ఓదెల ఐ కె పి కార్యాలయం లో ఇందిరా శక్తి సంబరాలు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని మల్లికార్జున మండల సమైక్య ఐకెపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబరాలను నేడు రాష్ట్రంలోని అన్ని మండలాలలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంబరాలను జరుపుకోవాలని తెలియజేయగా ఓదెల మండల సమైక్య కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇన్సూరెన్సులు పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు సంస్థ గత నిర్మాణం మార్కెట్ సెంటర్లు నిర్వహణ మహిళలను చైతన్య పరచడానికి శిక్షణలు మొదలగునవి l
ఈ సంబరాలలో మహిళలందియంచా, ఈ కార్యక్రమంలో డిపిఎం సంజీవ్, ఏపీఎం లతా మంగేశ్వరి ,మండల సమైక్య అధ్యక్షురాలు ఆలేటి స్వప్న సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ, రాజకుమారి,అకౌంటెంట్ భవాని,ఆపరేటర్ పవన్ కుమార్, అటెండర్ రామయ్యలతోపాటు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాలు వివో ఏలు పాల్గొనడం జరిగింది.