తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
నేటిదాత్రి చర్ల
Telangana PRTU Association.
పిఆర్ టియు రాష్ట్ర జిల్లా శాఖల పిలుపు మేరకు చర్ల మండలం లోని వివిధ పాఠశాలలు తిరిగి పిఆర్ టియు టిఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగినది దీనిలో చర్ల మండల సభ్యులు అందరూ సభ్యత్వం తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం లో పిఆర్ టియు టిఎస్ చర్ల మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి తుర్రం వీరభద్రం పునేం వేణు శ్రీనివాస్ దారయ్య గురుమూర్తి వీరమోహన్ పోడియం నాగేశ్వరరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు మంచి స్పందన సభ్యులలో కనిపించింది సంఘం ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అని మీకు త్వరలో మంచి పి ఆర్ సి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్స్ పెండింగ్ బకాయిలు జనగణన చేసిన డబ్బులు ఇప్పించాలని సభ్యులు తెలుపగా సమస్యలు వెంటనే తీర్చే విధంగా చర్యలు తీసుకొనేలా రాష్ట్ర శాఖకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి తెలిపి వీలైనంతవరగా సమస్యలను పరిష్కరిస్తామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు
`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.
`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.
`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.
`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.
`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.
`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.
`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.
`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.
`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.
`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు
`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.
………………………..
`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్’’ కార్యకర్తలు బతికింది లేదు. `అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు. `నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించింది లేదు. `కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు. `ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు. ………………………. `కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది. `పార్టీ కమిటీలకు దిక్కు లేదు.. `పూర్తి స్థాయిలో నామినేట్ పదవులు పంచింది లేదు. ………………….. `బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు. `ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు. `మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు. `ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు. `గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు. `మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు. `ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు. `కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!
హైదరాబాద్,నేటిధాత్రి: రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్ వ్యాపారం చేసే కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.
`నిత్యం లక్షలకు లక్షల సంపాదనలు.కోట్ల రూపాయల ఆస్థులు.
`ప్రకృతి విపత్తులొస్తే ఎంత ప్రాణాలు కోల్పోతారో!
`‘‘జిహెచ్‌ఎంసి’’ని చూసి జిల్లాలలో కూడా ఇదే అనుసరిస్తున్నాయి. వ్రరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరపాలికలు కూడా అవినీతి కంపులో కూరుకుపోయాయి.
`ప్రకృతి విరుద్దంగా అధికారుల నిర్ణయాలు.
`‘‘డిల్లీ’’ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సి వస్తున్న నగరాలు.
`మున్సిపల్ శాఖల అడ్డగోలు అవినీతికి జరిగిన ప్రమాదాలే సాక్ష్యాలు.
`అయినా అధికారులు మారరు.
`ప్రజల ప్రాణాల గురించి క్షణం కూడా ఆలోచించరు.
`పాలకులు పట్టించుకోరు.
`అవినీతి అధికారులు తమ తీరు మార్చుకోరు.
`జిహెచ్‌ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగంలో మరొక ‘‘బాలకృష్ణ’’. ఎపిసోడ్ – 2
`పదిలక్షలు ఇస్తే..ఆరు ఫ్లోర్ల వరకు కళ్ళు మూసుకుంట?
హైదరాబాద్,నేటిధాత్రి:
రక్తం మరిగిన పులి, ఎలుకను వేటాడే పిల్లి ఎప్పుడూ ఒకటి కాదు. రెండూ ఆకలి కోసమే అనుకుంటాం. కాని పులి కోపంతో కూడా వేటాడుతుంది. కనిపించిన జంతువునల్నా చంపి తింటుంది. రక్తం మరిగిన పులిలో ఆకలి,కోపం తప్ప విచక్షణ కనిపించదు. సరిగ్గా అవినీతి అలవాటు పడిన కొందరు ఉద్యోగుల తీరు ఇంతకన్నా దారుణంగా వుంటోంది. ఎంత ఆకలైనా గడ్డి తినవు. కాని అవినీతి తిమింగలాలు మాత్రం గడ్డి, గాదం ఏదైనా తింటారు. పుణ్యానికి వస్తున్నాయంటే పినాయిలైనా తాగుతారు. అంత దరిద్రంగా మారిపోయారు. నీతి లేదు, నియమం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. కనికరం లేదు. ఉద్యోగం పోతుందన్న బెరుకు లేదు. భయం అసలే లేదు. ఎందుకంటే జీతం కంటే వందల రెట్లు అవినీతి సంపాదన చేతుల నిండా నిత్యం కనిపిస్తుంటే భయం ఎందుకుంటుంది? ఒకప్పుడు ఉద్యోగులంటే సగటు జీతగాళ్లు. నెల నెల వచ్చే జీతంతో బతికే మధ్య తరగతి జీవితాలు అనుకునే వారు. కాని ఇప్పుడు ఉద్యోగం అంటే ఒక కల్పతరువైపోయింది. నిత్య సంపాదనకు నెలవైపోయింది. జేబు నిండడం ఎనాడో మర్చిపోయారు. రోజూ సూట్ కేస్ నిండితే గాని ఆకలి తీరని జలగలు తయారయ్యారు. నిత్యం ఎంతో మంది పట్టుబడుతూనే వున్నారు. అయినా జంకు లేదు. బొంకడానికి కూడా ఇష్టపడడం లేదు. లంచం తీసుకొని కూడా కుర్చీలో దర్జాగా కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అలాంటి ఉద్యోగులలో రెవిన్యూ, మున్సిపల్ శాఖలు అందరికన్నా ముందున్నారు. తెలంగాణ వ్యప్తంగా ఒక్క రోజు జరిగితే అవినీతి అంత ఒక ఎత్తైతే ఒక్క జిహెచ్‌ఎంసిలో జరిగితే అవినీతి అంత ఎత్తుగా సాగుతోంది. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇంత విచ్చలవిడి తనం ఎక్కడా కనిపించదు. ఏరాష్ట్రంలోనూ ఇంతటి అవినీతి గలగలున్నట్లు వార్తలు కూడా వుండవు. తెలంగాణలో అధికారుల్లో అవినీతి ఉన్మాదం పెరిగిపోయిందా? అన్నట్లు సాగుతోంది. లంచాలకు బాగా అలవాటు పడ్డారు. జిహెచ్‌ఎంసికి వచ్చే ప్రజలను పీడిరచుకుతింటున్నారు. వారు చెప్పిందే లెక్క. అడిగిందే రొక్కం. అన్నట్లు సాగుతోంది. ఒకప్పుడు లంచమంటే వందలు అనుకునేవారు. ఇప్పుడు వేలు కూడ దాటిపోయింది. లక్షలు,కోట్లు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య పట్టుబడిన కీసర ఎమ్మార్వో ఏక కాలంలో తీసుకున్న లంచం ఏకంగా రూ.100 కోట్లు. అది విన్న జనానికి గుండెలు అదిరాయి. అంటే తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అనేది ఊడల మర్రిని మించిపోయింది. జిహెచ్‌ఎంసి అధికారులు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం అంటే నిత్యం కరెన్సీలతోనే స్నానం అన్నట్లు అవినీతి సాగుతోంది. ఎలాంటి పర్మిషన్ కావాలన్నా సరే లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇలా జిహెచ్‌ఎంసిలోని అన్ని సర్కిళ్లలో అవినీతికి అంతు లేకుండాపోతోంది. అడ్డూ అదుపు లేని అవినీతి సంపాదన ఉద్యోగులకు చేరుతోంది. ఓ వైపు సామాన్యులను వేదించుకుతింటున్నారు. అడ్డగోలు నిర్మాణాలు చేసుకునేవారికి అమ్ముడుపోతున్నారు. నగరం ఎలా వుండాలి. ఎలా వుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులుండవు. సమాజానికి సమస్యలు ఎదురుకాకుండా వుంటాయన్న సోయి ఏ ఒక్క ఉద్యోగిలోనూ లేకుండాపోతోంది. జిహెచ్‌ఎంసిలో అదికారులు అనుసరిస్తున్న విధానం ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయని చెప్పకతప్పదు. జిహెచ్‌ఎంసి అంటేనే అవినీతికి తాతలు అనే పేరు సార్ధకం చేసుకుంటున్నారు. ఇక టౌన్ ప్లానింగ్ అంటేనే జనం జడుసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే దాక వెళ్లిపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. సక్రమ నిర్మాణదారులను వేదిస్తుంటారు. అక్రమ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంత చెబితే అంత ముట్టజెబుతారు. అన్నీ వాళ్లే చూసుకుంటారు. అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. బిల్డింగ్ మొదలు పెట్టిన నుంచి పూర్తయ్యే వరకు అక్రమ నిర్మాణదారులు ఉద్యోగులను ఇంటి అల్లుడిని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారు. లంచాలు, విందులు, వినోదాలు అన్నీ అందిస్తున్నారు. కాని సామాన్యులు కనీసం లంచం ఇచ్చుకోలేరు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు అడిగినంత సొమ్ము అసలే ఇచ్చుకోలేరు. ఇంకా ఇక్కడ వింతేమిటంటే 60 గజాలు, వంద గజాల స్ధలాలలో సహజంగా జివన్ ప్లస్ వరకు మాత్రమే అనుమతి వుంటుంది. అంత వరకే నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. కాని అధికారులు అశీస్సులతో నిర్మాణదారులు ఆరు అంతస్ధులు వేసుకున్నా పట్టించుకోరు. అటు వైపు చూడరు. ఎందుకంటే నిర్మాణం చేసుకోపో..అని అభయమిచ్చేదే టౌన్ ప్లానింగ్ అధికారులు. అలా ఒకరిని చూసి ఒకరు అదికారులు అడిగింత ముట్టజెప్పి నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీ, …..లలో ఐటి కంపనీలు ఎక్కువ. ఆ ప్రాంతాలలో కొత్తగా వెలిసిన కాలనీలు చూస్తే పద్మవ్యూహమైనా అర్దమౌతుందేమో కాని, ఆ కాలనీలు అర్ధం కావు. అన్ని ఆరు అంతస్ధుల బిల్డింగులే. ఎక్కడ చూసినా ఐటి ఉద్యోగులకు అవసరమైయ్యేలా నిర్మాణం చేసి ఇస్తున్న అద్దె బిల్డింగులే. అరవై, వంద గజాలలో ఆరు అంతస్ధుల నిర్మాణాలు. కనీసం గాలి కూడా దూరనంత సందు కూడా వుండనంత ఇరుగ్గా, పక్కపక్కనే బిల్డింగులు. ఇళ్లముందు రోడ్లు కూడా కనీసం పది ఫీట్లు కూడా వుండవు. రెండు ఆటోలు ఎదురెదురు వచ్చినా ముందుకు వెళ్లలేవు. నలుగురు ఏక కాలంలో నడుచుకుంటూ వెళ్లలేరు. ఆ రోడ్లమీదే కార్లు, బైక్‌లు. ఇలా అంతా చిందరవందర జీవితాలను తలపించేలా కాలనీలుంటాయి. ఇలాంటి నిర్మాణాలన్నీ అక్రమమే. ఏ ఒక్కటి సక్రమం కాదు. ఎందుకంటే 60, 100 గజాల స్ధలాలలో జిప్లస్ వన్ మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలి. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఐదారు ప్లోర్లకు అనుమతులు ఇవ్వకూడదు. అదికారులు చాక చక్యంగా నోటి మాట ద్వారా అనుమతులిస్తారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేసేందుకు కూడా వీలుండదు. కనీసం ఆ సందుల్లోకి జేసిబిలు కూడా వెళ్లలేవు. అంటే కూల్చడానికి వీలు లేనంత సందుల్లో నిర్మాణాలు చేపడతారు. 