కొత్త ‘‘సిఎస్‌’’. రామకృష్ణారావు?

`వచ్చే నెలలో సిఎస్‌. శాంతి కుమారి రిటైర్‌ అవుతున్నారు!

`గతంలోనే రామకృష్ణారావు సిఎస్‌. అవుతారని అందరూ అనుకున్నారు.

`అనూహ్యంగా శాంతి కుమారి సిఎస్‌. అయ్యారు.

`మళ్ళీ ఇప్పుడు రామకృష్ణారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

`సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు.

`సవాళ్లను అధిగమించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అనుభవం వున్న అధికారి.

`తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాత్ర గొప్పది.

`తెలంగాణ వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌ రూపకల్పన సాగిస్తున్న అధికారి.

`అంతటి అనుభవం వున్న అధికారి మరొకరు కనిపించడం లేదు.

`పైగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

`తెలంగాణ మీద పూర్తి అవగాహన వుంది.

`తెలంగాణ సామాజిక పరిస్థితులు పూర్తిగా తెలిసిన అధికారి.

`తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌లు రూపకల్పన చేసి మెప్పించారు.

`తెలంగాణ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నారు.

`అలాంటి రామకృష్ణారావు సిఎస్‌ అయితే తెలంగాణకు మరింత మేలు.

`రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధుల సమీకరణకు తలనొప్పులుండవు.

`ఉమ్మడి రాష్ట్రంలో పలు ఉమ్మడి జిల్లాలకు కలెక్టరుగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.

`ముఖ్యంగా తెలంగాణ వనరులు, వసతులు, సమస్యలపై పూర్తి అవగాహన వుంది.

`ఏ ఏ ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో తెలిసిన అధికారి.

`అన్ని వర్గాల అభ్యున్నతికి సమ ప్రాధాన్యత కల్పించడం కోసం పరితపించే అధికారి.

`అట్టడుగు వర్గాల ప్రగతిని కోరుకున్న అధికారి.

`ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ లాంటి వెనుకబడిన జిల్లాలో కలెక్టర్‌గా పని చేశారు.

`పట్టణ ప్రజల జీవితాలే కాదు, మారు మూల ప్రజల స్థితిగతులు తెలుసు.

`అలాంటి అధికారి సిఎస్‌ అయితే తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుంది.

`ప్రజా ప్రభుత్వానికి మరింత మంచి పేరు వస్తుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

