తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.

సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు .

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

-MEO లింగాల కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి :

 

shine junior college

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడ పాఠశాల నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలను గురువారం మండలంలోని మొట్లపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి తెలిపారు. మంగళవారం మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సన్నద్ధత సమావేశoలో ఆయన మాట్లాడారు. ఎంపికు వచ్చే అభ్యర్థుల వయస్సు 8 నుండి 9 సంవత్సరాలలోపు (అనగా 01.09.2016 నుండి 31.08.2017 వరకు) ఉండాలని తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని, మండల స్థాయిలో ఎంపికలు తేది 19.06.2025న మొట్లపల్లి ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పాఠశాల స్టడీ సర్టిఫికెట్,
లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో( కలర్).మూడవ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ జిరాక్స్ఆధార్ కార్డు జిరాక్స్.కమ్యూనిటీ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని కోరారు.
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు ఎం.ఆర్.సీ, సీ.సీ.వో వేణును 9866744719 చరవాణిలో
సంప్రదించాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు సందీప్, మహేష్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

shine junior college

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో కలిసిన తెలంగాణ కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి అయినటువంటి గడ్డ వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా మంగళవారం కలవడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి,రైతుల సంక్షేమ, కార్మికుల హితానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో మంత్రి వివేక్ వెంకటస్వామి సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు

◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి చేరుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ కావాల‌నే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించి విచార‌ణ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మ‌ళ్లీ కేటీఆర్‌ గారికి ACB నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్,మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్,జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్,మాజీ సర్పంచ్ లు బస్వరజ్,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్,అశోక్ పాటిల్,రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్.

తెలంగాణలో హాట్ హాట్‌గా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్…

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది.

హనుమకొండ: తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ రాజుకుంది. భద్రకాళీ చెరువు పూడికతీత పనులపై నెలకొన్న రాజకీయ రగడ చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయాలు భగ్గుమన్నాయి. మాటల తూటాలతో రెండు పార్టీల్లోని నేతలు రెచ్చిపోయారు. భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపణలు చేశారు. వినయ్ భాస్కర్ వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెండర్లు ప్రకటించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయని వినయ్ భాస్కర్‌ అన్నారు. పూడికతీత పనుల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని ఆయన చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని చర్చకు రమ్మను తాను సిద్ధమని నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో కుడాకు ఒక రూపాయి అయినా నిధులు తెచ్చినట్టు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని నాయిని రాజేందర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సామాజిక ఉగ్రవాదులు వీళ్లను ఎన్‌కౌంటర్ చేయాలని నాయిని రాజేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల పరిస్థితి దొంగే దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. వరంగల్‌లో కుడా నిధులు దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్‌పై కేసు పెడతామని హెచ్చరించారు. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చీడ పురుగులలాంటి వాళ్లు… వీళ్లను వెంటనే జైళ్లో పెట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక్కడి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌కి పారిపోతారని నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు…

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పాలన రావాలని తిరుమల శ్రీవారిని వేడుకున్న రవీందర్ యాదవ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం యువనేత, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ను కేటీఆర్ ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దారని రవీందర్ యాదవ్ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి, కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతి పనికి కమీషన్ల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని రవీందర్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

చందుపట్ల కీర్తి రెడ్డి బిజెపి పార్టీ అధికార ప్రతినిధి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన అధ్యక్షతన జిల్లా మండల స్థాయి పదాధికారులతో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు
అనంతరం జిల్లా కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు.
11 ఏళ్ల మోదీ పాలనతో సాధించిన విజయాలు, ఘనతలపై ఈ నెల 4 నుంచి 25 వరకు చేపట్టబోయే కార్యక్రమాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ
ఈ కార్యక్రమంలో పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి వికసిత భారత్ కన్వీనర్ కో కన్వీనర్లులు జన్నే మొగిలి దొంగల రాజేందర్ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కన్వీనర్ సుతాటి వేణు రావు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు శక్తి కేంద్ర ప్రభారీలు ప్రముఖు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం.!

