గోదారి నీటిని గణపసముద్రం కు కలపాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-2.wav?_=1

గోదారి నీటిని గణపసముద్రం కు కలపాలి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలo దేవాదుల ప్రాజెక్ట్ నుండి గోదావరి నీరు రామప్ప చెరువులో చేరడం జరుగుతుంది అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రం చెరువులోకి నీటిని వదిలి దాని ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ఎమ్మార్వో కి వినతి పత్రం ను మండల అధ్యక్షుడు నవీన్ రావు ఆధ్వర్యం లో ఇవ్వడం జరిగింది ఇందులో సీనియర్ నాయకులు దుగ్గిశెట్టి పున్నం చందర్ ఉపాధ్యక్షులు మాదాసు మొగిలి. బూత్ అధ్యక్షులు కాశెట్టి సాయి కన్వీనర్ .మండల కన్వినర్ మండల రాజు పాల్గొనడం జరిగింది అలాగే రేపు మండల కేంద్రం లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో అందరు పెద్ద ఎత్తున పాల్గొని స్వాత్రంత్ర సమర్యోదులను గుర్తు చేస్తూ బావితరాలకు తెలియజేయాలనీ కోరడం జరిగింది

ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15.wav?_=2

ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పిక కిరణ్ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధం నౌక గద్దర్ మూడో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్యముఖ్య అతిథి హాజరై ప్రజాయుద్ధనౌక గద్దర్ చిత్రపటానికి పూలదండలతో ఘనంగా నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టయ్య మాట్లాడుతూ, కామ్రేడ్ గద్దర్ అన్న తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన ప్రజాసామిక తెలంగాణ ప్రజా స్వామిక తెలంగాణ కోసం ప్రజలు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని గద్దర్ అన్న విప్లవ సాంస్కృతికోధ్యమ సారధి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న తన ఆట,పాట మాటతో పాలకవర్గాల దోపిడి దౌర్జన్యాలపై ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజా ఉద్యమాల వైపు నడిపించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది, యువతరాన్ని విప్లవ ఉద్యమం వైపు ఆకర్షించడంలో ఆయన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత దోహాధం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి గని కార్మికులను సమీకరించడానికి బాయి నుండి బాయి.కార్యక్రమం తెలంగాణ కొంగు బంగారం సింగరేణిలో ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆయన ఆట పాట మాటను నిర్మూలించడానికి రాజ్యం కాల్చిన తూటాలను సైతం ధిక్కరించి రాజ్య హింసను దోపిడి వ్యవస్థను ఎండ కట్టింది. సాంస్కృకోద్యమానికి ఆయన లోటు ఎనలేనిది, ప్రజా గళాలు, కళాలు కలుషితమవుతున్న నేటి సాంస్కృతిక ఉద్యమ, భావవాదం వైపు కొట్టుకుపోతున్న తరుణంలో ఆయన లోటు తీర్చలేనిది. ఆయన వదిలి వెళ్ళిన విప్లవ సాంస్కృతిక ఉద్యమ బాధ్యతను భుజానికి ఎత్తుకుందాం
ఇదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. అమరుడు గద్దర్ కు సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రజా సంఘాలు నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు. దాసరి జనార్ధన్. దుబాసి పార్వతి. కర్ణాటక సమ్మయ్య. అయితే బాపు. కోడిమేత సరస్వతి.సంజీవ్. వావిలాల లక్ష్మణ్. దేవి సత్యం. రాసమల్ల భద్రయ్య. జైపాల్ సింగ్. అక్కల బాపు. రాజన్న. తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం.

తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్ట్ కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు అది

కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్ట్

పిసి గోష్ రిపోర్ట్ తప్పులతడక

కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ,డోర్నకల్ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ ఫైర్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌస్ లో నవీన్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి,డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని సమాజంలో బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, అది కాళేశ్వరం కమీషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పని చేస్తుందన్నారు, పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందు పరిచాడు అన్నారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కట్టిన తెలంగాణ ప్రజల వరప్రదాయని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, లక్ష ఎకరాలకు తాగు,సాగునీరు ఇచ్చె ప్రాజెక్టు ను ఎండ బెట్టే కుట్రకు తెర లేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు, రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్షాలు లేక పంటలు ఎండుతుంటే కనీసం రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా రైతులను ఆగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల గొస తగులుతుందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న దురదృష్టపు పాలన అన్నారు,కేసీఆర్ ను తెలంగాణ సమాజంలో తక్కువ చేయాలని తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్రను చెరిపేయాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు ,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల రైతులు రెండు కార్లు పంటలు పండి రైతులు సంతోషం వ్యక్తం చేసే వారు అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని రాకుండా చేసి రైతులను ఆగం చేస్తుందన్నారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల ను ఎప్పుడు అమలు చేస్తారన్నారు,ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అన్నారు,రైతులకు 100శాతం ఋణ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేతులెత్తేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా డిల్లీ లో ధర్నా లు అంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు,మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చిన దిక్కులేదు గాని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వo, వికలాంగులు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి వికలాంగులను మోసం చేసింది అన్నారు,బిఆర్ఎస్ కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మూల్యం తప్పదు అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం వస్తుందని రైతులు,నిరుద్యోగ విద్యార్థులు, మహిళలు అందరు ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా రైతులు ఈ ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు,మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,గాదె అశోక్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేజావత్ రవీందర్,కాలు నాయక్,కొమ్ము చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కొమ్ము నరేష్,బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రేఖ వెంకటేశ్వర్లు, వెంకన్న,సీనియర్ నాయకులు బాలాజీ నాయక్,గండి మహేష్ గౌడ్,గంధసిరి కృష్ణ,దుస్స నరసయ్య, అజ్మీర రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తల్లిపాల వారోత్సవ దినోత్సవం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T165836.799.wav?_=3

ఘనంగా తల్లిపాల వారోత్సవ దినోత్సవం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కృష్ణ కాలనీ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడి టీచర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ ఈనెల ఫస్ట్ తారీకు నుండి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి కేవలం ఆరు నెలల వరకే తల్లిపాలు ఇవ్వాలని బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని పోషక ఆహారం తీసుకున్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు కమల పిల్లలకు కూడా సమానంగా తల్లి పాలు ఇవ్వవచ్చని ఆరు నెలల వరకు కూడా తల్లికి పాలు సరిపోను ఉంటాయని అన్నారు కార్యక్రమంలో ఏఎన్ఎం సాయి సుధా గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు

ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-3.wav?_=4

ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి.

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.

భూపాలపల్లి నేటిధాత్రి

2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవం అని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.

