంత కాలానికైనా వస్తుందన్న నమ్మకం. అయితే అసలు విషయమేమిటంటే హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన లక్కర్సు మొగిళి 2014లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందాల్సి వుంది. రైతుకు నష్టపరిహారం అందించడానికి తహసిల్ధార్‌ మెలికపెట్టారు. కాని ఆ పేద రైతు కుటుంబానికి అంత తాహతు లేదు. దాంతో ఏళ్ల తరబడి ఎమ్మార్వో కార్యాలయానికి మృతుడి భార్య తిరుగుతూనే వుంది. కాని ఆ తహిసిల్ధార్‌కు కనికరం కలగలేదు. ఇక విసిగిపోయిన రైతు బార్య లక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు మృతుడికి పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసి తీర్పునిచ్చింది. అయినా ఎమ్మార్వో హైకోర్టు ఉత్తర్వులను కూడా పక్కన పెట్టాడు. ఈ విషయాన్ని పదే పదే మృతుడి బార్య ఎంత వేడుకున్నా ఎమ్మార్వో స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలనే ఆ ఎమ్మార్వో బేకాతరు చేస్తూ వచ్చారు. దాంతో మళ్లీ రైతు కుటుంబం మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మార్వోకు జీత భత్యాలు ఆపేయాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జీవో. 173 ప్రకారం మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్దానం ఇచ్చిన తీర్పులను కూడా ఇలా ఎమ్మార్వోలు పక్కన పెట్టే స్ధాయికి చేరుకున్నారంటే , ఇక సామాన్యుల పరిస్దితి ఏమిటి? వారు చెప్పింది వినాల్సిందే..అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. ఇక మరో ఎమ్మార్వో మరో ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఎమ్మార్వోల అక్రమాలపై గతంలోనే నేటిధాత్రి అనేక కథనాలు రాసింది. ఆయన చేస్తున్న దుర్మార్గాలను వెలుగులోకి తెచ్చింది. పాపం పండే కాలం రావాలంటే ఇదే మరి. ఆఖరుకు ఆ తహసిల్ధార్‌ జైలుకు వెళ్లాల్సిన పరిస్దితి ఇప్పుడు వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన మోతే మండలంలోని రెవిన్యూ కార్యాలయంలో ఫైళ్ల టాంపరింగ్‌ జరుగుతోందంటూ నేటిధాత్రి వార్తలు రాసిన సందర్భం వుంది. రెవిన్యూ కార్యాలయంలో ఫహానీల టాంపరింగ్‌ జరిగింది వాస్తవమే అంటూ అధికారుల విచారణలో తేలింది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతే మండల తహసిల్ధార్‌పై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ దృష్టిపెట్టారు. కొంత కాలంగా ఎమ్మార్వోపై వస్తున్న వార్తలను సీరియస్‌గా తీసుకున్నారు. గత కొంత కాలంగా లోతైన విచారణ చాలా పకడ్భందీగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తహసిల్ధార్‌తోపాటు, ఇద్దరు ఆర్‌ఐలు, కంపూరట్‌ ఆపరేటర్‌, మీ సేవ నిర్వాహకులతోపాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే అరెస్టైయిన తహసిల్ధార్‌ , ఆర్‌ఐలను జైలుకు పంపించారు. ఈ కేసులో దోషులుగా 21మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే ఒక ఎమ్మార్వో మూలంగా వాటాలు పంచుకుతిన్న ఇతర ఉద్యోగులు కూడా బలికావాల్సి వచ్చింది. ఒక్క కార్యాలయం సాక్షిగా 21 మంది దోచుకుతింటున్నారంటే, ఒక్కొ వ్యక్తి వద్ద ఈ ముఠా ఎంతెంత వసూలు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా వచ్చిన ప్రతి పైసాను వాటాలు వేసుకుంటున్నారంటే, ఏ రేంజ్‌లో అవినీతి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అసలు రైతుల నుంచి ఇలా లంచాలు తీసుకుంటూ జలగలై రక్తాలు పీల్చుకుతింటున్నారు. అటు లంచాలు తీసుకుంటున్నారు. ఇలా ఫహానీలును టాంపరింగ్‌ చేస్తూ అరాచాలు సాగిస్తున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ ఎమ్మార్వోల బాగోతాలు బైటపడుతూనే వున్నాయి. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎమ్మార్వోలు సాగిస్తున్న అక్రమాలపై ఇప్పటికే మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అనేక సార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే వున్నారు. ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతూనే వున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ అక్రమార్కుల దుమ్ము దులుపుతూనే వున్నారు. ఇకనుంచి గతంలో లాగా క్షమించాడాలు వుండవని కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ ఎమ్మార్వోల అరాచకాలు ఎక్కడా ఆగడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మార్వోలు రాబందులకెక్కువ..రాక్షసులకు తక్కువగా తయారౌతున్నారని సాక్ష్యాత్తు ప్రజలే నిందిస్తున్నారు. రైతులను, ప్రజలను జలగల్లా పీడిరచుకుతింటున్నారు. రైతు చనిపోతే వచ్చే పరిహారంలో కూడా చేతి వాటం చూపిస్తామనే దాకా దిగిజారి బతుకుతున్నారంటే అంతటి నికృష్టమైన బతుకు అవసరమా? సరే రైతు పరిహారంలో ఒక్క ఎమ్మార్వోకు చేతులు తడిపితే సరిపోతుందా?..ఆ కార్యాలయంలో ఎమ్మార్వో నుంచి కింది స్ధాయి వరకు పంచుకుంటూ పోతే తప్ప చెక్కు చేతికి రాదు. మానవత్వం పూర్తిగా మార్చిపోయారు. లంచాలు కూడా తమ హక్కు అనేకునే స్ధాయికి చేరుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంత బెదిరించినా అక్రమాలు ఆపరు. లంచాలు తీసుకోకుండా వుండరు. ఒకరి భూములు ఒకరికి అంటగట్టి పల్లెలో పంచాయితీలు పెంచుతున్నారు. రైతుల మధ్య పగలకు కారణమౌతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇస్తే పెట్టిన పిండాలను కూడా తింటామనే తరహాకు దిగజారిపోతున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత చేతిగాని తనంగా తీసుకుంటున్నట్లున్నారు. ఓ వైపు తప్పులు చేస్తూనే దమ్ముంటే పట్టుకొమ్మను అని సవాలు విసురుతున్న ఎమ్మార్వోలు కూడా వున్నారంటే వారి అనైతిక ఎంత దూరం వెళ్తోందో అర్ధంచేసుకోవచ్చు.

కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్.

కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్

గుండాల ఎంపీపీస్ విద్యార్థులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం లో ఆదివారం జరిగిన కుంగ్ పూ, కరాటే పోటిల్లో గుండాల ఎంపీపిఎస్ స్కూల్ విధ్యార్థులు ఏడు గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు ఎస్కె ముఖీన, గుండెబోయిన ఈషిత, ఈసం అరుణ శ్రీ,షైనిస్(స్టూడెంట్), అరేం హర్షవర్ధన్,చీమల మహివరున్, బియ్యాని మైతిలి, సిల్వర్ మెడల్స్,ఎస్కె ముదాజిర్, రాఘవి సాదించారు. ముఖ్య అతిధిగా గుండాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్, వాసవి క్లబ్ గుండాల అధక్షులు వనాల శ్రవణ్, శరత్, తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, ఎట్టి సుందర్ . ఎంపీపీ స్కూల్ ఎచ్ఏం బి. రమేష్, సహా ఉపాధ్యాయులు,పిల్లల తల్లి దండ్రులు, కరాటే మాస్టర్ మంకిడి సుధాకర్ మెడల్స్ సాదించిన విద్యార్థులకు మాస్టర్ కు తల్లి దండ్రులకు చాలువాలతో సన్మానించారు.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఎంహెచ్పీఎస్ అన్ని వర్గాల మేలుకొరకు పోరాటం చేస్తుంది

ఎంహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి:

MHPS

మాదిగల రిజర్వేషన్ ప్రకారం రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్,స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కు అనుకూలంగా ప్రత్యేక సీట్లు కేటాయించాలని
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఎంహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైస ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కులను సాధించే దిశగా కొన్ని దశాబ్దాల ఉద్యమ కాలంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి క్రియాశీలకంగా పనిచేసిందని ఆవిర్భావం నుండి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.గత ప్రభుత్వంలోని దళిత బంధం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క పథకాన్ని అమలులో ఉంచాలని కోరారు.గత డిసెంబర్ నెలలో జరిగినటువంటి గ్రూపు-2 గ్రూప్-3 ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల రిజర్వేషన్ అమలు చేసి మరోసారి మాదిగల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడాలని ఎస్సీల వర్గీకరణ మాదిగ అమరవీరుల విజయమని,నామినేటెడ్ పదవులలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వాలని మైస ఉపేందర్ మాదిగ అన్నారు.ఈ కార్యక్రమము లో
మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొల్లికొండ వీరేందర్ గజ్జల మల్లేష్,పుల్ల రమేష్ ఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు (వరంగల్ జిల్లా)వంతడుపుల అవినాష్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,కందుకూరి ప్రభాకర్ఎంహెచ్పీఎస్ హనుమకొండ(జిల్లా ఇన్చార్జి), మందా ఆరోగ్యం,సిలుముల రాజు,బరిగల బాబు,ఒసేపాక రవి,మున్నా తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

కొమ్మాల జాతరలో ఏరులై పారుతున్న మద్యం.

పవిత్ర దేవాలయం వద్ద మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతులు.?

అడుగడుగునా మద్యం బెల్టు దుకాణాలే జాతరలో దర్శనం.

దేవాలయం అధికారుల పర్మిషన్ లెటర్ ద్వారానే అనుమతులు ఇచ్చమంటూ వివరణ?

ఈ నెల 16 తో ముగిసిన మద్యం అమ్మకాల గడువు..

మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..

బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.

ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

Liquor

పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.భక్తి శ్రద్ధలతో కొమ్మాల జాతరకు వెళ్లిన భక్తులకు ముందుగా మద్యం దుకాణాలు,బెల్టుషాపులే దర్శనం ఇస్తాయి.ఈ నేపథ్యంలో కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారే పరిస్థితి నెలకొన్నది.

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మినరసింహస్వామి జాతర గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది.వివిధ రాజకీయ పార్టీలు,ఇతర ప్రభ బండ్లతో మొదలైన జాతర మంగళవారం ఐదవరోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఆలయ ప్రాంగణంలో మద్యం దుకాణాలు,బెల్టు షాపుల జోరు కొనసాగుతూనే ఉన్నది.దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కొందరు ఉద్యోగులు,రైతులు రాత్రివేళలో వస్తున్నారు.ఐతే జాతరలో ఎక్కడ చూసినా బెల్టు షాపులు,అక్కడే మద్యం సేవించి మత్తులో తిరగటం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఐతే దేవాలయం వద్ద పోలీస్ కంట్రోల్ రూం వద్దనే బెల్టు షాపులు ఏర్పాట్లు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నది.పవిత్రమైన దేవాలయం వద్ద జాతరలో ఫెస్టివల్ ఈవెంట్ అనుమతులు అంటూ ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇవ్వడం ఒకెత్తు అయితే అక్కడ మద్యం దుకాణాలకు ఈవెంట్ కు దేవాలయం అధికారులు పర్మిషన్ లెటర్ ఇస్తారు.. వారు ఇస్తేనే మూడు రోజులకు పర్మిషన్ ఇచ్చాము అని గీసుకొండ పరిధిలో ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ పేర్కొనడం కొసమెరుపు.
ఐనప్పటికీ తాత్కాలిక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన గడువు ఈ నెల 16 తో ముగిసినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని భక్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా పవిత్రమైన దేవాలయం వద్ద మద్యం అమ్మకాలు ఆపివేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు,భక్తులు కోరుతున్నారు.