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నే.

ఆవిర్భావ వేడుకలో జెండా ఆవిష్కరించిన గూట్ల తిరుపతి

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం* ఘనంగా నిర్వwహించుకోవడం జరిగినది.

మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి* జాతీయ జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ..

ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ

ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి యువకులు 1200 మంది చనిపోయిన దాన్ని చూసి సోనియా గాంధీ మనసు చలించిపోయి

తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదని నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును పెట్టి ఆమోదింపచేసి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.

అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందియాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ ప్రజాపాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకపోయిన ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందుతున్నారు.

గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ ,ఎస్టీ బీసీల అందర్నీ ఎలాంటి సంక్షేమ పథకాల అందించక అనేక ఇబ్బందులకు గురిచేస్తూ తమ స్వలాభం కోసం కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదే తీరుగా ప్రజాసంక్షేమ పథకాల అమలు అందరికీ అందిస్తున్నారు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,కామిడి రత్నాకర్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*

తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి.

ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మనోహర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

 

ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ అన్నారు.తెలంగాణ ఏర్పాటు అయి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులు బిసి నాయకులు నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటం ఫలించి నేటికీ 11 సంవత్సరాల కావస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ ఏర్పాటు కాలేదని,ఆంధ్ర కబంధ హస్తాల నుండి విడిపోయిన తెలంగాణ అగ్రవర్ణాల కుట్రలో బందీ అయి ఉన్నదని ఉద్యోగ ఉపాధి రంగాలలో తెలంగాణ యువతకు నష్టం చేకూరుస్తున్న,రైతాంగాన్ని నడ్డి విరుస్తున్నారు.ఈ పాలకవర్గాలను,ఏదైతే తెలంగాణ ఆకాంక్షల కోసం జరిగిన బలిదానాల ఆశయాలు నెరవేరలేదని,ఆ ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం సిద్ధం కావాలని ఈ సందర్భంగా నాయకులు అన్నారు.
తెలంగాణ ఉద్యమము తొలిదశ మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు తుల మధుసూదన్ రావు,జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్,పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రాయలింగు పద్మశాలి సంఘం జిల్లా నాయకులు నల్ల నాగేంద్రప్రసాద్,తెలంగాణ బీసీ జేఏసీ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవిడపుగణేష్,జిల్లా నాయకులు వేముల మల్లేష్, భీమ్సేన్,బీసీ జేఏసీ యువజన నాయకులు పెద్దల చంద్రకాంత్,ఎండి లతీఫ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇప్పలపల్లి బాపు,జిల్లా నాయకులు తాళ్ల పెళ్లి దేవేందర్ గౌడ్,అడిచర్ల రాజయ్య,తోకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్నా ఇందిరమ్మ ప్రభుత్వం

మంచిర్యాల నేటి ధాత్రి:

మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాలకు చెందిన 509 మంది లబ్దిదారులకు మరియు నస్పూర్ కు చెందిన 529 మంది లబ్ధిదారులకు మరియు హజీపూర్ కు చెందిన 162 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకొని మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలో ఈ రోజు మొత్తం1,193 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని చెప్పారు.

మంచిర్యాల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మొత్తం 3,098 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రెడ్డి గారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కి, రాష్ట్ర రెవెన్యూ ,గృహ నిర్మాణం & సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

ఈ కార్యక్రమంలో సంబంధింత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరించిన…ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చెప్పినట్టు చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు

సోనియా గాంధీ చోరువుతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది

జోహార్లు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు

ఎఏం సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య

( నేటిధాత్రి )వర్ధన్నపేట:

