అతడి నోరు తెరుచుకోవడం లేదు.. కలిసి చంపేద్దాం రా.. ఢిల్లీ హత్య కేసులో సంచలన నిజాలు..
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వరసకు మరిది అయిన రాహుల్ (24)తో అఫైర్ పెట్టుకున్న సుస్మిత.. అతడి సహాయంతో భర్తను అంతమొందించింది.
వివాహేతర సంబంధాలు, ఇష్టం లేని పెళ్లిళ్లు వంటి కారణాలతో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది (Wife Kills Husband). భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఢిల్లీ (Delhi)లో కూడా అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన కరణ్ దేవ్ (36) కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడని సుస్మిత అనే మహిళ హాస్పిటల్‌కు తీసుకొచ్చింది. అయితే పోస్ట్‌మార్టమ్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
‘మాత్రలు వేసుకున్న తర్వాత ఎంతసేపటికి చనిపోతారో ఒకసారి చెక్ చెయి. ఇప్పటికి కరణ్‌కు మాత్రలు ఇచ్చి మూడు గంటలు అయింది. వామిటింగ్స్ కాలేదు. చనిపోలేదు. ఇప్పుడేం చేయాలి’ అని రాహుల్‌కు సుస్మిత మెసేజ్ పంపించింది.
ఆ మెసేజ్‌కు రాహుల్ స్పందిస్తూ.. ‘అది వర్కవుట్ కాకపోతే కరెంట్ షాక్ ఇవ్వు’ అని చెప్పాడు. అతడి కాళ్లు, చేతులను టేప్‌తో కట్టేసి షాక్ ఇవ్వాలని సూచించాడు.
‘అతడు చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాడు’ అని రాహుల్‌కు సుస్మిత చెప్పింది.
‘ఇంట్లో ఏమేం మాత్రలు ఉన్నాయో అవన్నీ అతడి చేత మింగించు’ అని రాహుల్ రిప్లై ఇచ్చాడు.
‘నేను కరణ్ నోరు తెరవలేకపోతున్నా. అతడి నోట్లో నీళ్లు వేశా. మాత్రలు వేయడానికి మాత్రం కుదరడంలేదు. నువ్వు ఇక్కడకు రా. ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం’ అని సుస్మిత చెప్పింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి కరణ్‌కు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశారు. అనంతరం సుస్మిత అత్తగారి దగ్గరకు వెళ్లి తన భర్త కరణ్‌కు కరెంట్ షాక్ కొట్టినట్టు చెప్పింది. వెంటనే అందరూ కలిసి కరణ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే కరణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ వద్దని అతడి తండ్రి, రాహుల్ (సహ నిందితుడు), సుస్మిత పట్టుబట్టారు. అయితే పోలీసులు వారి మాటలను వినకుండా పోస్ట్‌మార్టమ్ జరిపించడంతో హత్య విషయం బయటపడింది.