బెల్టు షాపుల నిర్వహికులపై చర్యలు తీసుకుంటాం.

ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ.

పవిత్రమైన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని వాటిని నిలుపదల చేస్తామని గీసుకొండ మండల పరిధి ఎక్సైజ్ శాఖ సీఐ తాతాజీ నేటిధాత్రికి వివరణ ఇచ్చారు.

మద్యం బెల్టు షాపులకు అనుమతులు ఇవ్వలేదు..

Liquor

దేవాలయ ఈ.ఓ నాగేశ్వర్ రావు..

కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తగా తీసుకున్నామని దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు. దేవాలయము పరిసర ప్రాంతాలకు 200 మీటర్ల లోపు మద్యం బెల్టు షాపులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ.ఓ తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆటంకం కల్పిస్తున్న బెల్టు షాపులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని కొమ్మాల దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తెలిపారు.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయ శ్రీ ,పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ.

ఓటర్ల జాబిత ఫారంల సవరణ పై పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన ఆర్డీఓ డాక్టర్.కె.నారాయణ

ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

పరకాల నేటిధాత్రి;
104 పరకాల నియోజకవర్గ ఓటర్ల జాబితా ఫారం 6,7,8ల సవరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని పరకాల ఆర్డీవో కె. నారాయణ నిర్వహించారు. మంగళవారం పట్టణలోని ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.ఓటర్ల జాబితాలో నూతన,ఓటర్ల మార్పుచేర్పులు,ఒక నియోజకవర్గంలో నుంచి మరొక నియోజకవర్గ మార్పులు చేర్పులు,చిరునామా మార్పిడి దరఖాస్తు చేసుకునే విధంగా బిఎల్వోల వద్దనమోదు చేసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆర్డీవో కోరారు.గత ఎలక్షన్ లో పోటి చేసిన అభ్యర్దుల యొక్క వ్యయ నివేదికలకు సంబంధించిన వివరాలు తెలిపి వాటిలో ఉన్న అభ్యర్దుల ఖాతాల ప్రకారంగా అన్నింటినీ లెక్కలను తెలియచేసారు.బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను ఇవ్వాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు తెలియజేయడంతో పాటు సూచనలు చేశారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ ఓటర్ నమోదు అధికారి,పరకాల తోట విజయలక్ష్మి,ఎన్నికల విభాగం నాయబ్ తహసిల్దార్ జి.సూర్య ప్రకాష్,ఎన్నికల సీనియర్ సహాయకులు ఎస్ భద్రయ్య , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:

ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టులను పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేపడుతున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రశంసించారు,
పరీక్ష రాయనున్న విద్యార్దులు అందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వుండాలని పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఎంచుకోవడానికి సరైన మార్గం అని అన్నారు.విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధిని
ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ , ఎండి.హఫీజ్, సౌదర పల్లి సంపత్ రాజ్ ,కొర్ర వెంకటేష్ నాయక్,ఇల్లందుల రాజు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు ఐలపాక శ్రీనివాస్,పొన్న రాజేష్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన.!

ప్రభుత్వ స్కూలు పరిశీలించి రికార్డులను తనిఖీ చేసిన ఎస్ ఇ ఆర్ టి బృందం..