మండలం, ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణం నందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఏంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…సబ్బండ వర్గాల పోరాటాల ఫలితం, సకల జనుల ఉద్యమాల ఫలితం వెరసి సోనియా గాంధీ గారి సాహసోపేతమైన నిర్ణయ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని తెలిపారు.సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరువతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్ననన్నారు.
చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం లోని ఆర్టికల్-3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయి నష్టపోయినప్పటికిని మరి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు ఉండదని చెప్పి పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ తలుపులు మూయించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్ చేయించిన ఘనత అమ్మ సోనియమ్మకు దక్కుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అయిందన్నారు.ఈ కార్యక్రమములో వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి,డైరెక్టర్లు బచ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,ఎండి ఖజామియా,బండి సంపత్ గౌడ్, కటబోయిన సంపత్,ఎండి మహమూద్, పుల్లూరు దామోదర్, మార్కేట్ కార్యదర్శి శ్రీనివాస్ రాజు గారు లు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇబ్రహీంపట్నం నేటి దాత్రి:

జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్
వర్షకొండ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి 2025 సంవత్సరం పాఠశాల నుండి 100% ఫలితాలు సాధించడం జరిగింది అలాగే 527 మార్కులతో ఎన్ లహరి.ప్రథమ స్థానంలో స్కూల్ టాపర్ గా నిలిచింది దానితో పాటు స్కూల్ సెకండ్ టాపర్ ఎస్ వర్షిని.ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు గ్రామ మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం మరియు మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు ఫోనుకంటి చిన్న వెంకట్. మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరియు ప్రధానోపాధ్యాయులు రాజేందర్. ఘనంగా మొమెంటోలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ కి సీసీ కెమెరాలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు అభినందించారు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి:

 

చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకొని 11 వ సంవత్సరం ముగించుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది
అనంతరం మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతోనే ఏర్పరచుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల కోరిక నెరవేర్చుకోవడానికి చిన్న పెద్ద తేడా అని లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఉద్యోగులు రైతులు అని తేడా లేకుండా యువతీ యువకులు అందరూ పాల్గొని తెలంగాణ సాధన కోసం ఎంతోమంది అమరులై సాధించుకున్న తెలంగాణలో మన నిధులు మన నియమకాలు మన ఉద్యోగాలు అనే నినాదంతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకతాటిపై నిలబడి ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం జరిగిందని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతీయ జనతా పార్టీ కృషి ఎనలేనిదని మొదటి నుండి ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి మద్దతుగా నిలిచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే క్రీ. శే. మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ తల్లి సూక్ష్మ స్వరాజ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని అన్నారుఅనంతరం భారతీయ జనతా పార్టీ చిట్యాల మండలాధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా కార్యకర్తలు బుర్ర వెంకటేష్ గౌడ్ కు శాలువాతో ఘనంగా సన్మానించడం .ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ గుండ సురేష్ సాధసదానందం కుమార్ శ్యామల వెంకటేశ్వర్లు శ్రీహరి సారంగపాణి మైదం శ్రీకాంత్ కింసారపు ప్రభాకర్ వల్లాల ప్రవీణ్ రాయిని శ్రీనివాస్ సదానందం చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖద్దరు కక్షలకు ఖాకీ బలి !?

`పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు.

`రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్న పోలీసు?

`కార్యకర్త స్థాయి నుంచి నాయకులు దాకా పోలీసులను బెదిరిస్తున్నారు.

`గతంలో ఇంతటి వేధింపులు వుండేవి కాదు.

`నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు.

`పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు.

`నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.

`ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు.

`క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు.

`నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు.

`మనసు చంపుకొని పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు.

`నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు.

`పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.

`కాంగ్రెస్‌ ఎదురు లేకుండా పాలించిన రోజుల్లో పోలీసు వ్యవస్థ బాగుండేది.

`ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చాక అసలైన సమస్య మొదలైంది.

`కాంగ్రెస్‌లో అప్పట్లో గ్రూపులు మాత్రమే వుండేవి.

`తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధిపత్యం మొదలైంది.

`పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.

`అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు.

`రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.

`ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది.

`ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు.

`సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు.

`సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు.

`సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు.

`పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు.

`ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు.

`ఒకప్పుడు తప్పు చేస్తే శంకరగిరి మాణ్యాలు అనే వారు.

`ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు.

`ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

`దేశవ్యాప్తంగా పోలీసులు అనుభవిస్తున్న ఇబ్బంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
జనం కోసం బతికే ఏకైక వ్యవస్థ పోలీసు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడి, త్యాగాల కోసమే పుట్టిన వ్యవస్థ పోలీసు. దేశ సరిహద్దులలో ఎండనక, వాననక, చలిని లెక్క చేయకుండా మనల్ని కావాడే వాళ్లు సైనికులు. మరి మన సమాజంలో చుట్టూ వున్న శక్తులను నుంచి కాపాడేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ వుందనే నమ్మకం, ధైర్యంతోనే మనం నిశ్చింతగా బతుకుతున్నాం. పోలీసులే లేకుంటే ఒక్ష క్షణం కూడా గడవదు. సమాజ భద్రత సాగదు. సమాజంలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. చెడు మీద మనం విజయం సాధించాలంటే కూడా మనకు పోలీసు అవసరం. పోలీసు వృత్తి అంటే అంత సామాన్యమైనది. తెగింపుతో కూడున్నది. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెట్టేది. అలాంటి వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో నలిగిపోతోంది. రాజకీయ పెత్తనంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరుకుంటోంది. నిష్పక్షపాతంగా పని చేయలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకుల గుప్పిట్లో పని చేయాల్సి వస్తోంది. గతంలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషనులో అధికారులుగా ఎవరుండాలని నాయకులే నిర్థేశిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలలో పాలక పక్షం ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోలీసులు ఠానాలకు ట్రాన్స్‌ఫర్‌ కాలేకపోతున్నారు. ఎమ్మెల్యేల విల్లింగ్‌ లెటర్లు లేకుండా పోస్టింగులు అందుకోలేక పోతున్నారు. దాంతో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల చేతిలో కాకుండా నాయకుల చేతుల్లోకి పోతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా, అందులో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్‌ఫర్లు యదాలాపంగా జరిగిపోవాలి. కానీ ట్రాన్స్‌ఫర్ల సమయంలో ఫలానా పోలీసు అధికారి మాకు వద్దని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను అచేతనావస్థలోకి నెట్టేస్తున్నారు. రాజకీయాలు రంగు మారడమే కాదు, రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తోంది. అది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. గతంలో ప్రత్యర్థులు అంటే రాజకీయంగా, సిద్దాంత పరంగా విభేదాలు వుండేవి. కానీ కక్ష పూరిత రాజకీయాలకు తావుండేది కాదు. పాలక పక్షం, ప్రతి పక్షం పరస్పరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నించేవి. నిజం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు సమాజ ప్రయోజనాల కంటే నాయకుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని చెప్పడంలో సందేహం. దాంతో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలలో నాయకుల అనుచరులు మీద ఎక్కువగా ఆధారపడుతూ వుండేవారు. కాలం మారింది. నాయకులలో మరింత స్వార్థం పెరిగింది. అనుచరులు బాగు పడడం అనేది నాయకులకు ఇష్టం లేకుండా పోయింది. నాయకులను సొంత పనులకు వాడుకొని, వారిని పోషించడం కన్నా, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు సాగిస్తున్నారు. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. నిష్పాక్షికంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం మరీ మితిమీరి పోవడంతో వ్యవస్థ నలిగిపోతోంది. ఏ పోలీసు అధికారి అన్యాయానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోరు. వాళ్లు మనుషులే! వారిలోనూ మానవత్వం వుంటుంది. ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన వారిది కరుకు గుండె కాదు. పోలీసులంటేనే సమాజ రక్షకులు. ఆ విషయం ప్రతి పోలీసుకు తెలుసు. కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతులు కట్టేస్తుంది. పార్టీల స్వలాభానికి వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా వాళ్లకు తెలుసు. అందుకే విధిలేని పరిస్థితులలో మనసు చంపుకొని పని చేస్తున్న పోలీసులు కొన్ని వేల మంది వున్నారు. పాలకుల ఎవరైనా సరే వారు చెప్పింది వినాలి. అది రూలు. ఆ రూల్‌ను పోలీసులు అతిక్రమించలేరు. దాంతో రాజకీయాల మూలంగా ఖాకీలు ఎంతో నష్టపోతున్నారు. ఉన్నత విద్య చదువుకొని, పోటీ పరీక్షలు రాసి, ఎన్నో సంక్లిష్టమైన దేహ దారుడ్య, శిక్షణలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వస్తారు. సమాజాన్ని