ఈనెల 9న కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9న కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి

కన్నూరి దానియల్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ టియు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి.

కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, చక్రపాణి, విశ్వనాధులు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుండి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9 న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కార్మిక శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సింగరేణి సంస్థను పరిరక్షించే విధంగా జాతీయ సంఘాల జేఏసీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, భూపాలపల్లి ఏరియాలోని అన్ని సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మాతంగి రామ్ చందర్, నూకల చంద్రమౌళి, బడి తల సమ్మయ్య, కంపేటి రాజయ్య, గణేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి.

ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐ ఎఫ్ టియు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఎం రాయమల్లు చంద్రగిరి శంకర్ హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సింగరేణి కార్మికులు చిరు వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి
మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని . ప్రవేట్ పారం చేస్తూ అమ్మి వేస్తూ అంబానీ,ఆదాని లాంటి వ్యాపారవేతలకు దేశవ్యాప్తంగా .బొగ్గు పరిశ్రమలు. అడివిలో ఉన్న అపార ఖనిజ సంపాదను అప్పగించేందుకు ప్రయత్నిస్తుదని ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కొడ్ లను తీసుకు వస్తుందని బొగ్గు పరిశ్రమరక్షణకోసం సింగరేణిబొగ్గు గనులను కాపాడుకునేందుకు జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె పరిశ్రమల రక్షణకోసం,ఉద్యోగ భద్రతకోసం,అసంఘటిత కార్మికులకు నెలకు 26వేల రూపాయల వేతనం చెల్లించాలని, లేదా పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పుప్రకారం సమాన పనికి సమానవేతనాలు చెల్లించాలని 18.86 నుండి. కార్మిక వర్గం అనేక ఉద్యమాలు నిర్మించి తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నా 44 కార్మిక చట్టాలను. నాలుగు కోడ్ లుగా అమలు చేస్తూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా. చేసే విధానానికి వ్యతిరేకంగా. ఉద్యమించాలని.
సింగరేణి సంస్థ ను వేలంపాట పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని. వేలం పాట లేకుండా సింగరేణి సంస్థను సింగరేణికే ఇవ్వాలని
కార్మికులకు సొంతింటి కల సాకారం చేయాలని
కార్మికులకు ఇన్కమ్ టాక్స్.రద్దు చేయాలని.
విజిలెన్స్ లో ఉన్న మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని
24.25. సంవత్సరపు. లాభాల వాటా.40 శాతం . వెంటనే కార్మికులకు సీసీపీ
లను. రద్దుచేసి. బొగ్గు బావులను నిర్మించాలని ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేశారు

9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు.!

ఎమ్మార్పీఎస్ 9వ రోజు రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టుల మద్దతు

పరకాల నేటిధాత్రి:

పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీ ఆధ్వర్యంలో 9వ రోజు రిలే నిరాహార దీక్షను ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు.షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు మరియు ప్రవేశపెట్టి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలనిడిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎంఆర్పిఎస్ రిలే నిరాహార దీక్షకు మండల పరిధిలోని జర్నలిస్టుల సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు దాసరి రమేష్,ఎండి పాష,
తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ మాదిగ,మాదిగ విద్యా సమైక్యబొచ్చు నవదీప్ మాదిగ,ఏకు కృష్ణ మాదిగ, ఒంటేరు పరమేష్ మాదిగ, బొచ్చు రాకేష్ మాదిగ,బొట్ల జాను మాదిగలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version