ఆల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ.

ఆల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవం

రామడుగు, నేటిధాత్రి:

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈపండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బోనాల జాతర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీనవదుర్గ చిత్రపటానికి పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను చూపిస్తున్నారని, మతాలకు అతీతంగా బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతని నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓతల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మాదైవం నృత్యాలు అందరినీ ఆకర్షింపచేశాయి. సుమారు నూటయాభై మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version