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ చిట్యాల పాఠశాలలో మంగళవారం రోజున ఎస్ సి ఇ ఆర్ టి పరిశీలకు లు శ్రీ రాంబాబు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కె లక్ష్మణ్ పలు రికార్డులు పరిశీలించారు. ఫార్మేటివ్ అసెస్మెంట్,సమ్మెటివ్ అసెస్మెంట్, టీచర్ డైరీలు, విద్యార్థుల పర్ఫామెన్స్ కు సంబంధించి ఎల్ఐ పి బేస్ లైన్ టెస్ట్, మిడ్లైన్ టెస్ట్ సంబంధించిన రికార్డులు, ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ రిజల్ట్,యాక్షన్ ప్లాన్,ఎస్ఎస్సి గ్రేడింగ్ రిజిస్టర్లు పరిశీలించారు. అంతేకాకుండా విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారి విద్యాసామర్ధ్యాలు పెంపొందించే కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడపాక రఘుపతి ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి ఉపాధ్యాయులు శ్రీ బొమ్మ రాజమౌళి, బుర్రసదయ్య,సాంబారు రామనారాయణ,ఉస్మాన్ ఆలీ,శంకర్, శ్రీనివాస్, నీలిమారెడ్డి, సరలా దేవి, విజయలక్ష్మి, కల్పన,సుజాత,మౌనిక, మరియు సి ఆర్ పి రాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు

కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి బీసీ జేఏసీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బిసి జేఏసీ,మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ సంఘాల విజయమని,బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారందరికీ ఇది గర్వకారణమన్నారు.ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అవుతుందని,దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే మైలురాయిగా నిలుస్తుందనీ,బీసీ జేఏసీ తరఫున ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,దేశవ్యాప్తంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మేము నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశమున్నందున,దీన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలనీ,అప్పుడే ఈ చట్టాన్ని న్యాయపరమైన సవాళ్ల నుండి రక్షించవచ్చునని,ఇది బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం అందించడంలో కీలక పాత్ర పోషితుందనీ,అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ,బీసీ లకు విద్య,ఉద్యోగ,స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% శాతం కల్పిస్తూ బిల్లు ను పెట్టి,తెలంగాణ లోని బీసీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కి ధన్యవాదములు తెలియ జేస్తూన్నామనీ బీసీ జేఏసీ,మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు
ఒడ్డేపల్లి మనోహర్ అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సేవ దళ్ నాయకులు,బీసీ నాయకులు డా.నిలకంటేశ్వర్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు,డా.రాజకిరణ్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,బీసీ జేఏసీ నాయకులు రాజన్న యాదవ్,పిట్టల రవీందర్,పెద్దల్ల చెంద్రకాంత్,ఎండీ లతీఫ్, భీమాసేన్,చెంద్రగిరి చెంద్రమౌళి,పిట్టల తిరుపతి,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా సభ్యులు
దినకర్,దీపక్,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా.!

మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనగా పై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటు

వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

వీణవంక మండల కేంద్రంలో టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి అప్పని హరీష్ వర్మ మాట్లాడుతూ, గత100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీలో నిరసనలకు నిర్బంధం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మల్కి,తెలంగాణ సామాజిక ఉద్యమాలకు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని అన్నారు అలాంటి వారి స్వేచ్ఛ హరించే విధంగా ఉన్న సర్కులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతే కాకుండా ఉన్నతమైనటువంటి విద్యాశాఖ ను తన దగ్గర పెట్టుకొని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని కుట్ర మానుకోవాలని హెచ్చరించారు వెంటనే విద్యాశాఖకు మంత్రి నియమించాలని అదేవిధంగా
ప్రజా పాలన పేరుతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పాలనకు చర్మ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని మేధావులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిర్బంధాలు విధించడం సిగ్గుచేటని విద్యార్థుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా పాలిస్తున్న ఈ పాలనను ప్రజా పాలన అంటారా ?ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలను తలపించే విధంగా ప్రశ్నించే ప్రతి వారిపై నిర్బంధాలను విధిస్తూ ప్రజాపాలన పేరుతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలన రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా స్వాగతించడం లేదని వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పై విధించిన నిర్బంధాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది

పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్.

