కమిటీలకు దిక్కు లేదు..కార్యకర్తలకు గుర్తింపు లేదు!

`వాళ్ల కష్టానికి ఫలితం లేదు.

`అన్ని పార్టీలది అదే తీరు.

`ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొస్తారు.

`ఏళ్లకేళ్లు వెట్టి చాకిరి చేయించుకుంటారు.

`కడుపు కట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పని చేస్తారు.

`జెండాలు కట్టడానికి, నాయకులకు సలాం కొట్టడానికి పనికొస్తారు.

`సభలు పెడితే జేజేలు కొట్టడానికి అవసరౌతారు.

`పథకాల అమలులో కూడా వివక్షకు గురౌతారు.

`సొంత పార్టీ వాళ్లకే ప్రయోజనమౌతుందని కార్యకర్తలను పక్కన పెడతారు.

`ఓట్లేయించేందుకు మాత్రమే కార్యకర్తలు అవసరమౌతారు.

`పార్టీ కోసం ఏం ఆశించకుండా పని చేస్తారని గొప్పలు చెప్పి నోరు మూయిస్తారు.

`అడుగడుగునా మాయ చేసి చెప్పు చేతుల్లో వుంచుకుంటారు.

`నాయకులు గ్రూపులు కట్టి కార్యకర్తలను విభజిస్తారు.

`సొంత పార్టీలలోనే కార్యకర్తలు శత్రులయ్యేలా చేస్తారు.

`నాయకులు మాత్రం చెట్టా పట్టాలేసుకొని తిరుగుతారు.

`గ్రామ, మండల కమిటీలు వేయకుండా కార్యకర్తలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు.

`కమిటీలెప్పుడు వేసినా పదవి నీకే అని అందరికీ చెప్పి కాలయాపన చేస్తారు.

`పై స్థాయిలో వున్న వాళ్లు ఒక్కొక్కరు నాలుగు పదవులు చేపడతారు

`కుటుంబంలో వున్న వాళ్లకు పదవులు పంచుకుంటారు.

………………………..

