తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య.

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి.

జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మనబోయిన యాకయ్య, సీనియర్ నాయకులు బి వెంకన్న.

తొర్రూరులో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సభ.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం గొల్ల కురుమలే కాకుండా సబ్బండ వర్గాల ప్రజలు కృషి చేయాలని, దొడ్డి కొమురయ్య ఉద్యమస్ఫూర్తితో గొల్ల కురుమ యువత తమ హక్కుల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జీ.ఎం.పీ.ఎస్) జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్మనబోయిన యాకయ్య, సంఘం సీనియర్ నాయకులు బొమ్మనబోయిన వెంకన్న లు పిలుపునిచ్చారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య 79 వ వర్ధంతి సందర్భంగా గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షులు ఎద్దు ఐలయ్య ఆధ్వర్యంలో స్థానిక పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొమ్మనబోయిన యాకయ్య, బొమ్మనబోయిన వెంకన్న లు సంయుక్తంగా మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి మరింత ఉద్యమాన్ని రగిలించిందని… తెలంగాణ సాయుధ పోరాటంలో ఓ గొల్ల కురుమ యువ నాయకుడు దొడ్డి కొమరయ్య ముందు నడిచి అమరత్వం పొందడం మన గొల్ల కురుమల అందరికీ గర్వకారణమని… వారి బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ దొడ్డి కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. ఒక గొల్ల కురుమలకే కాకుండా దొడ్డి కొమరయ్య తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయన అమరత్వం బాసటగా నిలిచిందని…. అణగారిన వర్గాల కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటం భూమి బుట్టి పేద ప్రజల విముక్తి కోసం అమరుడయ్యాడని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు పోసాని సంతోష్ యాదవ్, నూకల హరీష్, జిఎంపిఎస్ తొర్రూరు మండల కార్యదర్శి మద్దెల రాజు, ఉపాధ్యక్షులు సర్వి నగరాజు, ఎర్రం రాజు, సహాయ కార్యదర్శి పెద్దబోయిన కుమార్, గిరిజన సంఘం నాయకులు భీమా నాయక్, బహుజన సామాజిక కార్యకర్త మాలోత్ సురేష్ బాబు, ఎస్సీ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు వెల్తూరి పూర్ణచందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి, జర్నలిస్టు పున్నం సారయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు కొండ వెంకన్న, వృత్తి ప్రజా, కుల గొల్ల కురుమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version