60, 100 గజాలలో ఆరు అంతస్ధులు నిర్మాణం చేసుకునేవారు ఓ పది లక్షల రూపాయలు టౌన్ ప్లానింగ్ అదికారులు చేతుల్లో పెడితే చాలు. అనుమతులు అర క్షణంలో ఇచ్చేస్తారు. మూడు నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఆరు నెలల్లో బిల్డింగులు అద్దెకిచ్చేస్తారు. ఇంత స్పీడ్‌గా నిర్మాణాలు జరిగిపోతుంటాయి. పక్క పక్కనే వెలసిన ఆరు అంతస్ధుల నిర్మాణాల కోసం విపరీతమైన బోర్లు వేస్తారు. భూమిని గుళ్ల గుళ్ల చేస్తారు. సహజంగా ఓ వంద గజాల స్ధలంలో ఓ నిర్మాణం చేపడితే ఓ పది మంది నివాసం వుండేందుకు ప్రకృతి సహకరిస్తుంది. స్వచ్చమైన గాలి, సరిపడినంత నీరు అందుతుంది. ప్రైగా మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసే డ్రైనేజీ సిస్టమ్ కూడా అంత మేరకే వుంటుంది. కాని నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్ నిర్మాణాలు చేసి, ఒక్కోబిల్డింగ్‌లో కనీసం వంద నుంచి నూటాయాభై మందికి వుంటున్నారు. ఇలా వేలాది నిర్మాణాలున్నాయి. అందుల్లో లక్షల్లో కిరాయిదారులుంటున్నారు. ఐటి కంపనీలు దగ్గరగా వుండడం వల్ల తప్పని పరిస్ధితుల్లో ఐటి ఉద్యోగులుంటున్నారు. ఐటి ఉద్యోగుల అవసరం గుర్తించిన వాళ్లు అక్రమంగా ఇలాంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. ఏదైనా అనుకోని ఉపద్రవం ఎదురైతే ఒక్కరు కూడా బతికి బట్టకట్టే పరిస్ధితి వుండదు. భూకంపం లాంటి విపత్తులొచ్చినా బతికే చాన్సు వుండదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే బూడిత తప్ప మరేం మిగలదు. పర్మిషన్లు ఇచ్చే ముందు అదికారులు భవిష్యత్తు గురించి ముందూ వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. లక్షలు చేతుల్లో పడుతున్నాయా? లేదా? అన్నదే చూసుకుంటున్నారు. అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏది జరిగినా తప్పించుకునేందుకు జిప్లస్ వన్ మాత్రమే ఇచ్చామని చెప్పుకునేలా మాటతోనే పర్మిషన్లు ఇచ్చుకుంటూపోతున్నారు. ఎందుకంటే అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగే అవకాశమే లేదు. సామాన్యులు కాంపౌడ్‌వాల్‌ను ఒక ఇంచ్ ముందుకు తెస్తేనే కూల్చేస్తారు. అలాంటిది ఆరు ఫ్లోర్లకు అనుమతులిస్తున్నారు. అలాంటి అక్రమ నిర్మాణాలు, జిహెచ్‌ఎంసి సర్కిళ్ల అధికారులు అవినీతిపై మీ నేటిధాత్రిలో వరుస కథనాలు త్వరలో…
కార్మికుల హక్కుల కోసం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహా ర్యాలీలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొడేటి అశోక్, ఉపాధ్యక్షులు ఈర్ల సురేందర్, కోశాధికారి గాయపు రాజురెడ్డి, చిలువేరు శ్రీకాంత్,గుర్రాల శ్రీనివాస్, సదిరం కుమార్,ఎండీ.అక్మల్ పాషా, మోడం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో వన మహోత్సవ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షిత చెట్లను మనం రక్షించినట్లయితే చెట్లు మనలను రక్షిస్తాయి చెట్లు నాటడం వలన పర్యావరణం సమతుల్యంగా ఉండి సకాలంలో వర్షాలు పడి నీటి ఎద్దడి ఉండదు చెట్లు మానవుని మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి చెట్లు కార్బన్డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ప్రాణవాయువుని ఇచ్చి ఆయుష్షును పెంచే విధంగా చేస్తాయి చెట్లు అనేక జీవులకు నివాసం కల్పించి మనకు పండ్లు వేసవికాలంలో నీడనిచ్చి సేద తీరుస్తాయి అందుకే విద్యార్థులు మీ ఇంటి ముందు గానీ ఖాళీ ప్రదేశాలున్నచోట మొక్కలు నాటాలని కోరారు ఈ సమావేశంలో పాఠశాల డైరెక్టర్ మహమ్మద్ ఆఫీస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
ఓదెల మండలంలోని మల్లికార్జున మండల సమైక్య ఐకెపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబరాలను నేడు రాష్ట్రంలోని అన్ని మండలాలలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంబరాలను జరుపుకోవాలని తెలియజేయగా ఓదెల మండల సమైక్య కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇన్సూరెన్సులు పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు సంస్థ గత నిర్మాణం మార్కెట్ సెంటర్లు నిర్వహణ మహిళలను చైతన్య పరచడానికి శిక్షణలు మొదలగునవి l ఈ సంబరాలలో మహిళలందియంచా, ఈ కార్యక్రమంలో డిపిఎం సంజీవ్, ఏపీఎం లతా మంగేశ్వరి ,మండల సమైక్య అధ్యక్షురాలు ఆలేటి స్వప్న సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ, రాజకుమారి,అకౌంటెంట్ భవాని,ఆపరేటర్ పవన్ కుమార్, అటెండర్ రామయ్యలతోపాటు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాలు వివో ఏలు పాల్గొనడం జరిగింది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈపండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీనవదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను చూపిస్తున్నారని, మతాలకు అతీతంగా బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓతల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మాదైవం నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. సుమారు నూటయాభై మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డే-కేర్ సెంటర్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కు అప్పగించాలని విన్నపం
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేత
సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ కు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల్ శంకరయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాసు కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం మరో కార్యదర్శి వికృతి ముత్తయ్య గౌడ్ , బుస దశరథం , చీకోటి శ్రీహరి, సీనియర్ సిటిజన్ వేములవాడ బాధ్యులు మొదలైన సీనియర్ సిటిజన్ ప్రతినిధులు కలిసి, ఆది శ్రీనివాస్ ని సత్కరించి వారి చేతుల మీదుగా సీనియర్ సిటిజన్ చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. వినతి పత్రాన్ని సమర్పించారు. తర్వాత ప్రభుత్వం తరఫునుండి మంజూరైన డీ-కేర్ సెంటర్ ను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నడుపుటకు సంసిద్ధంగా ఉన్నదని విన్నవించారు. వినతి పత్రం సమర్పించారు. సీనియర్ సిటిజనులకు సంబంధించినది కాబట్టి సీనియర్ సిటిజనులకు ఇచ్చినచో 100% సీనియర్ సిటిజనులకు న్యాయం జరుగుతుందని ప్రతినిధులు విన్నవించుకున్నారు. దానికి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని చెప్పడం జరిగినది.సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి.
జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మనబోయిన యాకయ్య, సీనియర్ నాయకులు బి వెంకన్న.
తొర్రూరులో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభ.
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం గొల్ల కురుమలే కాకుండా సబ్బండ వర్గాల ప్రజలు కృషి చేయాలని, దొడ్డి కొమురయ్య ఉద్యమస్ఫూర్తితో గొల్ల కురుమ యువత తమ హక్కుల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీ.ఎం.పీ.ఎస్) జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్మనబోయిన యాకయ్య, సంఘం సీనియర్ నాయకులు బొమ్మనబోయిన వెంకన్న లు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి సందర్భంగా గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షులు ఎద్దు ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్మనబోయిన యాకయ్య, బొమ్మనబోయిన వెంకన్న లు సంయుక్తంగా మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి మరింత ఉద్యమాన్ని రగిలించిందని… తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ గొల్ల కురుమ యువ నాయకుడు దొడ్డి కొమరయ్య ముందు నడిచి అమరత్వం పొందడం మన గొల్ల కురుమల అందరికీ గర్వకారణమని… వారి బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఒక గొల్ల కురుమలకే కాకుండా దొడ్డి కొమరయ్య తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయన అమరత్వం బాసటగా నిలిచిందని…. అణగారిన వర్గాల కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం భూమి బుట్టి పేద ప్రజల విముక్తి కోసం అమరుడయ్యాడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు పోసాని సంతోష్ యాదవ్, నూకల హరీష్, జిఎంపిఎస్ తొర్రూరు మండల కార్యదర్శి మద్దెల రాజు, ఉపాధ్యక్షులు సర్వి నగరాజు, ఎర్రం రాజు, సహాయ కార్యదర్శి పెద్దబోయిన కుమార్, గిరిజన సంఘం నాయకులు భీమా నాయక్, బహుజన సామాజిక కార్యకర్త మాలోత్ సురేష్ బాబు, ఎస్సీ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు వెల్తూరి పూర్ణచందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి, జర్నలిస్టు పున్నం సారయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు కొండ వెంకన్న, వృత్తి ప్రజా, కుల గొల్ల కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS )రాయికల్ మండల శాఖ పక్షాన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న రాయికల్ మండల ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్స్ అందజేయుట గురించి రాయికల్ మండల పరిషత్ కార్యాలయం లో ఎపిఓ కండ్లె సుష్మ సూపరింటెండెంట్ యస్.ప్రవీణ్ గార్లకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ, వేముల మధు, మండల శాఖ అధ్యక్షులు కొండూరి రజనీకాంత్ సభ్యులు పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈటెల, అరవింద్‌ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు
హైదరాబాద్,నేటిధాత్రి:
కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్నారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించిన తర్వాత 2023 జూలై నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. కాగా ఎన్. రామచంద్రరావుకు మొదట్నుంచీ ఆర్.ఎస్.ఎస్.తో మంచి అనుబంధం వుంది. ఆయన సంఫ్‌ు కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. నుంచి సంపూర్ణ మద్దతు లభించడం కూడా ఒక కారణం. రాబోయే మూడేళ్ల కాలం ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. తర్వాత వచ్చే ఎన్నికల ముందు బండిసంజయ్‌కి పార్టీ పగ్గాలను తిరిగి అప్పగించే అవకాశాలున్నాయి. బండిసంజ య్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించినప్పటికీ, కేంద్ర నాయకత్వం, ఆయన మాటకు అత్యంత విలువనిస్తుంది. బీజేపీని నాటి అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న స్థాయికి తీసుకెళ్లిన ఆయన సేవలను పార్టీ అధిష్టానం ఇప్పటికీ గుర్తిస్తోంది. గతనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, కేంద్ర నాయకత్వం రామచంద్రరావును నామినేషన్ దాఖలు చేయాలని కోరడం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి విషయంలో కేంద్ర నాయకత్వం ఒక స్పష్టమైన వైఖరి తో వున్నదని దీంతో స్పష్టమైంది. అయితే మల్కాజ్‌గిరి ఎం.పి. ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎం.పి. అరవింద్‌కుమార్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మహబూబ్‌నగర్ ఎం.పి. డి.కె. అరుణ కూడా ఈ పదవికి పోటీదార్లుగా వున్నారు. అయితే రాజాసింగ్ ఒక వీడియోను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగాలని కోరారు. కానీ అధిష్టాం దీన్ని పట్టించుకోలేదు. కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి శోభ కరండల్‌జీ కేంద్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాగా రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ ఆర్.ఎస్.ఎస్. విభాగం, రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం రామచంద్రరావు పేరును సిఫారసు చేయడం ఈ ఎన్నికకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకున్న విడదీ యరాని అనుబంధం, ఎబీవీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, మొదట్నుంచీ బీజేపీకి విధేయంగా వుండటం, పార్టీలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్య నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చిన అంశాలు. పార్టీ మిగిలిన వారిని పరిశీలించినప్పటికీ, ఒక్కక్కరికీ ఒక్కో రకమైన ప్రతి కూలత వుండటాన్ని కూడా పార్టీ నాయకత్వం గుర్తించింది. వీరిలో ఎవరికి అవకాశమిచ్చినా ఇతర వర్గాలనుంచి అసమ్మతి చెలరేగే ప్రమాదమున్న సంగతిని అర్థం చేసుకునే చివరకు రామచం ద్రరావువైపు మొగ్గు చూపింది. ఉదాహరణకు ఈటెల రాజేందర్‌ను, ఇటు బండిసంజయ్ వర్గం, కిషన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇక బండిసంజయ్ అభ్యర్థిత్వాన్ని ఈటెల, కిషన్‌రెడ్డి అడ్డుకుంటారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్‌ను పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. అమిత్ షాతో అత్యంత సాన్నిహిత్యం వున్న నేపథ్యంలో బండి సంజయ్ మాటకు విలువ ఎక్కువ. ఆయన రామచంద్రరావుకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. అరవింద్ కుమార్‌కు కూడా రా మచంద్రరావు అభ్యర్థిత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇక ఈటెల రాజేందర్ విషయానికి వ స్తే ఇప్పటికీ ఆయనకు బీఆర్‌ఎస్ నాయకులతో సాన్నిహిత్యం వుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను కూడా ప్రశ్నించడం మరో కారణం. ఆయనకు ఎన్ని అవ కాశాలిచ్చినా బీఆర్‌ఎస్ పట్ల సానుభూతి వున్న నేతగానే పేరుపడ్డారు. కె.సి.ఆర్. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కె.సి.ఆర్.తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చారు. అదీకాకుండా తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అవినీతి పార్టీ అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించేవారు చేతులెత్తమని కోరగా, పాల్గన్నవారిలో చాలామంది చేతులెత్తారు. కానీ ఈటెల రాజేందర్ మిన్నకుండిపోయారు. దీన్ని అధినాయకత్వం గుర్తింలేదనుకుంటే పొరపాటే. పార్టీ నాయకత్వం వివిధ నేతల వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఈ అంశం కూడా రాష్ట్ర నాయకులు అమిత్ షా చెవిన వేయకుండా వుండరు. ఇవన్నీ ఈటెల రాజేందర్ ఎ న్నికకు ప్రతికూలంగా మారాయి. ఇక ఎన్. రామచంద్రరావు (66) ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. 2015 నుంచి 2021 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.సి.గా తెలంగాణ శాసనమండలిలో కొనసాగారు. అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్‌కు ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 1985లో రామచంద్రరావు అడ్వకేట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్ రావు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. రామచంద్రరావు కుమార్తె ఆముక్త నారపరాజు ఆస్ట్రేలియాలో ఐ.టి. రంగంలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అవినాష్ నారపరాజు తెలంగాణ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పికెట్ కేంద్రీయ విద్యాయంలో చదువుతున్న కాలంలో రామచంద్రరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలం లో ఆయన ఏబీవీపీ రాష్ట్ర యూనియన్‌కు మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా వరుసగా ఎన్నికయ్యారు. ఉస్మానియా లా కాలేజీ యూనియన్‌కు ఎబివిపి తరపున అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను చదువుకుంటున్న కాలంలో 14సార్లు జైలుకెళ్లారు. 1982లో ఆర్డ్స్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీనుంచి మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. 1985లో బ్యాచులర్ ఆఫ్ లా డిగ్రీని ఇదే యూనివర్సిటీనుంచి పొందారు.తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, తనపట్ల అచంచల వి శ్వాసం వ్యక్తం చేసిన తె లంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్పూర్తిదాయక రాష్ట్ర ప్రజలకు సేవచేసే గురుతర బాధ్యతను అప్పగించిన నరేంద్ర మోదీ, అమిత్ షా, జె.పి. నడ్డాలకు కృతజ్ఞత లు తెలిపారు. ఇదే సమయంలో తనకు రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్రరావు ఎన్నికపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తం కావడం మామూలే. మరెవరు ఎన్ని కౖౖెనా ప్రతికూల గ్రూపుల నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం సహజమే. అయితే ఏ గ్రూపునకు చెందనివాడు కావడంతో అందరి ఆమోదాన్ని రామచంద్రరావు పొందగలిగారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రామచంద్రరావుకు జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక రూపంలో సవా లు ఎదురుకానుంది. అంతేకాదు పార్టీలోని వివిధ గ్రూపుల మధ్య కూడా సమన్వయం సాధించడం ఆయన ముందున్న మరో సవాలు. కాకపోతు మృదుస్వభావి, అందరినీ కలుపుకుపోయే స్వభావం వున్న నాయకుడిగా రామచంద్రరావుకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. అంతేకాదు అందరినీ పార్టీ ఉమ్మడి లక్ష్యాలవైపు నడిచేలా చేయడానికి కూడా ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాకపోవచ్చు. పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వాలతో సన్నిహిత సంబంధాలు, మొద ట్నుంచీ పార్టీకి విశ్వసనీయ కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఆయనకు సానుకూలంగా మారనున్నది. అయితే రామచంద్రరావు ఎన్నికకు ముందే పార్టీ ‘ఎం`3’ ఫార్ములాను ముందుకు తెచ్చింది. ‘ముదిరాజ్, మున్నూరు కాపు, మాదిగ’ వర్గాలను ఆకర్షించేందుకు పార్టీ రూపొందించిన ఫార్ములా ఇది. దీన్ని రామచంద్రరావు గట్టిగా అమలు చేసి ఆయా వర్గాలు పార్టీవైపు మళ్లేలా చేయాల్సి వుంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మాదిగ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగను తన పక్కనే కూర్చోబెట్టుకోవడమే కాదు, ఎస్సీ ఉపకుల వర్గీకరణకు కూడా సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు కూడా అనుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో దీన్ని అమలు చే శారు. ఇదే మాదిరి మిగిలిన రెండువర్గాలను పార్టీకి అనుకూలంగా మారేలా రామచంద్రరావు కృషి చేయాల్సి వుంటుంది.
-అభివృద్ధి ఓటు వేసి కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారా?
-హైడ్రా ప్రభావం కాంగ్రెస్ కు అనుకూలమా? వ్యతిరేకమా?
-జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమే.
-ఈ ఎన్నిక గెలిస్తే కాంగ్రెస్ తిరుగుండదు.
