* తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
రేషన్ డీలర్ లేక ప్రజలు అవస్థలు
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
తిమ్మారెడ్డి గూడెంలో రేషన్ డీలర్ ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సింహుల గూడెం ప్రధాన బీటీ రోడ్డునుండి తిమ్మారెడ్డి గూడెం వరకు జరిగేరోడ్డుపనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గ్రామం నుండి రేషన్ బియ్యం కోసం ప్రజలురెండు కిలోమీటర్ల దూరం నుండి తుమ్మలపల్లి గ్రామానికి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు రూ. 2500 ఇవ్వాలని, భూమి లేని పేదలకుఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూమిలేని పేదలకు ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25, 26 తేదీలలో తహసిల్దార్ కార్యాలయల వద్ద నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చిట్టి మల్ల లింగయ్య, ఈరటి వెంకటయ్య, గ్రామ ప్రజలు ముత్తయ్య, యాదయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.