ప్రపంచ ఆదివాసి దినోత్సవం వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజున మహా ముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన శైలి ఇతర సమాజాలకు భిన్నంగా ఉంటుందనీ, ఆదివాసులు విగ్రహ ఆరాధకులు కాదని, పకృతి ఆరాధకులని వీరి పూజా వ్యవహారాలు వేరుగా ఉంటాయని అన్నారు, వీరిని జనగణలలో ఏదో ఒక మతం కింద నమోదు చేయడం వలన వీరి అభివృద్ధి కి అస్తిత్వానికి ముప్పు

 

వాటిల్లుతుందని అందుకే 2027 జనగణలో ఆదివాసులకు షెడ్యూల్ ట్రైబ్స్ కాలం కేటాయించాలని అదేవిధంగా ఆదివాసి దినోత్సవం ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినప్పుడే ఆదివాసులలోని ఉద్యోగులు మేధావులు సంస్కృతి మీద సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొనడం వలన ఆదివాసులకు ఉపయోగం జరుగుతుందని కావున అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 ని ప్రభుత్వ సెల్లు దినంగా కేటాయించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలను కల్పించి ఆదివాసి గ్రామాలలో సమస్యలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ,అదేవిధంగా ఆదివాసి జెండా పండుగలు వారోత్సవాలలో భాగంగా ప్రతి గ్రామంలో జెండా పండుగలు చేసుకుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలు కలలు పునర్జీవింప పడేవిధంగా ఆదివాసి సమాజం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ఆదివాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పోలం సతీష్ బదిరాజయ్య రామినేని రాజు నాగరాజు తోట లక్ష్మయ్య గుంటి అంజలి తోట శ్రీ చందన గుండప్పు తేజస్విని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఐ ఎన్ టియుసి సంఘం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1.wav?_=5

కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఐ ఎన్ టియుసి సంఘం

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
గత కార్మిక సంఘం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని
భూపాలపల్లి ఏరియాలో సింగరేణి గుర్తింపు సంఘంగా ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాన్ని కార్మికులు ఎంతో ఆశతో గెలిపిస్తే ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘం నాయకులు కింది స్థాయి అధికారులను కార్మికులను కొంతమంది నాయకులు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ
యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉచిత మాస్టర్ల కు అలవాటు పడి కార్మికుల ఫోటోలు తీసి కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తూ యాజమాన్యానికి పంపిస్తూ అదే విధంగా కంపెనీకి అధికారులకు ఇన్ ఫార్మర్లు గా వ్యవహరిస్తూ కార్మికులకు సస్మేట్లు షరీసిలు ఇప్పిస్తూన్నరు
కార్మికులు గనులలో ఎదుర్కొంటున్న సమస్యలు గాలి లేక త్రాగునీరు లేక సరి అయిన పనిముట్లు లేక కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గెలిచిన సంఘం నాయకులకు సమస్యలు చెప్పుకుంటే
ఆ సమస్యల యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించకపోగా కార్మికుల పైన తిరగబడుతూ గుండాల్లాగా బెదిరింపుల పాల్పడుతున్నారు
మాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయంటూ విరవీగుతున్నారు ఇలాంటి కొంతమంది స్వార్థపరుల మూలంగా ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీకి ఐ ఎన్ టియు సి కార్మిక సంఘం కార్మిక వర్గంలో ఉనికి కోల్పోతున్నదని ఇప్పటికైనా ఎమ్మెల్యే అదే విధంగా ఐఎన్టియుసి యూనియన్ పై నాయకత్వం కార్మిక వ్యతిరేక నాయకుల పైన తగు చర్యలు తీసుకోవాలని
ప్రశ్నిస్తున్న కార్మికులకు యాజమాన్యంతో కుమ్మక్కై షరిసిట్లు సస్పెండ్ లేటర్ లు ఇపిస్తున్నారు
ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే వీరికి రాబోయే రోజులలో కార్మిక వర్గం తగు గుణపాఠం చెప్తుంది వారు అన్నారు
ఈ కార్యక్రమంలో
టీఎస్ యుఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్
నామల శ్రీనివాస్
రాళ్ల బండి బాబు
జయశంకర్
కే నరసింహారెడ్డి
ఎస్ కే సాజిద్
ఎండి సలీం
సిహెచ్ లక్ష్మీనారాయణ
కే మధుకర్
తదితరులు పాల్గొన్నారు

ఇవేనా రాజకీయాలు..వీళ్లేనా మన నాయకులు!

చరిత్ర తెలియదు.. చారిత్రక విశేషాలు తెలియవు.

`దేశ చరిత్రకు మూలాలు తెలియవు.

`చారిత్రక ఆనవాళ్ల మీద అవగాహన వుండదు.

`చారిత్రక సత్యాలు తెలిసిన వాళ్లు కరువౌతున్నారు.

`విద్యావంతులు వస్తున్నారు..విద్యాభివృద్ధికి తోడ్పడడం లేదు.

`ప్రపంచ వారసత్వం మీద అవగాహన వుండదు.

`సమాజం గురించి తెలియదు.

`సామాజిక పరిస్థితులు అర్థం కావు.

`సామాజిక శాస్త్రం చదివిన వాళ్లు కాదు.

`సమాజ శాస్త్రం గురించి అవగాహన కూడా చాలా మందిలో లేదు.

`ప్రజా సమస్యలను అధ్యయనం చేయరు.

`పొలిటికల్‌ సైన్స్‌ చదివిన వారు కరువు.

`రాజకీయం కూడా ఒక శాస్త్రమనే సత్యం కూడా తెలియదు.

`ప్రపంచ గతిని మార్చిన మేధావుల గురించి తెలియదు.

`ఉద్యమాల గురించి తెలియదు.

`ఉద్యమ స్పూర్తితో రాజకీయాలు చేయడం లేదు.

`పాలనా పరమైన అంశాలు అర్థం చేసుకోరు.

`దేశ రాజకీయాలను ఏలే వారికి నైసర్గిక స్వరూపాలు తెలియవు.

`రాష్ట్ర రాజకీయాలు చేసే వారికి భౌగోళిక పరిస్థితులు తెలియవు.

`పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గురించి అసలే తెలియదు.

`ప్రజల అవసరాలు, అవస్థలు కళ్లారా చూడరు.

`కులాల కుంపట్లు తెలుసు..ఎన్నికలలో గెలిచేందుకు ఓట్లు కొనడం తెలుసు.

`మత రాజకీయాలు తెలుసు..మత ప్రాతిపదికన పోలరైజేషన్‌ తెలుసు.

`మెజారిటీ ప్రజల ఓట్లు ఎలా సాధించుకోవాలో తెలుసు.

`మైనారిటీ ఓట్లను ఎలా పొందాలో తెలుసు.

`ఇదే నా రాజకీయం..అన్ని పార్టీలదీ అదే తీరు..

`గెలుపు గుర్రాలుంటే చాలు.

`రాజకీయాలంటే పురాణాలు కాదు.