-కాంగ్రెస్ కు వలసలు వరదలా వస్తాయి.
-సిఎం. రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది.
-మరో పదేళ్ల దాక కాంగ్రెస్ కు బలం చేకూరుతుంది.
-బిఆర్‌ఎస్ చేసే ప్రచారం అసత్యమని తేలుతుంది.
-అధికారమంతా కేంద్రీకృతం చేసుకునే అవకాశం కూడా వుంది. …………………………..
-బిఆర్‌ఎస్‌కు సానుభూతి కలిసొస్తుందా?
-ప్రభుత్వం మీద చేస్తున్న దుష్ప్రచారం పని చేస్తుందా?
-ప్రజల్లో బిఆర్‌ఎస్ కు ఆదరణ వుందా?
-పార్లమెంటు ఎన్నికల ఫలితమే పునరావృతమౌతుందా?
-బిఆర్‌ఎస్‌కు ఈ గెలుపు జీవన్మరణ సమస్య
-జూబ్లీ హిల్స్ గెలవకపోతే గులాబీ మనుగడ చాలా కష్టం.
-ఫోన్ ట్యాపింగ్, ఇతర కేసులన్నీ నిజమని బలపడుతుంది జనం నమ్మకం
-ఇప్పటికీ కంటోన్మెంట్ కోల్పోయారు.
-అక్కడ సానుభూతి ఏ మాత్రం పని చేయలేదు.
-జూబ్లీ హిల్స్ లో కూడా పని చేస్తుందన్న నమ్మకం బిఆర్‌ఎస్‌లోనే కనిపించడం లేదు.
……………………
-జూబ్లీ హిల్స్ కమలం వికసించాలని చూస్తోంది.
-బిజేపి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం వుంది.
-జాతీయ రాజకీయ నాయకులను రంగంలోకి దింపే ఆస్కారం వుంది.
హైదరాబాద్,నేటిధాత్రి: రంగంలోకి దిగితే గాని గండామా, సుడిగుండమా తెలుస్తుందనేది ఓ సామెత. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఎన్నిక విషయంలోనూ అన్ని పార్టీలదీ అదే పరిస్ధితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ జెండా ఎగుతుందనేది ఉత్కంఠగామారింది. అన్ని పార్టీలు ఉప ఎన్నిక విషయంలో సై అంటే సై అన్నట్లే వున్నాయి. కాని లోలోప మాత్రం ఎంతో కొంత భయం కూడా పార్టీలకు వున్నట్లు కనిపిస్తోంది. సుమారు ఏడాది తర్వాత వస్తున్న ఎన్నిక కావడం కూడా గమనార్హం. ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఇంత ఉత్కంఠ నెలకొనలేదు. కాని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాత్రం అందరికీ అంచచనాలున్నాయి. అందరికీ భయాలున్నాయి. అయితే పాలకపక్షం కాంగ్రెస్ గెలిచేందుకు కొంత సులువుగా వాతావతరణం కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతం రాజకీయ, సామాజిక, ఆర్ధికపరమైన సమస్యలు పెద్దగా చూసే నియోజకవర్గం కాదు. అక్కడి ప్రజలకు, ఇతర ప్రాంతాల ప్రజల జీవన విధానానికి కూడా కొంత తేడా వుంటుంది. సుమారు సగం మంది ప్రజలకు అసలు ఈ ప్రపంచంతోనే సంబంధం లేన్నట్లు జీవితం వుంటుంది. రాజకీయాలతో సంబంధం లేని జీవితాలు గడిపే కుటుంబాలుకూడా చాల వుంటాయి. అందువల్ల ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతారని చెప్పడం కొంత కష్టం. అందుకే అదికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందన్న అంచనాలు కూడ వున్నాయి. పైగా సార్వత్రిక ఎన్నికలు మూడేళ్లకుపైగా సమయం వుంది. అప్పటి వరకైనా నియోజకవర్గం అభివృద్ది కోరుకునే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఇలాంటి సమయాల్లో సహజంగా ప్రజలు అభివృద్ది కావాలనే కోరుకుంటారు. ఒక వేళ ప్రతిపక్షానికి ఓటు వేసినా, ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా మళ్లీ అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ నాయకుల వద్దకే వెళ్లాల్సివుంటుంది. అప్పుడు ఓటెందుకు వేయలేదన్న ప్రశ్నలు కూడా వారి నుంచి ఎదురౌతాయి. అందుకే సహజంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీలే ఎక్కువ మేలు జరిగిన సందర్భాలే అదికంగా వుంటాయి. జూబ్లీ హిల్స్‌లో హైడ్రా ప్రభావం ఏమైనా వుంటుందా? సందేహం మాత్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ప్రజలు పూర్తిగా నూటికి నూరుశాతం హైడ్రాకు మద్దతు తెలిపినట్లే అనుకోవాల్సి వుంటుంది. అది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనకు, ఆయన దూకుడుకు మరింత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే ప్రజల మద్దతు మాత్రమే కొండంత బలమౌతుంది. ఇక్కడ కూడా అదే జరిగితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వానికి మరో పదేళ్ల వరకు తిరుగుండని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల ఈ ఎన్నిక గెలుపు అనేది అటు పార్టీకే కాదు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకమే అనిచెప్పాలి. ఈ ఉప ఎన్నిక గెలిస్తే ఇక కాంగ్రెస్‌కు ఎదురుండదు. కాంగ్రెస్ నాయకుల జోష్‌కు తిరుగుండదు. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమౌతుంది. నాయకులకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఊ అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటూ బిఆర్‌ఎస్ చెప్పే లేనిపోని సర్వేలన్నింటికి చరమగీతం పాడినట్లౌవుంది. మూడేళ్ల దాకా ఇక బిఆర్‌ఎస్ నోరు తెరవకుండా అవుతుంది. 2005 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కనీసం పోటీ చేయని పరిస్తితి బిఆర్‌ఎస్‌కు మరోసారి వస్తుంది. ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నుంచి వలసలు వరదల్లా వస్తాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది పార్టీ అభ్యర్ధికే కాకుండా ప్రభుత్వానికి పరీక్ష అనుకొని పనిచేయాల్సి వుంటుంది. జూబ్లీహిల్స్ సీటు గెల్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేకపోయినా, ఎంతో కొంత ఇబ్బందికరమే అవుతుంది. ముఖ్యంగా సిఎం. రేవంత్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారికి ఒక దారి దొరికినట్లౌవుతుంది. ఆ అవకాశం స్వపక్షానికి గాని, ప్రతిపక్షానికి గాని ఇవ్వకూడదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలి. రేవంత్‌రెడ్డి నాయకత్వం మరింత బలపడాలంటే ఆయన బలం కొండంత పెరగాలంటే పార్టీ నాయకులందరూ శ్రమించాల్సిన అవసరం వుంటుంది. అధికార యంత్రాంగమంతా చేతుల్లో వుంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులంతా అక్కడే వుంటారు. జిల్లాల నాయకత్వాలను కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకొని గెలవాల్సిన అవసరమైతే వుంది. అంతే కాకుండా బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలని కూడా తిప్పి కొట్టేందుకు వీలు కల్పించినట్లౌవుంది. కాలు దువ్వే గులాబీకి రేకులన్నీ రాలిపోయాతాయన్న భయం ఏర్పడుతుంది. ఇక బిఆర్‌ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీకి ముందుగా కలిసి వచ్చే ప్రధానమైన అంశం కేవలం సానుభూతి. ఆ సానుభూతి ఎంత వరకు ఉపయోగపడుతుందన్నది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేం. సానుభూతి రాజకీయాలు కూడా కొన్ని సార్లు పనిచేయవని గతంలో దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. ఎందుకంటే బిఆర్‌ఎస్ తిరుగులేని మెజార్టీతో గెలిచిన సమయంలో బిఆర్‌ఎస్ ఉప ఎన్నికలో సీటు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేసుకున్నారు. కాని ఓడిపోయారు. ఎందుకంటే సాదారణ మరణాలు పెద్దగా సానుభూతిని కల్పించలేవు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగి కంటోన్‌మెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అంటే సానుభూతి అన్ని సమయాల్లో ఉపయోగపడకపోవచ్చని రెండు ఉప ఎన్నికలు రుజువుచేశాయి. ఇప్పుడు కూడా అదే వర్కవుట్ అయితేమాత్రం బిఆర్‌ఎస్ సీటు కోల్పోవడం ఖాయం. అయితే ప్రభుత్వం మీద నిత్యం బిఆర్‌ఎస్ సాగిస్తున్న ప్రచారం జనం నిజమే అని నమ్మితే మాత్రం బిఆర్‌ఎస్ గెలుస్తుందేమో? కాని గతంలో మెజార్టీ రాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ గెలిస్తే ప్రజల్లో బిఆర్‌ఎస్‌కు ఆదరణ తగ్గలేదనేది రుజువౌతుంది. ఆదరణ చెక్కుచెదరలేదన్న నమ్మకం క్యాడర్‌లో కలుగుతుంది. ఇక ఏ ఎన్నికలైనా మళ్లీ గులాబీ తోటకే అన్న విశ్వాసం నాయకుల్లోనూ పెరుగుతుంది. అధికార కాంగ్రెస్ వైపు చూడాలనుకునే నాయకులు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. గోడ దూకాలనుకునేవారు తొందరపడందే మంచిదైందనుకుంటారు. ఒక వేళ పార్టీ మారిన వారు పునరాలోచనలో పడతారు. ఒక వేళ పార్లమెంటు ఎన్నికల ఫలితమే గులాబీకి దక్కితే మాత్రం బిఆర్‌ఎస్ రాజకీయ మనుగడ చాల కష్టమౌతుందని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఈ ఉప ఎన్నిక గెలవడం అనేది బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్య అని చెప్పక తప్పదు. ఈ గెలుపు కూడా పోన్ ట్యాపింగ్, ఈ కార్‌రేస్, కాళేశ్వరం వంటి అనేక చిక్కుముడులకు సమాదానం దొరికనట్లౌవుంది. బిఆర్‌ఎస్ ఓడితే ఇవన్నీ ప్రజల మనసుల్లో వున్నాయన్నది తేలిపోతుంది. ఒక వేళ బిఆర్‌ఎస్ గెలిస్తే ప్రభుత్వం మోపుతున్న ఆరోపణలు ఏవీ ప్రజలు నమ్మడం లేదన్నది తేలిపోతుంది. ఎందుకంటే ప్రజా స్వామ్యంలో ప్రజా భిప్రాయమే అంతిమం. అందువల్ల ఈ ఉప ఎన్నిక రావడం కూడా మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టు బిఆర్‌ఎస్‌కు తీరని కష్టమే తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే తప్ప నిలబడలేని సమస్య. ఎలాగైనా గెలవాలన్న కసితో బిఆర్‌ఎస్ నాయకులు వున్నారా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. కేసిఆర్ మీద ప్రజల అభిప్రాయం బలంగానే వుందా? మారిందా? అన్నది కూడా తెలిసిపోతుంది. ఈ ఎన్నిక బిఆర్‌ఎస్ మనుగడకు గీటు రాయి అని చెప్పకతప్పదు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బిజేపికి కూడా ప్రతిష్టాత్మకమే. తెలంగాణలో ఇక మేమే ప్రత్యామ్నాయం అంటూ చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌కు రెండు సార్లు అధికారమిచ్చారు. కాంగ్రెస్‌కు ఇచ్చారు. నాలుగోసారి ముచ్చట బిజేపికి అవకాశమివ్వండి అని వచ్చే ఎన్నికల్లో ప్రాదేయపడేందుకు వీలు కలుగుతుంది. ఈ ఉప ఎన్నికలో బిజేపి గెలిస్తే తెలంగాణలో బిజేపి బలం చాలా పెరిగినట్లే లెక్క. ఈ నియోజకవర్గం లో ముస్లింమైనార్టీల ఓట్ల ప్రభావం తీవ్రంగా వుంటుంది. లక్షా ఇరవై వేల వరకు ముస్లిం ఓట్లు వుంటాయని అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో బిజేపి గెలిస్తే మాత్రం ఇక వచ్చే కాలం బిజేపితే అవతుందని చెప్పడం కూడా సబబుగానే వుంటుంది. చూద్దాం…మూడు ముక్కలాటైనా, రెండు ముక్కలాలైనా గెలిచే ఒక్కరే..ఆ ఒక్కరే వచ్చే ఎన్నికలకు బాద్‌షా అవుతారు.