`పదేళ్లు అధికారంలో వున్నా ‘‘బిఆర్‌ఎస్‌’’ కార్యకర్తలు బతికింది లేదు.
`అప్పుల పాలై దివాళా తీసినా ఒక్కరినీ ఆదుకున్నది లేదు.
`నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవించింది లేదు.
`కనీసం పార్టీ కమిటీలు వేసి పదవులు అప్పగించింది లేదు.
`ఇప్పటికీ ‘‘బిఆర్‌ఎస్‌’’ కమిటీలు వేయాలన్న సోయి లేదు.
……………………….
`కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావొస్తోంది.
`పార్టీ కమిటీలకు దిక్కు లేదు..
`పూర్తి స్థాయిలో నామినేట్‌ పదవులు పంచింది లేదు.
…………………..
`బిజేపి ఇందుకు తీసిపోయిందేమీ లేదు.
`ఆ పార్టీ అనుసరిస్తున్నది అదే తీరు.
`మూడు పార్టీలలో కమిటీలకు దిక్కు లేదు.
`ఎన్నికల పేరు చెప్పుకొని నాయకులు ఎగేసుకొస్తారు.
`గెలిపించే బాధ్యత మీదే అని కార్యకర్తలను ఆకాశానికెత్తురు.
`మీరు లేకుండా పార్టీయే లేదని ఉబ్బిస్తారు.
`ఎన్నికలైపోయిన తర్వాత ముఖం చాటేస్తారు.
`కార్యకర్తలు కరివేపాకులు..రాజకీయాలలో గోలించి పడేస్తారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాజకీయ నాయకులు, కార్యకర్తలు అనగానే ఖద్దరు చొక్కాలు. రేబాన్‌ కళ్లజోళ్లు. కాళ్లకు ఖరీదైన చెప్పులు. అయితే టూవీలర్‌, లేకుంటే కారు. కాలు తీసి బైట పెడితే చాలు గౌరవాలు. మర్యాదలు. పైరవీలు. ప్రజ సమస్యలు. అబ్బో ఆ సెటప్పే వేరు. కనిపించిన వాళ్లను పలకరించడం. వారికి టీలు తాగిపించడం. అవసరమైతే టిఫిన్లు చేయించడం. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం అదో సంతర్పణ కార్యక్రమం. ఇదంతా ఎలా? అనుకుంటే సమాధానం చెప్పడానికి నోరు రాదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేంత దుఖం. కాని పైకి మాత్రం చెరగని చిరునవ్వు. నోరు తెరిస్తే కోట్ల రూపాయల రియల్‌ వ్యాపారం మాటలు విన పక్కవాళ్లు అబ్బో అనుకోవాలి. అంతే కాని అబ్బా..అనేలా వుండకూడదు. అలా మెంటైన్‌ చేయకపోతే నాయకుడే కాదు. కార్యకర్త కూడా కాదు. కాని ఇంత హడావుడి చేస్తున్నా ఆయా రాజకీయ పార్టీలలో వారి పదవులు ఏమిటని మాత్రం ఎవరూ అడగొద్దు. ఎందుకంటే కొంచెం వయసు చిన్నదైతే కార్యకర్త. కాస్త పెద్ద వయసైతే సీనియర్‌ కార్యకర్త. ఇక వాళ్లు పార్టీల కోసం పడే కష్టం అంతా ఇంత కాదు. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కేక వేస్తే చాలు జీ హుజూర్‌ అని వాలిపోవాల్సిందే. చేతులు కట్టుకొని నిలడాల్సిందే. నోరు నొచ్చేదాకా ఆ పార్టీ నాయకులు జేజేలు కొట్టాల్సిందే. పార్టీ కండువాలు మెడలో వేసుకొని, జెండా కూడా మోయాల్సిందే. ఇంతగా పార్టీకి సేవ చేస్తున్నా పదవులు ఇస్తారా? ఇస్తాం..ఇస్తామంటూ ఊరిస్తారు. పుణ్యకాలం పూర్తయ్యేదాకా వాయిదా వేస్తూ వెళ్లాల్సిందే. అధికారంలో వున్నప్పుడు నాయకులు ఊడిగం చేయాలి. ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీకి రక్షణ కవచాలు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మొత్తానికి పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీ చేసే కూలీలుగా మారిపోవాలి. ఇంతకు మించి రాజకీయం అంటే చెప్పుకోవడానికి ఏదీ వుండదు. పార్టీ పేరు చెప్పి బతికే కొంత మంది లైక్యం తెలిసిన కారకర్తలుంటారు. చిన్నా చితక పైరవీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు. నాయకులు చెప్పి పనులు చేయించుకుంటారు. ఇది కూడా ఏ ఐదు శాతమో వుంటారేమో? కాని మిగతా నాయకులంతా జేజేలు కొట్టడం మాత్రం చేస్తుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పదవి రాకపోతుందా? అని జీవితాంతం ఎదురు