అమెరికాలో చేయకూడని పని చేస్తూ దొరికిన భారతీయ మహిళ.

అమెరికాలో చేయకూడని పని చేస్తూ దొరికిన భారతీయ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే..?

ఓ మహిళ అమెరికాకు వెళ్లింది. ఆ దేశాన్ని చూసి వస్తే సరిపోతుండే.. కానీ చేయకూడని పని చేసి కటకటాల పాలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరాయి దేశంలలో ఇండియా పరువు తీసిందంటూ కొందరు.. డబ్బులు ఇచ్చి తప్పించుకోవాలని అనుకుంది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

దేశం కానీ దేశంలో చేయకూడని పని చేస్తూ దొరికిపోయింది భారత్‌కు చెందిన ఓ మహిళ. చివరకు పోలీసులకు చిక్కి.. కటకటాలపాలయ్యింది. తనపై కేసు నమోదు చేయొద్దని.. అవసరమైతే డబ్బులు ఇస్తానని పోలీసులను ప్రాధేయపడిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ భారతీయ మహిళ అమెరికాను సందర్శించడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని టార్గెట్ స్టోర్‌కు ఆమె వెళ్లింది. అయితే ఆ స్టోర్‌లో ఏకంగా ఆ మహిళ 7గంటలు గడిపింది. ఆ తర్వాత పలు వస్తువులు తీసుకుని.. డబ్బులు కట్టకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1300 డాలర్ల విలువైన వస్తువులను ఆమె దొంగిలించిందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఈ మహిళ గత 7 గంటలుగా స్టోర్‌లోనే తిరుగుతుంది. ఆమె వస్తువులను తీసుకుంటూ, తన ఫోన్‌ను తనిఖీ చేస్తూ చివరకు డబ్బులు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను పట్టుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాం’’ అని సిబ్బంది చెప్పారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్నాక.. అవసరమైతే డబ్బు చెల్లిస్తానని.. అరెస్ట్ చేయొద్దని మహిళ ప్రాధేయపడింది. భారత్ లోనూ ఇలానే వస్తువులు దొంగలించడానికి పర్మిషన్ ఉందా..?  డబ్బు ఇస్తే వదిలేస్తారా..? అంటూ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమెను ప్రశ్నించింది. పోలీసులు ఆమెపై ఇంకా కేసు నమోదు చేయలేదు.  అదుపులోకి తీసుకుని ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ దేశానికి అతిథిగా వెళ్లి అక్కడి చట్టాలను ఉల్లంఘించే ధైర్యం చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటే.. ఆమె కచ్చితంగా తెలిసే ఇదంతా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే డబ్బు చెల్లించి బయటపడదామని ఆ మహిళ అనుకుంది. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఒకరు కామెంట్ చేయగా.. పరాయి దేశంలో భారత్‌ పరువు తీసిందని మరొకరు కామెంట్ చేశారు.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

ఓంకార్,బి.ఎన్ రెడ్డి ల పేర్లను వాడితే ఉపేక్షించేదిలేదు.

పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేకే అధినాయకత్వంపై ఆరోపణలు.

ఎంసిపిఐ(యు) డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ వెల్లడి.

నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి:

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి మద్దికాయల ఓంకార్,బి.ఎన్. రెడ్డిల పేర్లను ఉపయోగిస్తూ పార్టీ బహిష్కృత ఆరాచకవాదులు ఎంసిపిఐ పేరుతో చేస్తున్న అరాచక ఆగడాల పట్ల ఉపేక్షించేదిలేదని ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ హెచ్చరించారు.పట్టణం లోని పార్టీ కార్యాలయం ఓంకార్ భవన్ లో పార్టీ సీనియర్ నాయకులు నాగెల్లి కొమురయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.రాజాసాహెబ్ మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్ది కాయల ఓంకార్ నాయకత్వంలో 1984 నుండి 2006 మధ్యకాలంలో మొదటగా ఎంసిపిగా వరంగల్ జిల్లాలో నర్సంపేట కేంద్రంగా ఏర్పడి, అనతి కాలంలోనే ఓంకార్ ఉద్యమ సహచరులతో కలసి ఎంసిపిఐ గా దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేయడంలో అసెంబ్లీ టైగర్ ఓంకార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు. సైదాంతిక విభేదాలతో చీలిన కమ్యూనిస్టు నాయకులను ఏకం చేసి వామపక్ష ఉద్యమాలను దేశంలో బలోపేతం చేయడానికి పార్టీ చివరన యూనిటీ అనే పదాన్ని జోడించారని, దీనిని పార్టీ నుండి బహిష్కరణకు గురైన పానుగంటి నర్సయ్య,సింగతి సాంబయ్య, మొగిలిచర్ల సందీప్ తదితరులు ఆర్థిక అరాచవాదులు పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక పార్టీ అధినాయకత్వంపై ఎంసిపిఐ పేరుతో నర్సంపేటలో ఏకమై తీవ్రమైన ఆరోపణలు చేయడం వారి దివాలాకోరు రాజకీయ రాక్షసత్వానికి నిదర్శనమని అన్నారు.ఓంకార్, బి ఎన్ రెడ్డి ల పేర్లను వాడే నైతిక హక్కు వారికి లేదని,ఆ మహానుభావుల నిజమైన వారసులు ఎవరనేది సరైన సమయంలో సరైన గుణపాఠం ప్రజలే చెబుతారని తెలిపారు.అందుకు ఓంకార్, బి ఎన్ రెడ్డిల నిజమైన వారసులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికీ చాలా ఓపికగా పార్టీ శ్రేణులు ఉన్నాయని, త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీని, పార్టీ నాయకత్వాన్ని అసత్య ఆరోపణలతో ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో శిక్షలు తప్పవని రాజా సాహెబ్ హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, మండల కార్యదర్శులు సింగతి మల్లికార్జున్, కలకొట్ల యాదగిరి, దామ సాంబయ్య, మార్త నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version