`పురాణాల పునాదుల మీద రాజకీయాలు ఎల్ల కాలం సాగవు.

`వేదాలు, ఉపనిషత్తులు అంటారు..వాటికి అర్థం కూడా తెలియదు.

`ఒక్కడికీ ఒక్క పద్యం తెలియదు.

`ఆఖరుకు జాతీయ గీతం జనగనమన కంఠస్థం రాదు.

`జాతీయ గేయం వందే మాతరం గుక్క తిప్పుకోకుండా చదవలేదు.

`మాటలు చెప్పి మోసం చేస్తున్నారు.

`దేశానికి వున్న గౌరవాన్ని దిగజార్చుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాను రాను రాజకీయాలు ఎటు పోతున్నాయి. రాజకీయాలలోకి ఎటు వంటి నాయకులు చేరుతున్నారు. రాజకీయాలను ఎటు వైపు తీసుకెళ్తున్నారు. పార్టీలు ఏవైనా సరే గొర్రెల మందలా, ఒక దానికి వెనుక మరొకటి వెళ్తోంది. ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాజకీయాలు అందరూ చేస్తామంటున్నారు. రాజకీయాలంటే అంత అలుసైపోయిందా? రాజకీయమంటే వ్యాపారమనుకంటున్నారా? ప్రజా ప్రతినిది అంటే పెత్తనం చేయడం అనుకుంటున్నారా? అసలు ఈ తరం నాయకులు ఏమనుకుంటున్నారు? పార్టీలు రాజకీయాలను ఎలా వాడుకుంటున్నాయి? అధికారంలోకి వస్తే చాలనుకుంటున్నాయి. అడ్డమైన మాటలు చెబుతున్నాయి. అదికారంలో వున్న వాళ్లు ప్రతిపక్షాలను, ప్రతిపక్షాలు పాలక పక్షాలను నిత్యం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. ఐదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ముసుగేసుకొని వస్తున్నాయి. పధకాలంటారు? సంక్షేమం అంటారు. ఎన్నికల ముందు హమీలు గుప్పిస్తుంటారు. అయినవి, కానివి అన్నీ చెబుతుంటారు. నోటికి ఏది వస్తే అది చెబుతుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు దేవుళ్లుగా కనిపిస్తారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హమీల గురించి అడిగితే దెయ్యాలుగా కనిపిస్తారు? శత్రువులుగా కనిపిస్తారు? ఓట్లు అడిగినప్పుడు మాత్రం ప్రజలు ఎంతో గొప్ప వాళ్లు. విజ్ఞులు. వివేకవంతులు. అసలు రాజకీయం అనే పదానికి చరిత్రలో ఎంతటి స్ధానం వుందో తెలియదు. కాని రాజకీయాలు చేయానుకుంటారు. నాయకులు కావాలనుకుంటారు? అసెంబ్లీలో కూర్చొని అద్యక్షా! అనాలనుకుంటారు. కుదిరితే కాలం కలిసొస్తే మంత్రి కావాలనుకుంటారు. బుగ్గ కారులో తిరగాలనుకుంటారు. జిల్లాలో చక్రం తిప్పాలనుకుంటారు. రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటారు. ఈ ఐదేళ్లలోనే సిఎం. కూడా అయిపోతే బాగుండనుకుంటారు. తాను బతికున్నంత కాలం పదవిలో వుండాలనుకుంటారు. ఇదీ నేటి తరం రాజకీయనాయకుల ఆలోచనలు. కాని అసలు రాజకీయాలను అర్ధం చేసుకున్నామా? రాజకీయాలకు అసలైన మూల సూత్రమేమిటి? ఒక నాయకుడికి వుండాల్సిన లక్షణం ఏమిటి? అనేది ఏ నాయకుడు ఆలోచించుకోవడం లేదు. కనీసం తెలుసుకోవాలనుకోవడం లేదు. దేశ చరిత్ర తెలియదు. దేశ రాజకీయ ముఖ చిత్రం తెలియదు. చారిత్రక విశేషాలు తెలియదు. చారిత్రాత్మక అంశాలు తెలియవు. దేశ చరిత్రకున్న మూలాలు తెలియవు. ఒక నాయకుడికి ఇవన్నీ తెలియాల్సిన అవసరం వుందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం కావొచ్చు. కాని ఈ తరం నాయకులు అవసరం. ఎందుకంటే మన దేశ విస్తీర్ణం, బౌగోళిక అంశాలపై నాయకులకు ఖచ్చితమైన అవగాహన వుండాలి. అప్పుడే దేశ రాజకీయాలలో సంపూర్ణమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన నాయకులే ఎక్కువగా వుండేవారు. వారిలో ఉన్నత విద్యావంతులు, దేశ రాజకీయాలపై అవగాహన వున్న వాళ్లు మాత్రమే ఎన్నికౌతూ వచ్చేవారు. కాని ఇప్పుడు పార్టీల బలం, బలగం, అర్ధబలం, అంగబలం వుంటే చాలు నాయకులౌతున్నారు. గతంలో ఎలాంటి నాయకుడైనా సమాజం గురించి ఆలోచించేవారు. తన నియోజకవర్గం అభివృద్ది గురించి ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడున్న నాయకులు ప్రజా సేవకన్నా, వ్యాపారాలపై దృష్టిపెడుతున్నారు. ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సంపాదించుకోవద్దా? అని నేరుగానే సమాధానం చెబుతున్నారు. రాజకీయాలు చేయాలనుకునేవారికి మన దేశమమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా తెలియాలి. తెలుసుకోవాలి. ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోంది. మనం ఎక్కడ వెనుకబడి వున్నామన్నది కూడా అధ్యయనం చేయాలి. దేశ విదేశాలలో జరుగుతున్న అభివృద్ది మీద అవగాహన పెంచుకోవాలి. పారిశ్రామిక ప్రగతిని అంచనా వేయాలి. మన దేశ ఆర్ధిక పురోగతి కోసం ఎలా ముందుకు వెళ్లాలి. అనే అంశాలపై సంపూర్ణమైన జ్ఞానం నాయకులకు కావాలి. ప్రపంచం కుగ్రామమైపోయింది. ఇంటర్‌ నెట్‌ చేతిలో వుంది. ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. నాయకులకు సమాజం మీద పూర్తి అవగాహన కావాలి. సామాజిక శాస్త్రం చదివి వుండాలి. ఒకప్పుడు టెక్నికల్‌ విద్య అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా వుండేది. ఇప్పుడు సోషల్‌ ఇంజనీరింగ్‌ తెలియకపోవడంతో తీరని నష్టం జరుగుతోంది. గతంలో ప్రతి యూనివర్సిటీలోనూ చరిత్ర, సోషియాలజీ, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విద్యార్ధులు ఎక్కువగా చదువుకునేవారు. అందుకే ఆ రోజుల్లో ప్రజా ఉద్యమాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పదో తరగతి వరకు కూడా భూగోళం, చరిత్ర, అర్ధశాస్త్రం, పౌరశాస్త్రం వుంటున్నాయి. కాని అవి మార్కుల కోసం మాత్రమే చదువుతున్నారు. ఎక్కువగా లెక్కలు, సైన్స్‌ మాత్రమే అభ్యసిస్తున్నారు. మిగతా సబ్జెక్టులను వదిలేస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్‌ విద్య వ్యాపారమైపోవడంతో, ఈ సబ్జెక్టులు విద్యార్ధులకు దూరమౌతున్నాయి. ఇప్పటి విద్యార్ధులకు రాజకీయాలు అంటే నాయకులు, పాలకులు, ప్రతిపక్షాలు అనే మాట తప్ప మరొకటి తెలియదు. మన ఓట్లేసి గెలిపిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారన్న ఆలోచన కూడా ఈ తరానికి అవసరం లేకుండాపోతోంది. అదేదో సినిమాలో చెప్పినట్లు తిన్నామ, పడుకున్నామా, తెల్లారిందా? అన్నట్లు లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్నామా? ఉద్యోగం వచ్చిందా? జీవితంలో స్ధిరపడిపోయామా? అన్నదే ఆలోచిస్తున్నారు. స్కిల్‌ అనే పదం రాజ్యమేలుతోంది. నైతికత అనేది దూరమైపోయింది. దాంతో దేశంలోనే కాదు, విదేశాలలో చదువులు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేశాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులనే కాదనుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా నాయకులకు సమాజ శాస్త్రం తెలియాలి. కుటుంబ వ్యవస్ధలు నిర్వీర్యం కాకుండా చూడాలి. ఉన్నత లక్ష్యాలున్న సమజాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాయకులే తీసుకోవాలి. సమాజ శాస్త్రం గురించి తెలియని నాయకులకు ప్రజా సమస్యలు కూడా తెలియవు. పట్టవు. ఇవన్నీ తెలియాలంటే అసలైన రాజకీయ మూల సిద్దాంతాలను తెలియజేసే పొలిటికల్‌ సైన్స్‌ అనే పదమే చాలా మంది రాజకీయ నాయకులకు తెలియదు. పొలిటికల్‌ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సోషియో ఎకనామిక్స్‌ అంటే ఏమిటో అవగాహన లేదు. పాలిటీ అంటే అర్ధంకూడా ఎవరికీ తెలియకుండాపోతోంది. రాజకీయం కూడా ఒక శాస్త్రమన్నది తెలియని నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను పాలిస్తున్నారు. చిరిత్రలో సోక్రటిస్‌ దగ్గర నుంచి ఎంత మంది రాజకీయ విజ్ఞానవంతులున్నారో తెలియదు. రూసో అనే రాజనీతిజ్ఞుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనిషి బానిస సంకెళ్లలలో వున్నాడని ఎందుకన్నాడు? అనేది తెలియదు. మాకియా వెళ్లి లాంటి రాజనీతిజ్ఞుడు రాజకీయాలు, నాయకులకు గురించి ఏం చెప్పారన్నది ప్రతి నాయకుడు తెలుసుకోవాలి. అరిస్టాటిల్‌ ఏమని చెప్పాడు. ఆడమ్‌ స్మిత్‌ ఏమని చెప్పారు తెలుసుకోవాలి. ఆఖరుకు మన ఆమర్త సేన్‌ మన దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఏం చెప్పారన్నది ఎంత మందికి తెలుసు. మన దేశ మొదటి ఆర్ధిక శాఖ మంత్రి ఎవరికి తెలుసు. పంచ వర్ష ప్రణాళికల రూపకర్త మహలోనుబిస్‌ గురించి ఎంత మంది నాయకులు తెలుసుకున్నారు. ఇవేవీ తెలియదు. కాని నాయకులమౌతాం. గెలుస్తాం. పాలిస్తాం..ఇదేనా రాజకీయం అంటే ఇదేనా? రాజకీయాలంటే చెప్పడానికి పురాణాలు కాదు. రాజకీయమంటే వర్తమానం. ప్రజల సమస్యలు తెలుసుకోవడం మర్చిపోతున్నారు. కులం, మతం అంటున్నారు. మెజార్టీ ఓట్ల గురించి లెక్కలేసుకుంటారు. మైనార్టీ ఓట్లు ఎటు వైపు అని మాట్లాడుకుంటారు. అంతే తప్ప వారి అభ్యున్నతి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మారడం లేదని ఆలోచించరు. ఇంత పెద్ద మన ప్రజాస్వామ్య వ్యవస్ధలో, ప్రపంచానికే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంలో మన జాతీయ గీతం కంఠస్తంగా వచ్చే నాయకులు ఎంత మంది? వారికి ఆ గీతంలో వున్న అర్దం, పరమార్ధం ఎంత మంది నాయకులకు తెలుసు. మన జాతీయ గేయం వందేమాతరం చూడకుండా చదవగలిగే వాళ్లు ఎంత మంది? అసలు వీటిలో జాతీయ గీతం, జాతీయ గేయం ఏదో చెప్పలేరు. మన జాతీయ జెండా ఎంత పొడవు విస్తీర్ణంలో వుండాలో తెలియదు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు ఏదీ తెలియడం లేదు. కాని నాయకులౌతున్నారు. మనల్ని పాలిస్తున్నారు. ఇదీ మన దౌర్భాగ్యం. అంతే…!

ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు

ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి..

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్ )

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామ గ్రామాన జెండా పండుగలు నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆదివాసి ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
శుక్రవారం మహా ముత్తారం మండల పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగలు గ్రామ గ్రామాన నిర్వహిస్తూ ఆదివాసుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు కలలు పరిరక్షించుకునే విధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు మేధావులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు కళాకారులు మేధావులు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.
ఐక్యరాజ్యసమితి ఆదివాసి ప్రాంతాల మీద దశాబ్ద కాలం పాటు అధ్యయనం చేసి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఇతర సమాజాలకు భిన్నంగా ఉందని ఏ దేశంలో నైనా పరిపాలకుల విధానాల వల్ల ఆదివాసి మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని ఏ దేశంలో నైనా పాలకులు ఆదివాసి అభివృద్ధి పట్ల ఆదివాసి మనుగడను ప్రశ్నార్థకం చేసే విధానాలను అనుసరించవద్దని వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించినప్పటికీ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నిరంతరం ఆదివాసి హక్కుల మీద ఆదివాసి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు కావున ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాల యొక్క ఆదివాసి వ్యతిరేక విధానాలను ప్రతి ఆదివాసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించినప్పుడే ఆదివాసి సమాజంలో ఉన్న మేధావులుగా ప్రజలందరినీ చైతన్యం చేసి వారు స్వేచ్ఛగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అలాంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాలని లేనిపక్షంలో ఆదివాసి వ్యతిరేక ప్రభుత్వాలుగా మిగులుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు కాపుల విజయ్ మడకం నిర్మ ,గుంటి అంజలి ,తోట చందన ,గుండాపూ తేజ అశ్విని గుండం రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

నివాళులు అర్పించినతెలంగాణ తొలి.!