చూస్తుంటారు. జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయిన వాళ్లు కొన్ని లక్షల మంది వుంటారు. కడుపు కట్టుకొని పార్టీకి సేవ చేస్తుంటారు. అప్పులు చేసిన పార్టీ కోసం పనిచేస్తుంటారు. ఆస్ధులు అమ్ముకొని రాజకీయాల్లో సాగుతుంటారు. ఇంత చేస్తున్నా నాయకులకు సలాం కొట్టడానికి మాత్రమే వుంటారు. నాయకుడు ఫోన్‌ చేస్తే క్షణాల్లో వాలిపోతారు. నాయకుడు కదలమని చెప్పేదాకా అక్కడే పడిగాపులు కాస్తారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం కాదు. నాయకులకు ఊడిగం చేయడం. సరే ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలనైనా కార్యకర్తలకు అందుతాయా? అదీ వుండదు. ఎందుకంటే అడుక్కుంటే చులకనౌతాడు. పట్టుబట్టి తీసుకుందామంటే నాయకుల ఆగ్రహానికి గురౌతారు. మనం పంచే స్దితిలో వున్నాం. అడుక్కుంటామా? అని చెప్పే నాయకుల మాటలకు తలవంచేవాళ్లుంటారు. సర్ధుకుపోయే మనస్తత్వమే అలవాటు చేసుకుంటారు. పథకాలు పార్టీ కార్యకర్తలకే పంచుకుంటున్నారన్న అవపాదు మోయొద్దని నాయకులు చెప్పే మాటలు విని ఆశలు చంపుకుంటారు. ఇది అన్ని పార్టీలలో వుండే కార్యకర్తల దీనస్ధితికి నిదర్శనం. కనీసం పార్టీ పదవులు ఇచ్చారా? అంటే అదీ లేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల కాలం అదికారంలో వున్నా ఇప్పటి వరకు సంస్ధాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు. మాటలకు మాత్రం 60లక్షల మంది కార్యకర్తలున్నారని గొప్పగా చెబుతారు. కాని ఎంత మంది కార్యకర్తలకు పదవులిచ్చారన్నది చెప్పరు. ఇప్పటికీ గ్రామస్దాయి నుంచి రాష్ట్ర స్దాయి వరకు పదవుల పంపకాలు లేవు. పదేళ్ల అదికారంలో నామినేటెడ్‌ పదువులు కొద్ది మందికి తప్ప పూర్తిగా ఇచ్చింది లేదు. నాయకుల ఇంట్లో ఒక్కొక్కరికి నాలుగు పదవులు పంచారు. అదే కుంటుంబంలో నలుగురున్నా పదవులు పంచారు. కాని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది కార్యకర్తలకు ఆఖరులోకూడా పదవులు పంచలేదు. వారి జీవితాలను నిలబెట్టలేదు. కార్యకర్తలంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొచ్చే వాళ్లుగా మారిపోయారు. ఎన్నికల సమయంలో జనాన్ని పోగేసుకునేందుకు పడే అవస్దలు కార్యకర్తలతో తీర్చుకుంటున్నారు. వారిని కూరలో కరివేపాకులు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చిన కష్టాలు పగ వాడికి కూడా రాకూడదనుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకులకు కూడా పదవులు లేదు. గుర్తింపు లేదు. కొత్త నీరుకు పెద్దగా పని లేదు. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చామన్న సంతోషమే తప్ప, పదువులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేపు, మాపు అనుకుంటూ ఇప్పటికీ ఏడాదిన్న కాలం చూస్తుండగానే కరిగిపోయింది. పార్టీ అదికారంలోకి వస్తే అంతా ఇక మా కాలామే..మా రాజ్యమే అనుకున్న ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు పదవుల రాక యాతన పడుతున్నారు. కనీసం చెప్పుకోవడానికిపార్టీ పదవులు కూడా ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగలేదు. మాకు ఎప్పుడు అవకాశాలు వస్తాయో అని ఎదరుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదవులు అందుకుంటామనుకున్నారు. కాని రెండేళ్ల దగ్గర పడుతున్నా ఎదరు చూపులు తప్పడం లేదు. ..