నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు…

నల్ల నీళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూపులు

మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ శూన్యం

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నీటి తిప్పలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం విలేజ్ లో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా చేసే పైప్ లైన్లు రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడంతో నేటి సరఫరా పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి గత కొన్ని రోజులుగా కేసముద్రం గ్రామ ప్రజలకు నేటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా నీటి కష్టాలు ఇంకా ఎన్ని రోజులు పడాల్సి వస్తుందోనని కేసముద్రం విలేజ్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రంలోని ఒకటవ వార్డు బజారుకు సుమారు 60 కుటుంబాలు వారం రోజులుగా నల్ల నీటి కోసం ఎదురుచూస్తున్నారు. రోజు వారి వాడుకునే నల్ల నీళ్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు. ప్రతిరోజు నీరు లేనిదే ఏ పని జరగదు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు నీటితోనే అవసరం అలాంటిది వారం పది దినాలుగా నీళ్లు లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. పండగ దగ్గరికి వస్తున్నందున నీళ్ల అవసరం చాలా ఎక్కువే అని ఇలా అయితే మనకు నీటి కష్టాలు తప్పవా అని సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ నీటి సమస్యకు కారకులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించడం వల్లనే భారీ యంత్రాలతో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో భూమిలో ఉన్న పైపులు సైతం పలిగేలా పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు.కానీ వాటి మరమ్మత్తులు మాత్రం మున్సిపల్ అధికారులు సకాలంలో చేయించకపోగా అరకొర సిబ్బందితో నత్త నడకగా పైపులైన్ రిపేరు జరుగుతున్నందున నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు. ఈ నేటి ఎద్దడికి కారకులైన రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి మేము బలైపోతున్నామని ఇటు మునిసిపల్ అధికారుల మధ్య ఇటు రోడ్డు కాంట్రాక్టర్ మధ్య మేము నీళ్ళు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రోడ్ కాంట్రాక్టర్ పైపులైన్లను పగలగొడుతుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కేసముద్రం విలేజ్ లోని రైస్ మిల్ దగ్గర మాజీ ఎంపిటిసి సట్ల వెంకన్న బజార్ అయినటువంటి పూర్వం గ్రామపంచాయతీ గల ఒకటో వార్డు సంబంధించిన నీటి సరఫరా పైప్లైన్ రోడ్డు ఆ చివర నుండి ఈ చివరి వరకు నీటి సరఫరా పైపు చాలా చోట్ల డ్యామేజ్ అయి ఉన్నందున ఎప్పటికైనా డ్యామేజ్ అయిన పైప్ లైన్ మొత్తం పూర్తిగా తొలగించి నాణ్యత గల పైపును అమర్చి మాకు నీటి ఎద్దడి సమస్య రాకుండా సరిచేయాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నామని కేసముద్రం గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

పన్నులు కట్టే ప్రజలకు త్రాగునీరు కరువు..

పన్నులు కట్టే ప్రజలకు త్రాగునీరు కరువు

– మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా

– పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నా

– మంచినీటి సమస్య తీర్చే వరకు బిజెపి పోరాటం ఆగదు

– బిజెపి పట్టణ అధ్యక్షులు
దుమాల శ్రీకాంత్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘం కార్యాలయం ఎదుట
భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంపై నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రజల సమస్యలపై మున్సిపల్ పాలకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ “సిరిసిల్లలో మంచినీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోందని అన్నారు.

ఇది సహజ సమస్య కాదు… ఇది పూర్తిగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం” అన్నారు. “పన్నులు కట్టే ప్రజలకు కనీసంగా త్రాగునీరు ఇవ్వలేని మున్సిపాలిటీకి
పాలన చేసే నైతిక హక్కు లేదని మేము స్పష్టంగా చెబుతున్నామన్నారు.
“వెంటనే మున్సిపల్ భగీరథ త్రాగునీటి సరఫరాను అంతరాయం లేకుండా పునరుద్ధరించాలి,అలాగే పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా, సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. “ఇది రాజకీయ పోరాటం కాదు…
ఇది ప్రజల జీవన హక్కుల కోసం చేస్తున్న ఉద్యమం అని అన్నారు. “ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజలతో కలిసి మరింత బలమైన ఉద్యమాలకు తిగుతామన్నారు. “సిరిసిల్ల ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ నిశ్శబ్దంగా కూర్చోదు – పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు. మునిసిపల్ కమిషనర్ ప్రత్యక్ష హామీతో రెండు రోజుల్లో పూర్తి సమస్యలు తీర్చుతామని పక్క హామీతో నిరసన విరమించామన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యాన రాంప్రసాద్, మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, మోర శ్రీహరి, పల్లికొండ నరసయ్య, కాంభోజ శ్రీధర్, అంకారపు రాజు ,చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, కొడం రవి, సూరం వినయ్, సిద్ధి దేవరాజు, ఇంజపురి మురళి కృష్ణ, గాలి శ్రీనివాస్, ఊరగొండ రాజు, కొండ ప్రతాప్,రమేష్, సుంకరి బాలకిషన్, బండారి వెంకటేశ్వర్లు, జంప రాజు,దేవరాజు,వర్ణాల శేఖర్ బాబు, వెలిశాల అభి రామారావు, కనకయ్య, మహిళా నాయకులు వేముల వైశాలి, కమటం మంజుల, మల్లీశ్వరి, లత, వనిత, తదితరులు పాల్గొన్నారు.

గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు..

గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు.. అధికారులు నిర్లక్ష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల గిన్నియర్ పల్లి గ్రామంలో వర్షాకాలంలో కూడా తీవ్ర నీటి కొరత నెలకొంది. బోర్లు పనిచేయకపోయినా, భగీరథ నీటి సరఫరా నెలలో కనీసం రెండుసార్లు కూడా సరిగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా ఆగిపోవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులే కారణమని అధికారులు చెబుతున్నారని, సమస్యపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version