నివాళులు అర్పించినతెలంగాణ తొలి శాసనసభాపతి-
శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అకినపల్లి గ్రామ వాస్తవ్యుడు టేకుమట్ల మండల మరియు మొగుళ్ళపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బండి సుదర్శన్ గారి ప్రథమ పుత్రుడు బండి కిరణ్ గారి సంస్మరణ సభకు విచ్చేసి నివాళులు అర్పించిన తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతి పక్ష నాయకుడు గౌరవ శ్రీ” సిరికొండ మధుసూదనా చారి .

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

పంటలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం భూపాలపల్లి జిల్లా లోని, మొగుళ్లపల్లి మండలం, రంగాపురం గ్రామంలో వివిధ పంట పొలాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. యు నాగభూషణం మాట్లాడుతూ రైతులు కలుపు యాజమాన్యం పై రైతు జాగ్రత్త వహించాలని.. గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ (రైస్ స్టార్) అనే మందును ఎకరాకి 350 మిల్లీమీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు. అలాగే వెడల్పాటి ఆకు కలుపు మరియు తుంగ నిర్మూలనకై ట్రై ఫోమో + ఈత్ ఆక్సీ సల్ఫురాన్
( కౌన్సిల్ ఆక్టివ్) మందును ఎకరానికి 90 గ్రాములు చొప్పునరో డువందలులీటర్ల నీటిలో పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించారు.. అలాగే పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చేచే పురుగుల నివారణకై వేప నూనె (1500 పి పి ఎం) ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాక మూడు వందల గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని. అంతేకాకుండా 1:4 నిష్పత్తిలో మోనోక్రోటఫాస్ లేదా 1:20 నిష్పత్తిలో ఇమిడా క్లోరోప్రీడ్ లేదా ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకొని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేత కారణానికి అంటే విధంగా మొక్కలకు పూసుకోవాలి అని సూచించారు. ఈ బృందం సభ్యులు శాస్త్రవేత్త డా// ఆర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, తో పాటు ఏ ఈ ఓలు, అభ్యుదయ రైతులు పోలినేని రాజేశ్వర్ రావు,ఎర్రబెల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం…

నెట్ బాల్ క్రీడలో తెలంగాణ జట్టుకు కాంస్య పథకం

నెట్ బాల్ క్రీడలో అత్యున్నతమైన క్రీడను ప్రదర్శించిన సెయింట్ జోన్స్ హై స్కూల్ విద్యార్థి

కంకాల దిలీప్ ను అభినందించిన కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

ఈనెల 13వ తారీకు రోజున మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ నెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సౌత్ జోన్ ఎంపిక క్రీడలలో పాల్గొని తమిళనాడులో జరిగిన సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడాలలో పాల్గొనడం జరిగింది దిలీప్ తన అత్యున్నతమైన క్రీడాను ప్రదర్శించి తెలంగాణ జట్టు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది,దిలీప్ యొక్క విజయాన్ని సెయింట్ జాన్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అల్లం శ్రావణ్ కుమార్ రెడ్డి, దిలీపును సన్మానించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఏం వెంకటేశ్వర్లు ఎన్ మహేష్ లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

బిగ్ బ్రేకింగ్………

 

బిగ్ బ్రేకింగ్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-30T115959.308.wav?_=6


“నేటిధాత్రి”, 

తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌లో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు

రూ.700 కోట్ల వ్యవహారంలో ఈడీ తనిఖీలు

లోలోనా పేరుతో ప్రభుత్వ స్కీంను..స్కామ్‌గా మార్చిన మొయినుద్దీన్‌

మొయినుద్దీన్‌కు చెందిన లోలోనా కార్యాలయాల్లో సోదాలు

మొయినుద్దీన్‌, ఇక్రముద్దీన్‌ నివాసాల్లో ఈడీ సోదాలు

మాజీ డైరెక్టర్‌ రామచంద్రనాయక్..మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్‌ నివాసాల్లోనూ సోద

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో హైఅలర్ట్‌

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో హైఅలర్ట్‌

ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు

మావోయిస్టు వారోత్సవాలతో చెన్నూర్ రూరల్ పోలీసుల అప్రమత్తం

కోటపల్లి,నీల్వాయి సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న విస్తృత వాహన తనిఖీలు

జైపూర్,నేటి ధాత్రి:

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ చేసి విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్న చెన్నూర్ పోలీసులు.మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో రామగుండం కమిషనర్,మంచిర్యాల డీసీపీ,జైపూర్ ఏసీపీ ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ కోటపల్లి,నీల్వాయి పోలీసులు చెన్నూర్ రూరల్ సీఐ,కోటపల్లి ఎస్సై లు విస్తృతంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానితుల వివరాలను సేకరిస్తున్నమన్నారు. మావోయిస్టులు అడవులలో ఉండి హింసాత్మాక ఘటనలకు పాల్పడుతూ సాధించేదేమి లేదు జనజీవన స్రవంతిలో కలసి తమ కుటుంబ సభ్యులతో కలసి ఆనందమైన జీవితం గడపాలని,లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను పొందాలని చెన్నూర్ రూరల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మాటలకు అంతు లేదు..చేతలకు చింత రాదు!?

`ఆదరించిన ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారు.

`దిక్కు మాలిన రాజకీయాలు చేస్తున్నారు.

`రాజకీయాలు వదిలేశారు.

`వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నారు.

`ప్రజాక్షేత్రంలోకి వెళ్లే శక్తి లేదు.

`ఎన్నికలుంటే తప్ప సభలు పెట్డుకోలేరు.

`కార్యకర్తలను కలుసుకోలేరు.

`ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.

`అయితే అవినీతి ఆరోపణలు!

`లేకుంటే నీతి మాలిన ఆరోపణలు!

`నిత్యం అవే ఆరోపణలా!?

`నాయకులు రాసలీల బాగోతాలా!

`చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడడం లేదు!

