ఎమ్మార్పీఎస్ 9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు
పరకాల నేటిధాత్రి:
పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు మరియు ప్రవేశపెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలనిడిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ రిలే నిరాహార దీక్షకు మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు దాసరి రమేష్,ఎండి పాష,
తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ మాదిగ,మాదిగ విద్యా సమైక్యబొచ్చు నవదీప్ మాదిగ,ఏకు కృష్ణ మాదిగ, ఒంటేరు పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ,బొట్ల జాను మాదిగలు పాల్గొన్నారు.