ఏదో చేయాలని కలలుగంటారు. కానీ కుర్చీలో కూర్చున్న రోజే తన చేతులతో అన్యాయం వైపు మొగ్గు చూపేలా నాయకుల జోక్యం, ఒత్తిడి మొదలౌతుంది. అప్పుడు వారు పడే వేధన, అనుభవించే ఆవేదన వాళ్లకు మాత్రమే తెలుసు. అయినా ఖద్దరు సమస్యలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరం ఖాకీలకు లేదు. అయినా పాలనా పరంగా అనుసరించక తప్పదు. అందుకే ఖద్దరు కక్షలకు పోలీసులు బలి అవుతున్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో ఇంతటి వేధింపులు పోలీసులకు వుండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు. నాయకులు పోలీసులతో ఎంతో మర్యాద, గౌరవంగా వుండే వారు. పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు. ఆ సమయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు. క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పోలీసులు పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా పోలీసులను బెదిరిస్తున్నారు. గతంలో రౌడీలు, గూండాలు, గజ దొంగలు పోలీసులకు సవాలు విసిరే వారు. ఇప్పుడు వాళ్లు కనుమరుగైపోయారు. ఆ పని ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీల ఆధిపత్యం పోలీసుల మీద మొదలై, వేధింపుల దాక వచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. అంతకు ముందు వర్గ పోరులు మాత్రమే వుండేవి. గ్రూప్‌ తగాదాలే వుండేవి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల అధికార మార్పిడీతో పోలీసు వ్యవస్థ సంకటానికి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకుల చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర రాజకీయాలను పోలి వుండేవి కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఆంద్రా ప్రాంతాలలో పార్టీల ఆధిపత్యం విపరీతంగా వుండేది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలలో పోలీసులు నలిగిపోయేవారు. పాలక పక్షం పెంచి పోషించే రౌడీలు, గూండాలు కూడా పోలీసులను బెదిరించే స్తాయికి చేరుకున్నారు. ఆంద్రాలో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలలో రౌడీలు రాజ్యమేలుతూ వుండేవారు. సినిమాలు కూడా అదే తరహాలో వుండేవి. ముఖ్యంగా కుల రాజకీయాలు, పార్టీ పరమైన రాజకీయాలు విపరీతంగా వుండేవి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత ఆయన కుటుంబమే అ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు మారింది. కానీ ఆనాడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే రంగ హత్యకు గురయ్యే వారు కాదని అదే రాజకీయ పార్టీలు అంటాయి. ఇంతకన్న దుర్మార్గం ఏదైనా వుంటుందా? చివరికి ఇప్పటికీ పోలీసులనే దోషులుగా చూస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ సంఘటన జరిగి నలభై ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులను నిందిస్తూనే వుంటారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అధికారంలో వున్న పార్టీలు, ప్రతిపక్షాలను అణచి వేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు. అది ఏ పార్టీ అయినా సరే…పాలకులు చెప్పిందాన్ని పోలీసులు పాటించాల్సి వస్తుంది. తప్పడం లేదు. అలా వింటే అన్నీ చూస్తున్నాం..పోలీసు వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాం…పేర్లు నోట్‌ చేసుకుంటున్నామని పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. రెడ్‌ బుక్‌, పింక్‌ బుక్‌, బ్లాక్‌ బుక్‌ ఇలా తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. అసలు రాజకీయ పార్టీలు సవాళ్లు చేసుకోవడం మానేసి, పోలీసులను టార్గెట్‌ చేస్తున్నారు. మీ అంతు చూస్తామని బెదురిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న పాలకుల మాట వినాలా? ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడాలా? అన్న సందిగ్ధత ఎదురౌతోంది. పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది. ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు. సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. అలాంటి రాజకీయాల వల్ల సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు. పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు. పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు. ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్‌ లేకుండా చేస్తున్నారు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవేడుకలు.