పేద ప్రజల వద్దకే… మెగా హెల్త్ క్యాంప్…

ఆరోగ్య సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రంను సంప్రదించాలి

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కేసముద్రం మండలం దీన్ దయల్ నగర్ కాలనీ ఎస్ ఆర్ స్కూల్ దగ్గర జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రం, ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ బి రమేష్ తెలియజేశారు. ఈ క్యాంపులో మొత్తం 138 అన్ని రకాల రక్త పరీక్షలు
షుగర్, బీపీ మరియు సాధారణ పరీక్షలు హెల్త్ క్యాంప్లో నిర్వహించడం జరిగిందని కాలనీ లోని ప్రజలు అందరు సధ్వినియోగ పరుచుకున్నారని తెలిపారు.
ఈ క్యాంపు కు ముఖ్య అతిధిగా జిల్లా హెచ్ ఐ వి /ఎయిడ్స్, టీబీ, లేప్రసీ కంట్రోల్ ప్రోగ్రాం ఆఫీస్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దాదాపు 148 మందిని ఒపీ చూడటం జరిగిందని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల వద్దకే వచ్చి హెల్త్ క్యాంపు పరీక్షలు నిరహించటం మూలంగా వారి యొక్క స్థితి తెలుస్తుందని చెప్పారు. మీకు ఆరోగ్య పరమైన,మానసిక ఆరోగ్య పరమైన కౌన్సిలింగ్ మరియు సుఖ లైంగిక సమస్యల కోసం సంపూర్ణ సురక్ష కేంద్రం ను సంప్రదించాలని కోరారు సంపూర్ణ సురక్ష కేంద్రం యొక్క కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. శ్రవణ్ డాక్టర్, శ్రీకాంత్ , ఏ ఎన్ ఎం సుప్రజా , ఆశ వర్కర్ పూలమ్మ , ఎస్ ఎస్ కె ఓ ఆర్ డబ్ల్యు మానస, సర్వోదయ యూత్ ఆర్గనైజషన్ ఓ ఆర్ డబ్ల్యు రమదేవి సరోజ , చిట్టమ్మ, విజయ గ్రామప్రజలు పాల్గొన్నరు. మా గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉందని ప్రజలు హార్షం వ్యక్తం చేసారు.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్.

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారుల చొరవ

25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మార్చి 31లోగా రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి(మెదక్):

Collector

అనధికార లే అవుట్ ప్లాట్లు, అనధికార లే అవుట్ లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31, 2025 లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ.. ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ * తెలిపారు.

ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 22,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని, హౌస్ ఓనర్స్ కి మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని వివరించారు.

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

మిగిలిన దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువు లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలన్నారు.

ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాలు కొరకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా మునిసిపల్ సిబ్బంది ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తుదారులకు ఫోన్ కాల్ చేసి ఈ నెల 31లోపు.. 25 శాతం రాయితీని ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ సేవలను పొందవచ్చునని, మార్చి 31 లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.

సందేహాల నివృత్తికి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయకేంద్రం నంబర్ 9154293341, .అలాగే రామాయంపేట పురపాలక సహాయ కేంద్రం నంబర్ 9963290800 లలో సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.

ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.*

జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

నర్సంపేట,నేటిధాత్రి:

Journalists

నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభిమాని సీనియర్ జర్నలిస్టు మన తెలంగాణ నర్సంపేట డివిజన్ ఆర్సీ ఇంఛార్జి కుండే సురేష్ జన్మదిన వేడుకలు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వార్త ఆర్సీ రడం శ్రీనివాస్ గౌడ్ ,నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబీ వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శులు బిట్ల మనోహర్, జన్ను మురళి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం భరత్ రెడ్డి, మేడం కుమార్, చెన్నబోయిన సాయి శ్రావణ్ దాస్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..