పదవులకోసం పడిగాపులు తప్పడం లేదు. అదికారంలోకి వచ్చి ఏడాదిన్నరౌతుంటే ఆశలు ఆవిరౌతాయేమోనన్న ఆందోళనలో వున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో రియల్‌ వ్యాపారం కూడా సాగడం లేదు. కాంగ్రెస్‌ నాయకులకు ఆ రకంగా కూడా కలిసి రావడం లేదు. రేవంత్‌ సర్కారు తీసుకొస్తున్న కొన్ని సంస్కరణల మూలంగా వున్న ఉపాధి కూడా పోయిందని రియల్‌ వ్యాపారం చేసే కాంగ్రెస్‌ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో భూముల అమ్మకాలు,కొనుగోలు ఆగిపోయింది. భూములు కొనాలంటేనే జనం భయడిపోవాల్సి వస్తోంది. వారికి భరోసా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ఇక ధరణి పేరుతో బిఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు కొంత బాగు పడ్డారు. భూ భారతి వచ్చినా, కాంగ్రెస్‌ నాయకుల సమస్యలు తీరడం లేదు. వారికి ఏదీ కలిసి రావడం లేదు. దాంతో పార్టీపరమైన పదవులు వచ్చినా చెప్పుకోవడానికి ఒక హోదా వుంటుందని అనుకుంటున్నా అవీ రావడం లేదు.ద అన్ని స్దాయిలో నాయకులకు ఎప్పుడొస్తాయో పదవులు అని ఎదురుచూస్తున్నారు. పైగా తమకు వస్తాయా? లేక ఇతరులకు వస్తాయా? కూడా అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అదే సమయంలో ఎక్కడిక్కడ నాయకులనే నిలదీసేంద ధైర్యం చేస్తున్నారు. ప్రభుత్వ పధకాలు అందక, పార్టీ పరమైన పదవులు అందక, ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేతికి రాక ఆర్ధికంగా నాయకులు చితికిపోతున్నారు. అప్పుల పాలౌతున్నారు. చిన్నా చితక కాంట్రాక్టులు వచ్చిన బాగుండని అనుకుంటున్నారు. పల్లెల్లో మొరం పనులు కూడా రాక సతమతమౌతున్నారు. రోడ్డెక్కితే వందలు ఖర్చవున్నాయి. నాయకులు చుట్టూ తిరిగేందుకు వేలకు వేలు ఖర్చవుతున్నాయి. నాయకులు మాటలు నమ్మి తిరిగాల్సిన పరిస్తితి ఎదురౌతోంది. ఇంట్లో కూర్చోలేరు. చేతిలో వున్న పైకం ఖర్చు చేసుకుంటూ సాగలేరు. ఇక పదవులు, పదువులు అని కలవరిస్తూ, ఏ కార్యక్రమం పెట్టినా పై స్దాయి కాంగ్రెస్‌ నాయకులకు ఎదురీతలు తప్పడం లేదు. కార్యకర్తల ప్రశ్నలు ఎదుర్కొ తప్పించుకునే పరిస్దితి లేదు. ఇక కాంగ్రెస్‌ అంటేనే గ్రూపులు. ఆ గ్రూపుల మధ్య సమన్వయం నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పదేళ్ల తర్వాత అదికారంలోకి వచ్చినా కష్టాలు తీరడం లేదని కార్యకర్తలు మొత్తుకుంటున్నారు.. అధికార పార్టీలో నాయకులుగా వుంటూ కూలీ చేసుకోలేరు. ఊరికి పరిమితమై వుండలేరు. నాయకుల పర్యటనల్లో పాలు పంచుకోక వుండలేరు. ఎక్కడా పనులు లేవు…చేతికి పైకం అందింది లేదని మదనపడుతున్నారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ ఓదార్చుకుంటున్నారు. అధికారంలోవున్నామన్న మాటే కాని అణా సంపాదన లేదంటూ నిట్టూర్చుతున్నారు. . ఖర్చులు మాత్రం ఆగడం లేదు..కార్యకర్తల పోషణ తప్పడం లేదు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికొచ్చి కార్యకర్తలు విసుక్కుంటున్నారు. మంత్రుల మందే నాయకులు తిట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల నాయకులు కొట్లాడుకుంటున్నారు. సెక్యూటిరీని కూడా నెట్టేసుకుంటే కష్టాలు చెప్పుకుంటున్నారు. గందరగోళంలో పార్టీ శ్రేణులు. స్దానిక సంస్దల ఎన్నికలు రావడం లేదు..పదువుల అందుతాయా అన్నదిగులు. అధికారంలోవున్న మాటే గాని, సంతోషం ఎక్కడా కనిపించడం లేదు. బిజేపి నాయకులు, కార్యకరర్తల పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా అదే పరిస్దితి. కార్యకర్తలకు పదవులు ఇచ్చింది లేదు. కేంద్రంలో పార్టీ అదికారంలోవున్నా గ్రామీణస్దాయి నాయకులకు నామినేటెడ్‌ పదవులు పంచింది లేదు. కార్యకర్తలు కూరలో కరివేపాకులు..రాజకీయాల్లో గోలించి పడేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version