కొత్తగూడ నేటిధాత్రి:

కొత్తగూడ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్త గూడబిజెపి మండల పార్టీ అధ్యక్షుడు యాదగిరి మురళి మాట్లాడుతూ .
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ఆరవది ఏండ్ల ఆరాటం ప్రజల అస్తిత్వపు ఆత్మ గౌరవ పోరాటం
నా తెలంగాణ అమరవీరుల పోరాట ఫలితంగా చిన్నమ్మ సుష్మ స్వరాజ్ గారి వంటి ఎందరో మహానీయులు యోగ దనంతో స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ మహానీయులు ఆశయాలతో ఆశయ సిద్ది కై అమరవీరుల ఆత్మ ఫలితంగా అవతరించిన నెల నా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు బోనాల ప్రవీణ్ కుమార్ చారి. వజ్జరవి . జిల్లా నాయకులు వాసంసారయ్య. మండల ఉపాధ్యక్షులు బూర్గసారంగపాణి. శ్రీనివాస్. రామయ్య పిన్నింటి రవీందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు…

అమర వీరుల త్యాగఫలం తెలంగాణ స్వరాష్ట్రం.

అమర వీరుల త్యాగఫలం తెలంగాణ స్వరాష్ట్రం…

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల…

నేటి ధాత్రి గార్ల:

ఎందరో అమర వీరుల త్యాగఫలం
తెలంగాణ స్వరాష్ట్రమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం విశ్వ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని విశ్వ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పాలకుల అసమర్ధత, నిధుల దుర్వినియోగం, అవినీతి, బంధుప్రీతి, ప్రాంతీయ వివక్షత, ప్రాంతీయ నిధుల మళ్లింపు, నీళ్ల దోపిడీ తదితర అవలక్షణాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారాయని అన్నారు. అధికార పంపిణీ, నిధుల పంపిణీ అన్ని ప్రాంతాలకు సమానంగా జరగకుండా చేస్తూ ప్రాంతాల, సమూహాల, కులాల,తెగల మధ్య అసమానతలను ప్రోత్సహించడం పాలకులకు సరైనది కాదని ఆయన పాలకులను హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత జల దోపిడికి, నిధుల దోపిడీకి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందన్నారు. ఒక్క జిల్లాకు ముగ్గురు మంత్రులను కేటాయిస్తూ కొన్ని జిల్లాలకు అసలు మంత్రులనే కేటాయించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాళోజీ మాటలను గుర్తు చేస్తూ “ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటే దాకా తన్ని తరుముదాం – ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదాం” అనే నినాదంతో తెలంగాణ ప్రజలు అంతర్గత దోపిడి, వివక్షతలను ఎదిరిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే అభివృద్ధిగా భావించడం వల్ల భవిష్యత్తు సమాజానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. గద్దర్ అవార్డుల ఎంపిక గద్దర్ పోరాట స్ఫూర్తి కి తెలంగాణ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా నిర్వహించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని దీన్ని పాలకులు గుర్తించి తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన యదవ పలికారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు వజ్రం నాగేశ్వరరావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్,సిపిఐ నాయకులు పోతుల నరసింహారావు, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణ, దీకొండ రాము, తెలంగాణ ఉద్యమకారులు నాగాచారి, ఎస్కే జానీ, మల్లి బాబు, పిల్లలమర్రి వీరస్వామి, కొమ్మరాజు జగదీష్, శ్రీను, పల్లెబోయిన మోహన్ యాదవ్, వల్లపు దాసు వెంకటేశ్వర్లు, మధులకర్ శివాజీ, ఎట్టి రామ దొర, బాలాజీ నాయక్, కాముని శ్రీనివాస్, కత్తి బాలరాజు,మైస ఐలేష్, మహిషా అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version