`విమర్శలు చేయడానికి ముందూ వెనుకా ఆలోచించడం లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ రాజకీయాలలో నాయకుల మాటలకు హద్దూ బద్దూ లేకుండాపోతోంది. గతంలో ప్రతిదానిని రాజకీయం చేయడం అలవాటైందని పార్టీలు అంటుండేవి. ఇప్పుడు రాజకీయాలు మానేసి, అశ్లీలాలు మాట్లాడుకుంటున్నారు. ఆ నాయకుడు వ్యవహరం ఇలా, ఈ నాయకుడి చీకటి బాగోతం ఇలా అనే మాటలు తప్ప మరేం వినిపించడం లేదు. అసలు సమాజం ఏమనుకుంటోంది? అన్న ఆలోచన కూడా లేకుండాపోతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా పెరిగిన తర్వాత రాజకీయాలలో కూడా విపరీత ధోరణలు పెరిగిపోతున్నాయి. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అసలు నాయకుల వ్యక్తిగత జీవితాలలోకి ఎందుకు తొంగి చూస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. నిజంగానే నాయకులు ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తే సమాజమే ఊపేక్షించదు. కాని లేని పోని బురదను జల్లుతూ, పేరున్న మహిళలను జీవితాలను ఎందుకు రోడ్లమీదకు తెస్తున్నారో అర్దం కావడంలేదు. ఇలాంటి విషయాలు ప్రజలు కోరుకుంటున్నారనుకోవడం రాజకీయ పార్టీల అవివేకానికి పరాకాష్ట. ఓ పక్క ప్రజా సమస్యలు నలుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఎంత సేపు ఆధిప్యత రాజకీయాలు..కక్షపూరిత రాజకీయాలకు దారులు వేస్తున్నారు. పాలక ప్రతిపక్ష పార్టీలు ఒక రోజు నిందించుకున్నారంటే వేరు. నిత్యం నిందలేనా? రాసలీలల కధనలేనా? మొన్నటి దాకా కేటిఆర్‌ గురించి చెప్పిందే చెప్పి, రాసిందే రాసి అటు నాయకులు, మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాలపై మాట్లాడడడం సరైంది కాదు. నిజంగా ఫోన్‌ ట్యాపింగ్‌ లో కేటిఆర్‌ దోషిగా తేలితే శిక్ష పడుతుంది. కాని అది నిజమే కాదో తెలుసుకోకుండానే రకరాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌ రెడ్డి మేమేం తక్కువ తిన్నామా? అన్నట్లు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీద ఆరోపణలుగుప్పించారు. నిజానికి ముఖ్యమంత్రి పదవిలో వున్న నాయకుడు అర్దరాత్రులు ఒంటరి ప్రయాణం చేసే అవకాశం వుంటుందా? రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా కౌషిక్‌ రెడ్డికి తెలియదా? గతంలో మేం బురద జల్లుతాం తుడుచుకోండి? అనే రాజకీయాలు చేసేవారు. ఇప్పుడు మేం బురదే జల్లుతాం..మీరు బురదే చల్లండి.. చూసుకుందాం? అన్నట్లు వుంది. ఇవేనా ప్రజా సమస్యలు లేవా? అవి పాలక , ప్రతిపక్షాలకు పట్టవా? ప్రజలు ఎనుకున్న ప్రభుత్వాలు ఏంచేయాలి? ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు ఏం చేయాలన్నదానిపై స్పష్టత వుంది. కాని తెలంగాణలో ఏం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ 18నెలలు గడుస్తోంది. అనేక కార్యక్రమాలు రూపకల్పన జరుగుతున్నాయి. కాని అవి ప్రజల్లోకి చేరడంలేదు. కాని నిత్యం అదికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న వివాదాలు మాత్రం మీడియాలో వార్తలౌతున్నాయి. పెద్ద పెద్ద హెడ్డింగులౌతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. ప్రతిపక్షాలను పాలక పక్షాలు నిందించడం వేరు. వేదించడం వేరు. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రజా సమస్యలు గాలికి వెళ్తున్నాయి. నిజంగా ప్రజల కోసం ఆలోచించే పార్టీలు ఏవైనా వున్నాయా? ఎన్నికల ముందు ఓడిపోయిన బిఆర్‌ఎస్‌ ఇచ్చిన హమీలు, గెలిచిన పార్టీ కాంగ్రెస్‌ ఇచ్చిన హమీల ఎక్కడైనా చర్చ జరుగుతోందా? లేదు. కేవలం నిందలు, ఆరోపణలు తప్ప నిజాయితీ మాటలు ఎక్కడా లేవు. ఎంత సేపు రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దోచుకున్నది అంటూ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. అదికారంలోకి వచ్చిన ఈ పద్దెనమి నెలల్లో లెక్కలేనంత అవినీతి జరుగుతోందని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. మధ్యలో బిజేపి చోద్యం చూస్తోంది. ప్రతిపక్షంగా వున్న బిజేపి కూడా ఏ ప్రజా సమస్య మీద స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఏ క్షణాన ఏ పార్టీ ఎటువైపు మాట్లాడుతుందో అర్దం కావడంలేదు. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే బిజేపి పాలక పక్షం మీదకన్నా, ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ మీదనే యుద్దం చేస్తోంది.. బిఆర్‌ఎస్‌గతంలోనే చేసిన తప్పులనే తవ్వితీస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హమీల మీద ఇప్పటి వరకు బిజేపి ప్రస్తావించపోవడం గమనార్హం. బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రశ్నించే నైతికలేదనే అనుకుందాం? కాని బిజేపి ఏం చేస్తోంది. ఎందుకు మౌనంగా వుంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తేవడం లేదు. పైగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ను ఎంత కార్నర్‌ చేస్తున్నారో అంతే విధంగా బిజేపిని కూడా కార్నర్‌ చేస్తున్నారు. అయినా బిజేపిలో ఎలాంటి చలనం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. వాటితోపాటు మరో 420 హామీలు కూడా ఇచ్చింది. వాటిపై ఏ ఒక్క బిజేపి నాయకుడికైనా అవగాహన వుందా? ఎప్పుడైనా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చదివారా? అందులోని అంశాలపై చర్చించారా? కార్యచరణ ప్రకటించారా? లేదు. కనీసం ఆరు గ్యారెంటీలలో ఎన్ని అమలౌతున్నాయి. ఎన్ని అమలు కావడం లేదన్న వాటిపైనైనా బిజేపికి అవగాహన వుందా? సహజంగా ప్రబుత్వం మీద యుద్దంచేసేప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాకపోయినా సరే, ఒకే ఎజెండాతో ఉద్యమాలు సాగిస్తాయి. కాని ఇప్పుడు పరిస్దితి భిన్నంగా వుంది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ఆపార్టీని దింపడానికి, కేసిఆర్‌ను గద్దెదించడానికి ఏక కాలంలో రెండు పార్టీలు చేయాల్సినంత పోరాటం చేశాయి. అన్ని విషయాల మీద పోరాటంలో ఎవరి పై చేయి అన్నట్లుగా సాగాయి. కాని ఇప్పుడు ఆ బిజేపిలో ఆ దూకుడు లేదు. అసలు ప్రజా సమస్యల మీద స్పందనే లేదు. ముఖ్యంగా రైతుల సమస్యల మీద కూడా బిజేపి మాట్లాడలేకపోతోంది. రైతులకు రైతు భరోసాపై బిజేపి స్పందనలేదు. వృద్దాప్య పించన్లు ఎప్పుడు పెంచుతారని అడిగింది లేదు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. అది ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించిన బిజేపి నాయకుడు లేడు. విద్యార్ధినులకు లాప్‌ టాప్‌లు ఇస్తామన్నారు. విద్యార్దులందరికీ విద్యా భరోసా కార్డులిస్తామన్నారు. వీటి మీద బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు మౌనంగా వుంటున్నారు. నిజంగా బిఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లకాలంలో తప్పులు చేస్తే శిక్షించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. నిజంగా కేసిఆర్‌ తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లైతే ఎందుకు ఉపేక్షిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రజలు కేసిఆర్‌ పాలన వద్దనుకున్నారు. కేసిఆర్‌ నాయకత్వం అవసరమే లేదనుకున్నారు. ఫామ్‌ హజ్‌ పాలన వద్దని నిర్ణయంతీసుకున్నారు. ప్రజలను కలవని కేసిఆర్‌ వద్దనే ఓడిరచారు. ఇంకెందుకు కేసిఆర్‌ ప్రస్తావన. ఓ వైపు కేసిఆర్‌ సిఎం. రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదు. అయినా కేసిఆర్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీకి ఏం పని. ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. కేసిఆర్‌ వద్దనుకున్నారు. ఇంట్లో రెస్టు తీసుకునేలా చేశారు. ఓడిస్తే ఇంట్లో కూర్చుంటానని కేసిఆర్‌ చెప్పారు. అదే చేస్తున్నారు. వదిలేయండి? అధికారంలోవున్నప్పుడు గెలిపించిన ప్రజలే కేసిఆర్‌ బైటకు రావాలని ఉద్యమాలు చేశారు. ప్రగతి భవన్‌ దాటి రావాలని డిమాండ్‌ చేశారు. ఆయన రాకపోతే ప్రజలే ప్రజాస్వామ్య పద్దతిలో ఓడిరచి, ప్రగతి భవన్‌ నుంచి గెంటేశారు. ఇంకా ఎందుకు కేసిఆర్‌ పేరును కాంగ్రెస్‌ కలవరిస్తోంది. పలవరిస్తోంది. కేసిఆర్‌ ముచ్చట చెప్పకుండా వుండలేరా? కేసిఆర్‌ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం నడపలేరా? కేసిఆర్‌ పేరెత్తకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేరా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదే పదే కేసిఆర్‌ పేరును గుర్తు చేస్తుంటే ప్రజలు కూడా ఇష్టపడడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కూడా కేసిఆర్‌ గురించి మనకెందుకు అంటున్నారు. ప్రజలు మర్చిపోదామనుకున్నా, కేసిఆర్‌ను కాంగ్రెస్‌ నాయకులే మర్చిపోకుండాచేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తు చేసి జపం చేస్తున్నారు. అలాంటప్పుడు కేసిఆర్‌పై కేసులు పెట్టినా జనం పట్టించుకోరు. పైగా కేసిఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారన్న సంకేతాలు వెళ్లే అవకాశం వుంటుంది. కేసిఆర్‌ ఆనవాలు చెరిపేస్తామంటూనే నిత్యం బిఆర్‌ఎస్‌ నాయకులకన్నా, కాంగ్రెస్‌ నాయకులే కేసిఆర్‌ జపం చేస్తున్నారు. పొద్దుకు పదుల సార్లు గుర్తు చేస్తున్నారు. కేసిఆర్‌ తప్పులు నిత్యం ఎత్తి చూపుతూ పోతుంటే లాభం లేదు. కేసిఆర్‌ కన్నా మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి. కేసిఆర్‌ చేయని సంక్షేమాన్ని అందించండి. అంతే కాని పూట పూటకు, కేసిఆర్‌ ప్రస్తావన ఎందుకు? అంతే కాదు కాంగ్రెస్‌ నాయకులకన్నా సిఎంతోపాటు, ఇతర నాయకులంతా బిఆర్‌ఎస్‌ నాయకులు కేటిఆర్‌, హరీష్‌రావు, కవితల పేర్తు ప్రస్తావిస్తూ జనం వారి పేర్లను మదిలో నింపుకునేలా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు బిఆర్‌ఎస్‌ నాయకుల పేర్తు తప్ప, కాంగ్రెస్‌ నాయకుల పేర్లు మర్చిపోయేలా పాలకులే చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఓ రైతు సభలో వేదిక మీద వున్న పెద్దలెవరో తెలియదని ఓ రైతు అన్నాడంటే అర్దం ఏమిటి? రెండేళ్లు దగ్గరకు వస్తున్నా, మంత్రుల పేర్లు కూడా జనం నాలుకల మీద ఆడడంలేదు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల బిఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు మర్చిపోవడం లేదు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ను గుర్తు చేసుకోవడం కాంగ్రెస్‌పెద్దలు మర్చిపోండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రచారం చేసుకోంది.

