నూతన ఎస్సైగా పీ. సుబ్బారావు బాధ్యతలు స్వీకారం

నూతన ఎస్సైగా పీ. సుబ్బారావు బాధ్యతలు స్వీకారం

తిర్యాణి ( మంచిర్యాల):

తిర్యాణి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పీ. సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఎలాంటి అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై లాల్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, మహిళా కానిస్టేబుళ్లు జ్యోతి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రత…అరైవ్, అలైవ్ కార్యక్రమం…

రహదారి భద్రత…అరైవ్, అలైవ్ కార్యక్రమం

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్

ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరుకోవడమే… అరైవ్… అలైన్ ప్రధాన ఉద్దేశం… సిఐ సత్యనారాయణ

కేసముద్రం/ నేటి ధాత్రి

రైతు వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అరైవ్, అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు.జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి
అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ఉదేశీస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ,

ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడమే ‘అరైవ్ అలైవ్’ ప్రధాన ఉద్దేశం”. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా తిరిగి రావడం ముఖ్యం అని అన్నారు.

అతివేగం, మొబైల్ వాడకం, తాగి వాహనం నడపడం ( డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి పనులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మునిసిపాలిటీ ప్రజలందరూ మన ప్రాణాలకు సంబంధించిన బాధ్యత హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలి అని అన్నారు.

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి అని పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒకరిది బాధ్యత అని అన్నారు.

వేగం కన్నా ప్రాణం ముఖ్యం…అనే సందేశాన్ని అందరికీ తెలియజేశారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టీ.శ్రీనివాస్ స్థానిక ఎస్సై.నరేష్, వార్డ్ కౌన్సిలర్స్ వీరష్ యాదవ్, కిషోర్, వేముల భారతి, ఉమా, కనుకుల సుభద్ర, విజయ, శరత్ యాదవ్, రాము, కృష్ణ, అరుణ, శారద,అధికారులు, వార్డ్ ఆఫీసర్, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి వేళ చైనా మాంజా వాడితే కఠిన చర్యలు…

సంక్రాంతి వేళ చైనా మాంజా వాడితే కఠిన చర్యలు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్ హెచ్చరిక.మందమర్రి,సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహంలో ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని మందమర్రి ఎస్.ఐ. రాజశేఖర్ సూచించారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిషేధిత చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
** ప్రాణాంతకమైన దారం: చైనా మాంజా గొంతుకు తగిలితే కోసుకుపోయే ప్రమాదం ఉందని, గతంలో ఇలాంటి ఎన్నో విషాద ఘటనలు జరిగాయని ఆయన గుర్తుచేశారు.
* పక్షుల మరణాలు: పర్యావరణానికి మేలు చేసే పక్షులు ఈ దారానికి చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
* అమ్మేవారిపై నిఘా: పట్టణంలోని ఫ్యాన్సీ జనరల్ స్టోర్లలో నిషేధిత మాంజా విక్రయిస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
* తల్లిదండ్రుల బాధ్యత: పిల్లలు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు వారు ఏ రకమైన దారం వాడుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ. మిలన్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వీరు పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలకు, వ్యాపారులకు చైనా మాంజా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version