అధికారుల సమర్ధత, నైపుణ్యాలు, అవగాహనల మీదనే ప్రభుత్వాల పనితీరు ఆధారపడి వుంటుంది. సమాజం మీద వారికి వున్న పట్టు, ప్రజల సమస్యల మీద అవగాహన, ఉన్నత లక్ష్యాల నిర్ధేశన ఎంతో ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల మీద తమ కర్తవ్య దీక్షా పరిరక్షణతోనే సమస్యల పరిష్కారం జరుగుతుంది. అయితే ఉన్నతాధికారులైనంత మాత్రాన అన్ని విషయాల మీద అందరికీ అన్ని రకాల అవగాహన వుండాలని లేదు. కాని వుంటే ఆ అదికారి సేవలు రాష్ట్రాలకు ఎంతో మేలు చేకూర్చుతాయి. రాష్ట్రాలను ప్రగతి పథంలో నడిపిస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. రాజకీయ నాయకులు చెప్పే విషయాలపై తలూపే అధికారులు కొంత మంది వుంటే, ప్రభుత్వాలు చేయాల్సిన పనులపై సమగ్రమైన నివేధికలతో అమలు చేయడంలో కొంత మందికి మాత్రమే చిత్తశుద్ది వుంటుంది. ఉద్యోగ నిర్వహన అనేది ఎవరికైనా ఒకటే. కాని కొందరి మాత్రం అది ఒక యజ్ఞం. తన ముద్ర పాలనలో కనిపించాలని తపించే అధికారులుంటారు. ప్రజల మేలు కోసమే నిరంతరం ఆలోచిస్తుంటారు. అలాంటి ఆలోచనలు వున్న అధికారుల మూలంగానే ఈ వ్యవస్ధలు సవ్యంగా, సక్రమంగా సాగుతున్నాయి. కొంత మంది అదికారులు తమకు వచ్చిన అవకాశాలను సమర్ధవంతంగా పూర్తి చేసి, ప్రజల జీవితాలను నిలబెడుతుంటారు. ప్రజల ఆనందాన్ని వారి కళ్లలో చూస్తారు. ప్రజల సంతోషంగా వుండేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ఎందుకంటే ఐఎఎస్‌ అధికారులకు ఉద్యోగ నిర్వహణలో సమయం, సందర్భం అంటూ ప్రత్యేకంగా వుండదు. రోజులో 24 గంటల పాటు ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. పని చేస్తుంటారు. ఎంత పని ఒత్తిడైనా సరే, వారి ముఖంలో చిరునవ్వు తగ్గదు. ఉత్సాహం అసలే తగ్గదు. అలాంటి అధికారులు చాలా మంది వున్నారు. అలాంటి అధికారులలో ఒకరైన రామకృష్ణారావు త్వరలో తెలంగాణ సిఎస్‌ అవుతున్నారని సమాచారం. ఆది నుంచి ఆయన ఉద్యోగ నిర్వహణలో సమర్ధవంతమైన, సంక్లిష్టతలను అధిగమించిన అధికారిగా పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా తన ముద్రను వేసుకుంటూ వచ్చారు. ప్రజల మేలు కోసం అహర్నిషలు కృషి చేశారు. నిజానికి రామకృష్ణారావు గతంలోనే సిఎస్‌ అవుతారంటూ వార్తలు వచ్చాయి. కాని అనూహ్యంగా ప్రస్తుత చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారి పేరు తెరమీదకు వచ్చింది. గత ప్రభుత్వం ఆమెకు అవకాశమిచ్చింది. శాంతి కుమారి వచ్చే నెల రిటైర్‌ కానున్నారు. ఆమె తర్వాత ఈసారి ఖచ్చితంగా రామకృష్ణారావు సిఎస్‌ అవుతారని అదికార వర్గాల్లో చర్చ సాగుతోంది. రామకృష్ణారావు ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ తెలంగాణ క్యాడర్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా విభాగంలో ప్రత్యేక, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన సేవలు ఎంతో విశిష్టమైనవని చెప్పకతప్పదు. గతంలోనైనా, ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హమీల అమలుకు నిధుల సమీకరణ, కేటాయింపుల్లో ఆయన చూపిన చొరవ ఎంతో గొప్పది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు, రూపాయి రాకడ, పోకడ, జీతాలు, నిధుల విడుదల వంటి విషయాల్లో ఇప్పటి వరకు ఆర్దిక వ్యవస్ధకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడంతో రామకృష్ణారావు కృషి అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి లోటు లేకుండా, ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా ప్రజలకు రూపాయి చేర్చడంలో రామకృష్ణారావు అనుసరించి ఆర్ధిక సూత్రాలు రాష్ట్రాన్ని ముందు వరసులో నిలబెట్టాయని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు 11 బడ్జెలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ పదకొండు బడ్జెట్‌లు కూడా రామకృష్ణారావు చేతిలో తీర్దిదిద్దబడ్డాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనైనా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని బడ్జెట్‌లు రూపకల్పన చేసిన అధికారి మరొకరు లేదు. బడ్జెట్‌ రూపకల్పన అంటే సమాన్యమైన విషయం కాదు. బడ్జెట్‌ రూపకల్పన చేసే అధికారులకు రాష్ట్ర పరిస్ధితులు, ప్రజల స్ధితిగతులు, సమాజ అవసరాలు, వ్యవస్ధకు