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన..

తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన చేపట్టిన బీసీ హక్కుల పోరాట సమితి

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర శనివారం రోజున జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.నాయకులు మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుండి 32 పార్టీలు బిసి రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి.అలాగే దేశంలోని తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేదో బీసీ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా దక్కకపోవడం అత్యంత బాధాకరమని,దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారని,దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందని, ఇంకెంతకాలం బీసీలకు అన్యాయం చేస్తారని,ఇదేనా ప్రజాస్వామ్యం,ఇదేనా సామాజిక న్యాయమని ప్రశ్నిస్తున్నామన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనీ,ఇప్పటికైనా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని,లేని పక్షంలో పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్,కర్రె లచ్చన్న సీనియర్ రాష్ట్ర నాయకులు,గజెలి వెంకటయ్య జిల్లా కార్యదర్శి,శాఖపురి భీమ్సేన్,నాయకులు అంకం సతీష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ.

పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ

దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.

పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు,
జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.

District Collector Dr. Satya Sarada.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో గ్రేట్ ట్విస్ట్…

తెలంగాణలో గ్రేట్ ట్విస్ట్…

తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రం టిక్కెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రోహిన్ రెడ్డి చూపిన చొరవకు ఎ.ఎం. రత్నం కృతజ్ఞతలు తెలిపారు.

నెలరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డు (Gaddar Film Awards) లను ఘనంగా జరపడంతో సినిమా వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. ఎలాంటి వివాదాలకు తెర తీయకుండా సమర్థవంతంగా దీన్ని ‘దిల్’ రాజు (Dil Raju) నేతృత్వంలో నిర్వహించడం మంచిదే అయ్యింది. అయితే… సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే విషయంలోనూ, రిలీజ్ కు ముందు పెయిడ్ స్పెషల్ ప్రీమియర్ షోస్ ను వేసుకునే విషయంలోనూ ఇంకా కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దీన్ని ‘హరిహర వీరమల్లు’ (Hair Hara Veeramallu) సినిమా విడుదల సందర్భంలో తొలగించడం విశేషం.

తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా ఉన్న ‘దిల్’ రాజు ప్రభుత్వ పెద్దల మనసెరిగి సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే విషయంలోను, ప్రీమియర్ షోస్ విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. ‘పుష్ప-2’ సినిమా ప్రీ-రిలీజ్ సందర్భంగా జరిగిన చేదు సంఘటనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే కాదు… తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కొంత పరుషపదజాలంతో సినిమా వాళ్ళను టార్గెట్ చేశారు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలూ అంటే కోమటిరెడ్డి ఓ విభజన రేఖ కూడా గీశారు. ఇక మీద టిక్కెట్ రెట్లు పెంచుకోవడం, ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోస్ వేయడం కుదరదని ఖరాఖండిగా చెప్పేశారు. అలానే కోర్టులు సైతం ఓ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, ఆ తర్వాత దీనిపై సినిమా రంగమే ప్రభుత్వంతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చింది.

సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలకు టిక్కెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించానా… దిల్ రాజు తన తాజా చిత్రం ‘తమ్ముడు’ విషయంలో టిక్కెట్ రేట్ల పెంపు గురించి ప్రభుత్వాన్ని అడగమని, ఇప్పుడున్న రేట్లు సరిపోతాయని చెప్పారు. అలానే దానికి ముందు వచ్చిన నాని ‘హిట్ 3’ సినిమాకు ఏపీలో టిక్కెట్ రేట్లను పెంచుకునే సౌలభ్యం కల్పించారు. కానీ తెలంగాణలో మాత్రం దాని టిక్కెట్ రేట్లను పెంచలేదు. దాంతో ఇక మీద తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచుకునే ఆస్కారం ఉండదేమోననే చిన్నపాటి గుబులు నిర్మాతలలో కలిగింది.

ఇక ‘హరి హర వీరమల్లు’ విషయానికి వస్తే… ఏపీలో ఇప్పటికే పది రోజుల పాటు ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణలో సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. ఇలాంటి టైమ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ నేత రోహిన్ రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. ఎ. ఎం. రత్నం రిక్వెస్ట్ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కన్వెన్స్ చేసి ‘హరిహర వీరమల్లు’ టిక్కెట్ రేట్లు తెలంగాణలో సైతం పెంచుకొనేలా చేశారని అంటున్నారు. అంతేకాదు… ఇక్కడ కూడా పెయిడ్ ప్రీమియర్ షోస్ కు పర్మిషన్ ఇప్పించారట. ఈ విషయంలో రోహిన్ రెడ్డి సాయం మరివలేమంటూ ఎ. ఎం. రత్నం స్వయంగా సోమవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అయిన రోహిన్ రెడ్డి గతంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘తిక్క’ మూవీని ప్రొడ్యూస్ చేశారు. దానికి ఆయన సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. అలా సినిమా రంగంతో రోహిన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నియోజకవర్గం నుండి రోహిన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. రేవంత్ ను సినిమా రంగానికి చెందిన వారు ఎవరు కలిసినా… వారితో పాటు రోహిన్ రెడ్డి కూడా ఉంటూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రోహిన్ రెడ్డి అంబర్ పేట నుండి గెలిచి ఉంటే… ఇవాళ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా తెలంగాణలో సేవలు అందించేవారేమో! ఏదేమైనా… ‘హరిహర వీరమల్లు’ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. తమ చిత్రాలకూ పర్మిషన్లు అడగడానికి ఆస్కారం ఏర్పడినట్టు అయ్యింది.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల.!

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మెట్ పల్లి జూలై 21 నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ –

కళాశాల విద్యా కమీషనర్ ( సీసీఈ) ఏ.శ్రీదేవసేన మరియు మల్టీ జోన్ – I,జాయింట్ డైరెక్టర్ (జేడీ) ప్రొఫెసర్ డీ.ఎస్.ఆర్. రాజేందర్ సింగ్ లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, పొలిటికల్ సైన్స్,కామర్స్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ పోస్టుల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య తెలిపారు.

 

సోమవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీ.జీ)తో పాటు యుజిసి నెట్,సెట్,పీహెచ్.డి వంటి అర్హతలు గల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.దరఖాస్తుతో పాటు తమ బయోడేటా మరియు అర్హత, అనుభవం వంటి అన్ని సర్టిఫికెట్ల “జిరాక్స్ కాపీల సెట్”ను విధిగా సమర్పించాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఈ నెల 25 వ తేదీన అనగా శుక్రవారం రోజున అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల వరకు తప్పకుండా హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.దరఖాస్తుదారులు ఆలస్యంగా వస్తే మాత్రం వారి దరఖాస్తులను పరిశీలించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఇతర వివరాలకు మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో పని వేళల్లో కళాశాల సిబ్బందిని సంప్రదించాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య అభ్యర్థులకు సూచించారు.

90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కు అన్యాయం

 

90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కు అన్యాయం

టి సి జె ఎ సి అడ్వైజర్ పాయిరాల శరత్ యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న జనరల్ బాడీ మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరిగింది, గత 90 ఏళ్లుగా తెలంగాణ జిల్లాల క్రికెట్ కి అన్యాయం జరుగుతున్న సందర్భంగా జిల్లా క్రికెట్ కి న్యాయం చేయాలని గ్రామీణ క్రీడాకారులను గుర్తించి తగిన అవకాశాలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు 209 క్లబ్లు ఉండగా తెలంగాణ ఉమ్మడి 8 జిల్లా లకు కేవలం 8 క్లబ్బులు మాత్రమే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఖండిస్తూ తెలంగాణ జిల్లాలకు 300 క్రికెట్ క్లబ్బులు అఫిలియేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ స్టేడియం ని ముట్టడించడం జరిగింది, ఇప్పటికైనా స్పోర్ట్స్ మినిస్టర్ స్పందించి తెలంగాణ గ్రామీణ క్రీడకరులకు న్యాయం చేయాలని లేని పక్షాలు బీసీసీఐకి చెప్పి తెలంగాణ కి సపరేట్ అసోసియేషన్ కి సహకరించగలరని టి

 

సి జె ఎ సి అడ్వయిజర్
పాయిరాల శరత్ యాదవ్
మాజీ విజ్జి ట్రోఫీ ప్లేయర్
మాజీ హెచ్ సి ఏ ప్లేయర్
కాకతీయ యూనివర్సిటీ మాజీ కెప్టెన్ మాట్లాడారు ఇట్టి కార్యక్రమం లో తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి టి సి జె ఎ సి జిమ్మి బాబు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version