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మనాక్షి నటరాజన్ గారితో కలిసి వర్కషాప్ లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహిరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మహారాష్ట్రలోని సేవాగ్రామ్, గాంధీ ఆశ్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో మహిళలు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు నేర్చుకోవలసిన అంశాలపై ఐదు రోజుల వర్కషాప్ లో రాజకీయ భాగ్యస్వామి కావడానికి మహిళలకు ఉన్న అడ్డంకులు తొలగించుకునేలా బూత్ స్థాయిలో వెళ్ళి మహిళలు ఒక సమూహమును ఏర్పరచుకొని నాయకులుగా ఎదగాలని రాజకయాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారి, మరోవైపు రాజకీయ పార్టీలో మహిళా శక్తిగా అవతరించాలని ముఖ్య అతిధులు అన్నారు.దేశ, రాష్ట్ర రాజకీయ పాండితులచే అనేక సెషన్స్ ను నిర్వహించడం జరిగింది.భారతదేశం నుండి ఈ కారిక్రమంలో నలభై మంది మహిళలు ప్రత్యేక ఆహ్వానం మరియు అనేక ప్రక్రియల ద్వారా ఎంపిక చేయబడిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీమతి అస్మా గారు మరియు విజయలక్ష్మి పాల్గొన్నారు
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.
ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరుతున్నారు. కాగా.. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.
చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి చేనేత కార్మికులకు అందజేసిన రూ33 కోట్ల రుణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని తెలంగాణ రాష్ట్ర కనుక మినిమం వేజెస్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ తెలియ జేశారు. ఈసందర్భంగాముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమా ర్కకు,రెవెన్యూమంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డికి,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కి, స్థానిక భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావులకు బాసాని చంద్రప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞ తలు తెలియజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా కొత్త రుణాలను మంజూరు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
కన్నప్ప అద్భుతం.. సినిమా వీక్షించిన తెలంగాణ మంత్రులు
ఆదివారం ముగ్గురు తెలంగాణ మంత్రులు గచ్చిబౌలి ఏఎంబీ మల్టీప్లెక్స్ లో మోహన్ బాబు, విష్ణులతో కలిసి కన్నప్ప సినిమా వీక్షించారు.
మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప (Kannappa) చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే సినిమా చూసిన చాలా మంది మిశ్రమ రివ్యూస్ ఇచ్చినా, ఇస్తున్నా కలెక్షన్ల పరంగా మాత్రం స్టేబుల్‌గానే ఉంది.
అయితే సినిమా ఫస్టాఫ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ సెకండాఫ్ మరో లెవల్‌లో ఉండి ప్రేక్షకకులను భక్తి ప్రపంచంలో తేల్చిందంటూ అనేక మంది తమ తమ సోషల్ మీడియాల ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో ఫ్యామిలీలు థియేటర్ల బాట పడుతున్నాయి.
సినిమా విజయంపై.. ఇప్పటికే మంచు విష్ణు సక్సెస్ మీట్ సైతం నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే తాజాగా ఆదివారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ ముగ్గురు గచ్చిబౌలి ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) లో మోహన్ బాబు, విష్ణులతో కలిసి కన్నప్ప సినిమా వీక్షించారు.
అనంతరం మంత్రి భట్టి మాట్లాడుతూ మోహన్ బాబు, విష్ణులకు అభినందనలు తెలిపారు.
సినిమా ఊహలకందని విధంగా ఉందని విష్ణు నటన, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని అన్నారు.
ఆపై మత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..
తెలుగు చిత్ర సీమలో చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి సినిమా వచ్చిందని అన్నారు.
మోహన్ లాల్, అక్షయ్ కుమా,ప్రభాస్ వంటి పెద్ద నటులను తీసుకువచ్చి మోహన్ బాబు, విష్ణులు మంచి చిత్రం అందించారని, ఈ సినిమా కేవలం శివ భక్తులే కాదు అందరూ పరవశించి పోయేలా చిత్రం ఉందని అన్నారు..
మున్మందు టాలీవుడ్ దర్శకులు కూడా ఇలాంటి సినిమాలు తీయాలని, తద్వారా మన సంస్కృతి, పురాణాల గురించి నేటి తరానికి తెలిసే అవకాశం ఉంటుందని తెలుపుతూ చివరకు కన్నప్ప టీంకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్
నేటి ధాత్రి, పఠాన్ చేరు
తెలంగాణ సచివాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ శనివారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గారితో చర్చించారు. మంత్రి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారాని ఆయన తెలిపారు
కాన్కూర్ గ్రామంలో సోలార్ లైట్ ఏర్పాటు చేసిన తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ
జైపూర్ నేటి ధాత్రి:
తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని కాన్కూర్ గ్రామంలో మంగళవారం సోలార్ లైట్ అమర్చారు.టీజీ ఎఫ్ డీసీ సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,ఫీల్డ్ సూపర్ వైసర్ రాజేష్,వాచర్ లు శంకర్,సాయికిరణ్, రాకేష్,గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా కో-ఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు.సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాస పథకంలో 20% శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు ప్రమాద బీమా ఐదు లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు ఎల్ల పోశెట్టి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం,బొడ్డు రాములు,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…పండగ
◆ రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న
◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి
న్యాలకల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు నేస్తం,రైతు భరోసా విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన శుభ సందర్భన్నీ పురస్కరించుకుని మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగుంది.అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ డీసీసీ ప్రధాన కార్యదర్శి.భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,pacs చైర్మన్లు.సిద్దిలింగయ్య స్వామి,జగ్గానాథ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ.గౌసోద్దీన్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.