*సీనియర్ జర్నలిస్టు కుండే సురేష్ జన్మదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు ఎర్రబెల్లి విద్యాసాగర్, కందుల శ్రీనివాస్ గౌడ్,మహాదేవుని జగదీశ్వర్,బుర్ర వేణు గౌడ్, హింగే రాజు,ప్రసాద్ రెడ్డి,గాదం రవి,మోహన్,వడ్లకొండ
రాజ్ కుమార్ గౌడ్,కక్కర్ల రంజిత్ కుమార్ గౌడ్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాలు సాధించాలి… ప్రధానోపాధ్యాయులు బద్రి నారాయణ

మహబూబాబాద్/ నేటి ధాత్రి:

మండలంలోని మాధవాపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ ,”విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ ను అలవర్చుకోవాలని, తమ భవిష్యత్తు తమ నడవడికపై ఆధారపడి ఉందని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికతో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలాషించారు. పదవ తరగతి పరీక్షలను ఎలాంటి భయము, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు మరియు 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు ఐదువేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు”.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని రాబోయే కామన్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయ బృందం స్నేహలత, నాగయ్య, రమాదేవి, పరమాత్మ చారి బాబురెడ్డి, సుజాత, సౌభాగ్య, హైమావతి, మమత పాల్గొని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు.!

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబు సహా మరో ఇద్దరు అరెస్ట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గత నెల భూపాలపల్లి పట్టణంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్త హరిబాబు ఖాసింపల్లి , భూపాలపల్లి అను అతనిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హరిబాబు పారిపోవడానికి సహకరించిన ములుగు జిల్లాకి చెందిన వట్టే రమణయ్య రమ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినారు. ఈ అరెస్ట్ నిమిత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీ, జైపూర్ ,ఆగ్రా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి చివరికి నిందితుని ఆచూకీ తెలుసుకొని పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే అరెస్టు అయిన నిందితులను మరల పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించి తదుపరి చర్య తీసుకోబడునని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి తెలిపారు

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు.

బిఆర్ ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టులు

విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి

జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి

శాయంపేట నేటిధాత్రి:

Education Minister

శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన బిఆర్ ఎస్వి నేతను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.బిఆర్ ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా కేయూ బిఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ముందస్తుగా అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలములో ఆరుసార్లు బిఆర్ ఎస్విరాష్ట్ర నాయకులు కొమ్ము ల శివను అక్రమ అరెస్టులు చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం అని అన్నారు విద్యాశాఖకు మంత్రిని నియమించ కుండా కాలయా పన చేస్తూ విద్యార్థుల జీవితా ల తోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటమాడుతూన్నాడని మండిపడ్డారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు.!

కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించిన ప్రభుత్వం:-

– ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం:-

హనుమకొండ, నేటిధాత్రి (లీగల్):-

Government

తెలంగాణ ప్రభుత్వం హనుమకొండ జిల్లా ప్రభుత్వ  న్యాయవాదిగా కాకిరాల నర్సింహారావు ను మరో మూడేళ్ళ పాటు కొనసాగిస్తూ తేది:- నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్టి నియామకానికి సంబంధించిన  ఉత్తర్వులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జారిచేసారు.

నర్సింహా రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కుందూరు సోమారం గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన కాకిరాల రామారావు అనసూయమ్మ దంపతులకు ప్రథమ సంతానం గా 1967 లో జన్మించారు. చినప్పటి నుండే న్యాయవాది వృత్తి లోకి రావాలనే పట్టుదలతో 1992 లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ తో లా పట్టాను పొందారు, ఆతర్వాత ఎల్ ఎల్ ఎం కాకతీయ యూనివర్సిటీ లో చేశారు. గత 33 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తు పలు సివిల్ మరియు క్రిమినల్ కేసుల వాదించారు. గతంలో నిట్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్టాండింగ్ కౌన్సిల్ గా పని చేసిన అనుభవం ఉండటం తో ఆయనను తెలంగాణ ప్రభుత్వ హనుమకొండ జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. ఆయన నియామకం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version