అవసరమైన ఖర్చులు, ప్రభుత్వాలు ప్రజలచ్చిన హమీలు, విద్య, వైద్యం వంటి కీలకమైన అంశాలు, రైతాంగ సమస్యలు, ఉపద్రవాలు, వివిధ సమాజిక వర్గాలకు ప్రభుత్వాలు ఇచ్చిన వరాలు, వాటి కోసం కేటాయింపులు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడంత లిస్టు వుంటుంది. వాటన్నింటికీ సమతూకం వేసి రూపాయి కేటాయింపులు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరు ఐఏఎస్‌ అధికారులు ఈ బాధ్యతను నిర్వర్తించలేరు. రామకృష్ణారావు సమర్ధవంతమైన పాత్ర పోషించడం మూలంగానే ఇన్ని బడ్జెట్‌లు ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ అంటేనే ప్రభుత్వం పని తీరుకు నిదర్శనం. రాజకీయపార్టీలు ఎన్నికల ముందు ఇచ్చే వరాలు, అధికారంలోకి వచ్చాక ఆ పధకాల అమలుకు నిధుల సమీకరణాలు, కేటాంపుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది. అటు ఆర్ధిక నియంత్రణ, ఇటు అవసరాలకు నిధుల సమకూర్పు అనేది కత్తిమీద సాము లాంటి వ్యవహారం. ఆ రెండిరటినీ బ్యాలెన్స్‌ చేసి నిధుల సమీకరణలో ఇప్పటి వరకు తెలంగాణ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొలేందంటే రామకృష్ణారావు బాద్యత ఎంత గొప్పదో అర్దం చేసుకోవచ్చు. అటు ఆర్ధిక శాఖతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ శాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఆ బాధ్యతను కూడా ఆయన ఎంత సమర్ధవంతంగా పోషిస్తున్నారో తెలంగాణ ఆర్ధిక పురోగతిని చూస్తేనే అర్ధమౌతోంది. ఇక రామకృష్ణారావు గతంలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరక్టర్‌ జనరల్‌గా పని చేసిన అనుభవం వుంది.. అది ఆయనకు తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టెందుకు ఎంతో దోహదపడుతోంది. రాష్ట్రం తరుపున ఐటి రంగ అభివృద్దిపై దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో జరిగిన అనేక సదస్సులకు హజరయ్యారు. అక్కడి ఆచరణలు చూశారు. మన అనుభవాలు అక్కడి రాష్ట్రాలకు నేర్పుతూ వచ్చారు. ఇక ఆయన విద్య, వైద్య రంగాలకు సంబంధించిన శాఖలను కూడా నిర్వహించిన అనుభవం గతంలో రామకృష్ణారావుకు వుంది. ఉమ్మడి రాష్ట్రంలో మారు మూల ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గుంటూరు లాంటి జిల్లాల్లోనూ కలెక్టర్‌గా సేవందించారు. దాంతో ఆయనకు పట్టణ ప్రాంతాల సమస్యలు, ప్రగతి, ఆదిలాబాద్‌ లాంటి వెనుబడిన జిల్లా ప్రాంతాలపై పూర్తి అవగాహన వుంది. కాన్పూర్‌, డిల్లీలో ఐఐటి, మాస్టర్స్‌ డిగ్రీలను పూర్తి చేసిన, రామకృష్ణారావు, ఎంబిఏ పట్టా కూడా పొందారు. దాంతో అటు సామాజిక నిర్వహణతోపాటు, ఆర్ధిక నిర్వహణలపై రామకృష్ణారావుకు మంచి పట్టు సాధించగలిగారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం తొలి రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ఎలా వుంటుందన్నదానిపై అనేక అనుమానాలు వుండేవి. కాని వాటి జాడ లేకుండా, ఆర్ధిక లోటు ఊసు లేకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత ఉన్నతాధికారిగా రామకృష్ణారావుకు దక్కుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర గొప్పది. త్వరలో సిఎస్‌ శాంతికుమారి రైటైర్‌ కానున్న నేపధ్యంలో రామకృష్ణారావుకు వున్నంత అన్ని విభాగాల్లో పాలనానుభం వున్న మరో అధికారి లేడు. కాని ఎవరి ప్రయత్నాలువారు చేస్తుంటారు. కాని తెలంగాణ రాష్ట్రం పరిస్ధితులపై పూర్తి అవగాహ వున్న సీనియర్లలో రామకృష్ణారావు ముందు వరుసలో వున్నారు. పైగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన అదికారి కావడం వల్ల ఆయన సేవలు భవిష్యత్తు తెలంగాణ కూడ గుర్తుంచుకుంటుంది. అదే ఇతర రాష్ట్రాల క్యాడర్‌ అదికారికి అంత అంకితభావం వుండకపోవచ్చు. తెలంగాణ ప్రజలు, అవసరాలు, సమాజిక స్ధితిగతులు, పరిస్దితులు, ప్రజల ఆలోచనలు, ఆశలు, అధికార పార్టీ ఇచి ్చన హమీలు, ఇతర రంగాలు, సంక్షేమ రంగాలు, పారిశ్రామిక రంగాలన్నింటినీ మిలితం చేసుకుంటూ రామకృష్ణారావు ముందుకు వెళ్లే అవకాశం వుంటుంది. బడ్జెట్‌ రూపకల్పనతోనే తెలంగాణను ఇంతగా పరగులు పెట్టించిన రామకృష్ణారావు సిఎస్‌ అయితే తెలంగాణ అన్ని రంగాల్లో మరింత ముందడుగు వేస్తుందని చెప్పడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!